కథ చెబుతారా? ఫిబ్రవరి 2012

 

ఈ నెల ఇస్తున్న అంశం:
ముగింపు మేమిస్తాం..

దూరంగా వెళుతున్న ఓడ చాలా దగ్గరగా ఉన్నభావన కలిగింది. తనే ఒక పడవగా అలా అలలపై తేలుతున్నట్లు, తనచుట్టూ అంతులేని కడలి పరచుకున్నట్లు అనుభూతి.   చూస్తూనే ఉన్నాడు సందీప్. ఈ ఏకాంతాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నాడు. దీని కోసం ఎంత కష్టపడ్డాడు! మొత్తానికి సాధించాడు. చిన్న నిట్టూర్పు. పుడమిని జోకొడుతున్న అలల లాలిపాట వింటూ తృప్తిగా నిదురపోయాడు.

ఆలోచించండి. ఈ ముగింపుకి సరిపోయే కథను పంపండి. నేపథ్యం మీ ఇష్టం. పాత్రలు, సన్నివేశాలు ఏవైనా అభ్యంతరం లేదు. హాస్యం, హారర్.. ఎటువంటివైనా బాధలేదు. ముగింపు మాత్రం సరిపోవాలి.

 

గమనిక: ఈ సమస్య మీదనే కాక గతనెలల్లో ఇచ్చిన దేని మీదనైనా రచయితలు ఎప్పుడైనా కథలు పంపవచ్చు.
ఈ శీర్షిక కాన్సెప్టు గురించిన మరిన్ని వివరాల కోసం కథ చెబుతారా.. ప్రకటన చూడండి.

This entry was posted in కథ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *