2010 మార్చి గడి ఫలితాలు – వివరణలు

-భైరవభట్ల కామేశ్వరరావు

ఈసారి ప్రత్యేకమైన ద్వ్యర్థి గడిని పూరించే ప్రయత్నం చేసిన అందరికీ ముందుగా అభినందనలు. ద్వ్యర్థి భాగం ఏది అన్నది అందరూ సరిగ్గానే గుర్తించారు. అయితే ఆ భాగంలో రెండు సెట్ల సమాధానాలు సరిగ్గా పూరించినవారు ఎవ్వరూ లేరు. మొదటిసారి కదా కష్టంగానే ఉంటుంది!

మొత్తం ఒక సెట్టుని సరిగ్గా పూరించినవారు కోడిహళ్ళి మురళీమోహన్ గారు. వారికి ప్రత్యేక అభినందనలు.

ద్వ్యర్థి భాగం సరిగ్గా పూరించిన (ఒక సెట్టు), మిగతా భాగంలో ఒక చిన్న తప్పుతో పూరించి పంపినవారు శ్రీలుగారు. వీరికికూడా అభినందనలు.

ఇక ద్వ్యర్థి భాగం కాకుండా తక్కిన గడినంతటినీ సరిగా నింపి పంపిన వారి పేర్లు: సుధారాణి పట్రాయని (ద్వ్యర్థి భాగంలో ఒకే ఒక తప్పు), మాచర్ల హనుమంత రావు.

ఒకటి రెండు అచ్చుతప్పులతో పంపినవారు: జ్యోతి, భమిడిపాటి సూర్యలక్ష్మి, వెంకట్ దశిక, శుభ, వేదుల సుభద్ర. గడి పంపిన ఇతరులు భాస్కరనాయుడు, సంచారి, అపరంజి.

పూరణలు పంపిన అందరికీ మరోసారి అభినందనలు.

ద్వ్యర్థి భాగంలోని ఆధారాల గురించి పదాల గురించి కొంచెం వివరించాలి. ద్వ్యర్థి గడిని కూర్చడం నాకిది మొదటిసారి. కాబట్టి బాగానే కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి ఆధారాలు, సమాధానాలు ఏమైనా మీకు నచ్చకపోతే క్షమించెయ్యండి.:-) నేనిచ్చిన ద్వ్యర్థి ఆధారాలని రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి – ఇచ్చిన ఆధారానికి ఒకటే అర్థం ఉన్నా, ఆ అర్థానికి సరిపోయే పదాలు రెండుండడం. అయితే ఇవి పర్యాయపదాలు కాకుండా ఉంటేనే బాగుంటుంది. రెండు – ఇచ్చిన ఆధారంలో శ్లేష వల్ల రెండర్థాలు వచ్చి, ఒకో దానికి ఒకో సమాధానం ఉండడం. ఇప్పుడు ఒకో ఆధారం గురించీ వివరిస్తాను.

మధ్యనున్న వంట సామాగ్రి – మధ్య “న” ఉన్న వంట సామాగ్రి. ఇది మొదటి రకం. ఇచ్చిన ఆధారానికి ఒకటే అర్థం. దానికి సరిపోయే పదాలు రెండు. పెనము, బానలి/బాణలి.

పేరుకి పిల్లల పుస్తకమైనా తెలుగువాళ్ళ వేదాంగమే – ఇది కూడా మొదటి రకమే. పేరులో “పిల్లల”కి సంబంధించిన పదం ఉంటుంది. పదంలో వేదాంగం ఉంటుంది. తెలుగువాళ్ళకి ప్రత్యేకమైన పుస్తకం. పెద్దబాలశిక్ష, బాలవ్యాకరణం. రెండిటిలోనూ బాల పదం ఉంది. శిక్ష, వ్యాకరణం రెండూ వేదాంగాలే. రెండూ తెలుగువాళ్ళకి ప్రత్యేకమైన పుస్తకాలే.

అలాగే ఈ క్రింద మూడూ కూడా మొదటి రకానికి చెందిన ఆధారాలు:

తలను పొట్టిచేసినా కుట్టక మానవు – దొమలు, చిమలు.

మన ఉపఖండంలో పాలుపంచుకొనే ఒక ప్రదేశం – నేపాలు, భోపాలు (ఇంపాలని ఒకరు వ్రాసారు. అది “ఇంఫాలు”, వత్తు ప, కాబట్టి సరిపొదు)

పట్టుకుందామంటే పూర్తిగా చేతికందలేదే. వీడు కడు దుర్లభుడు! – చిక్క, దొర. ఇది కూడా మొదటి రకం ఆధారమే. చిక్కడు, దొరకడు ఆధారంగా ఇచ్చిన ఆధారమిది 🙂 కడు దుర్లభులు కదా వాళ్ళు. పూర్తిగా లేరు.

వెనకనుంచి వచ్చిందొక స్టారు – శిరా, రతా. ఇది రెండవ రకం అనుకోవచ్చు. ఇక్కడ “స్టారు” అన్న పదానికి నక్షత్రం, సినీతార అనే రెండర్థాలు.

ఇప్పటిదాకా చెప్పిన ద్వ్యర్థి ఆధారాలన్నీ చాలావరకూ అందరికీ తెలిసిపోయాయి. అసలు పట్టు పట్టినవాటి గురించి ఇప్పుడు చూద్దాం.

ఛాందసమైన దండలు చెల్లాచెదరయ్యాయి – ఇది కూడా కొంతమందికి తెలిసింది. “సరములు”, “మాలికలు” చెల్లాచెదరయ్యాయి. ఇక్కడ కొందరు సరములు బదులు హారములు అనుకున్నారు. కాని అది సరిపోదు. హారములు అంటే దండలే అయినా వాటికి ఛందస్సుతో సంబంధం లేదు! మాలికలంటే ఛందస్సులో ఒకే వృత్తంలో నాలుగుకన్నా ఎక్కువపాదాలు కలిగిన పద్యం. అలాగే సరములంటే ముత్యాల సరములనే ఛందస్సు. ఈ రకంగా ఈ రెండిటికీ చందస్సుతో సంబంధం ఉంది. “ఛాందసమైన” పదం ఇందుకు! ఇది కూడా మొదటి రకానికి చెందిన ఆధారమే. ఇందులో శ్లేష లేదు. వాక్యార్థం ఒకటే. సరిపోయే పదాలు రెండు.

ఈ శునకమ్ము కృష్ణమూర్తే – చాలామందిని ఇబ్బంది పెట్టిన ఆధారం ఇది! అయితే ఆశ్చర్యంగా పొద్దు స్లిప్పుల బ్లాగులో దీనికి సమాధానం ఒకరు చెప్పారు. కాని అందరికీ తెలియలేదు. ఇది రెండవ రకం ఆధారం. అంటే శ్లేషతో ఉన్న వాక్యం. “ఈ శునకమ్ము కృష్ణమూర్తి” అంటే ఒక అర్థం, ఈ కుక్క నల్లని రూపం కలిగినది అని. దీని సమాధానం “నల్లకుక్క”. దీన్ని మరోలా విడగొట్టుకుంటే, “ఈశున కమ్ము కృష్ణమూర్తియే” -> “ఈశునకు అమ్ము కృష్ణమూర్తియే”. అంటే ఈశ్వరుడి బాణం కృష్ణమూర్తే. త్రిపురాసుల సంహారంలో ఈశ్వరుడికి నారాయణుడు బాణమయ్యాడు. అలాంటి నారాయణుడే కృష్ణుడు. వారిద్దరికీ ఉన్న పేరొకటి దీనికి సమాధానం. వచ్చిన మిగతా అక్షరాలబట్టి అది “మురహర”.

ఇది ఆడవాళ్ళకి ఆభరణమన్నది పాతకాలం మాటా? – ఇది రెండవ రకానికి చెందిన ఆధారమనే అనుకోవచ్చు. ఇందులో “ఆభరణం” అంటే మామూలుగా వచ్చే “నగ” అన్న అర్థం ఒకటి. మనిషికి ఉండే మంచి గుణాన్ని “భూషణం”, “అలంకారం” అంటూ ఉంటాం కదా, ఆ అర్థం రెండోది. రెండో అర్థంలో “మానము” అన్నది జవాబు. ఇది కొంతమంది సరిగానే గుర్తించారు. ఎవ్వరూ గుర్తించ లేకపోయింది మొదటి అర్థంలో తీసుకుంటే వచ్చే జవాబు. అంటే ఆడవాళ్ళు పాతకాలంలో వేసుకొనే ఒక నగ. ఇది మిగతా అక్షరాల బట్టి “రశన”. అంటే మొలనూలు. ఇప్పటికీ కొందరు వేసుకుంటారేమో కాని ఇప్పుడది ఫేషన్ కాదు కదా! అందికే “పాతకాలం మాటా?” అని ప్రశ్నార్థకం పెట్టి వదిలేసాను.

జ్యా మధ్యనుండేవి. వీటికి ధర్మాసనమే దిక్కు – ఇది కూడా రెండవ రకానికి చెందిన ఆధారమే. శ్లేష ఉందిందులో. ఒక అర్థంలో అందరికీ జవాబు తెలిసింది – వ్యాజ్యాలు. “జ్యా” అన్న అక్షరం మధ్యలో ఉండి, కోర్టుకి సంబంధించినవి. రెండో అర్థమూ, జవాబు ఎవరికీ తెలియలేదు. “జ్యా” అంటే వింటి నారి. “జ్యా మధ్యనుండేవి” అంటే వింటి నారికి మధ్యలో ఉంటాయి. అలాగే “ధర్మం” అంటే విల్లు అనే అర్థం ఉంది. అంటే విల్లే వీటికి ఆసనం. దీని జవాబు “బాణాలు”. బాణాలు వేసేటప్పుడు వింటి మీద నారికి మధ్యగా పెడతారు కదా! బహుశా అన్నిటికన్నా క్లిష్టమైన ఆధారం ఇదే!

మిగతా ఆధారాలకి వివరణ అవసరం లేదనుకుంటున్నాను.

1పె

2ము

ద్ద

8

9

11బా

ణా

లు

ల్ల

కు

18శి

రా

19చి

క్క

క్ష

22నే

పా

లు

1బా

2 లి

3 భీ

4 మా

5

6కుం

7

8మా

9ము

10ర్జా

ల్స్క్మి

11వ్యా

జ్యా

లు

12నం

13బి

14కి

లా

15రి

16ల్వం

17

18

తా

19దొ

శో

మ్మ

లే

ణం

20హో

తె

21మాం

జా

22భో

పా

లు

దా

23బా

వు

టా

24

25గో

26

27

28తి

29

30

త్కా

31

ము

32

33

యా

ని

ము

34

35

కు

36

రు

37

ము

లు

38ము

క్తి

లం

39తి

40

లి

కి

41గో

42రా

———-

1. మధ్యనున్న వంట సామాగ్రి

3. కుంతీసుత మధ్యముని జీవితానికి భద్రత కావాలా?

5. తెలంగాణా భరతమాత

8. ఇది ఆడవాళ్ళకి ఆభరణమన్నది పాతకాలం మాటా?

10. కుడి యెడమైనా ఆ ఠీవికేం తక్కువలేదు

11. జ్యా మధ్యనుండేవి. వీటికి ధర్మాసనమే దిక్కు

12. విష్ణుభక్తుడే తంబీ

14. పసులకాపరికి లారీతో పనేమిటి?

16. నూరే రాయిని తిరగేసావేం?

18. వెనకనుంచి వచ్చిందొక స్టారు

19. పట్టుకుందామంటే పూర్తిగా చేతికందలేదే. వీడు కడు దుర్లభుడు!

20. ఒక గంటసేపు పులి తోడైతే చాలు మంచి వంటకం తయారవుతుంది

21. పదునైన దారమిప్పుడు రోడ్డు మీదకి షికారుకొచ్చింది

22. మన ఉపఖండంలో పాలుపంచుకొనే ఒక ప్రదేశం

23. చెప్పుల కంపెనీ వాళ్ళు చుట్టూ చేరి ఎగరేస్తారు

27. అలతిగా శ్రుతి మీరితే

29. చేమ కూరలో ఈ కారపు ఘాటు తాపీగా రుచిచూడాలి!

32. సింగపూరు పక్కనుంచి చల్లగాలి వీస్తోంది

34. మహేశ్వరుడి ధ్వంసరచనలో కనిపించే అందమైన నాయిక

35. కడవరకు అవసరం లేదు, కాస్త దగ్గరకు వస్తే చాలు

36. ఈ జన్మ ఉన్నదో లేదో!

37. పలు రసముల నాస్వాదించ లేనివి

38. అజిభీధఫపా విశ్వేసకి స్వాములవారు ఈ కాంతకోసమే తప్పస్సు చేసారా?
39. చేతికిచిక్కిన శత్రువు తల, కాళ్ళు నరికేయండి

40. ఈ యుగపు ఆడది

41. 42 అడ్డానికి opposite

42. 41 అడ్డానికి వ్యతిరేకం. వెరసి శాస్త్రీయమైన సంపాదకుడు

నిలువు

——–

1. పేరుకి పిల్లల పుస్తకమైనా తెలుగువాళ్ళ వేదాంగమే!

2. ఛాందసమైన దండలు చెల్లాచెదరయ్యాయి

4. లా తెలిసిన పిల్లిపిల్ల

6. మల్లెలపూవుని దాచుకున్న బంగారం

7. మంచువారింటి ఆడపడుచు పార్వతి

9. ఈ శునకమ్ము కృష్ణమూర్తే

13. ఆకులైనా తిననావిడ భర్తకి ఇష్టమైన ఆకు

15. చతుర్ముఖునికి పుట్టిన రోగం లులుప్తమైపోయింది

17. దమ్ముంటే ఎత్తుకుపో!

19. తలను పొట్టిచేసినా కుట్టక మానవు

20. 10 అడ్డం లాంటి దానినే నహో!

24. కొండదొరకి అతి చపలత్వం ఎలా వచ్చింది?

25. ఇదిగో ముద్దబంతిలో ఎంత సౌకుమార్యముందో చూడు!

26. తమిళంలో చనువుగా అవుననడానికి చాలా దూరమే వెళ్ళాలి

27. ఆకుతోడిది ఆమ్రేడిస్తే మాతా సుపుత్రులకి సంబరమే సంబరం

28. మిట్టూరోడి పొగరు

30. రసమయభవంతి – రారాజుకి అశాంతి

31. త్వరగా తబ్బిబ్బైతే సమాధానమునరయము

33. పిట్టే, కానీ కాకి కులముది కాదు

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

8 Responses to 2010 మార్చి గడి ఫలితాలు – వివరణలు

  1. “ఈశున కమ్ము కృష్ణమూర్తియే” -> “ఈశునకు అమ్ము కృష్ణమూర్తియే”. అంటే ఈశ్వరుడి బాణం కృష్ణమూర్తే. త్రిపురాసుల సంహారంలో ఈశ్వరుడికి నారాయణుడు బాణమయ్యాడు. అలాంటి నారాయణుడే కృష్ణుడు.

    సెబాసో!దీన్ని పట్టుకుంది స్లిప్పుల బ్లాగులో నేనే అయినా(వెయ్యండ్రా వీరతాడు) మురహర అనే మాట తట్టక, తప్పని తెలిసీ నింపడానికి మనసొప్పక మొత్తం గడినే వదిలి వేశాను.మిగిలినవన్నీ వచ్చాయి.

  2. వేణు says:

    కామేశ్వరరావు గారూ! మార్చి నెల గడిని బాగా కూర్చినందుకు అభినందనలు! (గడి పూర్తి చేసి పంపాలని ప్రయత్నించాను కానీ, రెండు పదాలు ఎంతకీ సంతృప్తి కరంగా లేక పంపలేకపోయాను)
    ‘ఆధారాలు, సమాధానాలు ఏమైనా మీకు నచ్చకపోతే క్షమించెయ్యండి’ అన్నారు. నచ్చినవి చాలా ఉన్నాయి. రసమయ భవంతి – రారాజుకి అశాంతి, ఆకులైనా తిననావిడ భర్తకి ఇష్టమైన ఆకు, ఈ యుగపు ఆడది వాటిలో కొన్ని.

    కొన్ని మాత్రం నిజంగానే నచ్చలేదు.

    ‘ఇది ఆడవాళ్ళకి ఆభరణమన్నది పాతకాలం మాటా?’ అనే క్లూకి ‘మానము’ అనే మాట సరిగా లేదనిపించింది. అలాగే ‘మంచువారింటి ఆడపడుచు’ అని ఇచ్చి ఊరుకుంటే సరిపోయేది. (హిమవంతుడి కూతురు పార్వతి కాబట్టి). ‘పార్వతి’ అనే మాట చేర్చి కొంత కన్ ఫ్యూజ్ చేశారు. మంచు మోహన్ బాబు కూతురు లక్ష్మి- జవాబు కరెక్టే కానీ , లక్ష్మి- పార్వతి ఎలా అవుతుందనే సందేహం వస్తుంది కదా?
    ఇక మీ వివరణలు చూశాక నాకు వచ్చిన సందేహాలు –

    * త్రిపురాసుర సంహారంలో శివుడి వింటి నారిగా (‘ఈశునకు అమ్ము’ ) విష్ణువు మారాడు. వింటి నారిని … బాణం అనొచ్చా?
    * మురహర అంటే విష్ణువు (కృష్ణుడు). ఈ మాటకు శివుడు అనే అర్థం కూడా ఉందా?

  3. వేణూగారూ,
    మీరన్నది నిజమే. “మంచువారి ఆడపడుచు” అని ఇచ్చి ఊరుకుంటే సరిపోయేది. అసలు “మంచువారి ఆడపడుచు పార్వతి కాదు” అని ఇద్దామనుకున్నాను. ఇంతలో “లక్ష్మీ పార్వతి” గుర్తుకు వచ్చి ఆ “కాదు”ని కొట్టేసాను. 🙂 ఇసారి జాగ్రత్తపడతాను.

    ఈశునకు అమ్ము గురించి: విష్ణువు మారింది బాణంగానే కాని వింటినారిగా (అల్లెత్రాడుగా) కాదు. సుజాతగారు పొరబడింది అదే. అల్లె త్రాడుగా మారింది వాసుకి అనే పాము. అమ్ము అంటే బాణం. కాబట్టి ఈశునకు అమ్ము – శివుని బాణం విష్ణుమూర్తే.

  4. శ్రీ says:

    సార్, ద్వర్థి గడిని చూడటం నాకిదే మొదటిసారి. ముందెప్పుడైనా ఎవరైనా ఏ భాషలోనైనా కూర్చివున్నారా?

  5. చాలా బావుందండీ. మీ విద్వత్తుకీ రసిక స్వభావానికీ తగినట్టుంది.
    ఇదివరకటి మీద పాల్గొనేవారి సంఖ్య పెరిగినట్టుంది. సంతోషం

  6. కామేశ్వరరావు గారూ! ఈసారి పూర్తిస్థాయి ద్వ్యర్థి గడిని మీనుండి ఆశిస్తున్నాము.

  7. సంచారి says:

    38 అడ్డం వివరిస్తారా దయచేసి?

  8. వేణుగారూ,
    మీరడిగిన మరో సందేహానికి సమాధానమివ్వలేదు. మురహర అంటే కృష్ణుడనే కాని శివడన్న అర్థం రాదు. ముర అనే రాక్షసుడిని చంపేడు కాబట్టి అతను మురహరుడు, మురారి, మురరిపుడు, మురవైరి. వట్టి “హరుడు” అంటే శివుడు అనే అర్థం ఉంది.

    శ్రీగారూ,
    నేనెప్పుడూ ద్వ్యర్థి గడిని చూడలేదండి. మరి తెలుగులో ఇదే మొదటిదో కాదో నాకు తెలియదు. ఇంగ్లీషులో కొన్ని గడులు ఒకే గడికి రెండు సెట్ల ఆధారాలతో ఉంటూ ఉంటాయి. దాన్ని తిరగేసి, ఒకే సెట్టు ఆధారాలకి రెండు అర్థాలుండేటట్టు ద్వ్యర్థి గడి చేస్తే బాగుంటుందన్న ఆలోచన పొద్దు సంపాదకులదే.

    కొత్తపాళీగారూ, నెనరులు.

    మురళీమోహన్ గారూ,
    పూర్తి స్థాయి ద్వ్యర్థి గడి అంటే చాలా చాలా కష్టమేనండీ! నాకూ, పూరించేవాళ్ళకీ కూడా. చూద్దాం.

    సంచారిగారూ,
    38 అడ్డం తెలియాలంటే శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా చూడాలి 🙂 అందులో అర్జునుడు యతి వేషంలో వచ్చినప్పుడు అతని పేరది. తను ముక్తికాంత కోసం తపస్సు చేస్తున్నానని చెప్పుకుంటాడు.

Comments are closed.