-కొవ్వలి సత్యసాయి
జనవరి 2010 వివరణలు
ముందుగా గడి సులభంగా ఉందని చెప్పినవారందరికీ నా కృతజ్ఞతలు. చాలా సులభంగా ఇచ్చానని అనుకున్నప్పుడల్లా చాలా కష్టంగా ఉందని పూరకులనుకున్నప్పుడు కాస్త ఆశ్చర్యమేసేది. మా ఇస్టూడెంట్ పిలకాయలు ప్రశ్నాపత్రం ఎంత ఈజీగా ఇచ్చాననుకున్నాకష్టంగా ఉందని వగర్చడంగుర్తొచ్చేది. ఒకే కూర్పరి గడి కొన్ని సార్లు చేస్తే దాన్లోని నాడి పట్టుకోవచ్చు. ఆనక సులభం అనిపిస్తుంది. ఇప్పుడు అదే జరుగుతోందనుకోవచ్చు. ఇంకో విషయం, గడినింపేవాళ్ళు, ముఖ్యంగా కొత్తవారు, పెరగడం ముదావహం. వారందరికీ నాఅభినందనలూ, అభివాదాలూ.
ఈసారి గడికి 29 పూరణలు 24 మందినుండి వచ్చాయి. ఒకే తప్పుతో నాగార్జున, ఆదిత్య, కామేశ్వర రావు, శుభ గార్లు, రెండు తప్పులతో రాగమంజీర, కోడీహళ్లి మురళీమోహన్, శ్రీలలిత, శ్రీలు, సుభద్ర వేదుల గార్లు, మూడు తప్పులతో బుడుగాయ్, నాగేశ్, వల్లీసునీత గార్లు పూరించారు. ఆవెనుకనే ఉన్నవారు జ్యోతి, సుధారాణి, శైలజ, అపరంజి, భమిడిపాటి ఫణిబాబు, భమిడిపాటి సూర్యలక్ష్మి, రాజేశ్వరి, రాధిక, అరిపిరాల, అపురూప గార్లు. చిత్తి గారికి పూరించడం కొత్తఅనుకుంటా అందుకని వర్ణక్రమదోషాలు, ముద్రా రాక్షసాలు ఎక్కువ కనిపించాయి. క్రమంగా అలవాటైపోతుంది, పూరిస్తూఉండండని వారికి మనవి.
1 గ్ర |
హ |
2 ణం |
X |
3 ర |
X |
X |
4 చు |
5 లు |
తొ |
డం |
6 కాం |
ద్ద |
X |
ర |
X |
7 వి |
8 సు |
గు |
X |
క్కు |
X |
X |
తం |
X |
9 న |
భ |
10 ము |
X |
డో |
X |
11 శ |
X |
12 చం |
ద్రి |
క |
13 ర్త |
వ |
ఆ |
ము |
X |
14 కు |
సు |
మం |
X |
ప |
X |
థ |
15 భ |
రా |
X |
16 క్షు |
ధ |
X |
X |
త |
X |
17 క |
వ |
ల |
X |
త్రు |
X |
వు |
X |
18 ఉ |
ద |
క |
X |
X |
X |
ము |
19 ప |
లు |
20 ప |
లు |
X |
ద |
X |
21 మ |
ద |
22 ద |
మ |
ని |
ద్య |
X |
ళ్ళ |
X |
23 ప్రి |
య |
24 మ |
ణి |
X |
లై |
X |
మా |
25 కా |
26 క |
ర |
27 కా |
య |
X |
ర |
X |
28 హ |
లా |
X |
ణి |
29 వ్య |
వ |
సా |
య |
ము |
X |
30 మ |
ట్టి |
లో |
మా |
ణి |
క్యం |
31 ము |
న |
లు |
క |
X |
X |
ని |
X |
బా |
X |
X |
X |
X |
ము |
X |
ష్టం |
X |
32 మూ |
షి |
క |
వా |
హ |
న |
ము |
అడ్డం | పదం | ఆధారం |
1 | గ్రహణం | ఇంద్రగంటి మోహనకృష్ణ చలం రాసిన గ్రహణం కధని సినిమాగా తీసాడని తెలుసుగా. |
4 | చులుతొడంకాం | కాండం తొలుచు (బోరింగ్) పురుగు ఆశిస్తే కాండం కుళ్ళిపోతుంది …. వెనకనుండి అనడంవల్ల తిరగేసిరాయమని. |
7 | విసుగు | ఎంత ఆలోచించినా పదం తట్టకపోతే మీకొచ్చేది విసుగే కదా |
9 | నభము | ఆకాశానికి పర్యాయపదం కదా |
12 | చంద్రిక | అంటే వెన్నెల. శరదృతువులోవచ్చేదిదే కదా. వెన్నెల్లో హాయ్ హాయ్ పాట హింట్ కోసం. |
13 | ర్తవఆము | ఆవర్తం అంటే ప్రదక్షిణ. మెలికలు తిరుగుతూ చేసినది అనడం వల్ల అక్షరాలటూ ఇటూ అయ్యాయని సూచన. |
14 | కుసుమం | కు తీస్తే సుమం అవుతుంది అంటే పువ్వే |
15 | భరా | భరాఆలూ వంటకం తెలుసుగా |
16 | క్షుధ | అంటే ఆకలి. ఈబాధ తీర్చగల అన్నదానం అత్యుత్తమమైనదంటారుగా |
17 | కవల | కుశలవులు కవలపిల్లలుకదా |
18 | ఉదక | ఊటీని ఉదకమండలం అని కూడా అంటారుకదా |
19 | పలుపలు | పలు అంటే అనేకం అని. |
21 | మదదమని | మదంఅంటే గర్వం. దమని అంటే అణచేది. ఈపదంలో అన్నీ సప్తస్వరాక్షరాలే. |
23 | ప్రియమణి | పెళ్ళైనకొత్తలో అని సూచించడం ప్రియమణి కోసమే J |
25 | కాకరకాయ | చేదనగానే గుర్తొచ్చేది, చూడగానే గగుర్పొడిచేది కాకరకాయకాక ఇంకేంటి |
28 | హలా | ఆహా! ఏమి హాయిలే హలా అని కాక ఇంకేమైనా పదం తడుతుందా |
29 | వ్యవసాయము | రైతులు చేసేది వ్యవసాయమే కదా |
30 | మట్టిలోమాణిక్యం | మురికివాడల్లో ముత్యంలాంటి మనిషిని మట్టిలోమాణిక్యం అంటాంకదా |
31 | మునలుక | నీళ్ళలో వేసేవి మునకలు. సగం బాగానే వేయడం అంటే మొదటి రెండక్షరాలు సరిగ్గా ఉన్నాయి, వెనుదిరుగడం చివరి అక్షరాలు తిరగబడ్డాయనడానికి సూచన |
32 | మూషికవాహనము | గుజ్జురూపుడు (వినాయకుడు) ఎలక వాహనమెక్కితే సుమో యోధుడు లూనా మీదెక్కినట్లుంటుంది కదా |
నిలువు | ||
1 | గ్రద్ద | గ్రద్ద కున్న దూరదృష్టి తెలిసినదేకదా. |
2 | ణంరభఆ | అంటే నగ. వెనకనుండి రాస్తే రణం (యుద్ధం) కూడా వెనకనుంచి రాయబడుతుందికదా.. |
3 | రవి | 11 నిలువులో శమంతకమణి సూర్యుడు ప్రసాదించినదే |
5 | లుక్కు | అంటే భ్రౌణ్యం ప్రకారం లోపం అని. ఇంగ్లీషులో చూడడమని. |
6 | కాంతంకథలమునిమాణిక్యం | కాంతంకథలు ఆయన పుస్తకం పేరు. ఇంటిపేరుగా చేసి ముందురాస్తే కాంతంకథలమునిమాణిక్యం అనే కదా రాయాలి |
8 | సుడోకు | వమనం అంటే డోకు. అందులో మంచి రకం సుడోకు J |
9 | నవరాత్రులు | కమల్‌హసన్ సినిమా దశావతారం. అక్కినేనిది నవరాత్రులు |
10 | ముముక్షువులు | అన్నివదలదల్చినవారిని ముముక్షువులంటారు. |
11 | శమంతకమణి | కృష్ణుడు శమంతకమణి వెతుకుతూ వెళ్ళి జాంబవతితో సహా వెనక్కిరావడం గుర్తుకు తెచ్చుకోండి |
12 | చంపక | 19 నిలువులో ఉన్నవి పద్యకావ్యాలు. చంపకమాలలు లేకుండా వ్రాయగలరా? |
13 | ర్తభ | భరించేవాడు భర్త. తిరగబడితే ర్తభ. |
18 | ఉదయ | 18 నిలువు (ఉదయ) +3 నిలువు (రవి) + 12 అడ్డం (చంద్రిక) = ఉదయ రవి చంద్రిక. ఇది ఒక రాగం పేరు. “ఎంతవారలైనా కాంతదాసులేగా” అన్న కీర్తన ఈరాగంలో ఉంది. . అర్ధం కాదు వెనకున్న అను రాగం అంటే తెలిసిందనుకుంటా. |
19 | పద్యకావ్యము | ‘నాలుగేసి పాదాల’ వి పద్యాలు. అవి వందల కొద్దీ ఉండేది పద్యకావ్యము కదా. |
20 | పళ్ళరసాలు | నమిలేవి పళ్ళు …వాటిని పిండితీసేవి పళ్ళరసాలు. తాగితే ఆరోగ్యమేకదా |
22 | దలైలామా | దలైలామా అరుణాచల్ వెళ్ళనివ్వకూడదని మనకి చైనా చెప్పింది. టిబెట్టుకి రానిచ్చేప్రశ్నే లేదు. |
23 | ప్రియము | ప్రియము అంటే ఇష్టం అనీ ఖరీదు అనీ కూడా అర్ధం |
24 | మరమనిషి | యంత్రాల (మరలు) మయమైన వాడు మరమనిషే కదా |
26 | కవనము | క ‘వనం'(తోట) అంటే కవిత్వం |
27 | కాయకష్టం | కార్మికులూ, కర్షకులూ కాయకష్టం చేసుకునే కదా బతికేది |
28 | హలోబావా | ఫోన్లో అత్తకొడుకు (బావ) ని పలకరించే పధ్ధతిదే. |
ప్రశ్నపత్రం సులువుగా ఇచ్చారని దిద్దడం బాగా స్ట్రిక్ట్ చేసినట్టున్నారు మాష్టారు:-) క్షుత్తు, క్షుధ రెండూ ఒకటే కదా!
పొద్దు వారు గమనించ ప్రార్థన!
నేను వ్రాసినవి అన్నీ సరియైనవే. ఇరవై ఎనిమిది అడ్డు `హలా’ అని పడవలసింది `కాక ‘ అని మీరు పంపిన దానిలో ఉంది. అయితే వాటికి అనుబంధంగా ఉన్న నిలువులలో ఇరవై ఎనిమిది నిలువు `హలోబావా’ అని, ఇరవై రెండు నిలువు `దలైలామా’ అనీ సరిగానే ఉన్నాయి. ఇవి సరిగా పడినప్పుడు ఆటోమేటిక్ గా ఇరవై ఎనిమిది అడ్డు `హలా ‘ అవుతుంది కదా. మరి అది మాత్రం వేరుగా ఎలాపడిందిందో కాస్త చూడమని మనవి.
నావి అన్ని సరియైనవిగా పరిగణించ ప్రార్థన.
అయ్యా !! నా గడి గుర్తింపు సంఖ్య : 330110
ఇంతకు ముందు నేను ఒక వ్యాఖ్య పెట్టాను అది ప్రచురించలేదు. దానికి ప్రతిస్పందించనూ లేదు. ఇరవై ఎనిమిది అడ్డు `కాక ‘ అని ఎలా వస్తుందో ఒక్కసారి చూడండి. వాటి అనుబంధ పదాలైనా `హలో బావ ‘ , `దలైలామా ‘ సరిగానే పడ్డాయి. అలా అయినప్పుడు ఆటోమాటిక్ గా ఇరవై ఎనిమిది ` హలా ‘ వస్తుంది. కనీసం దీనిని పరిశీలించి, ప్రతిస్పందించ ప్రార్థన.
స్వస్తి,
ఆదిత్య
ఆదిత్య గారూ,
దీనికి సమాధానం రెండు రోజుల లోపల ఇస్తాం.
గడి ఫలితాలు ప్రచురించినప్పుడు సమాధానాలు ప్రచురిస్తున్నారు కదా. ఆ కాలమ్స్ అన్నీ సగమే కనిపిస్తాయి. ఎందువల్ల….వ్యాఖ్య పెట్టె వెడల్పు పేజీ మాత్రమే కనిపిస్తోంది. దానిని దాటిన టెక్స్ట్ కనిపించడంలేదు. ఏమయినా చేయగలరా..ఇది మా కంప్యూటర్ కో మానిటర్ కో సంబంధించిన సమస్య కాదనుకుంటున్నాను.
ఆదిత్యగారూ, సాంకేతిక సమస్య ఉందని ఎడిటర్ గారు చెప్పడం వల్ల కాక లాంటి పదాలు తప్పులుగా పరిగణించలేదు. మీరు చేసిన చివరి తప్పు [:))))] అడ్డం లో ఆఖరిది. మూషికవాహనుడు అని రాసారు. ఆధారాన్ని బట్టి మూషికవాహనము అని ఉండాలి. కామేశ్వరరావుగారన్నట్లు గడి సులభంగా ఉందని అనేసరికి కాస్త వత్తులూ, వర్ణాలూ భూతద్దంలో చూసాం. :))) అయినా ఒకటీ అరా దోషాలు ఉన్నా లేనట్లే.
అయ్యో !! విఘ్నేశ్వరుని దగ్గరే విఘ్నమా!? 🙁
ప్రథమా వి`భక్తి ‘ లోనే తేడావచ్చిందా!!? హతవిధి!
తప్పు చూపినందుకు ధన్యవాదాలు
ఆదిత్య