[dropcap style=”font-size: 60px; color: #9b9b9b;”]గా [/dropcap] యమైన గుండే గజలౌతుంది
విషాద గానాల ఖజానా అవుతుంది.
నడుచుకుంటూ పోయే కాలపు నల్ల నీడల దారులు
కన్నీటి పైన మాయమయ్యే అలల అడుగులు
సప్త వర్ణాల తనువుల మబ్బు వస్త్రాలు
నిశ్శబ్ద నీరవాలు – గజళ్ళు.
నువ్వెళ్ళిపోయిన దారి మలుపులు
తారట్లాడే చీకటి వెలుగుల చారలు
మెలిపెట్టే జ్ఞాపకాల ఆనవాళ్ళు
గొంతు కొసల చిట్లిన జీరలు – గజళ్ళు
నీ అరిపాదాల అద్దకాల ముద్రలు
ఎదకెత్తుకున్న మట్టిజన్మ జాడలు
వలపు పరిమళాల విలాపాలు
పగిలి రాలిన మొగలిరేకుల గుత్తులు – గజళ్ళు.
నీ తలపుల తెమ్మెర తెరలు వీచి
మత్తైన విషాదపు పువ్వులు విచ్చినపుడు
కనులలొలికిన కన్నీరుబుడ్డి జల్లి పొయే
మధుర వేదనా అత్తరులు
– గజళ్ళు.
ఎడబాసిన కరకుతనపు కరవాలాలు
హృదయ కుత్తుకని మెత్తగా నొక్కుతున్నప్పుడు
మడత పడ్డ ప్రాణాలు మెలికలు పోతుంటే
గాలి – నా బాధను పాడే గానాలు గజళ్ళు.
సఖా!
నువ్ వెనుదిరిగేసరికి నే వుందునో లేనో..
అందుకే ఇక్కడ గుమ్మరించి పోతున్నా
నీకై నిశ్శబ్దించిన నా గుండె చప్పుళ్ళు
– గజళ్ళు
Nice….
Thank you!
baagundanDi…mattaina vishaadapu poolu vichchinappuDu…..madhura vedanaa attarlu….great lines anDi… naa hrudpoorvaka abhinandanalu…
థాంక్స్ లక్ష్మీ గారూ. థాంక్యూ. మీకూ నా మనః పూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.
Started my day with a great poetic lines.
Amazing one!
ప్రతీ లైనులో ప్రాణం కొట్టుకుంటుంది!
నిజం!?
థాంక్యూ!..థాంక్యూ సో మచ్ తులసి మోహన్ గారూ!!
WoW…అద్భుతం!
Thanks for your wonderful expression Dr.pen gaarU!
– ఆర్.దమయంతి
I don’t have words to describe poetic excellency. Here language defeated before your flow of feelings. It’s feeling which language can not reach to describe.
It’s my heart’s echo after reading your attaru ganalu
Thanks for your heart felt appreciation!
చాలా చాలా బాగుంది.కానీ ఎదకెత్తుకున్న మట్టి జన్మ జాడలేమిటో తెలియలేదు.మరో విషయం- హృదయకుత్తుకలాంటి దుష్ట సమాసాల్ని పరిహరిస్తూండండి. నేనీ మాట ఛాందసత్వంతో చెప్పడం లేదు.కవితకు అందం చేకూర్చేదయితే తప్పులేదుకానీ మిగిలిన చోట్ల పంటికింద పడ్డ రాయిలా ఉంటాయి. పూల హారాల్లో ముళ్లు లేకుండా జాగ్రత్త పడడం మంచిది కదా.మంచి కవితలు వినిపిస్తుండండి.
పంతుల గోపాలకృష్ణ గారికి!
మీరు చాందసత్వంతో చెబుతున్నా రని నేననుకోవడం లేదండి!
మీ విమర్శ తప్పక ఆలోచింప చేస్తుందనడంలో సందేహమే లేదు.’పూల హారాల్లో ముళ్లు లేకుండా జాగ్రత్త పడడం’ అన్న మీ సూచన కూడా బాగుంది. మొత్తం మీద నా కవిత ‘చాలా చాలా బాగుంది ‘ అనే మీ ప్రశంసకు చాలా చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ…
నమస్సులతో-