-అవ్వారి నాగరాజు
ఏదో భయం ఉంటుంది
వోరగ తెరచి ఉంచిన అపరిచిత ప్రపంచపు
ఆహ్వానానికై ఎదురు చూసే పెరపెరా ఉంటుంది
రాతిరి విచ్చుకున్న ఆకాశపు పందిరి కింద
చేతులు చాచుకుని
అగాథపు నీలిమ లోతులలో
పవ్వళించే స్వాప్నికతా ఉంటుంది
ఒక రోజు తొలగి ఇంకొక దానికి దారి చూపే
వేకువలలో తెలియని సంశాయాత్మతో
తనలోకి తానై ఒక శూన్యతగా తారాడే అశక్తతా ఉంటుంది
అలల కదలికల నడుమ
అలకూ అలకూ కలిపి తేలికగా నాట్యం చేసే తీగలాంటిదేదో ఉంటుంది
మాటకూ మాటకూ నడుమ కృత్యదావస్థ ఒకటి
పెనుగులాటై భుజాన వేలాడే భారపుమూటలా
పక్కటెముకలకూ రాపెడుతూ ఉంటుంది
సాంద్రమై అన్నింటినీ ఏకమట్టం చేసే
మహాసందోహపు అట్టహాసమూ ఉంటుంది
దూరాన ఎక్కడో మనిగిన
గడ్డి పూవు రెక్కలపై
అల్లాడే గాలి తరగలను కొలిచే
సున్నితపు మాపనీ ఉంటుంది
అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి
యధావిధిగా ఏమీ లేనట్టుగా
——————-
అవ్వారి నాగరాజు గారు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తెలుగు సాహిత్యం, కవిత్వం మీద ఎనలేని ఆసక్తి.
bagundi
బాగుంది……
పెరపేరా…..అర్థం కాలేదు .
భావుకత నిండిన కవిత ….
కృతజ్ఞతలు.
Very nice
Chaala baagundi
చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ కింది లైనులు బాగా నచ్చేసాయి
దూరాన ఎక్కడో మనిగిన
గడ్డి పూవు రెక్కలపై
అల్లాడే గాలి తరగలను కొలిచే
సున్నితపు మాపనీ ఉంటుంది
చాలా బాగుంది!
విచ్చుకున్న ఆకాశం…అగాథపు నీలిమ లోతులు…కృత్యదావస్థ…
అన్నీ ఉన్నట్టుగానే యధావిధిగా ఏమీ లేనట్టు…
బాగా నచ్చాయి.
కవితా తాత్వికత నచ్చింది. కానీ భౌతిక వాస్తవికతను కాదనలేము. తెగిపడిన శిరసులకు వెలకట్టలేము. గాయాల సలపరం మిధ్య కాదన్నది సత్యం..
“మాటకూ మాటకూ నడుమ కృత్యదావస్థ ఒకటి
పెనుగులాటై భుజాన వేలాడే భారపుమూటలా
పక్కటెముకలకూ రాపెడుతూ ఉంటుంది”
నిజం కదా? “అన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి, యధావిధిగా ఏమీ లేనట్టుగా..” అవును ఈ ద్వంద్వ భావనలకి మనిషి స్టామినాతో ఏం పని, వాటి మానాన అవి తొలిచి, తోడిపోయటమే తప్పా!
వర్మగారూ,
నేను ఒక ప్రాసెస్ గురించి రాస్తూపోయాను అంతే.అంతకు మించి పెద్ద విషయాలు ఏమీ లేవు.
NAGARAJU..Garu,
Mee kavitha chala bagundandi..
Dhanyavadalu..