ఆదివారం మధ్యాహ్నాలు

అదోలా వుంటాయి
ముందురోజు
హడావిడి మతలబులన్నీ
ముడి వీడి
కళ్ళ మీద మత్తుగా

వాలుతుంటాయి,
యుద్ధానంతరం సాగే
విరామంలా తోస్తూనే

మరో మహాసంగ్రామానికి
సిద్ధమయే భ్రమలో

అదోలా వుంటాయి

ఆదివారం మధ్యాహ్నాలు!

అంత వెలుగులోనూ
నలుపూ తెలుపుల్లో
నలిగిన
ఛాయాచిత్రపు లోతుల్ని

గ్రహించలేనంత తీరిగ్గానూ,
సగంలో ఆపబడిన పుస్తకంలా
సుదీర్ఘంగానూ సాగుతుంటాయి,
గుమ్మం ముందు
ఎండ పొడలో అదోలా
ఆదివారం మధ్యాహ్నాలు!
ఆకులు కదలవు
గాలి వీచదు
సందేహాత్మక నిశ్చలత్వాన్ని
ఆపాదించుకుని
ఆరుబయట అంతా
అదో మాదిరిగా వుంటుంది
కనిపించని వేడిని వెంటేసుకుని

సమాధానపడని
ఓ నగ్నజ్ఞాపకంలా
గుండెని సర్రున కోస్తూ,

స్రవిస్తున్నదేమిటో
భారమో…భావమో

తెలీకుండా!

నిజంగానే….

అదోలా వుంటాయి

ఆదివారం మధ్యాహ్నాలు!

About రామినేని లక్ష్మితులసి

లక్ష్మీతులసి రామినేని, సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ, కుటుంబంతో చికాగోలో ఉంటున్నారు. కవితలు చదవడం-వ్రాయడం, పెయింటింగ్, సంగీతం వినడం, స్నేహితులతో గడపడం వీరి హాబీలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

8 Responses to ఆదివారం మధ్యాహ్నాలు

  1. Krishna Mohan says:

    super

  2. Krishna says:

    true & good one.
    i have read Tagore’s description of afternoons in his book.

  3. తులసి గారు:
    ఈ కవిత వొక ఛాయాచిత్రపు నాలుగో లోతు లా వుంది.
    ప్రతి పంక్తీ వొక దృశ్యంలా వుంది.

    ముఖ్యంగా ఇవీ:

    ఛాయాచిత్రపు లోతుల్ని
    గ్రహించలేనంత తీరిగ్గానూ,

    సగంలో ఆపబడిన పుస్తకంలా

    సుదీర్ఘంగానూ సాగుతుంటాయి,

    గుమ్మం ముందు

    ఎండ పొడలో అదోలా

  4. nagamurali says:

    After reading your poem, I remembered these sentences from Hitchhiker’s guide to the galaxy:

    In the end, it was the Sunday afternoons he couldn’t cope with, and that terrible listlessness that starts to set in about 2:55, when you know you’ve taken all the baths that you can usefully take that day, that however hard you stare at any given paragraph in the newspaper you will never actually read it, or use the revolutionary new pruning technique it describes, and that as you stare at the clock the hands will move relentlessly on to four o’clock, and you will enter the long dark teatime of the soul.

    (Didn’t memorize these, just looked up in Wikiquote).

  5. Thank you all for your time.

  6. ఆదివారం కానుక
    **
    ‘ ఔద్వేగిక ఆవరణను గురించి మరింత వివరించే ముందు, కొన్ని ఉదాహరణలు – తెలుగు, ఇంగ్లిష్ నుండి… ఆదివారం మధ్యాహ్నాలు అని రామినేని లక్ష్మీ తులసి గారి కవిత. నాకు మొదటిసారి చూడగానే మళ్ళీ పట్టి చదవాలి అనిపించేయి. ఈ ఆహ్వానంలో, అనుభవంలో నా గతానుభవం, నావైన ఆకాంక్షలకూ చాలానే పాత్ర చాలా ఉంది. ఈ కవితలకు చాలా మందే పాఠకులు ఉండుంటారు. వాళ్ళలో ఏ ఒక్కరి అనుభవం నాకు వివరంగా తెలిసే అవకాశం లేదు. కాని నా స్వంత అనుభవమైతే నాకు తెలుస్తుంది. దృశ్యాభాస లోన ఔద్వేగిక ఆవరణ ఎలా నిర్మితమౌతుందో వివరించడానికి మాత్రమే….
    ఆదివారం మధాహ్నాలు ప్రకృతిని – కాలంలో అనువారంగా వచ్చే మార్పునూ, అంతరంగంపై ఆ కాలపు ప్రభావాన్నీ వర్ణిస్తున్నాది. దీన్లో మాట్లాడుతున్న గొంతు ‘అప్పల్రాజు ‘ గారిది కాదు. అది స్వయంగా కవయిత్రి గొంతు. అది పరికల్పించాలని ప్రయత్నిస్తున్న ఔద్వేగిక ఆవరణ, అనుభవం కవయిత్రి లాగనే వారం అంతా ఉద్యోగాలు చేసుకొంటూ వారాంతం లోని మార్పును అనుభవించే ఆధునికులందరికీ పరిచితమైనది. ఇలాంటి మనుషులందరికీ ‘ఆదివారం మధ్యాహ్నం’ అన్న మాట వినీ వినగానే ఈ ఔద్వేగిక ఆవరణ స్ఫురణకు వస్తుంది. ముందుగా ఈ ఒక్క మాటా – అంటే కవిత పేరు వినగానే నాకు ఏం స్ఫురించిందో చెప్తున్నాను. ( ఈమాట – మూడు లాంతర్లు -10 లో)శ్రీ కనక ప్రసాద్.
    కంగ్రాట్సండి! నా హృదయపూర్వక అభినందనలందుకోండి!
    అభిమానంతో-
    ఆర్.దమయంతి.

  7. Pingback: ఈమాట » మూడు లాంతర్లు -11

Comments are closed.