ఎగిరిపోతాను

అప్పుడప్పుడూ

కన్పించని గాలిపాటకోసం

చెవులురిక్కించి వెతుకుతుంటాను

వెతుకులాట వెర్రిగా కన్పిస్తుంది నీకు

 

మూసలోకి దిగిపోయిన ఆలోచనలన్నీ

బయటకువచ్చే

బిరడా మూతనెవరైనా తెరుస్తారని చూస్తుంటాను

 

ఎవరికివారు

మూసల్లోకి దిగిపోయారనే సంగతే గుర్తుకు రాదు!

నాకు నేనే

మూసను బద్దలుకొట్టుకొని

ఏ తీరంలోనో మూర్చబోతాను

 

గాలిచేసే వింతసవ్వడులమధ్య

ఈ విషయం ఎలాగో తెలుస్తుంది నీకు!

About కనుమూరి జాన్ హైడ్

జాన్‌హైడ్ కనుమూరి రాసిన 'హృదయాంజలి' కవితాసంపుటి మార్చి 2004 లో శ్రీ మునిపల్లె రాజు గారిచే ఆవిష్కరించబడింది. వీరు రాసిన 'హసీనా' గురజాడ రాసిన 'పుత్తడిబొమ్మ పూర్ణమ్మ' తర్వాత స్త్రీ సమస్యలతో వచ్చిన దీర్ఘ కవిత అని వాడ్రేవు చినవీరభద్రుడు గారి అభిప్రాయం. వీరి 'అలలపై కలలతీగ' కవితాసంపుటి ఫిబ్రవరి 2006లో విడుదలైంది.జాన్‌హైడ్ గారి ర గురించి మరిన్ని వివరాలతో బాటు, వీరు రాసిన కవితలు కొన్ని ఈ బ్లాగులో చూడవచ్చు.
This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

12 Responses to ఎగిరిపోతాను

  1. అవును ఎవరి మూసల్లో వారు జీవితాలు కొనసాగిస్తున్నారు బిరడాలు బిగించుకొని .ప్రస్తుత జీవన చిత్రణ. అభినందనలు.జాన్ హైడ్ గారి కలం నుంచి మరో ఆణి ముత్యం….Nutakki Raghavendra Rao.

  2. అఫ్సర్ says:

    “గాలిచేసే వింతసవ్వడులమధ్య

    ఈ విషయం ఎలాగో తెలుస్తుంది నీకు! ”

    – చాలా భిన్నమయిన కవిత . మీ కొత్త దారి కనిపిస్తోంది, జాన్ గారు!

  3. kcubevarma says:

    చాలా కొత్తగా వుంది సార్.. బాగుంది..

  4. Venkat says:

    బాగుంది. ఏదో అర్ధం అయినట్టే అనిపిస్తుంది. కాని ఇందులో ఇంకేముందో తెలుసుకోవాలనిపించింది. నా అజ్ఞానానికి మన్నించండి.
    దీనికి అప్పుడప్పుడూ అన్న శీర్షిక ఎందుకు పెట్టారు?

    “కన్పించని గాలిపాటకోసం
    చెవులురిక్కించి వెతుకుతుంటాను”
    ఎక్కడైనా కన్పించని గాలిపాట ఉంటుందా. అయితే ఇది “వినిపించని గాలిపాటకోసం చెవులురిక్కించి వింటాను” అయివుంటుంది. ఏదయితేనేం, కన్పించని/వినిపించని దేనికోసమో ఎవరో వెతుకుతున్నారు. బహుశా తనలో తనే దేనికోసమో వెతుకుతున్నాడనుకుంటా.
    “వెతుకులాట వెర్రిగా కన్పిస్తుంది నీకు” అంటే ఎవరికో ఇది వెర్రిగా కన్పిస్తుంది. ఎవరికయిఉంటుందబ్బా?

    “మూసలోకి దిగిపోయిన ఆలోచనలన్నీ
    బయటకువచ్చే
    బిరడా మూతనెవరైనా తెరుస్తారని చూస్తుంటాను”
    అంటే మూసలో చిక్కుకు పోయిన ఆలోచనల గురించి రాసాడా? లేక మూసలో చిక్కుకు పోయిన తన గురించి రాసాడా? ఇక్కడ మూస అంటే తన శరీరమా? “బిరడానెవరైనా” అంటే సరిపోదా? “బిరడా మూతనెవరైనా” అనడంలో ఏమైనా అంతర్యం ఉందా?

    “ఎవరికివారు
    మూసల్లోకి దిగిపోయారనే సంగతే గుర్తుకు రాదు!
    నాకు నేనే
    మూసను బద్దలుకొట్టుకొని
    ఏ తీరంలోనో మూర్చబోతాను” ఇది బాగానే అర్ధమైంది.

    “గాలిచేసే వింతసవ్వడులమధ్య
    ఈ విషయం ఎలాగో తెలుస్తుంది నీకు!”

    ఎవరికీ తెలుస్తుంది? అంటే ఇతను/ఆలోచనలు బయటికొచ్చినట్టు ఎవరికీ తెలుస్తుంది?

    ఓహో. బహుశా పద్యం గురించి చెబుతున్నాడా? అంటే మొదటి మూడు లైన్లు, పద్యం రాయడానికి ఆలోచనల కోసం వెతుకులాట అన్నమాట. ఆ అలోచనన బద్దలుకొట్టుకొని బయటికి వస్తుంది. ఆ పద్యం చేసే వింతసవ్వడి మనకు తెలుస్తుంది. ఏమో?
    ఎవరైనా విప్పి చెబుతారా? ప్లీజ్!

    పొద్దు వెబ్ అడ్మిన్ కు: పొద్దు పత్రిక అంటే నాకు చాలా ఇష్టం. కాని ఈ మధ్య ఈ సైట్ చాలా చాలా చాలా స్లో అయ్యింది. అందుకే రావడం తగ్గించేసాను. అంతకుముందు డిజైన్ చాలా ఫాస్ట్ గా లోడ్ అయ్యేది.

    • జాన్ హైడ్ కనుమూరి says:

      అప్పుడప్పుడూ అనేది శీర్షికకాదు, టెక్నికల్ సమస్యవలన దాని ఖతి కొంచెం పెద్దగా కనబడటంవల్ల మీకు శీర్షిక అనిపిస్తుంది.

      “వెతుకులాట వెర్రిగా కన్పిస్తుంది నీకు”
      దేనికోసమో వెతుకుతున్నప్పుడు
      ఎదుటివారికి వెర్రిగా కన్పిస్తుంది.
      ఎందుకటే వెదుకుతున్నవాడు తనకు వస్స్తున్న ఆలోచనలకనుగుణంగా వెదకుతుంటే, ఎదుటివారు నియమిత కొలమానాలతో చూడాలనుకుంటారు. వాటిమధ్య కలిగే వైరుధ్యమే …. వెతుకులాట వెర్రిగా కన్పిస్తుంది

      “గాలిచేసే వింతసవ్వడులమధ్య
      ఈ విషయం ఎలాగో తెలుస్తుంది నీకు!”

      ఎవరికీ తెలుస్తుంది? అనే మీ సందేహం

      ఎవరైనా కావొచ్చు పాఠకుడు కావొచ్చు లేదా రాస్తున్నవారి దృష్టిలో ఎవరైనా వుండవచ్చు.

      • Venkat says:

        జాన్ గారు,
        శీర్షిక విషయంలో నా తొందరపాటుకు మన్నించండి. నా ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చినందుకు థాంక్స్.
        ఎవరి ఆలోచనల మూసల్లో వారుంటారు. బద్దలుకొట్టుకొని బయటికి వచ్చిన మీ ఆలోచనలు నన్ను తాకడానికి కాస్త సమయం పట్టింది.
        మీ ఆలోచన బావుంది. “మూసను బద్దలుకొట్టుకొని/ఏ తీరంలోనో మూర్చబోతాను” అనడం ఇంకా బావుంది. అభినందనలు.

  5. మూస ఆలోచనలకు భిన్నంగా మూసను బద్దలుకొట్టుకొని

    ఈ పొద్దు తీరంలో బాగుంది

  6. Sai Padma says:

    నాకు నేనే
    మూసను బద్దలుకొట్టుకొని
    ఏ తీరంలోనో మూర్చబోతాను

    Its wonderful line depicting the real struggle..conveys great meanings with simple lines

  7. devi says:

    very nice

  8. Prasuna says:

    Chaala bavundandi kavita.

  9. కొత్త అభివ్యక్తి కనిపిస్తుంది హైడ్ గారు! చాల బాగుంది. అభినందనలు.

  10. Nihar Bheemanathi says:

    Hi, that’s really good one….. i need to know some information regarding website… How can i post or submit something on this website… i didn’t find any information… can u help me out guys…. 🙂

Comments are closed.