ప్రకృతి పాఠం ఎప్పుడూ ఒకేలా ఉండదు .
పాదాల కింద భూగోళం
శిరస్సు పైన ఆకాశం
రెండింటి మధ్య ఆయుధం !
గుడి గంట వినపడగానే గువ్వల గుంపు
ఆకాశానికి పందిరివేసి పల్లవి అందుకునే
పురాతన ఉషోదయం….
కల కనడానికి బాగానే ఉంటుంది !
రోజూ లాగే కాలం గడవదు
కొన్ని కాలనాగు వలయాలు
ఇంకొన్ని కాలకూట ప్రళయాలు
నువ్వు చూసేది, వినేది మాత్రమే నిజం కాదు
జననం లేకుండా… మరణం లేకుండా…
ఇంకొక మాయాలోకం పని చేస్తుంటుంది
అదృశ్యంగా!
చరిత్ర ఇప్పుడు మారింది .
దానికి నీ రక్తం కావాలి …నీ దేహం కావాలి .
అదిప్పుడు
నీ కంకాళంపై వాలే రాబందు !
నడి రాత్రి ఆకాశపు వెలుగులు
దూరంగా రాలిపోయే నక్షత్రాలు
చంద్రుడి చుట్టూ రాహు కేతువులు
మర్రి కొమ్మల్లో కూసే తీతువులు
ఇవాళ కూడా ఎప్పటి లాగే కళ్ళనిండా కల్లోలం
వర్షం కుండపోతగా నీలో కురుస్తూనే ఉంటుంది ….!
నడి అడివిలో నూకల వల పరిచిన వైనం
మనం ఇప్పుడు వాలడం కాదు …
ఫైపైకి ఎగరడం నేర్చుకోవాలి …
నెత్తుటి పూలు తెలియని ఉషోదయం
ఇప్పుడొక కల మాత్రమే!
మనిషి నేర్వని పాఠం ఎప్పుడూ ఒకటి మిగిలే ఉంటుంది!
very poem nice
“Manam ippudu vaaladam kaadu ,egaradam nerchukovali ” Rhythm and flow are
excellent. The dawn which comes after night’s toil is always fresh ,always inspiring every dawn opens new doors to new thoughts. Dawn is not old but gold
Thank you for giving good poem
this Poem is very beautiful & meaningful. Ending excellent