ఈసారి గడి కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. మొత్తం పంపిన వారు ఎనిమిది మంది. స్లిప్పుల సర్వీసులో పాల్గొనే వీరులెవరూ పంపకపోవడం అన్యాయం! స్లిప్పులు అందుకొని,అందించే ఉత్సాహం గడి నింపి, పంపడంలో కూడా చూపిస్తే బాగుంటుంది. అన్నీ వస్తేనే పంపించాలని ఏమీ లేదు కదా.
పంపినవారిలో మొత్తం సరైన సమాధానాలు పంపినవారు ఆదిత్య. ఒకటి రెండు అచ్చుతప్పులతో కోడీహళ్ళి మురళీమోహన్ గారు కూడా అన్నీ సరిగ్గానే పూర్తిచేసారు. మూడు తప్పులతో పంపినవారు వెన్నెల_డిబి, సంచారి. సమాధానాలు పంపిన ఇతరులు, వెన్నెల పట్రాయని, సుధారాణి పట్రాయని, కల్పన, మైత్రేయి.
ముఖ్యంగా ఏకాక్షర పదాలు చాలామందికి కొరుకుడు పడినట్టు లేదు.
కాస్త తేడాగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇలా ఇచ్చాను. దీని గురించి ఇతర పదాల/ఆధారాల గురించి గడివీరులు అభిప్రాయాలు నిరభ్యంతరంగా చెప్పవచ్చు. ముందుముందు గడులు మరింత ఆసక్తికరంగా కూర్చడానికి మీ సూచనలు ఉపయోగపడతాయి. -కామేశ్వరరావు
య |
మ |
హా |
న |
గ |
రి |
క |
ల |
క |
త్తా |
పు |
రి |
1పొ |
|
2జ |
3మై |
4కా |
|
5లు | 6బా |
డు |
|
7లి |
కాట్ |
8త్ర | 9ప |
|
10దా |
రు |
11క |
వ |
నం |
|
12చే |
ప |
|
13ము |
రు |
|
ము |
|
పి |
|
దం |
|
14త |
తం |
15గం |
|
16స |
గం |
|
17బ్బి |
ల |
ము |
18మీ |
నా |
|
డం |
|
|
వే |
|
19అ |
|
గో |
|
20అ |
|
వ |
|
|
21చాం |
ది |
22నీ |
|
23కా |
వు |
24మా |
|
25వా |
ర్త |
లు |
|
|
|
26రం |
జా |
ను |
|
27త |
ల |
పు |
|
|
28
కు |
29శ్యే | 30ని |
|
|
31క |
32పా |
లి |
|
33బొ |
రు |
సు |
|
|
34శ |
క |
35ము |
|
జా |
|
36శా |
త |
ము |
మ |
|
37పా |
|
|
38ప్ప |
అ |
త |
గిం |
లు |
|
|
39ఉం |
కు |
40సం |
జయ్ |
గాం |
ది |
|
ము |
|
41వా |
స్కో |
డి |
గా |
మా |
కీలక పదానికి ఆధారం:
హనుమంతుడంతటివాడు యుద్ధాసక్తితో సుందరంగా వర్ణించిన నగరాన్ని దర్శించాలని ఎందుకుండదు? – యమహా నగరి కలకత్తాపురి
హనుమంతుడంతటివాడు: చిరంజీవి.
యుద్ధాసక్తి అంటే కదనకుతూహల రాగం.
సుందరంగా: సుందరరామమూర్తిగారు.
వర్ణించిన నగరం: కలకత్తాపురి.
దర్శించాలని ఎందుకుండదు: ఉంటుంది, ‘చూడాలని ఉంది’ సినిమా.
అడ్డం
2 అభ్రకాంత ద్వీపం – జమైకా. అభ్రకం అంటే మైకా
5 బంతికోసం వెతుకుతూ పిల్లాడు అటూ ఇటూ వెళ్ళిపోయాడు – ‘బాలు’డు అటూ ఇటూ అయ్యాడు
7 మంచమెక్కిన టైగర్ ని చూస్తే సరస్సుకి ప్రళయం వచ్చినట్టే – మంచమెక్కిన టైగర్ – ‘పులి’కాట్. తెలుగులో ఆ సరస్సు పేరు ‘ప్రళయ కావేరి’. ‘పు’ కీలకపదంలో ఉంది.
8 నీ సిగ్గు నేత్రపర్వంగా ఉంది – త్రప అంటే సిగ్గు. నే’త్రప’ర్వం లో ఉంది.
10 నషా ఎక్కించేది జరా పుచ్చుకొని కవిత్వం రాస్తే ఆ నాగేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు – దారుకవనం. నషా ఎక్కించేది హిందీలో ‘దారు’. కవిత్వం ‘కవన’. దారుకవన క్షేత్రంలో ఉన్నది నాగేశ్వరుడు.
12 అంబుధిలో అనిమిషం. తెలీలేదా ? చేతులు పట్టుకో, క్లుప్తంగా చెప్తాను. – చేప. అంబుధి అంటే సముద్రం. అనిమేషం అంటే రెప్పలు వెయ్యనిది. చేపకి రెప్పలుండవుకదా. ‘చేతులు పట్టుకో’ మొదటి అక్షరాలతో క్లుప్తీకరిస్తే వచ్చేది కూడా అదే కదా.
13 నీ మురుగులో చిన్న ముక్క నాకిస్తావా? – మురు. అంటే చిన్నముక్క
14 తెల్లని నల్లని గళ్ళ… జీవితమే ఒక చదరంగం – తతంగం. ఒక సినిమా పాటలో పల్లవి.
16 దీని అర్థం అర్థం కాదు అర్ధం. పూర్తిగా అర్థం కాలేదా ? – సగం. ‘అర్థం’ (వత్తు త) అంటే meaning, డబ్బు అని అర్థాలు. ‘అర్ధం’ (వత్తు ద) అంటే సగం అని అర్థం.
17 ఇది గుహలో ఉంటుందా, దీనిలో గుహ ఉంటుందా? నిశీ నిష్ ని అడిగితే తెలియొచ్చు. – గబ్బిలము. బిలం అంటే గుహ. గబ్బిలాలు గుహల్లో ఉంటాయి కదా. ఇవి నిశాచరులు కూడాను. ‘గ’ కీలకపదంలో ఉంది.
18 ఎంత అల్లరిపిల్లైనా మన తెలిగింటి మనవరాలు కదా, క్యోఁ డాంట్తా హై ఉస్కో? – కమీనా. హిందీలో తిట్టు. తెలుగింటి మనవరాలు మీనా. ‘క’ కీలకపదంలో ఉంది.
19 అచ్చు 20 అడ్డుకి ప్రతిబింబమే! – అ. 19, 20 ఒకదానికి ఒకటి ప్రతిబింబం. రెండూ ఒకటే అక్షరం కూడాను. అలాంటివి తెలుగులో చాలా ఉన్నాయి కాని ‘అచ్చు’ ‘అ’ ఒకటే.
20 అచ్చు 19 అడ్డుకి ప్రతిబింబమే! తెలియలేదా? సరే, ఇలా ప్రయత్నించండి:
(35 నిలువు + 8 ) అడ్డం [2] – అ. ’35 నిలువు’ = ముప్పది. కాబట్టి (35 నిలువు + 8 ) = 38. 38 అడ్డం [2] = 38 అడ్డంలో రెండో అక్షరం. ఇది ‘గిం’ కాని ‘అ’ కాని అవ్వవచ్చు. కాని ‘గిం’ ప్రతిబింబం అక్షరం కాదు, అది ‘అచ్చు’ కూడా కాదు !
21 నీ వెన్నెల చౌకగా దొరుకుతుందా భాయ్ – చాందినీ. హిందీలో వెన్నెల. ‘చాందినీ చౌక్’లో ఉన్నది.
23 రక్షించూ అంటూ ఎందుకు ఒహటే కాకిగోల ! – ‘కావు’మా.
25 అద్దంకి మన్నార్, కందుకూరి సూర్యనారాయణ, బలదేవానంద సాగర్ – వార్తలు. రేడియోలో వార్తలు చదివేవాళ్ళు.
26 అల్లా సాక్షిగా జఠరాగ్ని పండగ చేసుకుందాం. సరంజామాను తెచ్చుకురండి. – రంజాను. ఇది ‘రమాదాన్’ అనే పదంనుండి వచ్చింది. దాని అర్థం జఠరాగ్ని.
27 తన జన్మస్థలాన్ని ఎప్పుడూ శిరసావహించడం మంచి ఆలోచన ! – ‘తల’పు. అంటే ఆలోచన. అది పుట్టేది ‘తల’లోనే కదా !
29 డేగల తల్లిట – శ్యేని. ఈమె కశ్యప ప్రజాపతి కుమార్తె. శ్యేనికి, సూర్యుడి సారథి అరుణుడి (అనూరుడి)కి పుట్టినవాళ్ళే శ్యేనములు అంటే డేగలు అని పురాణాల్లో ఉన్నది.
31 పుఱ్ఱె పట్టిన ప్రతివాడూ పరమేశ్వరుడే ? – కపాలి.
33 ఎప్పుడూ బొమ్మకిందే ఉంటుంది – బొరుసు.
34 మధు కలశములో దోమా? అయ్యయ్యో! – మశకము. ‘మ’ధు ‘క’ల’శ”ము’ లో ఉంది కదా. ‘మ’ కీలకపదంలో ఉంది.
36 వాడి పర్సెంటేజి ఎంత? – శాతము. శాతము అంటే పర్సెంటేజి, అలాగే ‘వాడి’ (పదును) అని కూడా అర్థం.
38 పెళ్ళి తంతేగా ! దానికోసం గింత పరేషానై తడబటతవేమప్ప? – అప్పగింతలు తడబడింది. ఇది ‘ప్ప అ త గిం లు’ అవ్వవచ్చు, లేదా, ‘ప్ప గిం త అ లు’ కూడా అవ్వవచ్చు. కాని 20 అడ్డం వల్ల మొదటిదే అవ్వాలి.
39 ఉండకు అంటే ఎలా ? ముందు వెనకల చూసి అప్పుడు సమ్మతి తెలియజేస్తాను – ఉంకు. దీని అర్థం సమ్మతి. ‘ఉండకు’ ముందూ వెనకాల ఉన్నది ‘ఉంకు’.
40 జయ్ కొట్టే మేనకేశ్వరుడు చివర్న తేలిపోయాడేం ? – సం’జయ్’గాంది. మేనకా గాంధి భర్త సంజగాంధి. చివర తేలిపోయి సం’జయ్’గాంది అయ్యాడు.
41 మాస్కోవాడిగా కనిపించే బుడతకీచు మన దేశం వచ్చాడు – వాస్కోడిగామా. ఇది ‘మాస్కోవాడిగా’ అనాగ్రాము. బుడతకీచు అంటే పోర్ట్యుగీసువాడు.
నిలువు
1 మహిళాలోకం నిద్రలేచిందంటూ అన్నగారు చెయ్యిచేసుకున్నది – పొత్రము. ‘లేచింది నిద్రలేచింది మహిళాలోకం’ పాటలో ఎం.టి.ఆర్. తిప్పేది.
3 శరీరాన్ని దానముచేస్తే అది విశాలమైన భూమి అవుతుంది – మైదానము. ‘మై’ అంటే శరీరం. ‘న’ కీలకపదంలో ఉంది.
4 నల్లని వాహనం – కారు. కారు అంటే నలుపు అని అర్థం తెలుగులో.
5 రాజు ప్రేయసికి కళ్ళతో పోలికేంటి ? – కలువ. రాజు అంటే చంద్రుడు అని కూడా అర్థం. కలువల్లాంటి కళ్ళని పోలుస్తారు (చిన్నగా ఉంటే). ‘క’ కీలకపదంలో ఉంది.
6 చిన్నపిల్ల కార్యక్రమం కదా, మధ్యలో దీర్ఘం పలకలేరు వాళ్ళు – బాలనందం. బాలానందం ప్రసిద్ధమైన రేడియో చిన్నపిల్లల కార్యక్రమం. ‘ల’ కీలకపదంలో ఉంది.
7 పండు వెంట్రుకని ఎంత అస్తవ్యస్తంగా తుంచి పడేసినా ఏంటి ఫలితం ? – పలితం ఇటు అటు అయ్యింది. పలితం అంటే పండు వెంట్రుక.
9 బంగారం తయారుచేసే రాయి తత్త్వవేత్తలకెందుకో ! – పరుసవేది. ఇంగ్లీషులో దీన్ని Philosopher’s stone అంటారు.
11 పిలక ఉన్నదే శ్రేష్ఠమైన ఆవా ? – కపిల గోవు. ఈ ఆవు శ్రేష్ఠమైనది అంటారు.
12 దిగంబరాన్ని ఆ కవులు ఖండించేది ఆలోచన చుట్టుకోవడం చేతనా? – చేతనావర్త. దిగంబర కవిత్వాన్ని ఖండిస్తూ కవిత్వం వ్రాసినవాళ్ళు చేతనావర్త కవులు. ‘చేతనావర్త’ అంటే ఆలోచన చేత చుట్టబడిన అని అర్థం. ఈ కవులు, శ్రీ నరసింహారెడ్డి, శ్రీ పేర్వారం జగన్నాథం, శ్రీ కోవెల సంపత్కుమారాచార్య, శ్రీ కోవెల సుప్రసన్నాచార్య. సుప్రసన్నాచార్యుల వారి పేరున ఈ మధ్య బ్లాగుకూడా వచ్చింది (http://samparayam.blogspot.com/)
15 చెంప చెళ్ళుమనే ప్రమాదం, జాగ్రత్త! – గండం. దీనికి ‘చెంప’ అని కూడా అర్థం ఉంది.
22 మంచు మధ్యలో కరిగిపోకుండా చూడు, లేదంటే నీరైపోతుంది – నీహారం. మధ్యలో అక్షరం పోతే ‘నీరం’ అంటే నీరు. ‘హా’ కీలకపదంలో ఉంది.
23 ఇది కాక, మధ్యలోను చేరినా గిఫ్టు వస్తుంది – కానుక. ‘కాక’ మధ్యలో ‘ను’ చేరితే వస్తుంది.
24 ఒక ప్రసిద్ధ సారథి అన్నగారి మరో ప్రసిద్ధ సారథి – మాతలి. ఒక ప్రసిద్ధ సారథి కృష్ణుడు. అతని అన్నగారు ఇంద్రుడు (దేవకీ వసుదేవులు, అదితి ప్రజాపతుల అంశ వాళ్ళు). ఇంద్ర సారథి మాతలి.
25 వాయుపుత్రుడి ఒంట్లో పొంగు – వాపు. ‘వా’యు’పు’త్రుడు లో ఉన్న పొంగు.
28 పూబాల కడు సుకుమారి సుమా ! – కుసుమకుమారి. ‘రి’ కీలకపదంలో ఉంది.
30 రాత్రి తిరగబడితే ఈశ్వరుడు కూడా భయపడతాడు – నిశ. అంటే రాత్రి. తిరగబడితే ‘శని’. ఇతనికి ఈశ్వరుడు కూడా భయపడతాడు కదా !
32 సత్య వాక్పరిపాలనకై వెన్నదొంగ అపహరించినది – పారిజాతము. ‘రి’ కీలకపదంలో ఉంది.
33 మా ముత్తాతబొమ్మలో షర్టుకున్నదేమిటో కనుక్కోండి చూద్దాం – బొత్తాము. ‘ము”త్తా’త ‘బొ’మ్మలో ఉంది. ‘త్తా’ కీలకపదంలో ఉంది.
35 అది ప్రమాదకరమైన వయసా ? ఎందుకు ? ముసలితనం చుట్టుముడుతుందనా ? – ముప్పది. ముప్పు + అది అని విడగొడితే అది ప్రమాదం అని అర్థం వస్తుంది. ‘ముది’ అంటే ముసలితనం.
36 విలువైన వలువ ఏమిటో తెలుశా ? – శాలువా.
37 ఇది తాగితే పిల్లలు పుడతారంటే ఎవరైనా నవ్వుతారు – పాయసం. ‘లలనలు పాయసమానిన కలుగుదురే పిల్లలంచు క్ష్మాసుత నవ్వన్’ పద్యం గుర్తుతెచ్చుకోండి. ‘య’ కీలకపదంలో ఉంది.
39 పిల్లల ఏడుపు మధురంగా, శ్రావ్యంగా, లలితంగా, హృదయంగమంగా ఉంటుంది – ఉంగా.
అమ్మో!! ఈసారి గడి కాసింత కష్టంగానే ఉంది. స్లిప్పులు ఇచ్చేవారు లేరు. సగం పేపరు రాసి ఇవ్వలేక పంపలేదు..
“ka” in the 9th column was never used! Thats where I faltered and could not fit “Meena” in. ( I got “Kameena” or “kareena” which didnt make any sense. Isn’t it mandatory to use every letter from Keelakapadam?
రౌడిగారు,
అది “కమీనా”నే. “క” కీలకపదంలో ఉంది. వట్టి “మీనా”నే అయితే, “క్యోఁ డాంట్తా హై ఉస్కో” అని అనాల్సిన అవసరం లేదు కదా.
Ohh okay. Thanks for the clarification Kameswara Rao garu
బాగుందండీ,
– కాఁ, కాం లాగా కాట్ కూడా అనుస్వరయుక్తమైన ఒకే అక్షరం అని తెలిసింది. ఇది బాగుంది, ఈసారి ఒక్కో గడికి రెండక్షరాలు పెట్టి ప్రయత్నించచ్చు.
– తలపుకీ తలంపుకీ తేడా ఏమిటి? తల్లో వచ్చేది తలపు అయిటే, జన్మస్థలం ప్రస్తావన ఎందుకు. స్థలము తలం కాబట్టి తలపు తలంపు అని సూచించట్లేదూ?
ఆఁ, ఇవ్వన్ని కేవలం నాకే పట్టినట్టుంది. లెక్కప్రకారం మైనారిటీ ఎప్పుడూ తప్పే గదా.. పొద్దుమలుపులో ఆగిన సమయం పర్లే బానే ఉంది.. ఇక వెల్తాను, పెరవారికి చోటొసంగుతూ..
శుభాకాంక్షలతో.
సంచారి
కీలక పదం ఆధారంలో అంత లోతు ఉందనుకోలేదు ..బాబోయ్!! అదిరింది.
ఆదిత్య