నీటి మడుగుచుట్టూ రెల్లుగడ్డి పహారా
నిర్భయంగా సుడులు రేపుతూ కలల గులకరాళ్ళు
—
దివారాత్రాల రాపిడిలో కళ్ల వెనక రంపపు పొడి
సంధ్య
ప్రవహిస్తున్న లోకాన్ని వ్యధల ఊబిలోంచి అచేతనంగా చూస్తూ
ఆశ
కొడిగట్టిన ఆత్మకు కవిత్వపు కొన ఊపిరులూదుతూ
అక్షరం
—-
ఓదార్చేందుకు ఎవరూలేని మరోచోట
రాత్రంతా బాధను దింపుకోవడానికి అవనతమౌతున్న సూర్యుడు.
యుగాలనుండీ అలానే పడి ఉన్నా
చుక్కల్ని కలిపి ముగ్గు పెట్టే దిక్కులేక
పాడుపడ్డ ఆకాశం.
చావు గీటురాయి మీద తప్ప
జీవితాన్ని విలువకట్టలేని అల్పత్వంతో
కాలంతో బేరాలాడుతూ మనం.
యుగాలనుండీ అలానే పడి ఉన్నాచుక్కల్ని కలిపి ముగ్గు పెట్టే దిక్కులేక పాడుపడ్డ ఆకాశం…. ee line chala bagundandi..!!