ఈసారి కొంచెం కష్టంగానే ఇచ్చాననుకున్నాను కాని చాలామంది బాగానే ప్రయత్నించారు. గడిని నింపి పంపించినవారు మొత్తం పన్నెండు మంది. అందరికీ అభినందనలు. -భైరవభట్ల కామేశ్వరరావు
- అన్నీ సరిగ్గా రాసి పంపినవారు: రాధిక (మహార్ణవం) గారు. వారికి ప్రత్యేక అభినందనలు.
- ఒకే ఒక తప్పుతో పంపినవారు: మనసులో మాట సుజాతగారు. ద్వాదశి వీరికి అచ్చిరాలేదు 🙂
- రెండు తప్పులతో పంపినవారు: నాగమురళిగారు, ఆదిత్యగారు.
- మూడు తప్పులతో పంపినవారు: జ్యోతిగారు.
- గడి నింపి పంపిన ఇతరులు: వెన్నెల, సుధారాణి పట్రాయని, కృష్ణుడు, కామేశ్, రాఘవ, పిచ్చోడు, కోడిహళ్ళి మురళీ మోహన్, శ్రీలు.
1ద్వా | ప | 2ర | యు | 3గం | 4క | రి | 5వే | 6పా | కు | ||
7బే | రం | ద | 8జా | వు | స | 9త | న | ||||
జా | 10 వ | యి | ర | 11నం | ద | 12కం | |||||
13రు | చి | ర | 14ము | 15తి | త్తు | 16లు | 17సం | కు | |||
వ | 18ద | 19వా | 20లా | 21మ | భ | ||||||
22కొ | 23ర | 24దా | ము | క | 25ల | క | ట్టు | ||||
త్త | 26రా | వా | ఆ | 27పీ | తాం | బ | ర | 28ము | |||
29బం | 30ధు | వు | లు | 31క | లి | తం | 32సం | దు | 33క | ||
34గా | ర | 35పు | ట్టు | క | క్ర | ల | |||||
రు | 36బె | త్తం | వ | 37శ | ద | మ | గ్ర | హం | |||
38లో | 39గు | ట్టు | 40మా | ర్గ | 41శి | రం | ణం | స | |||
42కం | డ | 43జ్వా | లా | ము | ఖి | 44శి | 45పూ | లు |
అడ్డం
======
1 కృష్ణుడు నల్లవాడే అయినా, విష్ణుమూర్తి పసుపుపచ్చగా ఉంటాడట ఈ కాలంలో! (3, 2) – ద్వాపర యుగం – ఒకో యుగంలో విష్ణుమూర్తికి ఒకో రంగు ఉంటుందట. ద్వాపరంలో విష్ణువు రంగు పసుపని అంటారు. కృష్ణావతారం ద్వాపరయుగంలోనే కదా.
4 ఏనుగు నమిలే తిక్తపత్రాన్ని అలా తీసిపారేయకండి! (5) – కరివేపాకు. తిక్త పత్రం అంటే చేదుగా ఉండే ఆకు. వేపాకు. ఏనుగు – కరి. కరివేపాకులా తీసిపారెయ్యడం అంటాం కదా.
7 అమ్మడానికైనా కొనడానికైనా ముందిది కుదరాలిగా (2) – బేరం
8 తిన్నగా ఉండాల్సిందే ఇలా అడ్డదిడ్డమైపోతే ఎలా? (3) – సజావు అటు ఇటు అయ్యింది.
9 ఎవరి శత్రువు ఎవరి కోపమో (2) – తన. “తన కోపమె తన శత్రువు” అన్న సుమతి పద్యం.
11 నందనానంద కారకం ఇదేనట (3) – నందకం. ఆన్నమయ్య సినిమాపాటలోనుంచి.
13 కాంతివంతమైన దీనికి మంచి అభిరుచి కూడా ఉందండోయ్! (3) – రుచిర అంటే కాంతివంతమైన అని అర్థం.
15 ఊపిరాడని లంగులు (3) – తిత్తులు. lungs తెలుగులో ఊపిరి తిత్తులు.
17 మదాన్ని వదిలిన జవ్వాజి (2) – సంకు. సంకుమదం అంటే జవ్వాజి
18 జరా మందివ్వమంటే అలా అడ్డంగా వాదన జేస్తావేం భాయ్ ? (2) – దవా. మందు హిందిలో దవా.
20 తలలేని తిలకం (2) – లామ. లలామ అంటే తిలకం. తల లేదంటే, మొదటి అక్షరం లేదు.
23 బద్దలు కొట్టేదే అలా బద్దలై చెల్లాచెదరై పోవడం దారుణం కదూ (4) – దారకము అంటే బద్దలు చేసేది అని అర్థం. అది చెల్లాచెదరయ్యింది.
26 మూడు భాషల్లో ముద్దుగా పిల్చినా, ఈ పనికిమాలినవాడు తిన్నగా రాడుకదా ! (3) – ఆవారా. హిందీలో ఆ, తమిళంలో వా, తెలుగులో రా అన్నవి పిలుపులు.
27 Crabs ఎప్పుడూ తెల్లబట్టలే కట్టుకుంటాయట ! (5) – పీతాంబరము అంటే తెల్లని వస్త్రం.
29 రాజేంద్ర ప్రసాద్ నెత్తినున్న తట్టలో వాళ్ళంతా మీ యింటికి వచ్చేస్తున్నారు జాగ్రత్త ! (4) – బంధువులు. రాజేంద్రప్రసాద్ బంధువులొస్తున్నారు జాగ్రత్త సినిమా పోస్టర్లో అతని నెత్తిపై తట్టలో బంధువులందరూ కూర్చుని ఉంటారు.
31 ఈ యుగాన్ని కూడుకున్నది (3) – కలితం. కలితం అంటే కూడుకున్నది అని అర్థం. ఇది కలియుగం కదా.
32 పాత ట్రంకుపెట్టె సందులోంచి చూస్తే ఎన్ని తెలంగాణ కవితలు కనిపిస్తాయో ! (3) – సందుక. తెలంగాణలో దీనర్థం పాత ట్రంకుపెట్టె. నారాయణస్వామిగారి ప్రఖ్యాత కవితా సంకలనం సందుక.
34 పళ్ళకి ఈ విశేషణం అంత “గా ర”హించదు (2) – గార. రహి అంటే అందము. గారపళ్ళు అందంగా ఉండవు కదా!
35 ప్రాణికి తెలియక్కరలేని ప్రాణ రహస్యం (3) – పుట్టుక. “ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా” అని సిరివెన్నెలలో పాట.
36 మాష్టారి హస్తభూషణం (2) – బెత్తం. ఇది అందరికీ అనుభవమే కదా ?
37 అల్లుడి దశ తిరిగిందోచ్ ! (3, 2) – శదమగ్రహం. “జామాతా దశమగ్రహ” అని సామెత. అల్లుణ్ణి దశమ గ్రహం అంటారు. అందులో దశ తిరిగి శద అయ్యింది.
38 పెద్ద రుమాళ్ళు దేవునికెందుకో, ఆ రహస్యం అతనికే తెలియాలి మరి ! (3) – లోగుట్టు. “లోగుట్టు పెరుమాళ్ళకెరుక” అని సామెత.
40 పోయిన్నెల తోవలో వెళుతూంటే ఒక తలకాయ తగిలింది తెలుసా ! (4) – గడి వచ్చే సమయానికి నడుస్తున్న నెల పుష్యం. దాని ముందు నెల మార్గశిరం.
42 తిండి కలిగిన చీమ (2) – కండ. తిండికలిగితె కండ కలదోయ్ అన్నారు కదా గురజాడ.
43 మొన్న మొన్ననే ఓ అగ్నిపర్వతం ఆరిపోయింది, మన రాష్ట్రంలో (4) – జ్వాలాముఖి. ఇటీవల మరణించిన ప్రముఖ కవి. జ్వాలాముఖి అంటే అగ్నిపర్వతమే కదా.
44 ఒకటిలో ఒకటి రెండులో రెండు వెరశి పన్నెండు (1) – ద్వాదశి అంటే పన్నెండు. ఒకటి నిలువులో మొదటి అక్షరం “ద్వా”. రెండు నిలువులో రెండో అక్షరం “ద”. ఈ అక్షరంతో కలిసి “ద్వాదశి” అవ్వాలి కాబట్టి, ఈ అక్షరం “శి”. “వెరసి” ని “వెరశి” అని ఇవ్వడం మరో క్లూ.
45 జారులని పూజారులుగా మార్చేవి! అదేం కాదు, నన్ను నువ్వు fool చేస్తున్నావు (2) – పూలు. జారులు, పూజారులు మధ్యనున్న తేడా “పూ”లే కదా.
నిలువు
=====.
1 వాయులీన స్వామి ఇంటి ముంగిలి తెరుచునే ఉన్నది (2) – ద్వారం. వెంకటస్వామి నాయుడు గారు ప్రముఖ వాయులీన విద్వాంసులు. వారి ఇంటిపేరు ద్వారం.
2 సగం విరిగిన పన్నుని చూస్తే ఎందుకంత సరద (2) – రద. రదనము అంటే పన్ను. సగం విరిగితే రద మిగిలింది.
3 గమ్ముని టీతో సరళంగా mix చేస్తే గం..మత్తుగానే ఉంటుంది (3) – గంజాయి. గం + చాయి = గంజాయి. “చా” సరళంగా మారి “జా” అయ్యింది.
4 సరిగా చేస్తే ఇది చేతికి బలాన్నిస్తుంది, ఒంటికి కూడా (4) – కసరత్తు. దీన్ని కొంచెం మారిస్తే కర సత్తు. కర – చెయ్యి. సత్తు బలం
5 తనంత వేగంగా కూలి ఇంకెవరిస్తారు ? (3) – వేతనం
6 అక్రమార్జన (4) – ఆర్జన అంటే సంపాదన. అది “అక్రమం” అంటే క్రమం తప్పి పానదసం అయ్యింది.
7 బేసిగ్గా సిగ్గు జారుకుంది. దానికంత హడలెందుకు? (3) – బేజారు అంటే హడలు.
10 ఇరువరముల ఎర్రని కవి (6) – వరవర రావు. ప్రముఖ విప్లవ కవి.
12 అజాతశత్రువు రహస్యంగా ఇంగ్లీషులో రమ్మంటున్నాడు (4) – “కం”కుభట్టు. అజ్ఞాతవాసంలో ధర్మరాజు పేరు.
14 సంతోషంతో ఆ నూనె పైకి చిమ్ముకొచ్చింది (4) – ఆముదము కిందనుంచి పైకి. ముదము అంటే సంతోషమే కదా.
16 యముని వీడిన దున్నపోతు (2) – లులాయము అంటే దున్నపోతు. అది “యము”ని వీడిపోతే మిగిలేది “లులా”.
19 వాన రాక తో ప్రవహించే ఏరు (2) – వాక అంటే ఏరు. “వా”నరా“క”లో ఉన్నది వాక.
21 మొసలి సూరీడుని మింగితే మీకెందుకా సంబరం? (3, 4) – మకర సంక్రమణం. సూర్యుడు మకర (అంటే మొసలి) రాశిలోకి ప్రవేశించే సమయం.
22 ఉత్త కంగారులో కొట్టిన బంతి చెల్లాచెదరైన చిత్రం భలేగా ఉంది! (2, 3, 2) – కొత్తబంగారులోకం. Perfect anagram కాకపోయినా, ఆ వాక్యంలో దాగున్న చిత్రం.
24 కోర్టున్నది వాదాలకే కాదు, వీటికోసం కూడా! (3) – దావాలు.
25 45 అడ్డంలోదే తంతాం అంటోంది (3) – 45 అడ్డంలోది పువ్వు. లతాంతం అన్నా పువ్వే.
27 చీమ మింగిన చిన్న గుడ్డ ముక్క (3) – పిపీలికం అంటే చీమ. అందులో ఉన్న చిన్న గుడ్డ ముక్క పీలిక.
28 ఇంత శిశిరంలోనూ ఈ ముసలోడికి సలి లేదేంటి సెప్మా! (2) – ముదుసలి అంటే ముసలోడు. “సలి” లేకపోతే మిగిలేదు “ముదు”.
30 మ“ధుర”ము మ“ధుర”ము ఈ బరువు! (2) – ధుర అంటే బరువు.
31 “క ఖ గ ఘ ఙ” కాదండీ, ఇదొక బట్టల బీరువా (5) – “క ఖ గ ఘ ఙ” ని కవర్గము అంటారు. కట్టు వర్గము అంటే బట్టల బీరువా.
33 ఈ మరాళములు ఎక్కడైనా కలవా? (2, 3) – కల హంసలు
36 పందెం కట్టడానికి అంత కష్టమా? (2) – బెట్టు అంటే ఇంగ్లీషులో పందెం. తెలుగులో కష్టం అని కూడా అర్థం.
37 శరీరంలో దిగబడిన బాణం (2) – శరం. “శ”రీ“రం” లో ఉన్నాది కదా.
39 42 అడ్డంలో ఉన్నవాటి తిండి ఇదే! (2) – గుడ అంటే బెల్లం. చీమలు బెల్లాన్ని తింటాయి కదా.
40 బాలి వెళితే దొరికే విష్ణు హారమా? (2) – మాలా. వైజయంతి మాలా బాలి ఒకనాటి అందాల తార. విష్ణువు ధరించే హారం వైజయంతి మాల
41 మండే నెమలి (2) – శిఖి. శిఖి అంటే అగ్ని, నెమలి అని రెండర్థాలు.
> 23 బద్దలు కొట్టేదే అలా బద్దలై చెల్లాచెదరై పోవడం దారుణం కదూ (4) – దారకము అంటే బద్దలు చేసేది అని అర్థం. అది చెల్లాచెదరయ్యింది.
23 అడ్డానికి నేను ముగ్దరు అన్న పదం తీసుకుని ముగుదార అని రాశాను. బ్రౌణ్యంలో చూస్తే –
ముగ్దరు (p. 1003) [ mugdaru ] mugdaru. [H.] n. An Indian club used by wrestlers.
ముగ్దరు అన్న పదం సరైనదని అనుకోడానికి కారణం -‘19 వాన రాక తో ప్రవహించే ఏరు (2) – వాక అంటే ఏరు. “వా”నరా“క”లో ఉన్నది వాక’ ని ‘వాగు’ గా పొరపడ్డం.
మొత్తానికి గడి బాగుంది. అయితే నా అభిప్రాయం ఏమిటంటే, గడి ఇచ్చేటప్పుడు తేలికైన పదాల్ని ‘చెల్లాచెదరు’ చేస్తే బాగానే ఉంటుంది కానీ, కష్టమైన పదాల్ని చెల్లాచెదరు చేస్తే కష్టమే మరి.
పీతాంబరం అంటే పచ్చటి బట్ట కాదూ?
నేను కూడా గడినింపి పంపానే కానీ గడినింపి పంపిన వారులో నా పేరు లేదేమిటి? 😕
ఈసారి నావి 6 తప్పులున్నట్టున్నాయి 🙁
అర్రె, ద్వాదశి నేను తప్పుగా రాయడమే కాక, ధీమాగా మురళీ మోహన్ గారికి కూడా తప్పు స్లిప్పు ఇచ్చాను. !క్షమించాలండి మురళీ మోహన్ గారు!
గడి పంపాక కూడా దారకము అనే మాటకు అర్థం తెలీలేదు.(శబ్దరత్నాకరంలో లేదు). వాన రాక అన్నారు కదా అని వాక అని రాశాను. ఈ రకంగా గళ్ళు వాటంతట అవి పూర్తి కాగా పుట్టిందే ఈ దారకము. రాధిక గారు రెండో సారీ జాక్ పాట్ కొట్టారు.
నాగమురళిగారు,
మీరన్నది “ముద్గరము” అనుకుంటా. మీరిచ్చిన సూచన ముందుముందు దృష్టిలో ఉంచుకుంటాను.
కొత్తపాళిగారు,
నిజమే! మీరు చెప్పేదాకా ఆ పొరపాటుని గమనించే లేదు. “ఇచ్చిన జవాబు రైటే, అడిగిన ప్రశ్నే తప్పు” అన్నదానికి ఇది మంచి ఉదాహరణ 🙂
శ్రీలుగారు,
అవునండి. పంపినందుకు మీకూ అభినందనలు. ఈసారి గడి సులువుగా ఉన్నట్టుంది మొత్తం పూర్తి చెయ్యగలరేమో చూడండి!
నాగమురళి గారూ!
నేనూ, “ముద్గరము , వాగు” వ్రాయాలో, “దాకరము, వాక” వ్రాయాలో అర్ధం కాక చివరి రోజు వరకు పంపించలేదు.
“బద్దలై” చెల్లాచెదరయిందన్నారు కాబట్టీ, “బద్దలు కొట్టేది” అన్నారు కాబట్టి ముద్గరమే క్లూ కి దగ్గరగా వుందనిపించింది.
కానీ, కామేశ్వరరావుగారి స్టైల్ ప్రకారం “వాగు” కి వానరాక అనరనీ , “వాక” కే వానరాక అంటారనీ వూహించి చివరికి వాక గా నింపాను.
కామేశ్వరరావు గారూ!
2 నిలువు సమాధానం అచ్చు తప్పు అనుకుంటా. రద బదులు రమ్య అని కనిపిస్తోంది.
ఔనండీ రాధిక గారూ,
కామేశ్వరరావు గారు పొద్దుకు పంపిన గడి మొదటి కూర్పులో రమ్య అనే ఇచ్చారు. తర్వాత దాన్ని రదగా మార్చాం. కానీ సమాధానాల్లో మార్చడం మర్చిపోయాం. ఇప్పుడు సరిచేశాం. చూపినందుకు నెనర్లు.