మూలా సుబ్రహ్మణ్యం
౧. అద్వైతం
పౌర్ణమి నాడు
పరిపూర్ణతనొందే
రాత్రి ఆత్మ
అమావాస్య నాడు
శూన్యంలోకి
అదృశ్యమౌతుంది
ఏం ఏకత్వాన్ని దర్శించిందో
ఒకేలా ఎగసిపడుతూ
పిచ్చి సముద్రం!
ప్రయాణించి ప్రయాణించి
ఒక్క కన్నీటిబొట్టు లోతుల్లోకి
చేరుకుంటాను
మంచుబొట్టు తాకిడికే
ముడుచుకుపోయే
అత్తిపత్తి ఆకుల నిశ్శబ్దం
నాలో ప్రవేశిస్తుంది
రాత్రంతా దుఃఖించే
నదీ నక్షత్రాలూ
నాకిప్పుడు బోధపడుతున్నాయి!
పాటకోసం తూట్లుపొడిచేవాళ్ళే తప్ప
నా గురించి పాడేవాళ్ళే లేరు
పక్కన కూచోబెట్టుకుని
చక్కగా పాడతావు
యుగాలుగా
అలుపెరుగక
కొండగాలికి నే పాడే పాట
నిజానికి నువ్వు నేర్పిందే
దాహం తీర్చుకుని
కలుషితం చేసేవాళ్ళే తప్ప
గుండె కరిగి పాడుతున్నా
వినే గుండె లేదు
అంగీకారంతో తలూపుతూ
ఆనందంగా వింటావు
నిరంతరం నీ నీడ
నాలో ప్రతిఫలిస్తుంది
మనల్ని బంధించిన పాట కోసమే
మనిద్దరం
ప్రపంచంతో
పనేమిటీ?
మేఘం కార్చిన
రెండు కన్నీటి బొట్లు
భూమి తన గుండెల్లో
దాచుకుంది
తనని తాను
వెతుక్కునే ప్రయత్నంలో
లోతుల్లోని తడిని
తాక గలిగింది చెట్టు
చిరునవ్వు నవ్వుతూ
చెట్టుకి పూసాయి
రెండు కన్నీటి పూలు!
సుబ్రమణ్యం గారు, అల్పమైన పదాలతో అనల్పమైన అర్ధాలు గోచరిస్తోంది మీ కవిత్వం. బావుంది.
సరళమైన భాషలో అద్భుతమైన భావం ఒలుకుతోంది కవితల్లో …
చాలా బాగున్నాయి కవితలు! అద్వైతం, కన్నీటి పూలు భావనాత్మకంగా ఉన్నాయి. అభినందనలు!
అదిరాయి మీ కవితలు…
“అద్వైతం” మరీ బాగుంది
“నక్షత్రాల దుఃఖం” నాకు చాలా నచ్చింది.
ఇలాంటి కవితల్ని ఒకేసారి చదివే కన్నా ఒకోటీ ఒకో రోజు చదువుకుంటే మరింత బాగుంటాయేమో.
“అద్వైతం” మనసుకు హత్తుకుంది.
అద్వైతం, నక్షత్రాల దుఃఖం ఈ రెండూ బాగా నచ్చాయి.. కామేశ్వరరావు గారితో ఏకీభవిస్తాను.. మిఠాయి దాచుకుని కొంచెం కొంచెం తిన్నట్టు, ఇవి కూడా రోజుకొకటి చదివితే ఇంకా బావుంటాయి 🙂
hi. a change in the poetical eye is evident. good.
పదాల పొందిక కోసవే కవిత్వంలాగుంది. ఒక్క వెదురు పొద, నది తప్ప
మిగిలినవన్నీ, స్వావులు చెప్పే వేదాంతం లాగా, ఆది, అంతం లేకుండా
అర్థం, పర్ధం లేకుండా వెల వెల పోతున్నాయి.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
mee kavithalu chadivika nijamina kavityam chadivina
anubhooti kalugutonidi. enko vesasham mee surname naa surname okkate , inko similarity meelagaa naadi kavi kulame
-Veereswara Rao Moola
mee kavithalu chala chala baagunnai , meelage naadi
kuda “kavikulame” . inti peru kooda “moola”
please read my poems in http://www.poemhunter.com – poems
by mula veereswara rao. if you can spare some minutes
for me