-కొవ్వలి సత్యసాయి
అగస్టు 09 గడి … వివరణలు
ఈసారి గడిని 11 మంది నింపి పంపారు. వారు జ్యోతి, అలకనంద, హిమజా వేమూరి, కంది శంకరయ్య, కోడీహళ్ళి మురళీమోహన్, శ్రీలు, భమిడిపాటి సూర్యలక్ష్మి, మైత్రి, కల్పన, వల్లూరు శ్రీరామ ప్రసాదు మరియు పట్రాయని సుధారాణి గార్లు. వారందరికీ అభినందనలు. వీరిలో కంది శంకరయ్యగారు మరియు శ్రీలు అన్నీ సరిగ్గా వ్రాసారు. వీరికి వీరతాళ్ళు. చాలా పూరణలలో (శంకరయ్యగారితో సహా) కుర్మా, కుర అని నింపారు. కొద్దిగా దీర్ఘమిస్తే కూర రుచిగా ఉండుండేది. ఇది తప్పుగా పరిగణించలేదు. కందుకం (బంతి), మోద (తమలపాకుల కట్ట) దాదాపు అందరూ (శంకరయ్యగారు తప్పించి) తప్పుగా పూరించారు. రోమనులిపిలో వ్రాయదల్చుకున్న వాళ్ళు దీర్ఘాలూ, హ్రస్వాల విషయంలో జాగ్రత్తపడితే బాగుంటుంది.
1 ర | గ | 2 డా | 3 పే | టిస్ | .. | 4 ధ | ర్మ | 5 వ్యా | ధు | 6 డు | … |
మ | .. | 7 బు | ట్ట | .. | 8 కూ | ర్మా | … | ఘ్రం | … | ము | .. |
ణా | .. | లు | .. | 9 ని | ర | ర్ధ | 10 కం | … | 11 బా | వు | లు |
12 రె | ట్ట | .. | 13 డ | ప్పు | .. | 14 కా | దు | … | 15 లా | లు | .. |
డ్డి | .. | 16 ల | బ్బు | .. | 17 త | మ | కం | .. | .. | .. | 18 మి |
.. | 19 ఆ | మ | డ | .. | 20 ద | మో | .. | 21 అ | లి | 22 పి | రి |
23 నీ | లి | మ | బ్బు | .. | 24 రి | క్షా | వా | లా | … | 25 ల | యా |
ల | .. | ల | .. | 26 వా | న | లు | .. | అ | .. | 27 కా | లు |
28 కం | చం | .. | 29 నా | రి | .. | .. | 30 బు | లా | కి | .. | కా |
ఠం | .. | 31 రు | .. | 32 జా | ణ | వు | లే | … | .. | 33 ఖీ | రా |
.. | 34 అ | క్కు | 35 ప | క్షి | .. | — | 36 నా | 37 మా | 38 లు | .. | లు |
39 వ | క్క | .. | క్కు | .. | 40 మం | చం | … | 41 డా | మి | నో | .. |
అడ్డం ఆధారాల వివరణ
1 ర గ డా పే టిస్ | రగడా అంటే కొట్లాటా, పేటిస్ అంటే పెట్టెలు. ర గ డా పే టిస్ ఒక చాట్ ఐటెం |
4 ధ ర్మ వ్యా ధు డు | ధ ర్మ వ్యా ధు డు మాంసం కొట్టు నడిపే ఆయన. కౌశికుడికి ధర్మాలు చెప్పాడు. |
7 బు ట్ట | దీంట్లో 39 నిలువులో ఉన్న వాటిని (చేపలు) వేయచ్చు, అబ్బాయిల్నీ బుట్టలో పడేయొచ్చు, మత్స్యగంధీ అని చేపలని సూచించడం కోసం వాడాం |
8 కూ ర్మా | పూరీలో నంజుకు తినేది. నిలువులో ఉన్నది కూర. అన్నంలో కలుపుకు తినేది.. |
9 ని ర ర్ధ కం | 11 అడ్డంలోవి బావులు. ఎండిపోతే అవి ని ర ర్ధ కమే కదా, |
11 బా వు లు | 26 అడ్డాలు అంటే వానలు లేక పోతే ఇవి ఎండతాయి కదా |
12 రె ట్ట | ఇది మీద పడడం వల్లేకదా కౌశికుడు దాన్ని శపిస్తాడు. తర్వాత పతివ్రత సలహా మీద ధర్మవ్యాధుడు (4 అడ్డం ఆయన) దగ్గరకెళ్ళి ధర్మసూక్ష్మాలు వింటాడు. |
13 డ ప్పు | స్వంత డబ్బా కొట్టుకోవడాన్ని డప్పుకొట్టుకోవడం అంటారు. |
14 కా దు | ఆడవాళ్ళు అవునంటే కాదు అనే కదా |
15 లా లు | ఇంతకు ముందు ఐదేళ్ళు రైల్వే మినిస్టరీయన. మమతా బెనర్జీ ఈయన తర్వాత రైల్వే మినిస్టర్ |
16 ల బ్బు | డబ్ లేదుకాబట్టి సగం కొట్టుకుంటున్న గుండె అన్నాం |
17 త మ కం | ప్రేమలో కలిగేది తమకమే కదా |
19 ఆ మ డ | హనుమంతుడు నూరు ఆమడల దూరం దూకాడు కదా అందులో 1 శాతం ఒక ఆమడ |
20 ద మో | తమలపాకుల కట్టని మోద అంటాం. తిరగబడింద. సరిగా పెట్టి దాని మీద మోపెట్టండి అన్న వాక్యంలో అదే సూచించాం. . |
21 అ లి పి రి | అంటే తేలిక మనిషి అని అర్ధం. తిరుమల కొండ నడిచెక్కాలంటే నడక అ లి పి రి నుండే మొదలెట్టాలిగా. |
23 నీ లి మ బ్బు | మొయిలు అంటే మబ్బు అనికదా. వానకారు మబ్బులు నల్ల (నీలి) గా ఉంటాయి. |
24 రి క్షా వా లా | ఈయన ముందు బలాదూరేట …అది ఒకప్పుడు. ఈమధ్యలో హైదరాబాదులో కనిపిస్తేకదా .. ఆయనే బలాదూరయి పోయాడు. రింజిం రింజిం హైదరబాద్ రిక్షావాలా జిందాబాద్. మూడు చక్రములు గిరగిర తిరిగితే మోటరుకారు బలాదూర్ అన్ని పాట గుర్తొస్తే ఈఆధారం వీజీ. |
25 ల యా | సంగీతానికి శ్రుతి తల్లి లయ తండ్రి కదా. |
26 వా న లు | బుల్లి పాపాయిలు బయటకెళ్ళి ఆడుకోకుండా చేసేవివే. రెయిన్ రెయిన్ గో అవే రైమ్ గుర్తుకు తెచ్చుకోండి |
27 కా లు | కాలు భాగం అంటే పావు (పాతిక) భాగం. కాలు లేక పోతే కుంటుకుంటూ వెళ్ళక తప్పుతుందా |
28 కం చం | ఒకే కంచం ఒకే మంచంలా ఉంటేనే కదా గాఢ స్నేహితులంటారు కదా. అలా కాకపోతే స్నేహితుల దినం చేసుకోవడానికి అనర్హులే |
29 నా రి | రాముడైనా, అర్జునుడైనా బాణం వేయాలంటే శత్రువులని చంపాలంటే వింటి నారి (ఆడది) ఆధారం |
30 బు లా కి | ఇది ముక్కుకి పెట్టే ఆభరణం. ఎటొచ్చీ దీనికిలా బుకింగు వెనుక తేదీపై చేసుకోవాలట. (లావక్షరాలు గమనించండి) |
32 జా ణ వు లే | తెలివైన ఆడదంటే ఉదయభానులే( జా ణ వు లే నెర జా ణ వు లే ఏంకర్) |
33 ఖీ రా | స్వయంగా పండగ సుందరి వెనకబడి (తిరగేసి రాయమని సూచన) వరమిస్తే మగవాళ్ళు చేయిచ్చి కట్టించుకుంటారా – రాఖీ సావంత్ స్వయంవరం స్ఫూర్తితో ఇచ్చిన ఆధారం |
34 అ క్కు ప క్షి | పిట్టంటే పిట్ట కాదు. తెలివి తక్కువ బక్కప్రాణి. వేరే వివరణ అవసరం లేదనుకుంటా. |
36 నా మా లు | పంగతో పెట్టగలిగేవివే …. పంగనామాలు అంటే తెలుసనుకుంటా |
39 వ క్క | ఆకుకి చక్కని జోడీ వక్క కాక ఇంకేముంటుంది |
40 మం చం | నవ్వారు లేకపోయినా పర్వాలేదు. చెక్కేసుకు పడుకోవచ్చు ..ఇప్పుడన్నీ చెక్కమంచాలే కదా |
41 డా మి నో.. | ఈజిట్ 3 డాట్ పిజ్జా షాప్ … మూడు చుక్కలున్న లోగో ఉన్న కంపనీ అని సూచన |
నిలువు ఆధారాల వివరణ
1 ర మ ణా రె డ్డి | రేలంగి మామగారు .. చాలా సినిమాల్లో రమణారెడ్డే. ఆయన మంచి మెజీషియన్ |
2 డా బు లు | బాబులు చెప్పుకునే గొప్పలు .. గొప్పలంటే డాబులు |
3 పే ట్ట | ఆడకోడి ముఖమేంటి ఇలా పేద్దగా ఉంది? .. పే దీర్ఘంగా ఉండాలన్న సూచన ఆధారంలో ఉంది |
4 ధ ర్మా ర్ధ కా మ మో క్షా లు | చతుర్విధ ఫలాలు .. ఇవి అందరికీ తెలిసినవే |
5 వ్యా ఘ్రం | దీన్ని చంపితేకానీ శివుడు బట్ట కట్టలేడు .. పులి చర్మం ధరిస్తాడు కదా .. పులిని చంపితే కానీ చర్మం రాదుకదా |
6 డు ము వు లు | డుమువులు ప్రథమా విభక్తి కదా |
8 కూ ర | కూర్మా, కూర ఒక్కలాంటివే కదా |
9 ని ప్పు | నిప్పుకి చెదబట్టునా అనికదా నానుడి |
10 కం దు కం | అంటే బంతి కదా |
11 బాలా | పెళ్ళికళవచ్చేసిందే… బాలా అనికదా పాట |
13 డ బ్బు డ బ్బు | లుబ్ధావధాని గుండె ఇలాగే కొట్టుకుంటుందేమో .. పిసినారికి అంతేకదా |
16 ల మ మ ల | బాగా ఆకలైతే మనమన మాడాం అంటాం కదా- తిన్నగా నిలబడలేవా అంటే అక్షరాలు అటూఇటూఅయ్యాయని |
17 త ద రి న | రాగాలాపనలో వచ్చే అక్షరాలు ఇవేకదా |
18 మి రి యా లు కా రా లు | బాగా కోపం ప్రదర్శిస్తే కారాలూ మిరియాలూ నూరాడంటాం కదా …ముందర నూరినా పర్వాలేదు అంటే పదాలు అటూ ఇటా అయ్యాయని. |
19 ఆ లి | అంటే పెళ్ళాం అనికదా. అది ఓ కమెడియన్ పేరు కూడా పెళ్ళాం |
21 అ లా అ లా | ఆకాశంలో హంసలమై అన్న పాట దీనికాధారం.. .. కులాసాల తేలిపోవాలంటే హంసలో పక్షులో అవ్వాలా (4) |
22 పి లకా | గణపతి శాస్త్రి గారి ఇంటిపేరు కాదా. పేరుకు ముందే పెట్టుకునేదింటి పేరే కదా. |
23 నీ ల కం ఠం | విషం సోకిన గళం నీలకంఠం అనేకదా |
26 వా రి జా క్షి | వారిజాక్షలంది వైవాహికములందు … అనృతమాడవచ్చు అని కదా శాస్త్రం. |
30 బు లే నా | బుర్ర లేని నాయకులని పొట్టిగా మార్చేస్తే బలే ఉంటుంది కదా- బుధ్ధిలేని వాళ్ళని కూడా ఇలాగే పొట్టిగా రాయచ్చు కదా. |
31 రుక్కు | చిన్నభార్యని ముద్దుగా సత్యా అని పిలిచినట్లు రుక్మిణిని రుక్కు అని పిలవగలడు కదా |
34 అ క్క | వరంగల్ లో అక్కా అని పిలవకూడదుట అవ్వ అని పిలవాలని చెప్తారు |
35 ప క్కు | ముక్కులో ద్రవంగా కాక ఘనంగా ఊడేదిదే కదా |
37 మాడా | మాడా వేంకటేశ్వర్రావు కొజ్జా వేషాలు వేసి వేసి ఒక ఐకన్ అయిపోయాడు కదా |
38 లు మి | మీలు తలకిందులుగా రాయాలి.. కుఱచ అన్నాం కాబట్టి మిలు. |
కుర్మా అని తెలుగులో khorma అని హిందీలో అంటారు. కాని కూర్మా అనేది నేను ఎప్పుడూ వినలేదు. చూడలేదు. ఇక 41 అడ్డం డామినోస్ domino’s ..
జ్యోతిగారి మాటే నా మాట కూడా. కుర్మా వచ్చినప్పుడు కూర సరిపోలేదని అప్పుడే తెలిసింది. కూర్మాఅని ఆకూర ని అనడం వినలేదు. అడ్డానికో,నిలువుకో ఆధారం మారిస్తే బాగుండేదేమో..ఇంగ్లీషు పదాలు నింపవలసివచ్చినప్పుడు బహువచనంగా ఎస్ ఉంటే ఆ పొల్లుఅక్షరాలను ముందు అక్షరంతో కలిపి రాయవచ్చన్న విషయం కూడా చాలామందికి తెలియదనుకుంటాను.ఉదా.కి డామినోస్ లో నోస్ ఒకే అక్షరం అన్నమాట
నీలిమబ్బు పదానికి ఆధారంగా వానమబ్బు ఇచ్చారు.నీలిమబ్బులో నీళ్ళు ఉంటాయంటారా….
రాఖీ సావంత్ మాత్రం చాలా రోజులు ఆలోచింపచేసిన ఆధారం… బావుంది.
మీరిద్దరూ అన్నది కరెక్టే ..కుర్మా. కు ని మరీ షార్ట్ గా పలికితే రుచి ఉండదు గమనించండి 🙂
నీలిమబ్బులు (క్యుములో నింబస్) వాననిచ్చేవి.
గడిమీది మీ శ్రధ్ధకి అభినందనలు
సుధారాణి గారి అభిప్రాయ౦ తో ఏకీభవిస్తున్నాను.