జూలై గడిపై మీమాట

సౌష్ఠవ (సిమెట్రికల్) గడి కావాలని గతంలో కొందరు గడి ప్రియులు సూచించారు. అలా ఇవ్వడానికి బేసి సంఖ్య గళ్ళు అయితేనే బావుంటుందని భావించిన కామేశ్వరరావు గారు ఈ సారి చాలావరకూ (అంటే మొదటి 11 కాలమ్స్) సౌష్ఠవంగా ఉండేట్టు ఇచ్చారు. అంతేకాకుండా స్లిప్పువీరుల ఉత్సాహం గమనించి ఈసారి గడిలో ప్రత్యేకించి వారికోసమే అన్నట్లుగా టెంకాయలు రాశులు పోశారు. యథాశక్తి పగలగొట్టి పండగ చేసుకోండి. 🙂

2009 జూలై గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి.

– పొద్దు

కూర్పరి, భైరవభట్ల కామేశ్వరరావు మాట:
ఈనెల గడిలో ఒక కీలక పదం తక్కిన వాటితో సంబంధం లేనిది ఉంది. అది ఒక row అంతాను. దానికి ఆధారం కూడా విడిగా ఉంది. కాబట్టి అసలు గడి 11×12 అన్నమాట.
కీలక పదంలో ఒకో అక్షరమూ, ఆ columnలో ఏదో ఒక నిలువులోనో అడ్డంలోనో ఉన్న పదంలో లోపించిన అక్షరం అవుతుంది. నిలువు పదంలో అక్షరం లోపిస్తే అది ఆ పదంలో ఎన్నో అక్షరమైనా అయ్యుండవచ్చు. అడ్డంలో లోపిస్తే మాత్రం అది మొదటి అక్షరమే అవుతుంది (కొంత సులువుగా ఉండేందుకు).
ఉదాహరణకి కీలక పదం “గోరొంక గూటికే చేరావు చిలక” అయితే (ఇప్పుడిచ్చింది ఇది కాదనుకోండి :-)), మొదటి columnలో ఏదో ఒక నిలువులో క్లూకి “గోమేధికము” అనే పదం సమాధానం కావచ్చు. కాని అక్కడ నాలుగక్షరాలే ఉంటాయి. అంచేత “గో” అన్నది కీలక పదంలో మొదటి అక్షరంగా వేసుకొని, “మేధికము” అన్నది నిలువు పదంలో వేసుకోవాలి. అలాగే మిగతా అక్షరాలు.
కీలక పదానికి (42 అడ్డం)ఆధారం: హనుమంతుడంతటివాడు యుద్ధాసక్తితో సుందరంగా వర్ణించిన నగరాన్ని దర్శించాలని ఎందుకుండదు?

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

One Response to జూలై గడిపై మీమాట

  1. సంచారి says:

    నేను ఇప్పటికే గడి నింపి పంపాను కాబట్టీ ఏ మార్పులూ చేయను. కానీ, 7 అడ్డం క్లూ మీద నాకు కొంత అభ్యంతరం ఉండవచ్చేమో.

    1. సరస్సులో ప్రళయం రావడం వల్ల టైగర్ తిరగబడి మంచం ఎక్కింది అనుకున్నాను (అప్పుడు 42 అడ్డం కీలక పదంలో అక్షరం 39 నిలువుకి చివర్లో చేరుతుంది. నేను పూర్తి చేసిన పద్ధతి ఇదే.)

    2. కాని పక్షంలో చివరి అక్షరం టపామని ఎగిరిపోయి 42 అడ్డం కీలక పదంలో అక్షరం ముందుగా మంచం సగమౌతుంది, 39 నిలువు కేవలం అలానే మిగిలిపోతుంది (ఈ ఊహ అనుకోకుండా ఇందాకే వచ్చింది, గడిని మళ్ళీ చూస్తుంటే).

    రెండవ వాదనే భై.కా.రా గారి ఉద్దేశమైతే నా గడి తప్పు అవుతుంది. దానికి నేనేమీ అంత బాధ పడను గానీ, క్లూ వివరణలో ప్రళయం వచ్చినప్పుడు తిరగబడటానికీ, తోకలు తెగిపోడానికి తేడా ఉందని వారు చూపిస్తారనే ఆశిస్తున్నాను (లేకపోతే క్లూ తప్పుదారి పట్టించేది అవుతుంది కదా). అందుకే “ఉండచ్చునేమో” అని పైన అన్నది.

Comments are closed.