Daily Archives: 2010, July 13
కవిత
-ఆత్రేయ కొండూరు తలపు తడుతూ నేల గంధం తలుపు తీస్తే, ఆకాశం కప్పుకున్న అస్థిరమయిన రూపాలు తేలిపోతూ, కరిగిపోతూ, అలజడిచేస్తూ, అక్షరాల జల్లు. నిలిచే సమయమేది ? పట్టే ఒడుపేది ? పల్లంలో దాగిన జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు. తడుపుదామనో కలిసి తరిద్దామనో! గుండె నిండేసరికి నిర్మలాకాశం వెచ్చగా మెరిసింది.