-చదువరి
తెలుగు బ్లాగుల్లో తెలుగులోనే రాయమంటున్నారు అబ్రకదబ్ర. “తెలుగు బ్లాగుల్లో రాసేటప్పుడు – అది టపాయైనా, వ్యాఖ్యైనా – వీలైనంత ఎక్కువగా తెలుగులో రాయటానికి ప్రయత్నిస్తే బాగుంటుంది.” -అవును, బావుంటుంది!
ప్రతీ సంవత్సరం డిసెంబరు రెండో ఆదివారం తెలుగు బ్లాగు దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు 2008 బ్లాగు దినోత్సవం డిసెంబరు 14న జరిగింది. ఈ సందర్భంగా బ్లాగరులు సమావేశాలు జరిపారు.
ఈ నెల్లోనే 23వ హైదరాబాదు పుస్తక ప్రదర్శన జరిగింది. అక్కడ e-తెలుగు కూడా స్టాలు పెట్టి సందడి చేసింది. తెలుగు బ్లాగరులు ఈ స్టాలులో స్వచ్ఛంద సేవలందించారు. అక్కడి విశేషాలను తమ తమ బ్లాగుల్లో పంచుకున్నారు. ఆ వివరాలు:
- నల్లమోతు శ్రీధర్ ఏరోజు కారోజు అక్కడి విశేషాలను తన బ్లాగులో అక్షరబద్ధం చేసారు.
- ఆశించినంత స్పందన లేదన్నారు రవిగారు.
- దాట్ల శ్రీనివాసరాజు తన నివేదిక రాసారు.
- వలబోజు జ్యోతి భలే మంచి రోజూ అంటూ రాసారు
- సుజాత ఫోటోలు ప్రచురించారు
- రమణి ఇదో e-కుటుంబం అన్నారు
- వేద కూడా ఫోటోలు ప్రచురించారు
- పర్ణశాల నుండి e-తెలుగు స్టాలుకొస్తే ఏంజరిగిందో కత్తి మహేష్ కుమార్ రాసారు
- బ్లాగ్బంధువుల గురించి రాసారు సురుచిలో
- విరజాజి బ్లాగ్మిత్రుల పరిచయాలను నెమరువేసుకున్నారు
- స్టాలుకు వెళ్ళలేనివారు కలలు కన్నారు.
ఓరుగల్లు యాసిడు దాడి: ఓరుగల్లులో తోటి విద్యార్థినిపై యాసిడ్ పోసి గాయపరచిన సంఘటన, ఆ తరవాత నిందితులు ఎన్‌కౌంటరులో హతులైన సంఘటనలపై బ్లాగరులు విశేషంగా స్పందించారు. బ్లాగరుల, వ్యాఖ్యాతల స్పందనలు చాలా వైవిధ్యంగా ఉన్నాయి. ఎన్‌కౌంటరు పట్ల సంతోషించినవారు, ఆడపిల్లల తప్పేమైనా ఉందేమో ఆలోచించాలన్నవారు, ఎన్‌కౌంటరు తప్పేమోగానీ, వాళ్ళకది తగిన శిక్షేనని అన్నవారు, ఈ తప్పుకు తల్లిదండ్రులదే బాధ్యత అన్నవారు, అసలు తప్పు మాధ్యమాలది అన్నవారు, .. ఇలా అనేక రకాలైన స్పందనలొచ్చాయి. కొన్నిటిని చూడండి.
- ఒకరి చావును విని సంతోషించడం మంచి పని కాకున్నా, వీళ్ళ ఎన్‌కౌంటరు మరణంతో సంతోషంగానే ఉన్నది అన్నారు నాగన్న
- మహదానందంగా ఉంది అన్నారు ఆంధ్రామృతంలో రామకృష్ణారావు
- సమస్యకు ఇదే పరిష్కారమా? ఇదే అంతిమ తీర్పా? అని అడుగుతున్నారు సిరిసిరిమువ్వ
- “ఒక సారి కాకపోతే ఒక సారైనా ఆడపిల్లల పాత్ర ఉంటుందా ఉండదా అని ప్రశ్నించుకోవాలని అనుకుంటున్నాను” అన్నారు మనసులో మాట సుజాత.
- యాసిడ్ పోయటం ఘోరమే! కాని ఎన్ కౌంటర్ చేయడమేంటి! అని ప్రశ్నిస్తున్నారు వెన్నెలరాజ్యంలో
- న్యాయమంటే ఇదేనా అని అడుగుతున్నారు స్నేహ
- పోలీసులకి కూడా కోర్టులపై నమ్మకం పోయిందేమోనన్నారు ఆరాధనలో
- బ్లాగరుల స్పందనను ప్రస్తావిస్తూ బ్లాగులు దారితప్పుతున్నాయా అని అడుగుతున్నారు ప్రదీప్
- ఇంట్లో ఎలుకలు దూరితే ఇంటికి నిప్పెట్టుకుంటామా అని అడుగుతున్నారు నరసింహారావు
- నాగమురళి పోలీసు న్యాయంలో మరో కోణాన్ని చూసారు.
- అసలు నేరస్తులు మాధ్యమాలంటున్నారు చదువరి
- ఇవి మీడియా చేయించిన హత్యలంటున్నారు తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
- పోలీసులు చేసిన ఈ పనికి అభినందనలా అని ప్రశ్నిస్తున్నారు ప్రవీణ్
- మనిషిలా ఆలోచించమంటున్నారు దాట్ల శ్రీనివాసరాజు
యాసిడ్ దాడి తరువాత, ఎన్‌కౌంటరుకు ముందూ వచ్చిన జాబులు
- యాసిడు పోసిన ఘటనపై ఆవేదన వెలిబుచ్చారు నేను? లో. ఇది ఈ నెలే కొత్తగా రంగ ప్రవేశం చేసిన బ్లాగు.
- “ఎవరైనా దాడి చెయ్యాలంటే ముందు శిక్ష గుర్తుకు రావాలి…అంత కఠినంగా వుండాలి చట్టాలు” అని అన్నారు సన్నజాజి.
- వరంగల్ విషాదం- ఏం నేర్చుకుంటోంది మన యువత అంటున్నారు ఆలోచనలో
- అందం శాపమా ? లేక అమ్మాయా!!! ఏది? అని అడుగుతున్నారు భవదీయుడు
రాజకీయాలు
- మేధావుల గురించి మేధోమథనం చదవండి వికటకవి బ్లాగులో
- పవన్‌కల్యాణ్ ఇరగదీసారంటున్నారు ఎ2జెడ్ కలల్లో. ఇది ఈ నెలలో కొత్తగా ప్రవేశించిన బ్లాగు
- ఆవేశం సరే.., ఆలోచన సంగతేంటంటున్నారు శుద్ధాంధ్రలో
- తనకోపమె తన శత్రువంటున్నారు చాకిరేవులో
హాస్యం, వ్యంగ్యం
- జంబలకిడిపంబ వారి వార్తలు వినండి
- “Infy నారాయణ మూర్తి గా అవుదామని సాఫ్ట్ వేర్ లోకి వచ్చి “ఒరెయ్..నారిగా” గ మారిన ఒక యువకుడి క(వ్య)ధ” చదవండి
- రన్నింగ్ బస్సు ఎక్కరబాబూ మంచి చెణుకులతో అలరించింది.
- బట్టతల.. ముగిసింది
- ఓ విప్లవకారుని కథ తెలుసుకున్నారా?
సినిమా
- కొత్తపాళీ ఈమధ్య చూసిన సినిమాల కథా కమామిషూ చదవండి.
- నేనింతే సినిమాను సమీక్షించారు కాలాస్3
- ప్రవీణ్ గార్లపాటి చూడదగ్గ సినిమా గురించి రాసారు
- కింగ్ సమీక్ష రాసారు కన్నగాడు
స్వగతాలు స్వ గతాలు
- నాన్న నేర్పిన పాఠాలను గుర్తు చేసుకున్నారు వేణూ శ్రీకాంత్
- శీర్షిక పెట్టాలని లేదు శీర్షికతో వచ్చిన ఈ కవితా స్వగతం చూడండి.
- పుట్టినరోజు నాడు పాత సంగతులను నెమరువేసుకున్నారు డా.ఇస్మాయిల్
- ఎలుక కరిచిన భాగోతం విన్నారా?
ఇంద్ర ధనుస్సు
- ఆధునిక కణికుల, అందునా నకిలీ కణికుల, నీతి గురించి అమ్మవొడిలో వ్యాసాలు చదువుకున్నారా?
- చీర గురించిన ఈ టపా చూసారా?
- కూర్గు విహారయాత్ర చేసొచ్చిన మేధ చదువరులనూ యాత్రకు పంపించారు
- ప్రజాచైతన్యానికి నమూనా అనదగ్గ విషయాన్ని రాసారు రానారె
- పదికోట్ల మంది నిరుద్యోగులతో సైన్యాన్ని ఏర్పాటు చెయ్యాలంటున్నారు ఇండియన్ పొలిటికల్ క్లోజప్‌లో. ఈ బ్లాగు ఈనెలలోనే ప్రవేశించింది.
- బైకాలజీ చదివారా?
- నిడదవోలు మాలతి రచయితలకు తగిన గౌరవం ఇవ్వని సంపాదకులకు చురకలంటిస్తే వ్యాఖ్యాతలు కూడా తమ వంతు పోట్లు పొడిచారు. సంపాదకుల సమర్థకులూ కొందరున్నారు వ్యాఖ్యాతల్లో.
- రేడియో జాకీ జీవితానికి తన బ్లాగును ట్యూను చేసారు పూర్ణిమ
- భారతీయత, దేశభక్తి లాంటివి కొందరిలో పేరుకే ఉంటాయంటున్నారు అబ్రకదబ్ర
- పుస్తక ప్రదర్శనలో తన పుస్తకాల అమ్మకాల అనుభవాన్ని సీరియలించారు కస్తూరి మురళీకృష్ణ
- తేలికభాషలో తత్వశాస్త్రాన్ని వివరిస్తున్నారు, సరస్వతీకుమార్
- ఓ యువ విద్యార్థి, బ్లాగరి విషాదాంతం గురించి రాసారు దార్ల
కొత్త బ్లాగులు
- జాజిపూలు
- శ్రీ-పదములకు ఈ నెల్లోనే శ్రీకారం చుట్టారు.
- హిమకుసుమాలు కూడా ఈ నెల్లోనే పూచాయి
- శ్రీపద్మకస్తూరి బ్లాగు కూడా మొదలైంది.
- నరేష్ కార్టూన్లు కూడా డిసెంబరులోనే మొదలయ్యాయి.
ఈనెల జాబు
కారుచీకట్లు కమ్ముకుంటున్న ఆర్థిక పరిస్థితిలో దేవన హరిప్రసాదరెడ్డి దివిటీ పట్టి దారి చూపిస్తున్నారు. వ్యవసాయం ఫర్ డమ్మీస్ అనే పుస్తకం రాసారు. ఎన్నో విలువైన సలహాలతో కూడిన ఈ జాబు చదివి మీ పంట పండించుకునే అవకాశాన్ని జారవిడుచుకోకండి.
“దేవన” లో వచ్చిన ఈ ఆహ్లాదకరమైన టపా మా ఈనెల జాబు
చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు
దేవన గారి టపా ఈనెల జాబుకు ఖచ్చితంగా అర్హమైనది.
eTelugu పనుల్లో ఉంటూనూ, మంచి సమీక్ష రాసారు.
eTelugu నిర్వాహకులు, పాల్గొన్న వారందరికీ ఈ సందర్భంగా అభినందనలు.
ఔరా!
మమ్ములను మరచిపోయితిరి.పొద్దు పొడిచేవేళకు మేమక్కడ లేమా?
నా కలను గుర్తించారు .ధన్యవాదములు
well deserved recognition for Devana. Appropriate that his “letter to God” was published in an AP daily too. (Sorry Abracadabra :))
శ్రీపద్మ కస్తూరి బ్లాగులో టపాలేవీ ఇంకా ప్రచురించలేదు. ఇలాంటి వాటిగురించిన ప్రస్తావన అనవసరమేమో! వర్గాల వారీగా బ్లాగు సమీక్షల విభజనలో కొత్త వర్గంగా పుస్తకాలు చేర్చటం అభిలషణీయం. పుస్తకం హస్తభూషణం అన్నారు కదా.
2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం – సమీక్ష ఉపయోగకరంగా ఉంది.
శ్రీపద్మ కస్తూరి బ్లాగు కస్తూరి మురళీ కృష్ణ గారి సతీమణి గారి బ్లాగని తెలిసి వెళ్ళి చూస్తే ఇంకా వారు రాతలు ఇంకా మొదలెట్టినట్టు లేదు. వేచి చూద్దాం!
సమీక్ష బావుందండీ.
ఈ-తెలుగు స్టాలుతో బిజీగా ఉండి కూడా డిసెంబర్ బ్లాగుల ప్రస్థానం అందించినందుకు మీకు ధన్యవాదాలు.
డిసెంబర్ లో అశ్విన్ బూదరాజు , మురళీగానం బ్లాగుల్లో మంచి హాస్యపు టపాలొచ్చాయి, అవికూడ చేరిస్తే బావుండేది.
Naa blog “Manchupoolu ” kuda Dec lo open ayindi..
Ram
బావుంది. అందరికీ హాట్స్ ఆఫ్ !
కానీ – వా వా వా ! ! ! (వాహ్ వాహ్ కాదు) అయాం కుళ్ళింగ్ ! నా గడ్డిపూలు వాడిపోయాయి !
పొద్దు లో 2008 డిసెంబరులో తెలుగు బ్లాగుల ప్రస్థానం లో నా బ్లాగు లో నే రాసుకున్న “శీర్షిక పెట్టాలని లేదు” టపాకు స్థానం కల్పించిన చదువరి గారికీ, పొద్దు సంపాదకీయానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు.
ధన్యవాదములు.:)
హృద్యమగు విషయములపై
పద్యంబులు,గేయములును,వచన కవిత్వా
లుద్యమమటు నల్లుచు నై
వేద్యముగ తెలుగు ప్రజకిడ వెలసెను నా “బ్లాగ్”!
నవంబర్2008లో Dr.Acharya Phaneendra పేర ప్రారంభించిన నా బ్లాగును కూడా దర్శించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర
మీరిక్కడ సూచించిన Blogలు కొన్ని గొప్యాలు (అంటే private blogs). అటువంటి blogలు సార్వజనీనాలుగా ప్రకటిస్తూ వాటిని సమీక్షించడంలో సంపాదకుల భావం, …?
ఉదాహరణాలు:
http://vanitavanivedika.blogspot.com/
http://manalomanamaata.blogspot.com/
– తాడేపల్లి హరికృష్ణ
తాడేపల్లి హరికృష్ణ: సంపాదకుల భావం.. ఈ వ్యాసం ప్రచురించేనాటికి అవి గోప్యాలు కాదు.
antarjaalam loo telugu patrika okati vundi ani ee roose naaku telisindi. nijangaa chaalaa santhoosham vesindi. etelugu vaariki kruthajnathalu.