వీపు మీద గోనె సంచీతో శ్రీరాం కాలనీలో ప్రవేశించాడు పైడితల్లి. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని మించి ఎరుపెక్కిన కళ్ళతో వెతుకుతున్నాడు.. ఆ తరువాత ఏం జరిగింది? –
ఒక అక్క, ఒక బావ, ఒక హీరో, ఒక విలన్, మధ్యలో వ్యాంపు 🙂 .. పాత్రలు మేమిస్తాం,
చనిపోయిన భార్య స్మృతులని, కలిసి జీవించిన క్షణాలని, మరపురాని సంఘటనలని గుర్తు చేసుకుంటున్న మానవ్ కు భార్య డైరీ దొరికితే.. అవే సంఘటనలు, విభిన్న కోణాలలో –
“కుక్కల బండి” ; “అనాహత నాదాలు”.. శీర్షికనిస్తే
దీర్ఘంగా నిట్టూర్చాడు వినయ్. “మీరూ సరితా ఎందుకు విడిపోయారో.. అందుకే” అన్నాడు.
“కానీ ఈ విషయం మీకు ముందే తెలుసుగా” అసహనంగా అడిగాడు హరీష్.
“మీకూ ముందే తెలుసు.. కాదనగలరా?” సూటిగా అడిగాడు వినయ్.
——————-
పొద్దు పాఠకులకు, కథా రచయితలకు ఇదే మా ఆహ్వానం. రకరకాల అంశాలతో ప్రతీ నెల మీ ముందుంటాం. ఇచ్చిన అంశానికి తగిన కథను వ్రాయండి. రచనాసక్తిని కలిగించడానికి, రచనాశక్తిని పెంపొందించడానికి ఇది ఒక చక్కని ప్రక్రియ అని మా భావన. కథకులలో వైవిధ్యాన్ని పాఠకులకు పరిచయం చెయ్యాలని మా కోరిక.
కథ పంపడానికి గడువంటూ లేదు. అయితే ప్రతీ నెలా క్రొత్త అంశం మీ ముందుంటుంది కనుక పాత అంశాలపై కథలు పంపేటప్పుడు అది ఏ నెలదో సూచించండి. editor@poddu.net ఐ.డి కి మీ కథను పంపండి. ఈమెయిలు సబ్జెక్టులో “కథ చెబుతారా?!” అని తప్పక రాయండి. ఎన్నిక చేసిన వాటిని పొద్దులో ప్రచురిస్తాం.
కథ చెబుతారా?! — 2011 నవంబరు
ఈ నెల ఇస్తున్న అంశం:
ముగింపు మేమిస్తాం..
ఆలస్యంగా వచ్చిన పాల అబ్బాయి రెండోసారి కూడా కాలింగ్ బెల్ నొక్కి, తలుపు దగ్గర పాలపాకెట్లు పడేసి మరో ఇంటికి వెళ్ళిపోయాడు. హాల్లో గడియారంలోంచి బయటికొచ్చిన చిలకబొమ్మ ఏడుసార్లు అరిచి మళ్ళీ లోపలకి దూరింది. డైనింగ్ టేబుల్ మీద సగం కొరికిన బ్రెడ్ ముక్క ఎండిపోయి పడి ఉంది. రాత్రి నుండీ టేబుల్ పైన ఫ్యాన్ తిరుగుతూనే ఉంది.
ఆలోచించండి. ఈ ముగింపుకి సరిపోయే కథను పంపండి. నేపథ్యం మీ ఇష్టం. పాత్రలు, సన్నివేశాలు ఏవైనా అభ్యంతరం లేదు. హాస్యం, హారర్.. ఎటువంటివైనా బాధలేదు. ముగింపు మాత్రం సరిపోవాలి.
పోటీ బాగుంది.
Nice Concept !
Keep it up!
నవంబరు కథ చెబుతారా ‘ కు ౩౦ నవంబరు వరకు టైము వుంటుందా?
లక్ష్మీ రాఘవ
రాఘవ గారూ,
సమయం ఉంది.మీరు ఈ లింకుని సూచిస్తూ ఎప్పుడైనా పంపవచ్చు.
Namaste!
For “Katha chebutara?!” feature – What is the limit of words?
Plesse respond.
Thanks!
Aluri Parthasardhi
కధాజగత్ లో నా కధకు స్థానం కలిపించినందుకు ధన్యవాదములు.