రమల్ ప్రశ్నాశాస్త్రం వ్యాసాల వరుసలో రెండవ భాగం ఇది.
————————-
రమల్ సంకేతాలు బిందువు ( ౦ ), రేఖ (__ ) మాత్రమే! అప్పుడప్పుడు రేఖని ( __ ) రెండు బిందువులతో కూడ సూచిస్తారు. అంటే (౦ ౦) అలా అన్నమాట .రేఖ రెండు బిందువులతో తయారయ్యేదే కదా మరి ! నాలుగు నిలువు వరసలలో నాలుగు బిందువులు, నాలుగు రేఖలతో , మొత్తం 16 షకల్ / మూర్తులు తయారవుతాయి. వాటినే రమల్ వర్ణమాల అంటారు. ఈ సంకేతాలని 8 వర్గ ఖండాలతో (8 క్యూబ్ లాంటివి) తయారు చేసిన పాచికల మీద పొడిపించి, నాలుగేసి వర్గాలని (గుటికలని ) ఒక రాగి మేకులో గ్రుచ్చి పాచికలని తయారు చేస్తారు.
'రమల్' ద్వారా ప్రశ్నలకి జవాబులివ్వడానికి, పాచికల అవసరం ఉంది. ఈ పాచికలని అష్ట ధాతువులతో తయారు చేయించాలి.
1. బంగారము (సూర్య ), 2. వెండి (చంద్ర ) 3. ఇనుము (మంగల్ లేక కుజ), 4. ఇత్తడి, (బృహస్పతి ), 5. రాగి (శుక్ర ), 6. సీసము (శని), 7. తగరము (బుధ), 8. పాదరసము -ఇవే ఆ ధాతువులు !
పాదరసము ఆకాశధాతువు. అందువల్ల దాని సంబంధం అన్ని గ్రహాలతోనూ ఉంటుంది. ఈ పాచికల గొడవ ఏమిటి? అవి లేనిదే యీ ప్రశ్న శాస్త్రం పని చెయ్యదా అన్న అనుమానం సహజంగానే వస్తుంది. వాటి అవసరం లేకుండా కూడా రమల్ ని ఉపయోగించి సమాధానాలు తెలుసుకోవచ్చు. కాకపోతే యీ పాచికలతో పని సులువవుతుంది !
ఇప్పుడు 16 సంకేతాలతో తయారయే షకల్ / మూర్తుల గురించి తెలుసుకొందాం.
‘రమల్’ మూర్తుల పేర్లు, వాటి స్వభావ స్వరూపాలు
పహలా షకల్ / ఒకటవ మూర్తి |
లహియాన్/ లేదా వాగ్మి |
బ్రాహ్మణ వర్ణము,తెలుపు రంగు, ధర్మాసక్తి కల వ్యక్తి, పండితుడు,మిష్టాన్నభోజి,, మధురభాషి, అయిన వ్యక్తి. |
౦ __ __ __ |
దూసరా షకల్ / రెండవ మూర్తి
|
కబ్జుల్ దాఖిల్ / లేదా తీక్ష్ణాంశు |
క్షత్రియ వర్ణము, గోధుమ రంగు,చిత్రకళాసక్తి కల వ్యక్తి, వ్యాపారి. హాజిర్ జవాబ్ తరహా వ్యక్తి. |
__ ౦ __ ౦ |
తీసరా షకల్ / మూడవ మూర్తి |
కబ్జుల్ ఖారీజ్ / పాత్. |
మ్లేఛ్ఛవర్ణము,అన్యాయము అధర్మము ఇష్టపడే వ్యక్తి, పిల్లి కళ్లు, నలుపు లేదా చిత్రమైన రంగు కల వ్యక్తి. |
౦ __ ౦ __ |
చౌదా షకల్ / నాల్గవ మూర్తి |
జమాత్ / సౌమ్య |
శూద్రవర్ణము,గోధుమరంగు, స్వర్ణకారుడు వక్త, దూత గుణవంతుడు |
__ __ __ __ |
పంచవా షకల్ / ఐదవ మూర్తి |
ఫరహా / . దైత్య గురు |
తెలుపు రంగు, అందమైన వాడు. చిన్నవైన నల్లని కళ్లు, మధుర భోజి, వ్రాయస గాడు |
౦ ౦ __ ౦ |
ఛటా షకల్ / ఆరవ మూర్తి |
ఉకలా / మందగ్ |
నలుపు రంగు, మలిన హీన జాతి, ఎత్తు వెడల్పు గల ముక్కు, కలహ ప్రియుడు, కూరలు అమ్మే వాడు. |
౦ __ __ ౦ |
సతవా షకల్ / ఏడవ మూర్తి |
అంకీష్ / సౌరి |
ఉజ్వల శ్యామవర్ణము, గోళ్లు దంతములు గల వ్యక్తి, వ్యవసాయము చేసేవాడు. దిబ్బ పెదవులు |
__ __ __ ౦ |
అఠవా షకల్ / ఎనిమిదో మూర్తి |
హుమరా / లోహిత్ |
క్షత్రియ వర్ణము, కౄరుడు, హింస నిందిత కార్యములు చేశేవాడు. పెద్ద బుర్ర మధ్యమ శరీరము, . |
__ ౦ __ __ |
నవా షకల్ / తొమ్మిదో మూర్తి |
బయాజ్ / విధు |
బ్రాహ్మణ వర్ణము, తెలుపు రంగు, భ్రమణశీలుడు, భక్తుడు, శ్రేష్టమైన పనులు చేసేవాడు.రత్నప్రియుడు |
__ __ ౦ __ |
దశవా షకల్ / పదవ మూర్తి |
నుస్రుతుల్ ఖారీజ్ / ఉష్ణగు |
క్షత్రియ వర్ణము, శ్రేష్టుడు, రాజకార్య దక్షుడు, తెలుపు రంగు, స్వర్ణ, రత్న వ్యాపారి. చిన్నబుర్ర, |
౦ ౦ __ __ |
గ్యారా షకల్ / ఏకాదశ మూర్తి |
నుస్రుతుల్ దాఖిల్ / సూరి |
బ్రాహ్మణవర్ణము, తెలుపు రంగు, అధ్యయనము, అధ్యాపక వృత్తి, అందగాడు లేక సౌందర్యవతి. |
__ __ ౦ ౦ |
బారవా షకల్ / ద్వాదశ మూర్తి |
అతవే ఖారీజ్ / చక్ర |
మ్లేఛ్ఛవర్ణము, దుర్బల శరీరము, ఉన్ని దుస్తులు ధరించే వాడు, గుహావాసి, మలిన వికృత రూపి |
౦ ౦ ౦ __ |
తేరవా షకల్ / త్రయోదశ మూర్తి |
నకీ / ఆర్ |
తెలుపు, క్షత్రియ వర్ణము, మాంసాహారి, యోధ్ధ, స్వతంత్రుడు, శిశు ప్రేమికుడు. |
౦ __ ౦ ౦ |
చౌదహవా షకల్ / చతుర్దశ మూర్తి |
అతవే దాఖిల్ / కవి |
గోధుమ రంగు, పొడవు సుందరి, పెద్ద పిరుదులు గలది. పకృతి ప్రేమి, ఉద్యాన వన వాసిని. |
__ ౦ ౦ ౦ |
పంద్రహవా షకల్ / పంచాదశ మూర్తి |
ఇజ్జతమా / బోధన్ |
శూద్రవర్ణము, లిపికుడు, జ్యోతిషి, గుణవంతుడు, గోధుమ వర్ణము, కోమల స్వబావము. |
__ ౦ ౦ __ |
సోలవా షకల్ / షోడశ మూర్తి |
తరీక్/ శీతాంశు |
వైశ్యవర్ణము, స్త్రీ , సుందరి, దుర్బల శరీరము, ధాతువులు, చిత్రములు, వస్త్రములు చేసేది. |
౦ ౦ ౦ ౦
|
మూర్తులలో చెప్పిన గుణ వర్ణ, స్వభావముల ఆదారంగా ప్రశ్నలకి సమాదానాలు చెప్పాలి. ఈ మూర్తులు తమ తమ గుణాలని అనుసరించే ఫలితాలు ఇస్తాయి.
కొసమెరుపు : ఏదైనా చిన్న ప్రశ్న ఔను / కాదు అనే సమాధానం మాత్రమే కల ప్రశ్న కలిగిందనుకోండి. 'రమల్' ద్వారా జవాబు తెలుసుకోవాలంటే, నాలుగు వరసలలో చుక్కలు గీతలు ఆ ప్రశ్నని మనసులో తల్చుకుంటూ పెట్టండి. తరువాత ఆ వరుసలలో గల గీతలు, చుక్కలు లెక్క పెట్టండి. గీత అంటే రెండు చుక్కలన్నమాట ! ఆ విధంగా లెక్క పెట్టిన తరువాత సమ సంఖ్య వస్తే గీత అని , విషమ సంఖ్య వస్తే చుక్క అని గ్రహించి మూర్తిని తయారు చేయండి.
ఉదాహరణకి
(1) ౦౦౦౦౦౦ _ _ _ _ ౦౦౦ _ _ _ ౦ = 24 = __
(2) _ _ _ _ _ _ ౦౦౦౦౦ _ _ _ _ = 25 = ౦
(3) ౦౦౦౦ _ _ _ _ _ _ _ _ _ _ _ ౦౦ = 28= __
(4) _ _ _ _ _ _ _ ౦౦౦౦౦౦౦ _ _ _ _౦ = 30 = __
ఈ మూర్తి పేరు మన ఛార్టు ప్రకారం 'హుమరా' ! హింస, నిందిత కార్యములు చేసేవాడు అని రమల్ చెప్తోంది. కాబట్టి మీ ప్రశ్నకి జవాబు 'కాదు' అని అర్థం!!
***************