అతిథి

– శారద

చలి గజగజ వణికిస్తూంది. బయట ఈదురుగాలి తల తలుపులకేసి బాదుకుంటున్న చప్పుడు గుయ్యిగుయ్యిమని వినిపిస్తూంది. భుజాల చుట్టూ వున్న షాల్‌ని గట్టిగా దగ్గరకి లాక్కున్నాను. చలిమంటకి ఇంకా దగ్గరగా జరిగాను. ఇంత చలిలో, గాలిలో బయట కాకుండా ఇంట్లో సురక్షితంగా, వెచ్చగా వున్నందుకు భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను మనసులోనే.
వున్నట్టుండి చినుకుల చప్పుడు మొదలైంది. దీనికి తోడు వర్షం కూడానా!

బయటికెళ్ళి చూస్తే సరి. భయాన్నీ బద్ధకాన్నీ వదుల్చుకొని బయటకొచ్చి, తలుపు తెరిచి చూసాను. చిక్కటి చీకటింకా అవలేదు గానీ, మెల్లిగా చాప కింద నీరులా ఆకాశాన్ని ఆక్రమించుకుంటూంది చీకటి. రాబోతున్న చీకటినీ, చలినీ తలుచుకుని ముహం ముడుచుకుని వున్నట్టుంది, ఆకాశం. చలి మాత్రం తట్టుకోలేనంతగా వుంది. వాకిట్లో ఎవరూ లేరు. మరా చప్పుడేమిటి?

పిల్లికూన నా వొళ్ళోకి వచ్చి పడుకుంది. కుక్కపిల్ల దాని వంక గుర్రుగా చూసింది. పిల్లలు వెళ్ళిపోవటంతో ఇల్లంతా ఆక్రమించుకున్న ఒంటరితనాన్ని తరిమేయటంకోసం నేను దగ్గరికి తీసిన నేస్తాలు, ఈ జంతువులు. ఆఫీసుపని మీద ఊరెళ్ళిన ఆయన తిరిగొచ్చేవరకూ నాకీ ఒంటరితనం తప్పని శిక్షే!

ఇంతలో బయట ఏదో గీరుతున్న శబ్దం. భయంతో వొళ్ళంతా నిక్క బొడుచుకుంది. ఈ గాలీ వానా, ఇంత వేళ గాని వేళ, ఎవరై వుంటారు? దొంగాడేమో! కుక్కపిల్ల చెవులు రిక్కించి వింటోంది. సన్నగా ఏదో టప టపా మన్నట్టుంది. మళ్ళీ ఎవరో గీరుతున్న శబ్దం.

బయటికెళ్ళి చూస్తే సరి. భయాన్నీ బద్ధకాన్నీ వదుల్చుకొని బయటకొచ్చి, తలుపు తెరిచి చూసాను. చిక్కటి చీకటింకా అవలేదు గానీ, మెల్లిగా చాప కింద నీరులా ఆకాశాన్ని ఆక్రమించుకుంటూంది చీకటి. రాబోతున్న చీకటినీ, చలినీ తలుచుకుని ముహం ముడుచుకుని వున్నట్టుంది, ఆకాశం. చలి మాత్రం తట్టుకోలేనంతగా వుంది. వాకిట్లో ఎవరూ లేరు. మరా చప్పుడేమిటి?

గాలికి విరిగిపడిన చెట్టు కొమ్మ కిటికీ రెక్కల మీద రాసుకుంటోంది. నవ్వుకుని దాన్ని తీసి అవతల పారేసాను. ఇంట్లోకి వెళ్ళబోతూ యధాలాపంగా కిందికి చూసాను.

ఎక్కణ్ణించి వచ్చి పడిందో, చిన్న చిలక, నేల మీద సొమ్మసిల్లి పడి వుంది. దెబ్బలేమైనా తగిలాయో ఏమో! మెల్లిగా దాన్ని వీలైనంత మృదువుగా ఎత్తుకుని ఇంట్లోకి తీసుకొచ్చాను.

“మళ్ళీ ఇదేమిటీ?” అన్నట్టు పిల్లికూన ఆ చిన్న చిలక వైపు కౄరంగా చూసింది. దాని చూపులని లెక్క చేయకుండా, వెచ్చటి, మెత్తటి టవల్ తెచ్చి ఆ చిలకని దాన్లో పడుకోపెట్టాను. వెచ్చటి నీళ్ళూ, పాత నూలుచీరతో దాని వొళ్ళూ రెక్కలూ తుడిచాను.

రెక్కలకింద దాగి వుంది, చిన్న ముల్లు. అందుకే అది ఎగరలేక పడిపోయింది. నేర్పుగా ఆ ముల్లుని పీకి పారేసాను. రెక్కలూ మెడా సవరిస్తూ చాలా సేపు ఉండిపోయాను. నా వొళ్ళో తన స్థానం పోయిందని కోపంగా పిల్లికూనా, దాని వైపు వేడుకగా కుక్క పిల్లా చూస్తున్నాయి. ఒక పాత సామాన్ల డబ్బాలో పాత చీరొకటి పరిచి దాన్ని అందులో పడుకో పెట్టాను. ఇన్ని గింజలూ, ఒక ఆపిల్ ముక్కా చిలక ముందు పెట్టి, చిన్నపళ్ళెంలో కొన్నినీళ్ళు పోసివుంచాను. కానీ అది కళ్ళు తెరవటానికైనా ఓపిక లేనట్టు సొమ్మసిల్లి పడి వుంది.

రాత్రి నేను భోజనం చేసి వచ్చి చూసేసరికి అదింకా అలానే పడి వుంది. దాని ముందు వేసిన గింజలూ, నీళ్ళూ ఏదీ ముట్టుకోలేదు. నా పక్కమీదికి చేరాను. నిద్ర పట్టక అటూ ఇటూ దొర్లుతున్నాను. ఆ చిన్నారి చిలకా, దాని తడిసిపోయిన రెక్కలు, అందమైన పచ్చటి శరీరం, తలచుకుంటేనే ముద్దొస్తుంది. లేచి. హాల్లోకి వెళ్ళి లైటు వేసి చిలక వైపు చూసాను. అదింకా అలాగే నిద్ర పోతుంది. ఒక్క సారి చేతుల్తో దాని రెక్కలు సవరించాలనిపించింది. కానీ నిద్రలో భయపడుతుందేమోనని ఊరుకున్నాను.

********************
తెల్లవారి నేను లేచేసరికి చిలక కొంచెం తేరుకున్నట్టు కనిపించింది. తనున్న డబ్బాను ముక్కుతో పొడుస్తూ పరీక్షిస్తోంది. మెల్లిగా దాన్ని చేతిలోకి తీసుకున్నాను, భయపడుతుందేమోనని భయపడుతూనే. కానీ నా చేతి స్పర్శ బాగా పరిచయమైనట్టు, కదలకుండా ఒదిగిపోయింది.

ఆ రోజు వెటర్నరీ డాక్టరుకి ఫోన్ చేసి పిలిపించాను. దాన్ని పరీక్ష చేసి, ఏమీ లేదని, ముల్లు బలంగా దిగటంతో రెక్కలో బాగా గాయమైందనీ, ఆ గాయం మానగానే ఎగరగలుగుతుందనీ చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన చేతుల్లో మాత్రం ఎక్కువసేపు వుండలేకపోయింది. కిచకిచమంటూ నా దగ్గరకొచ్చింది. దానికి నా మీదున్న నమ్మకానికి నాకు కొంచెం గర్వం అనిపించింది.

ఆయన చేతుల్లోకి తీసుకోబోయాడు. గబగబా టేబిల్ మీద నడుచుకుంటూ నా దగ్గరకొచ్చి ఎగిరి చేతుల్లో దూరింది. నాకు నవ్వూ, కించిత్తు గర్వమూ కలిగాయి. నోరులేని జీవి నామీద ఎంత నమ్మకమూ ప్రేమా పెంచుకుందో కదా అని. దాన్నలా నా చేతుల్లో వుంచే ఆయన పరీక్ష చేసారు.

రెండు రోజుల్లో అది నాకు బాగా చేరికైంది. ఆ చిలకని దువ్వుతూ, దానితో కబుర్లు చెప్పటం, దానికి పాటలు పాడి వినిపించటం బాగా అలవాటైంది. మెల్లిగా దాన్ని తోటలోకి కూడా తీసుకెళ్తున్నాను. నా భుజం పైన వాలి కూర్చుంటుంది. నా భుజం మీద దాని బరువు నాకేమీ భారంగా అనిపించలేదు. బహుశా ఇతరుల బరువు మొయ్యటం తల్లిగా, భార్యగా నాకలవాటైపోయిందేమో! దాని వాడి గోళ్ళు నా భుజంలోకి గుచ్చినా నాకేమీ నొప్పి కలగలేదు. ఆ నొప్పికంటే కబుర్లు చెప్పుకోవటానికి నేస్తం దొరికిందనే సంతోషం ఎక్కువైందేమో! నేను చెప్పే కబుర్లన్నీ శ్రద్ధగా విన్నది.

“నీకా చిలక వచ్చిందగ్గర్నించీ మా మీద ప్రేమ తగ్గిపోయింది, దాన్ని బయటికి పంపించేయి” అని చెప్తున్నట్టు కుక్క పిల్లా, పిల్లి కూనా నా వైపు నిష్టూరంగా చూస్తున్నాయి.

“అది కాదర్రా! దెబ్బ తగిలి కదలలేని పరిస్థితిలో అది మనింటికొచ్చింది. ఇలాటప్పుడు మనం దానికివ్వాల్సింది ప్రేమా, అభిమానమూ. మనం దానికి బలం రాకముందే బయట వదిలేస్తే, అది చచ్చిపోదూ?” అనునయంగా చెప్పాను వాటికి.

పిల్లీ కుక్కలని ఇంటి వెనక వైపు ఉంచేసాను. వీలైనంతవరకూ ముగ్గురినీ వేరు వేరుగానే వుంచుతున్నాను. అయితే అది నన్ను ఒక్క క్షణం కూడా వదిలి ఉండ గలిగేది కాదు. ఇలా అయితే అది ఎగరటం ఎలా మరి?

అందుకే ఒక రోజు దాన్ని మొదటిసారి తోటలో ఒంటరిగా వదిలేసాను. అటూ ఇటూ నడుస్తూ తోటంతా కలియ తిరుగుతోంది. లోపల పని చేసుకుంటూ కూడా ఒక కన్ను దాని మీదే వేసి వుంచాను.

కలకలమని గోల వినిపించటంతో తోటలోకి ఒక్క పరుగున వెళ్ళాను. పక్షుల గుంపేదో తరుముతున్నట్టు వుంది, చిలక తొందర తొందరగా అడుగులేస్తూ వస్తుంది. నాలుగైదు పెద్ద చిలకలు దాన్ని ఎగిరి ఎగిరి పొడుస్తున్నాయి. అది భయంతో గజగజా వణికి పోతోంది. ఒక్క ఉదుటున దాన్ని చేతుల్లోకి తీసుకుని లోపలికొచ్చి తలుపేసాను. నా చేతుల్లో ముడుచుకుపోయింది. దాని భయాన్ని చూసి నాకు జాలేసింది.

“పోనీలే! ఇప్పట్లో నిన్ను బయటకి పంపించను. నా దగ్గరే వుందువుగాని.” బుజ్జగించాను.
ఎంత భయపడిందో ఏమో కానీ తేరుకోవటానికి చాలాసేపే పట్టింది. నేను కొంచెం ఆశ్చర్యపోయాను. అది ఎగరలేదెందుకా అని. ఇంకా రెక్కల్లో నొప్పిగా వుందా?

మర్నాడు మళ్ళీ వెట్ దగ్గరికి తీసికెళ్ళాను. ఆయనా ఆశ్చర్యపోయాడు. దెబ్బ తగిలి అయిదారు రోజుల పైనే అయింది. ఇంకా ఎగరలేక పోవటం ఏమిటా అని.

ఆయన చేతుల్లోకి తీసుకోబోయాడు. గబగబా టేబిల్ మీద నడుచుకుంటూ నా దగ్గరకొచ్చి ఎగిరి చేతుల్లో దూరింది. నాకు నవ్వూ, కించిత్తు గర్వమూ కలిగాయి. నోరులేని జీవి నామీద ఎంత నమ్మకమూ ప్రేమా పెంచుకుందో కదా అని. దాన్నలా నా చేతుల్లో వుంచే ఆయన పరీక్ష చేసారు.

“రెక్కలు బలంగానే వున్నాయి మరి. ఎందుకెగరటం లేదో. ఇంకొక నాలుగైదు రోజులు చూద్దాం,” అన్నారు.

ఇంటికొస్తూ దానికెంతో బోధ పరిచాను. “అందమైన పక్షివి, రెక్కలూ వున్నదానివి, ఎగరలేకపోవటం ఏమిటీ? నామోషిగా లేదూ?” మందలించాను. “నా బాధ నీకేం అర్థమవుతుందిలే,” అన్నట్టు నా చెంపమీద తల ఆనించింది. మళ్ళీ రెండు రోజులు నా చుట్టుపక్కలే వుంది. ఒంటరిగా బయట వదిలేస్తే ఏమాత్రం వుండలేదు. నన్నే వెతుక్కుంటూ వచ్చేస్తుంది.

ఇలా ఎన్నిరోజులు? తలచుకుంటే దిగులుగా వుంది. పక్షి తన స్వభావసిద్ధంగా ఆకాశపుటంచులు వెతుక్కుంటూ, రివ్వురివ్వుమని రెక్కలు సాచి, మేఘాలమధ్య తేలిపోవాలేగానీ, ఇలా మనుషులమీద అభిమానం పెంచుకుని మిగతా ప్రపంచానికి భయపడి దూరంగా వుటే ఎలా? ఈ ఆలోచనతో నాలుగైదు రోజులు నిద్ర పట్టలేదు.

దానికి నాతోటలో వుండే మూలమూలా చూపించాను. ప్రతీచెట్టూ, ప్రతీఆకూ, ప్రతీపువ్వూ పరిచయం చేసాను. ఏ మొక్క ఎప్పుడు నాటానో వివరించాను. పిల్లల గురించీ, మావూరి గురించీ ఎన్నో కబుర్లు చెప్పాను. మెల్లిగా చెట్టు కొమ్మపైకెక్కించాను ఒక రోజు దాన్ని. ఇదెంత వింతపక్షి, ఎగరటానికింత భయపడుతుందేమిటి అనుకుంటూనే. కానీ ఆరోజు అది ఎక్కువ భయపడలేదు. కొంచెం సేపాగి, కొమ్మమీంచి రివ్వుమంటూ ఎగిరి నా భుజం పైకొచ్చి వాలింది. సంతోషంగా, మళ్ళీ కొమ్మ మీదికెక్కించాను. ఈ ఆట ఆ రోజంతా ఆడుతూనే వున్నాము.

వారం రోజులు గడిచాక, ఒక రోజు తనంతట తనే కొంచెం రెక్కలు విదిలించి మామిడి కొమ్మపైకెగిరింది. పట్టరాని సంతోషం కలిగింది నాకు.

“అదీ! అలా ఎగరాలి! ఈ జామ కాయ ముక్కని తిను”, అభినందించాను. కొంచెం కొంచెం ఎగరటం మొదలు పెట్టింది. రెండు రోజుల తరువాత మళ్ళీ ఒంటరిగా తోటలో ఒదిలేసాను. ఈ సారి ఏ ప్రమాదమూ జరగలేదు. రెండు మూడు గంటలైంతరువాత ఇంట్లోకి తీసుకొచ్చాను. ఇంకొక చిలకల గుంపుతో స్నేహమైనట్టుంది. అన్నీ కలిసి గుంపుగా కిచకిచమంటూ కబుర్లాడేవి. అన్నిటికీ కలిపి కొంచెం తిండి గింజలూ ఇన్ని మంచి నీళ్ళూ పెట్టి లోపలికొచ్చాను. వాటన్నిటితో కబుర్లయ్యాక చిలక లోపలికొచ్చి నా భుజం మీది కెక్కి కూర్చుంది, ఎప్పట్లానే.

అయిదోరోజు పొద్దున తోటలో వొదిలేసిన చిలక సాయంత్రమైనా రాలేదు. ఏదో ఆందోళన మనసుల్లో! చీకట్లు పడేవేళకి ఇల్లు చేరుకుంది. “ఇదా నువ్వు ఇంటికొచ్చే టైం?” విసుక్కుంటూనే జామకాయ ముక్కని పెట్టాను. ఎక్కడ ఏం తిన్నదో కాని, పండు ముక్క కొంచెం కొరికి వదిలేసింది. ప్రేమగా నా మెడలో తల దాచుకుంది. నా మనసెందుకో బాధ పడింది.

ఇంకొక నాలుగు రోజులు గడిచాయి. ఇప్పుడు, రోజూ పొద్దున్నే దాన్ని తోటలో వదిలిపెడుతున్నాను. తన స్నేహితులందరితో కలిసి బాగానే ఎగురుతోంది. కానీ మూడు నాలుగు గంటలకంటే ఎక్కువ వుండలేదు. అయిదోరోజు పొద్దున తోటలో వొదిలేసిన చిలక సాయంత్రమైనా రాలేదు. ఏదో ఆందోళన మనసుల్లో! చీకట్లు పడేవేళకి ఇల్లు చేరుకుంది. “ఇదా నువ్వు ఇంటికొచ్చే టైం?” విసుక్కుంటూనే జామకాయ ముక్కని పెట్టాను. ఎక్కడ ఏం తిన్నదో కాని, పండు ముక్క కొంచెం కొరికి వదిలేసింది. ప్రేమగా నా మెడలో తల దాచుకుంది. నా మనసెందుకో బాధ పడింది.

అలా రోజూ పొద్దున వెళ్ళి సాయంత్రం రావటం మొదలు పెట్టింది. ఇలా ఏదో ఒకరోజు జరగక తప్పదని తెలిసినా, అది కనపడక పగలంతా ఏదో వెలితిగా వుండేది. తోటలో తిరుగుతున్నా, పుస్తకం చదువుతున్నా, పాటలు వింటున్నా ఏదో తెలియని ఒంటరితనం చుట్టుముట్టినట్టే వుండేది.

ఇంకొక నాలుగు రోజుల తరువాత చిలక సాయంత్రమైనా ఇంటికి రాలేదు. అసలు ఆ తరువాతెప్పుడూ రాలేదు. నాకే.. తోటా, ఇల్లూ, నా మనసూ అన్నీ ఖాళీగా అనిపిస్తున్నాయి. తోటంతా తిప్పి చిలకకి చూపించాననుకున్నా కానీ, నా మనసంతా విప్పి పంచుకున్నానుకోలేదు.
ఆరునెలల తరువాత సాయంత్రం తోటలో పూల వైపు చూస్తున్నాను. కుక్కపిల్లా పిల్లికూనా ఆడుకుంటున్నాయి. రివ్వున వచ్చి వాలింది చిలక, నా చిలక! ఒక్కసారి దాన్ని దువ్వాలన్న ఆశని అణుచుకున్నాను.

“బాగున్నావా?” దగ్గరికెళ్ళి పలకరించాను. రివ్వున ఎగిరి నా భుజం మీద వాలింది. రెండు నిమిషాలుండి మళ్ళీ ఎగిరి, ఆకాశంవైపు దూసుకెళ్ళిపోయింది.

నేనూ నా ఒంటరి తోటా మిగిలిపోయాము. కుక్కపిల్లా, పిల్లికూనా, “ఎంత కృతఘ్నతో చూడు! నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది” అంటూ తోకలూపుతున్నాయి. “మరది పక్షి కదా? ఎగరకుండా మనతో పాటే ఎలా వుండగలదు? అయినా మీరుండగా నేను ఒంటరినెందుకవుతాను?” ఇద్దరికీ నచ్చచెప్పాను. నాకేం కోపం లేదు, నా చిలక మీద. ఎగురుతుందని చిలక మీద కోపగిస్తారా ఎవరైనా? అయినా, ఆకాశంలో వెళ్ళే చిలకల గుంపు వైపు ఆశగా చూస్తూనే వుంటాను, నా చిలక ఎప్పుడైనా కనిపిస్తుందేమోనని.

**************************

శారద అనేక తెలుగు రచనలను thulika.net కోసం ఆంగ్లంలోకి అనువదించారు. సునిశితమూ, సున్నితమూ ఐన కొ.కు. గారి శైలి తనకిష్టమనీ, తాను మార్క్సిజమ్, ఫెమినిజమ్ వగైరా ఏ ఇజాన్నీ పూర్తిగా ఆమోదించలేననీ అంటారు. స్టోరీస్ అనే బ్లాగు రాస్తూంటారు.

About శారద

నివాసం : అడిలైడ్, ఆస్ట్రేలియా
వృత్తి : ఆస్ట్రేలియా లో సైంటిస్టు
కథలు: దాదాపు ముప్పై కి పైగా, తెలుగు పత్రికల్లో, ఇంగ్లీషు వెబ్ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.

This entry was posted in కథ and tagged , , , . Bookmark the permalink.

14 Responses to అతిథి

  1. Neelima says:

    Sweet story. bavundi.

  2. Aruna Pappu says:

    చాలా బాగుంది, మనసుని కదిలించింది. ముఖ్యంగా ఈ వాక్యం…..
    ‘‘తోటంతా తిప్పి చిలకకి చూపించాననుకున్నా కానీ, నా మనసంతా విప్పి పంచుకున్నానుకోలేదు.’’ చిలకను పిల్లలకో, స్నేహితులకో ప్రతీకనుకుంటే ఈ కథ మరింత నచ్చింది.

  3. కథ బావుంది. పాపం ఆమెని వదిలేసి అలా ఎగిరిపోడానికి ఆ చిలక ఎంతగా మధనపడి ఉంటుందో!

  4. శారదా, మీరు ఎంచుకున్న ఇతివృత్తం, రాసినతీరూ కూడా కొత్తగానూ, అద్భుతంగానూ వున్నాయి. ఆచంట శారదాదేవిగారి పారిపోయినచిలక జ్ఞాపకం వచ్చింది – మీ ఇమేజరీ, శైలీ చూస్తుంటే. మంచికథ. అభినందనలు.

  5. శారద says:

    నీలిమా, అరుణ గారూ,
    ధన్యవాదాలు.
    కామేశ్వర రావు గారూ,
    నిజమే. నేను ఎంతసేపూ నా గురించే ఆలోచించాను కాను, చిలక గురించి కాదు.ఎందుకో వదిలి వెళ్ళిపోయినవాళ్ళకంటే మిగిలి వున్న వాళ్ళకే నొప్పి ఎక్కువగా కలుగుతుందనిపిస్తుంది. ఎందుకో మరి!
    మాలతి గారూ,
    ఆచంట గారి కథ నేను చదవలేదు. ఎక్కడైనా చదవటనికి వీలుంటే pointer ఇవ్వగలరు.
    శారద

  6. శారదా, ఆచంట శారదాదేవిగారి సంకలనం, పారిపోయినచిలక, అన్నపేరుతోనే వచ్చింది చాలాకాలం క్రితం. ఇప్పుడు బజారులో దొరక్కపోవచ్చు. నేను ఇక్కడ లైబ్రరీలోంచి తెచ్చుకుని అనువాదం చేసేను. తూలిక.నెట్ లో వుంది. కానీ మీకూ తెలుసు కదా అలాటికథలు తెలుగులోనే చదవాలి.:)

  7. kamala says:

    శారద,నీ కథ ఏంతొ బాగుంది.క్రిష్ణ శాస్త్రి గారి పాట గుర్తొచింది.’రాకొఇ అనుకొని అతిధి ‘

  8. ఓబుల్ రెడ్డి says:

    శారద గారి అతిథి కథ బాగుంది.
    అభినందనలు.
    జంతువులూ , పక్షులూ మనిషిని అమాయకంగా నమ్ముతాయి.
    మనం ఆ నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉండగలుగుతున్నామా?

  9. చాలా బావుంది

  10. bhavani says:

    sarada garu, athidhi kadha baagundi. evaraina ee lokaniki athidhe. life is nothing but chain of sentiments. hrudyam ga undi. congrats.. bhavani

  11. Meher says:

    చాలా బాగుంది

  12. sneha says:

    kadha chala bhagaundi manam mana talli tandri ni vodili vaccham rapu thodu(sneham)dorikina mana pillalu anthe ani pinchindi

  13. Sarada says:

    Sarada gaaru,
    idi chaduvuthunte naaku ‘Chalam’ gaari “Bujji gaadu” gnapakam vachindi..Indulo chilaka, andulo nemo gorinka..
    Manchi katha..baagundi..

  14. vasanta lakshmi,p says:

    meeru ila kathala tone maa gundelani pindestunnaru.. elagandi..egiri poyina chilaka tiri raadu, rekkalu vacchi, illu vadili ,tama daari taamu vetukkune pillalu tirigi raaru, empty nest syndrome to badha padutoo, ee blogs loki digaane nenu..chilka upmaanam..chaala baagundi..chala gaari, puvvu virisindi gurtu vacchindi, inko vishayam tripura maa mavayye, vizag lone untaam mem kooda.. vasantham.

Comments are closed.