సందె వేళ –
నే సిగ కట్టి, నువ్ చిట్టిచేమంతుల చెండు చుట్టి
మొగలేఱు అద్దంలో మనం – మురుసుకుంటూంటే..
ఫక్కుమన్న చుక్కల భరతం పట్టాలని – పరుగులు తీసే కోడెగాళ్ళం.
ఒకరి చేతుల మీద ఒకరంగా
జంట పిట్టలకు మల్లే.. గాల్లో తేలుతూ
పిల్లపక్షులకు ఈత నేర్పాల్సిన ఈడుగాళ్ళం
కన్రెప్ప పాటే జీవితం.
కలసి పంచుకునే సంతోషాలే – శాశ్వతం.
నలుపు తెలుపు ‘కల’నేత వస్త్రాలు ధరించిన దేహాలం మనం.
చీకటి చీలినప్పుడో..వెలుగు విరిగినప్పుడో..
ఎవరికి వారం ఒకరొకరంగా విడిపోవాల్సిన వాళ్ళం.
మనకంతా తెలుసు జీవన సారం. ఔనా?
మరి ఈ కాసిన్ని క్షణాలకే
తూర్పుకి తలపెట్టుకుని నువ్వూ, పడమరకి ముఖం తిప్పుకుని నేనూ..
ఇలా శతృశిలలకు మల్లే బ్రతుకుతున్నామెందుకనీ?
ఏమో, ఇపుడెందుకులే ఆ సంగతులూ..
పండగపూట అనుకోడాల్నూ !
ఒట్టు.
ఈ చలి కాలం నుంచైనా మనం.. సరికొత్త జంటలౌదాం.
పుష్యంలో రాలే నిశాపుష్పాల తడుద్దాం.
సంకురాతిరి సాక్షిగా –
పూటకో వెన్నెల పక్క
ఇంటెనక జొన్నమొక్క పక్క
కొండ మీద తళుక్కుమన్న వెండి చుక్క
నీ నవ్వే-
నా వలపు వాకిట బంతి పూ రెక్క.
కాలమొక కలం. ఆకాశాని కేది అంతం!
మనమధ్య మంచు తెరలు మాసాక, ఇక కథంతా సుఖాంతం.
ఇలా క్షణం క్షణం జీవితం – సంక్రాంతి సంబరం.
ఎడిటర్ గారూ, నా కవిత ని పబ్లిష్ చేసినందుకు – చాలా థాంక్సండి! పొద్దు వారి సంక్రాంతి gift లా చాలా సంతోషం గా వుంది.
గౌరవనీయులైన సంపాదకులకు, సంపాదక వర్గానికి, రచయితలకు, పాఠకులకు..అందరికీ -నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ…
శుభాకాంక్షలతో-
ఆర్.దమయంతి.
chaalaa baagundandi mee kavita… mee kaalpanika lOkamlO munigipOyi undi pOgalgitE enta haayi….asnipinchindi… congrats.
థాంక్స్ లక్ష్మి గారూ! మీ కాంప్లిమెంట్ కి ఆనందమేసింది. అవునూ, మీకలా వుండాలనిపిస్తే అలాగే వుండిపోకూడదూ హాయిగా !..ఇదిగో అందుకోండి సంతోషాల పూలగుత్తులు!
మరో సారి కృతజ్ఞతలతో –
Thanks for nice .You are always maintaining same tempo and rhythm and sending readers to unknown delighted areas . You certainly knows the alchemy of poetry
Simple words becoming poetry in your pen.
మీ ప్రశంసలకు నా కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను.
thanks and regards