జూన్ గడి పరిష్కారాలు – ఫలితాలు

– రానారె

వాసకసజ్జిక (45 అడ్డం) చాలా మందికి చిక్కలేదు. కొందరు మకురం బదులు ముకురం అని పూరించారు. దాంతో డమరుకము డమురుకము అయింది. ఈ రెంటినీ కలిపి ఒకే తప్పుగా పరిగణించడమైనది. అలాగే మొదటి వరుస పదకొండో గడిలో ‘ర’కు దీర్ఘం లోపించడంతో రాధ కాస్తా రధ, రామ కాస్తా రమ అయ్యారు. రెంటినీ కలిపి ఒకే తప్పుగా పరిగణించడమయింది.

జూన్ నెల గడిని సరిగ్గా పూరించిన వారు కంది శంకరయ్య, కోడీహళ్ళి మురళీమోహన్. మురళీమోహన్ గారు ఈ గడిని పట్టువదలని విక్రమార్కునిలా పదే పదే పూరించి చాలాసార్లు పంపించారు. చివరికి అన్నీ సరిగ్గా పూరించగలిగారు. వారి పట్టుదలకు ‘పొద్దు’ అభినందనలు తెలియజేస్తోంది.

సుజాత(మనసులోమాట), వేణు, జ్యోతి ఒక్క తప్పుతో, శ్రీనివాసులు, సంచారి, మాలపికుమార రెండు తప్పులతో, స్వరూప కృష్ణ, భమిటిపాటి సూర్యలక్ష్మి మూడు తప్పులతో, మైత్రేయి, హిమజ, మైత్రి, రాధిక గార్లు మూడు కన్నా ఎక్కువ తప్పులతో పూరించారు. అందరికీ అభినందనలు. జూలై గడి వచ్చేస్తోంది. ఓ పట్టు పట్టండి.

ఆధారాలకు వివరణలు:

అడ్డం:

1 సంకటం కలిగిన ఒక తెలుగు సామెత. పూర్తిగా చెప్పాలా? (7)
పిల్లికి చెలగాటం (ఎలుకకు ప్రాణసంకటం)ద్రాక్షపాకం
6 కృష్ణుడి ప్రేమధారలో తలమునకలు (2)
రాధ అనాగ్రాంద్రాక్షపాకం
8 మాయల మరాఠీ సేవిక (2)
సంగు (బాలనాగమ్మ లో మాంత్రికుడు సంగు అని పిలిచే సంగీత)ద్రాక్షపాకం
9 నానా మతములందు ఏక, బహు వచనాల్లో ఉండే వ్యక్తి శ్రేయస్సు (2+2)
తనా మనా అనాగ్రాంకదళీపాకం
11 పొడిబారిన నేతల సంఘం (2)
నేసంద్రాక్షపాకం
14 తెలితామరకన్నులవాడా అంతా నీవే (3+2+2+5)
అంతయు నీవే హరి పుండరీకాక్ష (అన్నమయ్య కీర్తన)కదళీపాకం
17 తోక తెగిన పాము. విన్నపాలకు అడ్డొచ్చిన దోమతెర దీనిదే (3)
పన్నగ (విన్నపాలు వినవలె … అన్నమయ్య కీర్తన)ద్రాక్షపాకం
18 కొమ్ము కలిగిన మొసలి అద్దము (3)
కొమ్ము కలిగిన మొసలి – మకురము అంటే అద్దము అని అర్థంకదళీపాకం
19 కాసును కడుపులో దాచుకుని నరుడి మధ్య చేరిన రాక్షసుడు (6)
నరకాసురుడు ద్రాక్షపాకం
22 తిరగబడిన మడి (2)
మడి – కయ్య. తిరగబడితే య్యకకదళీపాకం
24 వరుస తప్పి స్వాధీనమైన డెడ్ బాడీ (2)
డెడ్ బాడీ – శవం. వరుస తప్పితే వశం – స్వాధీనంకదళీపాకం
25 ఓటమి ప్రభావం కాబోలు చంద్రకళ కనబడలేదు (2)
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు పేరులో చంద్ర తీసేస్తే మిగిలేది బాబు.కదళీపాకం
26 పంటినొప్పా? ఉపశమనకారి అల వంగదేశములో (4)
లవంగం పంటినొప్పికి మంచి విరుగుడు అనాగ్రాంకదళీపాకం
29 కంపము తడబడితే తామర పుట్టిల్లు (3)
పంకము తామర (పంకజము) పుట్టేచోటు అనాగ్రాంకదళీపాకం
31 నిశ్చలానందంలో ఇదీ సౌఖ్యకారే (2)
బాధ (బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ పాట)కదళీపాకం
32 అందరికీ అమ్మ (1)
క్ష్మా – భూమికదళీపాకం
33 రాలమీద అట్నుంచి తేలిగ్గా రండి (2)
రిరా. రాలమీద – రకారంలో రండి – రార్రి/రారి.కదళీపాకం
34 పంతులమ్మ దాచుకున్న ముళ్ళ బెత్తం (2)
తుమ్మ అనాగ్రాంద్రాక్షపాకం
36 సరిగా లేని అరకలు మరి పొరపొచ్చాలే కదా? (6)
అరమరికలు అనాగ్రాంద్రాక్షపాకం
39 వెదకడం ప్రారంభించే ముందు దాసోహమనాలి (2)
సోదా అనాగ్రాంద్రాక్షపాకం
42 సగం అబల మొత్తుకోలు (2)
లబ. లబలబ అనే మొత్తుకోలులో సగం. అనాగ్రాంద్రాక్షపాకం
44 అటు ఒకని, ఇటు ఒకని మధ్య మారువేషంలో తమ్ముడిని దాచిన ఘనజఘన సుందరి (4)
నితంబిని. ఒక ని, ఇంకొక ని మధ్యలో తంబి (తమిళంలో తమ్ముడు)ద్రాక్షపాకం
45 ప్రియుడి కోసం జవ్వాజి కసకస పూసినా ఎదురుచూపులు తప్పలేదు (6)
వాసకసజ్జిక – ఎదురుచూపుల కావ్యనాయిక. అనాగ్రాంద్రాక్షపాకం

నిలువు:

1 పిడుగు పెరిగి పెద్దదయ్యాక ఇలా పిలవాలంటే వరస కుదరాలి.(2)
పిల్లాద్రాక్షపాకం
2 కండ్లకు కుట్టడమేకాదు, గిల్లడమూ తెలుసు. తడి.(2)
చెమ్మకదళీపాకం
3 గొడ్లకు గడ్డి, మనుషులకు తిండి గాసిపడకుండా దొరకునా?(2)
గాసంకదళీపాకం
4 పేరులో నాలుక వుంటే సరిపోదు, దమ్ముంటే కాల్చండిరా అని వెలగడానికి.(10)
టంగుటూరి ప్రకాశం పంతులుద్రాక్షపాకం
5 ముందుగా ఇది చేసుకోకపోతే -మెడకో డోలు- అంటూ ఈసడింపులే. (2)
కంత. ‘తాదూర కంత లేదు మెడకో డోలు’ అని సామెతద్రాక్షపాకం
6 అందమైనది. స్త్రీ.(2)
రామకదళీపాకం
7 పిసినారి చూపే అపేక్ష (4)
ధనాపేక్షకదళీపాకం
10 నారీ! వాగకుడు అని వాపోయి చెప్పినా వినని నాజూకు మనిషి (5)
నాగరీకుడు అనాగ్రాంద్రాక్షపాకం
11 ఆత్మీయంగా బట్ట నేసేవాడిని అక్రమంగా తన్ననేరము? (3)
నేతన్న అనాగ్రాంద్రాక్షపాకం
12 ఇరుసేనల మధ్య యుద్ధం కొత్త తరహా శకమనుకునేరు (4)
సంయుగము అంటే యుద్ధం.నారికేళపాకం
13 ఇట్టి జ్ఞానమున్నవాడవు, అర్హమైన తావి చనవే? (4)
వివేచన అనాగ్రాంకదళీపాకం
14 నవీన్ కొత్తింటిపేరు (4)
అంపశయ్య. నవీన్ అంపశయ్య నవలా రచయితగా, అంపశయ్య నవీన్ గా ప్రసిద్ధుడయ్యారు కదళీపాకం
15 ఉరుము కడమ, మొదల్లేకుండా సరిగా మోగించాలి (5)
డమరుకము అనాగ్రాంకదళీపాకం
16 నోళ్లలో నానకముందే గిర్రున కళ్ళ నీళ్ళు తెప్పించేది రంకా? (2)
కారం అనాగ్రాంకదళీపాకం
20 ఉండేది రవంత అనుకున్నా. అంత లేదు (2)
రవంతలో అంత తీసేస్తే మిగిలేది రవ. ఆధారంలో సమాధానం నేరుగానే ఉంది. ప్రత్యక్ష సమాధానంకదళీపాకం
21 విలుకాడు (5)
అంబుధరుడుకదళీపాకం
23 సకలమూ పరిశీలించగా కొంత నిజం కాదు (2)
కల – ప్రత్యక్ష సమాధానంకదళీపాకం
25 బాలు ఒకటి కాదు రెండు (2)
బాబాకదళీపాకం
27 స్వరాల మాలగా సిద్ధించిన గురుత్వం (3)
గరిమ (సప్తస్వరాల్లోని గ,రి,మ. కలిస్తే అష్టసిద్ధుల్లో ఒకటైన గరిమ – గురుత్వం)కదళీపాకం
28 ఒక్కోసారి రాముడిలోనూ కృష్ణుడుంటాడు. సవ్యంగా చూసేవారికి తప్పక కనిపిస్తాడు (3)
మురారి అనాగ్రాంకదళీపాకం
30 మలమ్మ కుడి ఎడమల ధరించిన నగ (2)
కమ్మద్రాక్షపాకం
35 అరహితంగా సదా అమలచిత్తురాలైన అలర్కమాత (4)
మదాలస అనాగ్రాంకదళీపాకం
37 సీసా మూత సరిగా తీయక అలా వచ్చింది (3)
రడాబికదళీపాకం
38 భూబకాసురుల క్వాలిఫికేషన్ (2)
కబ్జాద్రాక్షపాకం
40 యవనికలోనుంచి కనిపించే అడవి (2)
వని – ప్రత్యక్ష సమాధానంద్రాక్షపాకం
41 అసహాయులకిది బాసట (2)
బాస – ప్రత్యక్ష సమాధానంద్రాక్షపాకం
43 దంచిన పచ్చడి (2)
బజ్జిద్రాక్షపాకం

————————————————————

(జూన్ గడిలో “విలుకాడు (5)” అని ఇచ్చిన ఆధారం గురించి కంది శంకరయ్య గారు సందేహం లేవనెత్తిన మీదట జరిగిన చర్చలో అంబు అనే పదం గురించి లోతైన విషయాలు తెలిశాయి. ఇందుకు శంకరయ్య గారికి, కామేశ్వరరావు గారికి నెనర్లు. ఎక్కువ ఆధారాలు అనాగ్రాముల రూపంలో చమత్కారభరితంగా, కనుక్కోవడానికి సులభంగా ఉన్న ఆ గడిలో ఆ ఆధారం అంత ముక్తసరిగా పొద్దెక్కడం నా నిర్వాకమే. 🙂

“అంబు(బాణము) అన్నది సంస్కృత భవమే అని బ్రౌను, సూర్యరాయాంధ్ర నిఘంటువుల్లో ఉంది. శబ్దరత్నాకరంలో వైకృతమని ఉంది. అంచేత అంబుధరుడు అన్నది బాణాన్ని ధరించినవాడు అన్న అర్థంలో వాడవచ్చనే అనుకుంటాను. అమ్ముకాడు అంటే విలుకాడు కాబట్టి అంబుధరుడు అన్నా విలుకాడు అనే అర్థం తీసుకోవచ్చనుకుంటున్నాను.” అన్నది కామేశ్వరరావు గారి అభిప్రాయం. ఆ ఆధారం ఇవ్వడంలో నా ఉద్దేశమూ అదే. గడి పూరించి పంపినవారిలో ఇద్దరు తప్ప మిగిలిన అందరూ అంబుధరుడు అనే రాయడం గమనార్హం. – త్రివిక్రమ్)

ఇక పైన ఇచ్చిన బొమ్మలు దేనికి సూచనో మీరు గ్రహించే ఉంటారు:

ద్రాక్షపాకం

ద్రాక్షపాకం

కదళీపాకం

కదళీపాకం

నారికేళపాకం

నారికేళపాకం

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

3 Responses to జూన్ గడి పరిష్కారాలు – ఫలితాలు

  1. ఒక్క తప్పుతో పూరించానని తెలుసు గానీ ఆ తప్పు అంబుధరుడు అయి ఉంటుందని ఊహించాను. ప్చ్! అనుకోనిది తప్పయిపోయిందన్నమాట. ఇదేనా విధి అంటే?

  2. tsradhika says:

    జూన్ గడి నేను పంపలేదే! లిస్టులో రాధిక పేరు పొరపాటా! మరో రాధిక గడి పంపారా!

  3. >> మరో రాధిక గడి పంపారా!

    అవునండీ, ఆ రాధిక వేరు. 🙂

Comments are closed.