గుండె చప్పుళ్ళు

-తులసీ మోహన్

జ్ఞాపకాలు…
వాటికేం!? వచ్చిపోతుంటాయి
గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో
కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి
తుడిచే వేళ్ళ కోసం.

నిన్నలా నేడుండనివ్వదు
ప్రకృతికెంత పౌరుషం!
మెరుపు చూపిస్తూనే
ముసురు కమ్ముతుంది.

సందెపొద్దులు, శ్రావణమేఘాలు
మధుర రాత్రులు, మౌనరాగాలు
ఎద అంచుల్లో జోడు విహంగాలు
ఏదయినా ఏకాంతం కాసేపే

తిరిగే ప్రతి మలుపులో
కొన్ని తలపులు దడి కట్టుకుంటాయి
యే జోరువానకో గండి పడి
గుండె లయ తప్పుతుంది

నిశ్శబ్దాన్ని నింపుకుని కలం
రాత్రి రంగు పులుముకుని కాగితం
ఎప్పుడో యే అర్ధరాత్రికో
కలతనిద్రలోకి జారతాయి

గుండెచప్పుళ్ళన్నిటినీ
అక్షరాలు గుర్తించాలనేం లేదుగా!

——————————————

లక్ష్మీ తులసి రామినేని

లక్ష్మీతులసి రామినేని, సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ, కుటుంబంతో చికాగోలో ఉంటున్నారు. కవితలు చదవడం-వ్రాయడం, పెయింటింగ్, సంగీతం వినడం, స్నేహితులతో గడపడం వీరి హాబీలు.

About రామినేని లక్ష్మితులసి

లక్ష్మీతులసి రామినేని, సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ, కుటుంబంతో చికాగోలో ఉంటున్నారు. కవితలు చదవడం-వ్రాయడం, పెయింటింగ్, సంగీతం వినడం, స్నేహితులతో గడపడం వీరి హాబీలు.

This entry was posted in కవిత్వం. Bookmark the permalink.

15 Responses to గుండె చప్పుళ్ళు

  1. padmarpita says:

    గుండె చప్పుళ్ళు బాగున్నాయి

  2. WOWWW ఎంత బావుందో రా!!

    “తిరిగే ప్రతి మలుపులో
    కొన్ని తలపులు దడి కట్టుకుంటాయి
    యే జోరువానకో గండి పడి
    గుండె లయ తప్పుతుంది”

    సరిగ్గా ఇక్కడే నేనూ లయ తప్పుతున్నాను.. you need to write more often.. please..

  3. telugu4kids says:

    “జ్ఞాపకాలు…
    వాటికేం!? వచ్చిపోతుంటాయి
    గాలి వీచినప్పుడో, గులాబీలు పూసినప్పుడో
    కానీ కంటి నిండా నీళ్ళే వెతుక్కుంటాయి
    తుడిచే వేళ్ళ కోసం.”

    and

    “తిరిగే ప్రతి మలుపులో
    కొన్ని తలపులు దడి కట్టుకుంటాయి
    యే జోరువానకో గండి పడి
    గుండె లయ తప్పుతుంది”

    WOW!

  4. చాలా చాలా బావున్నాయి మీ గుండె చప్పుళ్ళు.

  5. భాష says:

    యేమని చెప్పను , ఎంత అని చెప్పను . మనసుని సంతోష పెడుతున్నారు మీ మాటల తో

    జన్మ ధాన్యం
    మీ మిత్రుడు

  6. padmarpita గారు and telugu4kids గారు కృతజ్ఞతలు మీకు

    నిషీ…thanks ra..for ur positive push

    మొన్న సుబ్బుగారు కూడా అదే చెప్పారు తరచుగా రాస్తుండమని 🙂

    సుబ్బుగారు…థేక్సండి…

  7. తుడిచే వేళ్ళ కోసం వెతుకులాటే కవిత్వ0 కదా..!చాలా బాగా రాసారు.

  8. జాన్‌హైడ్ కనుమూరి says:

    చాలా బాగా రాసారు.

  9. parimalam says:

    అందమైన అక్షరాల అల్లిక …అద్భుతమైన కవితైంది !

  10. “ఏదయినా ఏకాంతం కాసేపే”

    కవిత చదివిన తరవాత ఆలోచనల్లో నిలిచిపోతున్న వాక్యం, ఒక సందేశం లా!.
    పరుగులు తీసే జీవనంలో మన మనసు ఫలకం పై ముద్రించబడేవి ఏకాంత క్షణాలే కదా… అవి కాసేపే కదా…

  11. హెచ్చార్కె says:

    ఔను, అక్షరాలు గుర్తించాలనేం లేదు గుండెచప్పుళ్లన్నిటినీ. గుర్తించిన మేరకే చాల బాగున్నాయి.

  12. వాసు says:

    అమ్మో నాకు రెండు మూడు సార్లు చదివితే కొంత బోధపడ్డట్టు ఉంది. నేను గ్రహించని విషయం ఇంకా చాలా ఉందేమో కవితలో అని అనుమానం వస్తోంది. అర్థమయినంత వరకూ అద్భుతంగా ఉంది.

    ఈ పాదం మాత్రం అసల అంతుపట్టలేదు.

    “నిన్నలా నేడుండనివ్వదు
    ప్రకృతికెంత పౌరుషం!
    మెరుపు చూపిస్తూనే
    ముసురు కమ్ముతుంది”

  13. జ్ఞాపకాల్లో తడి, గుండె చప్పుళ్ళలో ఆర్తి
    అక్షరాలకు అందేలా చేసినందుకు అభినందనలు..!

  14. మోహన says:

    Beautiful 🙂
    నన్ను నేను చూసుకోగల అతి కొద్ది కవితల్లో ఇదొకటి.

  15. “తిరిగే ప్రతి మలుపులో
    కొన్ని తలపులు దడి కట్టుకుంటాయి
    యే జోరువానకో గండి పడి
    గుండె లయ తప్పుతుంది”

    “” ఆ జోరు వాన వేలిసేది ఎప్పుడో,ఆ లయ తప్పిన గుండె కు దారి కనపడేది ఎప్పుడో… ఎదురు చూస్తూ వుంటాను “”

Comments are closed.