శకలస్వరం

-డా. పులిపాటి గురుస్వామి

ఎప్పటికీ
ఏదో ఒక బాధ..

దానికి రూపం ఉండదు,
నువ్వనుకుంటున్నట్టు
సరిహద్దులు కూడా ఉండవు.

నన్ను కాపాడుకోవటం కోసం
అది ఆవహించుకు పోతుంది.

వందశాతం వశీకరణ మంత్రమేదో ఉంది.
నేను దాన్ని ప్రేమించినట్టే
అది కూడా నన్ను..

కనికరింపుల కలత
దుఃఖాన్ని సాదరంగా
చేయి పట్టుకు తీసుకువచ్చి
నిలబెడితే..

దాని దీనమైన ముఖానికి
నవ్వాగదు నాకు..

నాకు నువ్వు కావాలి
దుఃఖం కూడా కావాలి .

డా.పులిపాటి గురుస్వామి గారు, ఎల్.బి.నగర్, హైద్రాబాద్‌లో వైద్యవృత్తిలో ఉన్నారు. కవిత్వం,రచనలు ప్రవృత్తి. స్వీయ కవితలతో “చెమ్మ” కవితా సంకలనాన్ని ప్రచురించారు.”జీవిగంజి” దీర్ఘ కవితను రచించారు.

About డా. పులిపాటి గురుస్వామి

డా.పులిపాటి గురుస్వామి, హైదరాబాద్ ఎల్.బి. నగర్ లో వైద్య వృత్తిలో ఉన్నారు . కవిత్వం, రచనలు ఆయన ప్రవృత్తి. ’'చెమ్మ’'కవితా సంకలనం, ’'జీవిగంజి’’ దీర్ఘ కవిత ఆయన రచనలు.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

4 Responses to శకలస్వరం

  1. ramanarsimha says:

    ROHIHI PRASAD GARU,

    Thanks for reply..

  2. ఉష says:

    “నాకు నువ్వు కావాలి
    దుఃఖం కూడా కావాలి”

    నా చెంత నువ్వున్నా లేకున్నా “నువ్వు” అన్న తలపు కావాలి. “నువ్వు” చుట్టూ పరిభ్రమించే “బాధ” కావాలి. ఈ “నువ్వు” అందరికీ అర్థం కాదులేండి. నువ్వు, దుఃఖం, సుఖం త్రివేణీ సంగమం. దానిలోనే “నేను/బాధ” కి అస్తిత్వం.

    మీ కవితాత్మ ఇది కాకపోయినా నాకు కలిగిన స్పందన మాత్రం ఇదే.

  3. హెచ్చార్కె says:

    చిన్నప్పుడు అమ్మ దాచిపెట్టి దాచిపెట్టి ఇచ్చిన బెల్లం ముక్కల్లా పద్యం పాదాలు. బెల్లం ముక్క తింటే అయిపోతుందని కొంచెం కొంచెం తింటామే అలాగ. పక్క పక్కన్నే కనికరింపు, కలత; దుఃఖం, సాదరంగా; దైన్యం, నవ్వు; నువ్వు, దుఃఖం…! నిజమే కదా, దఃఖం లేకపోతే ‘నువ్వు’ తెలుస్తావా ‘నాకు’? దుఃఖానికి తప్పకుండా ఒక విలువ ఉంది, నవ్వు నాకు తెలిసేట్టు చేసే విలువ. బ్యూటిఫుల్ పొయెమ్. డాక్టరు గారూ, అభినందనలు. ‘ఆవహించుకు పోతుంది’ అనే ఒక్క మాట మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంది (విషయం కాదు, మాట).

  4. rajesh says:

    kavita baagundi guruswamy gaaru,

    jeevitaalni dukham kannaa sukhamae aavahinchaalani ee kavita naaku eruka parchindi. telugu kavitvam gurunchi naaku peddagaa teliadu. aevao konni maatalu.

Comments are closed.