తనెళ్ళిపోయింది..

— కొండూరు ఆత్రేయ

తనెళ్ళిపోయింది..

ఐనా ఈ రాత్రి… అవే ఊసుల్ని
చీకటి పొదల్లో.. ఎక్కడినుంచో
చెపుతూనే ఉంది.

ఆ దారుల్లో నిప్పు రేణువుల్ని
మిణుకు మిణుకు మంటూ
రేపుతూనే ఉంది.

కాసేపు అలా
నేను, రాత్రి, ఏకాంతం.

అసంకల్పితంగా
పచ్చిక మీద వెల్లికిలా.. ఓ కన్ను మూసి
బొటనవ్రేలితో చంద్రుడిని నొక్కుతూ
పక్కనున్న గడ్డి పరకలు
త్రుంచుతూ.. తింటూ..
కాళ్ళను ఆ యేటి నీళ్ళల్లో ఆడిస్తూ..

అన్నీ తీసుకు వెళ్ళిపోయింది..
నన్ను కూడా..

కాలమూ ఆగిపోయింది
సగం పరక నోట్లోనే మిగిలిపోయింది
నిశ్శబ్దం ఆవరించింది.

—————————

బంధాలను సుదూర తీరాల్లో వదిలి, అనుబంధాలను రంగు కాగితాల కోసం తాకట్టుపెట్టి, ప్రవాసమో వనవాసమో తెలియని జీవనం గడుపుతున్న మామూలు తెలుగువాడు ఆత్రేయ కొండూరు. భావాలను భాషలోకి మార్చే ప్రయత్నం చేస్తుంటారు. ఆచార్య ఆత్రేయంటే చాలా అభిమానం.

This entry was posted in కవిత్వం and tagged . Bookmark the permalink.

15 Responses to తనెళ్ళిపోయింది..

  1. radhika says:

    చాలా బాగుందండి.

  2. padmarpita says:

    బాగుందండి…

  3. బాగుందండీ

    “చేసిన పుణ్యాలు కొన్ని
    చేయని పాపాలు చాలా
    అందులకే సంతోషము
    సంతుష్టి జీవితము”

    అని గాలిబ్ గారు ఊరకే అనలా

  4. ఉష says:

    మాటలేవీ జ్ఞప్తికి రావటం లేదు. మనసు మాత్రం మీరు చెప్పిన భావనలో మునిగిపోయింది.

  5. parimalam says:

    కాలమూ ఆగిపోయింది
    నిశ్శబ్దం ఆవరించింది !

  6. తుంచేసిన పచ్చిక
    చిగురేసిందిలా
    కలసి నడిచిన
    మన అడుగుల జాడను
    చెరిపేసిందిలా
    కురిసే వెన్నలను
    మరిపించేస్తూ
    మనసు మాత్రం నెమరు
    వేసుకుంటుంది
    మీ అక్షరాలలోని
    సత్యాన్నిలా.

  7. స్పందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

  8. Sree says:

    “అవే ఊసుల్ని —- ఎక్కడినుంచో చెపుతూనే ఉంది”

  9. m s bhairi says:

    తానెల్లిపొఇంది
    పాతగురుతులుగా జ్ఞాపకాలనొదలి
    మినుకు మినుకు మంటు రేపుతున్న గాయలు
    పరిసరాలనే మరిపించేంతగా
    కాలంతోపాతు తనూ:తనతోపాటు
    నన్నూ తీసుకెల్లిపొఇంది

    కవిత చాల బాగుంది

  10. m s bhairi says:

    ధరనిగారి చివరి వార్నింగ్ భర్తపై పనిచేస్తుందని ఆసిద్దాం

  11. చాలా బాగా రాశారు,మీ విశ్లేషణ చాలా బాగుంది.

Comments are closed.