-చదువరి
బ్లాగుల్లో వివాదాలు కొత్తేం కాదు. కాని వివాదాల కారణంగా కొన్ని బ్లాగుల్లో సార్వజనిక ప్రవేశాన్ని తీసేసి కేవలం ఎంపిక చేసుకున్న కొందరు బ్లాగరులకే ప్రవేశం కల్పించారు. వ్యక్తిగత కారణాల వలన మూతపడిన బ్లాగులూ ఉన్నాయి. కారణాలేమైనప్పటికీ కొన్ని మంచి బ్లాగులకు ప్రవేశం లేకపోవడం లేదా మూత పడటం విచారకరం. త్వరలో ఈ బ్లాగులు మళ్ళీ చదువరులకు ఆహ్వాన వచనాలు పలుకుతాయని ఆశిద్దాం.
సత్యం కంప్యూటర్స్ సంస్థ ఒక మేడిపండని స్వయానా దాని సంస్థాపక చైర్మనే చెప్పాక యావజ్జాతి లాగానే తెలుగు బ్లాగరులూ ఆశ్చర్యపోయారు. వారి స్పందనలు కొన్ని ఇక్కడ:
- అ’సత్యమ’న్నారు పులిపాటి నిరంజన్
- “నిజానికి పాకినాడులోని లజ్జరి తోయిబా గాడు చేసిన దానికన్న పెద్ద ద్రోహం ఇది” అన్నారు నాగన్న
- నా హీరో రామలింగరాజు అన్నారు కశ్యప్. ఈ బ్లాగులో బాగా చర్చ జరిగింది
- సత్యం వధ అన్నారు అబ్రకదబ్ర
- మేటాస్ నిజాలు రాసారు జయప్రకాశ్
- ఓడలు బళ్ళయ్యాయి అన్నరు సన్నజాజి
- సత్యం గురించి మాట్లాడే హక్కు రాజకీయులకు, పత్రికలకు లేదన్నారు, అరుణాంక్
- సత్యం కుంభకోణం నేపథ్యంలో తెలుగు దిగ్గజాల భవిష్యత్తు ఏమటని ప్రశ్నించారు, తాడేపల్లి.
- కార్పొరేటు కాశి మజిలీ కథల్లో సత్యం కథ కూడా చేరింది
- సత్యాసత్యాల మాటెలా ఉన్నా, రాజు పట్ల తమ సానుభూతిని చూపిన టపాల్లో పద్మకళ రాసిన ఈ జాబు అత్యంత ఉద్వేగభరితమైంది.
రాజకీయాలు
- భారత రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర గురించి రాస్తున్నారు అమ్మ ఒడిలో
- పోలింగు బూతుల గురించి చెబుతున్నారు ఫణి మాధవ్
- ఏమారిన మనిషి గురించి రాసారు అబ్రకదబ్ర
కలగూరగంప
- కత్తి మహేష్ కుమార్‌ను ఇంటర్వ్యూ చేసారు వలబోజు జ్యోతి.
- ఎప్పుడో యాభై యేళ్ళ కిందట ఎన్.ఇన్నయ్య విశ్వనాథ సత్యనారాయణపై రాసిన విమర్శను దీప్తిధారలో ప్రచురించారు. సభ్యుల స్పందనతో ఆసక్తికరమైన చర్చ జరిగింది.
- విజయవాడ పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ప్రదర్శన గురించిన టపాలు:
- నిడదవోలు మాలతి చాతకపక్షులు అనే నవలను సీరియలిస్తున్నారు.
- హై. పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు నిర్వహణ పట్ల భవదీయుని విభిన్న స్వరం విన్నారా?
- సొంత డబ్బా కొంతమానుకు పక్కబ్లాగును చూడమంటున్నారు జయభారత్
- ఉగ్రవాదులు మావాళ్ళు కాదంటున్న పాకిస్తానుపై కన్నెర్ర జేసారు ఫణి ప్రసన్న కుమార్. వీరు కార్టూన్లు కూడా వేస్తూంటారు.
- ప్రభల తీర్థం గురించి రాసి, ఫణి చదువరుల జ్ఞాపకాలను తట్టిలేపారు.
- అంతరించిపోతున్న పిచ్చుకలకు తన ఆవేదనను వెలిబుచ్చారు బొల్లోజు బాబా
- కిక్ సినిమా చూసారా? లప్పంగిరిగిరి చూడండి, తెలుస్తుంది.
- కాలసర్పయోగం గురించి సత్య రాసారు
- బోర్న్‌విటాను తొందరపడి వాడొద్దంటున్నారు తెలుగబ్బాయి.
- “కందం రాసినవాడు కవేగాని అంతింతో కందపద్య మల్లగలవాడెల్లా ఎంతమాత్రమూ కవికాడు.” శ్రీశ్రీ, ఆరుద్రల సంవాదం చదవండి.
- లేటుగానైనా సంక్రాంతి పండగను లేటెస్టుగా చేసుకున్నారు అరిపిరాల సత్యప్రసాదు గారు
- శ్రీపతిశర్మ నవ్వు నాలుగు విధాలంటున్నారు.
- గరికపాటివారి అవధానం గురించి భైరవభట్ల కామేశ్వరరావు రాసారు.
- ఆమనిలో తెలుగెందుకు చదవాలి అనే జాబు రాసారు. వేరే బ్లాగులో వచ్చిన ఇంగ్లీషు జాబుకు ఇది స్పందన.
- డావించీ చేతిలో కాగితం, యూనివర్సిటీ ఒడిలో విద్యార్థి – ఈ పోలికను అసంఖ్య మాటల్లో చదివి, వీడియోలో చూడండి.
- శ్రీశ్రీ లేకున్ననేమి సిరిసిరిమువ్వా! అంటున్నారు రాఘవకిరణ్. మరి సిరిసిరిమువ్వ ఏమన్నదో తప్పకుండా కనుక్కోవలసిందే.
సినిమా
- రవిగారు మస్కా సమీక్ష రాసారు
- కాలాస్3 కూడా మస్కాను సమీక్షించారు
- స్లమ్‌డాగ్ మిలియనీర్ గురించిన సమీక్ష రేరాజ్ మాటల్లో చదవండి.
హాస్యం
- గిరీష్, లోపలి మనిషిల సంవాదం చదవండి.
- ఫణి ప్రసన్న కుమార్ గిరీశం ది గ్రేట్ కార్టూన్లు చూస్తున్నారా?
- నవ్వులాటే ఇది
జ్ఞాపకాలు
- మంచు కురిసినరాత్రి ఉమాశంకర్ అనుభవాలు చదివారా?
- తన ఊరెంత మారిందో నని వేదన చెందారు అస్థికలులో
- మా ఊరూ మారిపోయిందంటున్నారు లక్ష్మి
- రానారె పారిగోడ పడిపోయిన కత విన్నారా?
సాంకేతికం
- సమాచార సేకరణ ఎలా చెయ్యవచ్చో చెబుతున్నారు గార్లపాటి ప్రవీణ్
- ఆన్ లైన్ వీడియోలను fast forward చేయడం ఇలా!
కొత్త బ్లాగులు
- e-కలం పేరుతో కొత్త బ్లాగు వచ్చింది.
- తెవికీలోని మంచి వ్యాసాలను ఎంపిక చేసి క్లుప్తంగా ప్రచురిస్తున్నారు జీడిపప్పు బ్లాగులో
- సంగతులు చెబుతూ ప్రవేశించింది సంకీర్తన బ్లాగు
- నాలోనేను అంటూ శివ బ్లాగులోకంలోకి వచ్చారు
- “మంచి పుస్తకం” ప్రచురణ సంస్థవారు బ్లాగు మొదలుపెట్టారు.
- ఉల్లి లేని వంటలంటూ వంటల బ్లాగు వచ్చింది.
- ఓపెన్ జగత్‌ను కూడా ఈ నెల్లోనే తెరిచారు
- సాయినాథ్ బ్లాగులోకంలోకి ప్రవేశించారు
- ఈ నెల్లోనే నెమలి కన్ను తెరిచింది.
———-
-చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు
i am rushing to the unread posts now. thank you sir
“సత్యం కంప్యూటర్స్ సంస్థ ఒక మేడిపండని స్వయానా దాని సంస్థాపక చైర్మనే చెప్పాక యావజ్జాతి లాగానే తెలుగు బ్లాగరులూ ఆశ్చర్యపోయారు.”
ఫణి ప్రసన్న కుమార్ స్పందన (http://turupumukka.blogspot.com/2009/01/blog-post_08.html#comments)
సత్యము మా ధర్మమనుచు
అత్యుత్తమ సేవలోసగు ఆశ్రిత జనులన్
ఆ ద్యుతుడు రామలింగడు
భత్యములకె ఎసరు తెచ్చె, భాగ్యము మురళీ!
పద్యం బాగుం మురళీగారూ. చివరిపాదం అదిరింది.
నా రచనగురించి వచించినందుకు ధన్యవాదాలు. మీ జాబితా చూస్తే బ్లాగులలో వైవిధ్యం ప్రస్పుటమవుతోంది. వాదాలూ, వివాదాలకు స్పందిస్తూ మీరు చేసిన వ్యాఖ్య గమనార్హం. బ్లగరులందరూ సద్భావంతో తెలుగు సాహిత్యం అభివృద్ధికి తోడ్పడగలరు.