మూగ ప్రేమ

– ఆత్రేయ

ఆవలి ప్రపంచంలో నువ్వు
అమాయకంగా అద్దాన్ని ముద్దెట్టే..
ఎక్వేరియం చేపలా … నేనూ..
మునివేలి గోటితో..
చెక్కిళ్ళు మీటుతావు
ఆసాంతం నీ ప్రేమలో..

అందంగా బందీగా ..
నా పిలుపు.. ఊచలకావల
ఏవో రావాలవుతుంటే..చూస్తాను
నన్నల్లిబిల్లి తిప్పుతూ.. నువ్వు
నీ చుట్టూ తిరుగుతున్న..
నా ఆలోచనలు..

నువ్వెళ్ళిపోతావు..
నీరు సద్దు మణుగుతుంది
పంజరమాగిపోతుంది !!

నా ఊసులు నీకర్ధమయ్యాయోలేదో
ఐనా.. స్థిరంగా నేనక్కడే !
ఆ మునివేలికోసం ఎదురు చూస్తూ…

—————

బంధాలను సుదూర తీరాల్లో వదిలి, అనుబంధాలను రంగు కాగితాల కోసం తాకట్టుపెట్టి, ప్రవాసమో వనవాసమో తెలియని జీవనం గడుపుతున్న మామూలు తెలుగువాడు ఆత్రేయ కొండూరు. భావాలను భాషలోకి మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆచార్య ఆత్రేయంటే చాలా అభిమానం.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

5 Responses to మూగ ప్రేమ

  1. వండర్ఫుల్ !! నిరీక్షణ, ఎడబాటు.. మీ హోంగ్రౌండనుకుంటా.. చాలా బాగుంది.

  2. చాలా బాగా రాశారు, మీ వివరణ చాలా బాగుంది.

  3. ఉష says:

    వలదన్న వినని నీ మనసు
    తనకు తాను బందీ అవుతుంటే
    తొంగిచూసిన నన్ను చెదరగొట్టింది నువ్వు
    నాకు తెలియని తావుకి తోసుకెళ్ళిందీ నువ్వు
    తిరిగి రారమ్మని కంటినీరువిడిచింది నువ్వే
    ఇన్నిటా మూగనై నీ వర్ణనలో మునిగిందీ నేనే…

  4. M.Munna Swamy says:

    మూగప్రేమ ఒకేవైపు ప్రేమ

Comments are closed.