Author Archives: జి.వి రమణారెడ్డి

About జి.వి రమణారెడ్డి

జి.వి.రమణారెడ్డి గారు హెచ్.ఎ.ఎల్. ఫ్యాక్టరీలో 39 సంవత్సరాలు పని చేసి వుద్యోగ విరమణ చేశారు. వీరికి చిన్నతనం నుండీ సాహిత్య అభిలాష మెండుగా ఉండేది. 1970-1984 ల మధ్య ఆకాశవాణికి కొన్ని కథలు, కవితలు మరియు నాటికలు రాశారు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా రంగస్థల సేవ చేశారు. దివంగత నటుడు నూతన్ ప్రసాద్ వీరికి గురువు, మిత్రుడు. అభ్యుదయ రచయితల సంఘం, హైదరాబాద్ శాఖకు కొంతకాలం కార్యదర్శిగా పని చేశారు. ప్రజా నాట్యమండలిలో కొంత కాలము పని చేశారు. ’కేవలం రాయటం కోసమే రాయను. మనసుకు హత్తుకునే వాస్తవ సంఘటనలే నా రచనలకు ప్రేరణ.’ అని చెబుతారు రమణారెడ్డి గారు. వీరికి బీనాదేవి, రావి శాస్త్రి గార్ల రచనలంటే ఇష్టం. ప్రస్తుతం లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సనత్ నగర్ శాఖకు అధ్యక్షుడిగా సమాజ సేవలో వున్నారు.

మధు గీతం

శ్రీఖర ఉగాది కథలపోటీలో సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథ.
——————————–

Continue reading

Posted in కథ | Tagged | 1 Comment