-ఆత్రేయ కొండూరు
తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే,
ఆకాశం కప్పుకున్న
అస్థిరమయిన రూపాలు
తేలిపోతూ, కరిగిపోతూ,
అలజడిచేస్తూ,
అక్షరాల జల్లు.
నిలిచే సమయమేది ?
పట్టే ఒడుపేది ?
పల్లంలో దాగిన
జ్ఞాపకాల వైపు ఒకటే పరుగు.
తడుపుదామనో
కలిసి తరిద్దామనో!
గుండె నిండేసరికి
నిర్మలాకాశం
వెచ్చగా మెరిసింది.
ఆత్రేయ గారు,
“తలపు తడుతూ నేల గంధం
తలుపు తీస్తే”
అనే కవితా పంక్తి….చాలా బాగుంది..
అభినందనలు..
pallamlo daagina jnaapakaala vaipu anadam baagundi.