Author Archives: hrk
పిచికగూటిలో కవిత్వపు కిచకిచలు
పిచికగూడు, కాశీమజిలీ, కోలాటం బ్లాగుల ద్వారా కవిత్వాన్నీ, కథల్నీ, వ్యాసాలూ-అనుభవాలనీ పంచుకుంటూ అంతర్జాలంలో సుపరిచితులైన తెలుగు కవి హెచార్కే గారితో పొద్దు జరిపిన మాటామంతీ; Continue reading
కోత
రోడ్డు మీద ఒక్కో మనిషి ఇద్దరుగానో ముగ్గురుగానో చీలిపోయి కనిపిస్తాడు. ఎవరు ఎవరో గుర్తు పడితే గెలుపు ఇద్దరు ముగ్గుర్నలుగురిలో ఎవరితో మాట్లాడాలి? -హెచ్చార్కె కవిత కోత ను ఆస్వాదించండి.
Continue reading
ఖననం
“తోలుపెట్టె అస్తిత్వాన్ని ప్రశ్నిస్తూ అస్థికలు.. సమాధానాల మజిలీల్లో పునర్మరణాలు.." ఆఖరు గమ్యాన్ని వెదుకుతున్న ఈ కవిత హెచ్చార్కే గారినుండి.
రొద
– హెచ్చార్కే రెండుగా చీలిన ఒక వేదన ముట్టడించిన మసక వెన్నెల చిట్టచివరి విందులో ఇద్దరు ద్రోహం ద్రోహం అలలెత్తి అరిచిన దుర్బల సముద్రం! ఎన్ని ఎండలల్లో ఇంకెన్ని వెన్నెలల్లో తగలెట్టుకోగలరు తమను తాము? ఎవరినెవరు పంపారు శిలువకు? వారిలో క్షమార్హు లెవరో చెప్పలేని సందేహ సముద్రం!! ఒక్కో రాత్రిగా ఒక్కొక్క పగలుగా పుట్ట లోంచి … Continue reading
కో హం
-హెచ్చార్కె ఏడుపు వస్తోంది ఎట్నుంచి ఎటో వెళ్తూ ఒక పాడువడిన పాకలో తల దాచుకున్నాను ఇక్కడెవరో నివసించిన, పిల్లల్ని కని పెంచిన, చనిపోయిన గుర్తులు నేను దేన్ని వెదుక్కుంటున్నాను? ఎక్కడ పోగొట్టుకున్న ఆశను? ఎట్నుంచి వచ్చానో ఎటు వెళ్తున్నానో తెలియనివ్వకుండా కళ్లను కబళించేంత కాటుక వంటి చీకటి దూరంగా బండ్లు వెళ్తున్న చప్పుడు బండి చక్రాల … Continue reading