-చదువరి
గతనెలలో చదువరుల అసంతృప్తిని చూసాక, అనుచితమైన రాతలపై బ్లాగరుల వ్యతిరేకత నిర్మాణాత్మక ధోరణిలోనే ఉంటుందన్న మా అంచనా నిజమేనని గ్రహించాము. అటువంటి రాతలపై మీమాటే మామాట అని విన్నవించుకుంటూ, బ్లాగువీక్షణమిక అప్రతిహతంగా కొనసాగుతుందని మనవి చేసుకుంటూ..
ఎన్నికల కారణంగా 2009 మార్చి బ్లాగుల్లో రాజకీయ విశేషాలు పెరిగాయి. ఉగాది పండుగ కూడా సందర్భంగా కూడా టపాలు బాగా వచ్చాయి.
తెలుగులో కొత్తపదాలను ఎందుకు అంగీకరించలేకున్నాము అని నాగప్రసాదు వెలిబుచ్చిన సందేహంపై పెద్ద చర్చ జరిగింది. ఇలాంటి అంశంపైనే తెలుగు చచ్చిపోతే తప్పేంటి అన్నారు రేరాజ్ రివ్యూస్‌లో. ఈ టపాకు కొనసాగింపుగా మరో టపా కూడా రాసారు.
రాజకీయం
- మూడో కూటమితో మళ్ళీ తప్పు చెయ్యొద్దంటున్నారు సూర్యుడు
- మనలోనే ఉన్న ఈ రకం మనుషుల గురించి మనలో మనిషి అడుగుతున్న ప్రశ్న చూడండి
- మనక్కావాల్సిందేమిటి అని అడుగుతున్నారు భావకుడన్
- చంద్రబాబు నిబద్ధత గురించి ఓ అభిమాని రాసిన టపా చూడండి.
- తెలుగుదేశపు డబ్బు పంచే కార్యక్రమంపై అశోక్ చావా అభిప్రాయం చదవండి
- వోట్లూ నోట్లతో రాజకీయులు కట్టే కోటలపై అసంఖ్య పేల్చిన తూటా. ఫిరంగులనూ ఆశించవచ్చు, ఈ బ్లాగులో
- ప్రజారాజ్యానికి రాజెవరు అంటున్నారు వేపాకులో
- వీళ్ళేనా మనం గౌరవిస్తున్న స్త్రీలు అని అడుగుతున్నారు నెటిజెన్
- పదికి పది – ఈ చెణుకు చూసారా?
- తెలుగుదేశాన్ని గౌరవిస్తున్న ప్రజారాజ్యం అంటున్నారు చాకిరేవులో
- రోజుకు 35 రూపాయలు ఇచ్చేవాడికే మనవోటు అని ఉద్యమిస్తున్నారు రానారె
- నిరుద్యోగం పురుష లక్షణం శృంఖలను కొనసాగిస్తున్నారు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
- బీజేపీ అంటే భయ్ హో అంటూ భాజపాను విమర్శించారు కత్తి మహేశ్ కుమార్
- ఇంతకీ నిశ్శబ్ద విప్లవం ఎవరిది అని అడుగుతున్నారు కలకలంలో
- రాజకీయ దుకాణాల్లో అన్నీ ఉచితమే నంటున్నారీ కార్టూన్లో
ఉగాది కోయిలలు:
- తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు బీటాను విడుదల చేసారు మిరియాల ప్రదీప్
- మరువం ఉష ఉగాది పాట పాడారు
- ఆత్రేయ పద్యాలతో విరోధిని పలకరించారు
- తెలుగు బ్లాగరి ఫణీంద్ర ఉగాది పురస్కారాన్ని పొందారు
- ఇది ఉగాది ప్రశంస కాదు బూరెల ప్రశంస
- విదేశాల్లో ఉగాది ఉత్సవాల సంగతులివి
- విరోధి పేరు అభాస కావాలని ఆకాంక్షించారు భైరవభట్ల కామేశ్వరరావు
- విరోధికే స్వాగతం పలుకుతున్నామే అంటూ ఆశ్చర్యపోయారు ఊకదంపుడు
- పక్కవాడి పండగ ఎందుకు దండగ మన పండగలు నెలకొకటి ఉండగ అంటున్నారు ఫన్‌కౌంటర్
- చిన్ననాటి ఉగాది సంగతులను నెమరు వేసుకున్నారు సుబ్బు
- ఉగాది నాడు నానో కవితల వేడుక
- ఉగాది పంచాంగ పఠనం చెయ్యవచ్చిక్కడ.
- రాకేశ్వర కూడా ఓ టపా రాసారు. అయితే ఇది సింహరాశి వారికి ప్రత్యేకం.
- ఈ ఉగాది తమ ఇంట్లో ఉంగాది అయిందంటున్నారు బ్లాగాడిస్తా రవి
- కొత్త ఆశలతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించారు మన హైదరాబాదులో
- ఉగాదికి ఛందోబద్ధ స్వాగతం పలికారు వేదుల బాల
- తన ఉగాది జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు నేస్తం
హాస్యం:
- వివిధ వృత్తుల్లో ఉన్నవారు, కొందరు ప్రసిద్ధ వ్యక్తులూ ప్రేమలేఖలు రాస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై గతంలో శ్రీరమణ పేరడీ రాసారు. పప్పు శ్రీనివాస్ దాన్ని గుర్తుకు తెచ్చేలా హెచ్చార్ మేనేజరు ప్రేమలేఖ రాసారు.
- యాపిలు పండు వలన కలిగిన జ్ఞానోదయాల గురించి చదివారా?
- కాఫీ వెనకున్న కుట్ర కథ తెలుసా మీకు?
- ఓ రౌడీ పెళ్ళి శుభలేఖ చూడండి. వ్యాఖ్యలూ బాగున్నాయిక్కడ
- పండగ ఆఫర్ల మీద ఈ టేకు చదివారా
- కుడిఎడమైతే పొరపాటేనంటున్నారు చైతన్య. ఇలాంటి వస్తువుతోటే మరో టపా వచ్చింది జంబలకిడిపంబలో
కలగూరగంప
- రామ్ములక్కాయ+పాలకూర=మూత్రపిండాల్లో రాళ్ళు? అని అడుగుతున్నారో సోదరి.
- అహం బ్రహ్మస్మి అంటున్నారు అబ్రకదబ్ర
- ప్రసిద్ధి గాంచిన పది ఆలయాల జాబితా చూడండి
- మంత్రాలయ యాత్రా విశేషాలు చూడండి.
- కె.ఎన్.వై పతంజలికి శ్రద్ధాంజలి ఘటించారు మురళి వీరబొబ్బిలితో
- రవి దుప్పల కూడా పతంజలికి శ్రద్ధాంజలి ఘటించారు
- కత్తి విరిగిపోయిందంటూ కాంతారావుకు శ్రద్ధాంజలి ఘటించారు గీతాచార్య
- ప్రమాదవనానికి యాభై రోజులు నిండాయి. మార్తాండవాదం అనే పదాన్ని కాయించారందులో!
- స్వర్ణసీమకు స్వాగతం నవలను సమీక్షించారు సుజాత.
- ఇజ్రాయిలుకు జై కొడదామంటున్నారు, జీడిపప్పు
- చిరంజీవి జాతకం చెప్పారు సత్య
- పెళ్ళి ముచ్చట్లులో వధువు ఎలా ఉండాలి అని చెబుతున్నారు
- బ్లాగులతో హౌసీ అనే వినూత్నమైన సంగతిని రాసారు పలకా బలపంలో
- తాను రంగులద్దిన చీరలను ప్రదర్శించారు లలిత
- వేదాంతం శ్రీపతి శర్మ ఫోటో క్విజ్‌లు చూస్తున్నారా?
- అదన్నమాట సంగతి అంటూ ప్రవీణ్ ఒక వైవిధ్యమైన అంశంతో టపా రాసారు.
- ఇక జీమెయిల్ తెలుగులోనూ రాసుకోవచ్చంటున్నారు వీవెన్!
- ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరు 8 బాగుందంటున్నారు నల్లమోతు శ్రీధర్
- మనసులో మాట చెప్పుకున్నారు నా లోకంలో
కవిత్వం, ఇతర సాహిత్యం
- తన మావకు తానెట్టుకున్న పేర్లు, మీ మావ కోసం కావాలంటే కొన్నట్టుకెళ్ళమంటోందీ యెంకి
- కవిసామ్రాట్టు భావుకత గురించి రాసారు చింతా రామకృష్ణారావు
- వేకువ వర్ణన చూడండి సాహితీయానంలో
కొత్త బ్లాగులు
- ఇదో మంచి స్నేహితుడి బ్లాగు
- యువశక్తి బ్లాగుల్లోకి ప్రవేశించింది.
- వికటకవి పేరుతో మరో బ్లాగు వచ్చింది.
- మాంధాత పేరుతో మరో బ్లాగు ప్రవేశించింది.
- వ్యాఖ్యల ద్వారా పరిచితులైన పిచ్చోడు బ్లాగు మొదలుపెట్టారు.
ఇంకా..
- మరోప్రపంచం సాధ్యమే నంటారు మార్తాండ. రోజుకు సగటున నాలుగు టపాల చొప్పున రాసుకుంటూ పోతున్నారు.
- ఇండియన్ పొలిటికల్ క్లోజప్ లో కూడా ఇబ్బడిముబ్బడిగా టపాలు వస్తూంటాయి
- ఎ2జెడ్ డ్రీమ్స్ లో కూడా టపాలు విరివిగా వస్తూంటాయి.
- భారత రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర సాగుతోంది.
—————————
-చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు.
మొత్తానికి పొద్దువారు కళ్ళు తెరిచారన్నమాట. జయహో..
సమీక్ష బాగుంది. అంతగా ప్రాచుర్యం పొందని నా టపాని కూడా గుర్తించినందుకు నెనర్లు.
ధన్యవాదాలు 🙂
ఇంత modesty నా చదువరి గారు ఈ టపా తప్పకుండా ఈ లిస్ట్ లో ఉండాలి 🙂
http://chaduvari.blogspot.com/2009/02/blog-post_27.html
ప్రయత్నం బావుంది.
ఇలా ఉత్తుత్తగా(?) గాకుండా ఆ బ్లాగు గూర్చి ఉన్నదున్నట్లు (ంఇ ఆభిప్రాయాలు వద్దూ) ఓ పేరాగ్రాఫు చెబితే బావుంటందాని నా అభిప్రాయం. ఆ బ్లాగు లేదా ఆ పోస్ట్ మంచిదా కాదా అన్నది వీక్షకుడు తేల్చుతాడు.
ఈగ హనుమాన్, nanolu.blogspot.com