ఫిబ్రవరి గడిపై మీమాట

2009 ఫిబ్రవరి గడిపై మీ అభిప్రాయం ఇక్కడ రాయండి

పాత గడులు

———————————-

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

11 Responses to ఫిబ్రవరి గడిపై మీమాట

  1. భలే భలే. ఈ సారి మరీ అంత కష్టంగా లేదు అని చెప్పేట్టుగా లేకుండా 6 అడ్డం, నిలువులతో భలే చమత్కారం చూపించేసారండీ. అది పూరించేసరికి తలప్రాణం తోకకొచ్చింది. రెండు మిగిలాయి ప్రస్తుతానికి. వాటి పని పట్టాలి.

  2. రాఘవ says:

    నాకు నలభై మిగిలింది!

  3. రాఘవ, నలభై క్లూ — అదే పేరుతో ఇటీవలి పౌరాణిక సినిమాల రచయిత ఒకాయన మన తెలుగులో మసలుతున్నాడు. ఇకపోతే, ముప్పై తొమ్మిది అడ్డంలో ఇరుక్కున్నా నేను 🙁

  4. సవరణ — అదే పేరు కాదు కానీ…దాదాపుగా అలాంటి పేరే

  5. రాఘవ says:

    శ్యామశాస్త్రుల్లవారి సరోజదళనేత్రి వినలేదా మీరు? పైగా త్యాగరాజులవారి కృష్ణుడు నీలమేఘశ్యాముడు ఒకడే కదండీ! 😉

  6. @ రాఘవ, అయ్యో ఆ మహానుభావుణ్ణి ఎరక్కపోవటమేమిటి. నిజానికి అదే నాకు తట్టిన మొదటి పేరు. కానీ సోదరి లేకపోతే…. అన్నది నన్ను మరోసారి ఆలోచింపచేసింది. అంకితముద్ర వరకూ వెళ్ళి కూడా ఆగిపోయా. అప్పటికీ సోదరి విషయం అర్ధంకాలా. మీరు చెప్పాక మరికాస్త లోతుకెళ్ళి చూస్తే తెలిసింది. ధన్యవాదాలు. పొద్దువారికి పంపుతున్నానోచ్…

  7. Ramana says:

    I don’t know how to type in telugu script. I am trying but not able to write desired letter. Can some one guide me please?

    Sorry for my english script. Let me learn how to type telugu script, next time I get back ti the site in telugu.

    Thank You

  8. రమణ గారూ,
    మీరు Firefox వాడుతున్నట్లైతే గడిలో మీరు రాసేవి నేరుగా తెలుగులోనే కనిపిస్తాయి. మీరు వేరే బ్రౌజర్ వాడుతున్నా లేక మీ ఇతర అవసరాల కోసం తెలుగులో టైపించాలనుకున్నా లేఖినితో మొదలుపెట్టవచ్చు.

  9. గడి నింపి పంపాక, 38 నిలువు నేను నింపింది ఒకటైతే, తిరుగు మెయిల్లో వచ్చిన సమాధానం ఇంకోలా ఉంది. పొరపాటున వేరే గడులు చూస్తున్నట్టున్నారు. చూసి సవరించగలరు.

  10. నిలువులు మూడు రావడంలేదు. ఎవరైనా కొంచం క్లూ ఇవ్వండి ప్లీస్.
    అవి: ౧,౨౭,౪౦. వజ పోస్తే వసపిట్ట లాగ వాగు తారంట కాని వజ గడులలో కుదరడం లేదు.

  11. భాస్కర్ గారు,
    ౧ నిలువుకి ,లక్ష్మణుడు ఎంతటి వాడైన తన తల్లికి కొడుకే కదా!!. అదే పేరుతో ఒక హింది కవి కూడా ఉన్నాడు.
    ౨౭, వజ అనేది వికృతి అయ్యివుంటది, అలాంటి పదం నేనెప్పుడు వినలేదు. వసపిట్ట లాగా వాగడానికి దానిలో ఉన్నదే
    పొయ్యాలండి.
    ౪౦, తలదండం(కన్నడ అనువాదం) అనే నవలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిందండి. ఇంతకంటే పెద్ద క్లూ ఇవ్వలేను 🙂

Comments are closed.