పొగమంచు

-ఆత్రేయ కొండూరు

దగ్గరయ్యేకొద్దీ
దారి చూపిస్తూ ,
మసక రూపాలకు
మెల్లగా రంగులమరుస్తూ,

మురిపిస్తూ,
తేమతగిలిస్తూ..

కంటి వెనక దారి మూసేస్తూ,
ముందు వెనకలను ఏకం చేస్తూ..

ఉదయమయ్యేదాకా
సగం రంగుల పరిధినే
ఆస్వాదించ మంటూ..

తాత మాటలు తవ్వి తీస్తూ..

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

2 Responses to పొగమంచు

  1. ramnarsimha says:

    chaala bagundi..

    rputluri@yahoo.com

  2. ఉష says:

    రేయి నల్లమబ్బు హఠాత్తుగా తెలవారి పొగమంచు లోకి పరకాయప్రవేశం చేసినట్లు ఎపుడూ చిత్రమే ఈ నీహారికల పోకడలు నా వరకు. తాత మాత్రం వదలరు మీరు ఆత్రేయ గారు. 🙂

Comments are closed.