తెలు’గోడు’

కాజ సురేశ్  (surkaja@gmail.com)

ఏ కులము, ఏ మతముర నీది
దుడ్డులెన్నిన్నుయ్ ర నీకు
ఈ చెక్కలు చాలవురా ఓరి తెలుగోడ
యాస బాసల ముక్కలంత
అవసరమా, ఓరి ఎర్రిబాగులోడ

గోచీ వేమనా, ఆడెవ్వడు
మాకు నీతులుచెప్పెటోడా
ఆదికవి మీ గోదాటొడ్డువాడా
మీ పోతన మా రాయల కొలవునుండెటోడా
కాళోజీ!! కాడు వాడు మా సీమపక్కోడు
శ్రీశ్రీ!! హూ వాడు వట్టి ఉత్తరాంధ్రవాడు

‘ఇజాలు’లేని దాశరథిదేమి కవితరా
వాడు మెచ్చిన ఆ ‘ఎఎన్ఆర్’దేమి నటనరా
కృష్ణమూర్తి వేమి ‘జిడ్డు’రాతలురా
మీ ‘సినారె’దేమి బడాయి
ఆడి కంటెముందె మా ‘విశ్వనాథు’డు
‘గ్యానపీట’ నెక్కెనోయి

క్షేత్రయ్య, ఘంటసాల గొంతులు మావొంతు
బద్రాద్రి రామదాసు ఆడి వొంతు
తాళ్లపాక అన్నమయ్య ఈడి వొంతు
త్యాగయ్యను ఇసిరి పారెయ్యరా
ఆడు ఎప్పుడో తమిళోడివంతు.

ఇయ్యన్నీ పచ్చినిజాలు
కాదు గీదు మనమంత ఒకటని గింజుకుంటనంటే,
పోయి దూకరాదె గోదాట్లోన
పారుతున్నాదది ఏ నడిబొడ్డులోన
సన్నబడిపోయి ‘బాబ్లీ’ మూలాన

అటు పోరాటాల పురిటిగడ్డ
త్యాగాల తెలంగాణ
ఇటు రోసాల రాయలసీమ
అటు కొమరము భీమన్న
ఇటు ఉయ్యలవాడ నరసింహ
మన మన్నెం దొర అల్లూరి
పోరలేదా వీరంతా నా ఛాతి పొంగిపోయేల!!
నైజాము నిరంకుశాన్ని
తెల్లోడి సామ్రాజ్యవాదాన్ని
మీసం మెలెయ్యలేనా ఇంకా, ఏం
వాడు మా ప్రాంతపోడు కాదు గదాని?

సుబ్బారాయుడు, పైడితల్లి, తిమ్మప్పలదేమి బంధము
యాదగిరితో లేని అంత పెద్దచుట్టరికము?
పాలమూరు పాలెగాడ్నినేను
అంబలైన లేని అన్న అనంతపురమునుండ
కరీమునగరు దొరెట్టా నావోడు?
కల్లు తీసెటోడ్ని, బట్టలుతికెటోడ్ని,
కాళ్లు పట్టెటోడ్ని, బొగ్గు గనుల్లో నలిగెటోడ్ని
‘అబ్బా అమ్మా’ అది ఏ యాస అయితేమి
నా తమ్మి అన్నిప్రాంతాలా పడే ప్రయాస ఒకటె గాదా!!

కాకా హోటలెట్టి, కప్పులన్ని కడిగికడిగి
కోరినన్ని ఇడ్డెనులెట్టి కాయకష్టము
చేసెటోడి మీద ఎందుకన్న అంత గుస్సా?
ఫ్లోరైడు నీళ్లు తాగి, నడుము నిక్కిపోయి,
నీ వళ్ళుగుల్లైతే, ఏడ తొంగున్నాడన్నా
ఆ ఎమ్మెల్లే, ఎంపీఓడు?
నీ సొమ్మంతా దోచిదోచి, గోచీగూడ
మిగలకుండా జేసిన నీ ఇలాక ఏలేటోడ్ని
నిగ్గదియ్యరాదే అన్న
ఆడెక్కడ పండినాడో గదన్న!!
మంత్రులు, సిఎమ్ములు, పియమ్ములు
ఎందరిని పంపలేదే అన్న
వాళ్లేమి ఊడబొడిసారే అన్న
మార్చకుంటే ముందుముందు
ఏలేటోళ్లు ఆళ్లే గదన్నా!!

రియలుదందాలెన్నో జేసి, గనులన్నీ కొల్లగొట్టి
సొమ్ములేన్నో కూడబెట్టారీ ఘనులు
ఆ దోపిడి చాలలేదా
ఎందుకన్నా ఆళ్లకోసం నీ బస్సుల తగలెట్టడం?
ప్రాజెక్టులు, ఫాక్టరీలు
పక్క రాష్ట్రపోడు పట్టుకెళ్తె మౌనం
రైలు, రక్షణ, హోము, విత్త
మంత్రి పదవులన్ని వేరేటోళ్లకెళ్తె ఆమోదం
హస్తి’నమ్మ’కు తెలుగు గౌరవం
తాకట్టు పెట్టినప్పుడులేని పౌరుషం
ఇప్పుడెందుకు ఈ కొత్త’రాగం’?
ఎందుకీ నిరసనలు ఈ నిరాహారదీక్షలు
ఎంతవరకు నిజమీ ఉపవాసం
ఎవరికోసమీ ఆయాసం?
ఈ మరుగుజ్జులా మన భావి ‘పొట్టి’ శ్రీరాములు?

దొంగలు దొంగలు ఊళ్లు పంచుకుంటున్నారు
మేలుకో తమ్ముడా!!!
ఇనపడలేదా ఆ వెక్కి వెక్కి ఏడ్పులు
గుచ్చే గునపాల హోరులో
ఆ మాయ మాటల మోతలో?
కనపడలేదా ఆ కన్నీళ్లు
ఈ కాళ నిశీధిలో?

ఎందుకమ్మా ఆ కన్నీరు ఓ మాయమ్మ
ముగురమ్మల మూలపుటమ్మ
మా మేటి తెలుగు పెద్దమ్మ
సింహాద్రి అప్పన్న
యాదగిరి నరసన్న
చిత్తూరు ఎంకన్న
నీ బిడ్డలనింక చల్లగా ఆళ్లే చూడాల
ఈ కాళరాత్రి గడిచిపోవాల!!!

About సురేష్ కాజా

పేరు సురేష్ కాజా. స్వస్థలము కృష్ణా జిల్లా నూజివీడు. పిలాని, కాన్పూర్, డల్లాస్ లో ఉన్నత విద్యనభ్యసించి ప్రస్తుతం డల్లాస్ లో Software Consultant గా పని చేస్తున్నారు. ”నా పిచ్చి రచనలు, పోలికేకలు, ఆలోచనలు చదవదలచిన http://naazaada.wordpress.com అనే నా బ్లాగుకు దయచేయగలరు”, అని అంటున్నారు సురేష్ గారు.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

18 Responses to తెలు’గోడు’

  1. చాలా బాగుందండి..ఇప్పటి పరిస్థితులకి అర్థం పడుతూ..

  2. చాలా బావుందండీ!

  3. లలిత says:

    “‘అబ్బా అమ్మా’ అది ఏ యాస అయితేమి
    నా తమ్మి అన్నిప్రాంతాలా పడే ప్రయాస ఒకటె గాదా!!” నిజం చెప్పారు.
    మీ ఆవేదనని అద్భుతంగా ఆవిష్కరించారు.

  4. sridharam says:

    teluguvari avedana chala correctga prathibimbinchavu,hatsoff,kani nissahayathaga…badhagavundhi…

  5. చాలా బలవంతంగా ఉంది కవిత

  6. మోహన says:

    “నీ వళ్ళుగుల్లైతే, ఏడ తొంగున్నాడన్నా
    ఆ ఎమ్మెల్లే, ఎంపీఓడు?
    నీ సొమ్మంతా దోచిదోచి, గోచీగూడ
    మిగలకుండా జేసిన నీ ఇలాక ఏలేటోడ్ని
    నిగ్గదియ్యరాదే అన్న
    ఆడెక్కడ పండినాడో గదన్న!!
    మంత్రులు, సిఎమ్ములు, పియమ్ములు
    ఎందరిని పంపలేదే అన్న
    వాళ్లేమి ఊడబొడిసారే అన్న
    మార్చకుంటే ముందుముందు
    ఏలేటోళ్లు ఆళ్లే గదన్నా!! ”

    ఈ సత్యాన్ని ఎవారూ అర్థం చేసుకోరేం?? 🙁

  7. @వరూధిని @సుజాత @లలిత @శ్రీధర్ @మహేష్ @మోహన

    నా కవితను చదివి స్పందించిన మీ అందరికీ నా ధన్యవాదములు

  8. venkat says:

    Adirindi anna nee paata…..

    ennatiki vachenanna moksham verpatu vaadulaku siggu…

    ninna gaddar mangalollu mosapoyaru ( reliance valla) daaniki andhra vodu emi chesinde…. tala leni maatalu matladuthunte nila deeyalsina telangana tammulu chappatlu kodithiri bidda… emi chestam

  9. Suresh,

    Thanks for this narration(I will post my future comments in the right lipi once I figure out how to do it). I think many educated share the same sentiments as you, my belief is that we are lacking strong leadership to turn this tide and unfortunately this problem may not subside for months to come, which is bad for our unified andhra.

    Kishore Dandu.

  10. rajagopal says:

    సురెష్ గారు,
    అద్బుతం
    -రాజగోపాల్

  11. Sree says:

    “ప్రాజెక్టులు, ఫాక్టరీలు
    పక్క రాష్ట్రపోడు పట్టుకెళ్తె మౌనం
    రైలు, రక్షణ, హోము, విత్త
    మంత్రి పదవులన్ని వేరేటోళ్లకెళ్తె ఆమోదం
    హస్తి’నమ్మ’కు తెలుగు గౌరవం
    తాకట్టు పెట్టినప్పుడులేని పౌరుషం
    ఇప్పుడెందుకు ఈ కొత్త’రాగం’?
    ఎందుకీ నిరసనలు ఈ నిరాహారదీక్షలు
    ఎంతవరకు నిజమీ ఉపవాసం
    ఎవరికోసమీ ఆయాసం?”

    బ్రహ్మాండంగా చెప్పారండీ…

  12. Sateesh says:

    సురెష్ గారు, చాలా బాగుందండి కవిత.

    ప్రస్తుత వివాదం పై తెలంగాన మిత్రుడొకరు ఈ రెండు లింకులు పంపించారు.

    http://telugu.greatandhra.com/cinema/22-12-2009/prantham_part1.php

    http://telugu.greatandhra.com/sangathulu/22-12-2009/prantam_part2.php

    అదె వెబ్ సైటులొ అంధ్రమహభారతం రచింపబడిన సమయము లొని చారిత్రక ఘట్టాల తొ కూడుకున్న నవల పై ఉగాది అని మంచి వ్యాసము కూడా ఉంది.

    http://telugu.greatandhra.com/mbs/political/yugadi_part1_1.php

    తెలుగొడి గొడు వినె రాజ రాజ నరెంధ్రుడు లెడు నెడు

    తెలుగొడిని ప్రధాన మంత్రి చెసినా తన కీలు బొమ్మ కాలెదనె హస్తినమ్మ కు కచ్చ

    ప్రాజెచ్టులు ఫాక్టరీలు కాదు జల యగ్నానికి పదె పదె దబ్బులడిగినందుకె ఇంత కచ్చ

    జలము లెదు మంత్రి లెదు తెలుగొడ నువ్వెంత అని రచించారీ పెద్ద వ్యుహం.

    ఒక దెబ్బ తొ రెండు పిట్టలు .. చంద్ర బాబు కు చెక్కు పెట్టి తమిల నాట ఒక చొలున్ని పుట్టిస్తె కాంగ్రెసుకు సంపూర్న బహుమతి వస్థుందని వ్యూహం.

    చిదంబరాన్ని చొల స్థానములొ ఉంచితె తన పుత్ర రత్నం ప్రధాన మంత్రి అయ్యె అవకాషం ఉందని హస్థినమ్మ నడిపిస్తుంధి ఈ నాటకం.

    ఇంక ఎన్ని బందులొ ఎంత నష్టమొ ఎంత అవమానమొ

  13. vinaychakravarthi says:

    excellent………….

  14. టి.యస్.కళాధర్ శర్మ says:

    ఆలోచనాపరులకు తెలిసిన సత్యమే ఇది. తెలివితక్కువ రాజకీయవేత్తల అతి తెలివి, పదవీవ్యామోహం దానికి బలవుతున్న ప్రజల్ని ఇలాంటి కవితలు ఆలోచింపజేయాలని
    కోరుకోవడం తప్ప చేయగలిగిందేముంది.
    కవిత చాలా బావుందండీ.

  15. ranjit says:

    mee kavitha chaala bagundi eee kavitha ni mari inka presnt telugu icons& places ni vivaristuu expand cheyandi

  16. కవిత చదివి స్పందించిన వారందరకూ పేరు పేరునా ధన్యవాదాలు.
    @ranjit గారూ interesting suggestion ఇచ్చారు. కానీ ఇవాల్టి పరిస్థితులు చూస్తుంటే ప్రాంతాలకతీతులైన సమకాలీన తెలుగు మహనీయులు ఎవరు అనే ప్రశ్న కలుగుతున్నది? ఏదన్నా పేరు ప్రతిపాదిద్దాము అంటే వారిమీద ఏ ప్రాంతీయ బురద జల్లుతారో? శ్రీనాధుడు, పోతన లాంటి మహానుభావులకే తప్పలేదు ఈ దుస్థితి.

  17. srinivas says:

    it is so nice

  18. krishna says:

    niku andra vallu rasina comments thappa telangana vadi avedhana ardham kadhu

Comments are closed.