ఖర నామ సంవత్సర ఉగాది కథలపోటీ
ఖరనామ సంవత్సర ఉగాది సందర్భంగా కథల పోటీని నిర్వహించాలని పొద్దు సంకల్పించింది.ఈ సందర్భంగా రచయితలు, రచయిత్రులకు సాదర ఆహ్వానం పలుకుతోంది. ఈ పోటీ యొక్క నిబంధనలివి:
1. ఇతివృత్తం, నిడివి వంటి విషయాల్లో పట్టింపులేమీ లేవు.
2. రచన అప్రచురితమూ, సొంతమూ అయిఉండాలి.
3. కథతో పాటు రచయిత సంక్షిప్త పరిచయము, ఫోటో, హామీ పత్రము జతచేసి పంపాలి
4. చివరితేదీ: మార్చి 25.
5. బహుమతి పొందినవి కాక, ఇతరకథల్లో అర్హమైన వాటిని రచయితకు తెలియజేసి సాధారణ ప్రచురణకు స్వీకరిస్తాము.
6.బహుమతులు పొందిన కథలతోపాటు సాధారణ ప్రచురణకు స్వీకరించిన కథలను ఉగాది నుండి వరుసగా ప్రచురిస్తాము.
7. కథను యూనికోడులో టైపించి editor@poddu.net మెయిల్ ఐడీకి ఈమెయిలు చెయ్యాలి.
8. పోస్ట్ ద్వారా పంపదలచిన వారు ఈ కింది చిరునామాకి పంపాలి.
తుమ్మల శిరీష్ కుమార్,
201, రాజ్యలక్ష్మి ఆర్కేడ్,
వివేకానందనగర్,
కూకట్ పల్లి,
హైదరాబాద్
పిన్: 500072
ఫోన్: 9866236956
9.బహుమతులు
అత్యుత్తమ కథ |
కినిగె పుస్తక భాండాగారం (kinige.com) వారి రూ 750 విలువైన బహుమతి కూపన్ మరియు సీ పీ బ్రౌన్ ఎకాడమీ వారి సాహితీ స్రవంతి పత్రికకు సంవత్సర చందా. |
ద్వితీయ ఉత్తమ కథ |
కినిగె పుస్తక భాండాగారం (kinige.com) వారి రూ 500 విలువైన బహుమతి కూపన్ మరియు ’పత్రిక’మాసపత్రికకు సంవత్సర చందా |
తృతీయ ఉత్తమ కథ |
కినిగె పుస్తక భాండాగారం (kinige.com) వారి రూ 250 విలువైన బహుమతి కూపన్ మరియు ఇటీవలి తెలుగు కథల సంకలనం |
నవవసంతశోభను ఇనుమడింపజేసే మీ కథాకూజితాల కోసం పొద్దు ఎదురుచూస్తోంది.
రచనలకు సంబంధించి, పొద్దు యొక్క ఇతర సూచనలు, నిబంధనల కోసం మా రచయితలకు సూచనలు పేజీ చూడండి.