వందేళ్ళ తరువాత నా కవితలను చదువుతున్న పాఠకుడా, నీవెవరవూ?
నేటి ఈ వసంత మాలిక నుంచి ఓ చిరుసుమాన్ని కానీ
అదో ఆ మబ్బుల గుంపునుంచి ఓ పసిడి మరకను కానీ
నీకు నేను పంపించలేను కదా!
తలుపులు తెరచి బయట చూడు
వందేళ్ళ క్రితం వాడిపోయిన పువ్వుల పరిమళాల స్మృతుల్ని
అరవిరిసిన నీ తోట లోంచి గ్రహించు
శతవత్సరాల దూరం విస్తరించిన
ఒకనాటి వసంతోత్సవ గాన మాధుర్యం సజీవమై
పరవశించే నీ హృదయానికి తెలుస్తుంది కదూ!