About భట్టు వెంకటరావు
53 సంవత్సరాల భట్టు వెంకటరావు గారు తన గురించి ఇలా చెబుతున్నారు:
వృత్తి రిత్యా (కేంద్ర) ప్రభుత్వోద్యోగిని. ప్రస్తుతం ఉంటున్నది బెంగళూరులో. తెలుగు సాహిత్యం, ఆంధ్రుల చరిత్ర-సంస్కృతి గురించి కొత్త విషయాలు చెప్పాలనే దిశగా కృషిచెయ్యడం నా మొదటి ఇష్టం. ఆ తరువాత, సంస్కృత సాహిత్యం, భారతీయ చరిత్ర-సంస్కృతి, ఆంగ్ల సాహిత్యం, సంగీతం (చాల వరకు కర్నాటక పధ్ధతిలో, ఆ తరువాత చెవికి ఇంపైనది ఏదైనా సరే), Indian Temple Architecture (more of South Indian Temple Architecture), photography....ఇవన్నీ ఇష్టాలే!
ప్రపంచ సాహిత్యానికి, మనం, (అంటే తెలుగు సాహిత్యాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి practice చేస్తున్న కవులము, రచయితలము, విమర్శకులము అయిన మనం), గడచిన వెయ్యేళ్ళలో ఇచ్చిన కొత్త సంగతి ఏదైనా ఉందా? ఉన్నట్లయితే, అదేమిటి? అనేది నన్నెపుడూ బాధపెడుతూండే ప్రశ్న. ఉన్న సాహిత్యంలోంచి కొంతనైనా ప్రపంచ సాహిత్యానికి తగినట్లుగా మనల్ని మనం present చేసుకోగలుగుతున్నామా? అనేది కూడా అప్పుడపూడూ వేధిస్తూండే ప్రశ్న.
గత వెయ్యేళ్ళుగా ఇతర సాహిత్యాలనుంచి అవసరాన్ని మించి దిగుమతి చేసుకున్నాం, చేసుకుంటూనే ఉన్నాం ఇప్పటికీ అని నేననుకుంటాను. దీనివలన స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తిని కోల్పోయామేమో అని నా సందేహం. ఇక ఇక్కడికి అది ఆపి, ఇప్పటికైనా మనదైన సొంత గొంతుకతో మాట్లాడడం మొదలెట్టడం అవసరం అని నేననుకుంటాను.
పుస్తకాలలో బాగా నచ్చినవి - 'ఋగ్వేదం' మొత్తంగా. ఎందుకంటే, how the Indian mind started imagining various things అనేదానికి మూలాలన్నీ ఋగ్వేదంలోనే దొరుకుతాయి. Traces of first imaginations for most of our myths could be found in RgveadaM అన్నది సర్వ విదితం. ఇది ఒక aspect అయితే, రెండవది, ఋగ్వేదం 10వ మండలంలో 'ఊర్వశీ పురూరవ' సంవాదానికి సంబంధించిన ఋక్కులు, ఇవి Indian creative mind యొక్క imagination కి సంబంధించిన అత్యుత్తమ ఉదాహరణలు. ఈ కథ అప్పటిలోనే వెనకనుంచి ముందుకు ఊహించబడి చెప్పబడింది. దీనిని భరించలేని తరువాత తరాల వారు common mind కి అమోదయోగ్యంగా అన్నట్లు సీదా చేసి పాడుచేశారేమో అని నేననుకుంటాను.
హాలుని 'గాథా సప్తశతి'. మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్లు చూసుకోవడానికి దీన్ని మించింది మరోటిలేదు. basic గా గత రెండువేల సంవత్సరాలుగా మనం పెద్దగా మారిందేమీ లేదన్నది ఇందులోని గాథలు చదివితే తెలుస్తుంది.
శూద్రకుని 'మృత్ శకటికం', బాసుని, కాళిదాసుని రచనలు ... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి.
ఆంగ్లంలో Albert Camus రచనలు, ముఖ్యంగా The Outsider, The Fall, W. Somerset Maugham, V.S. Naipual, Milan Kundera (ముఖ్యంగా The Art of the Novel, The Unbearable lightness of being, Joke, Life is elsewhere ఇత్యాదిగానూ...), Indian English writers లో Arundhati Roy, Amitav Ghosh (The Circle of Reason, The Glass Palace ఇత్యాదిగానూ)...
తెలుగు రచయితలలో బుచ్చిబాబు, రావి శాస్త్రి, చలం (చాలా తక్కువ మేరకు), పూర్వ కవులలో నన్నయ, శ్రీనాథుడు, పోతన, పింగళి సూరన, సాహిత్య పరిశోధకులలో మానవల్లి రామకృష్ణకవిగారూ, పంచాజ్ఞుల ఆదినారయణ శాస్త్రిగారు, తిరుమల రామచంద్ర గారు, ఆరుద్ర గారు, విమర్శకులలో అక్కిరాజు ఉమాకాంత విద్యాశేఖరులు....తెలుగు సాహిత్యం కోసం వీరు పడ్డ శ్రమ, గడిపిన జీవన విధానం, ఇవన్నీ నాకు అత్యంత పూజ్యనీయాలు.
చదువుతూంటాను, రాస్తూంటాను, ప్రస్తుతానికి ఎక్కువగా నా బ్లాగ్స్ లోనే! నా బ్లాగులు:
http://memorylines.wordpress.com
http://venkatbrao.wordpress.com
http://chaayaaviidhi.wordpress.com
ఎప్పటికైనా 'Basic concepts of Indian Imagination down the ages' అని వేదాలనుంచి, పురాణాలనుంచి, ఇతిహాసాల నుంచి, కావ్యాలనుంచీ ఉల్లేఖనాలతో, ఒక reference book లాగా ఉపయోగపడేటువంటి ఉద్గ్రంథం రాయాలని నా కోరిక.
చాలా బావుంది!
చాలా బాగుంది కవిత
మరేమాటా లేకుండా రాత్రి
సరివి చెట్ల మధ్య దిరిసెనపువ్వులా విప్పారి
తనకుతానుగానే అర్పించుకోనపుడూ గాని
అర్ధం కాదు!
అద్భుతమైన భావుకత
chaala anTE chaalaa baagundi.