-చదువరి
ముంబైలో ఉగ్రవాదులు జరిపిన పాశవికమైన మారణకాండపై బ్లాగరులు చాలా విస్తృతంగా స్పందించారు. ఈ మధ్య కాలంలో ఇంత ఎక్కువగా బ్లాగరులు స్పందించిన అంశం మరొకటి లేదేమో! ఈ సంఘటన ప్రజల్లో కలిగించిన కలవరపు తీవ్రతను, దీనిపై స్పందిస్తూ వచ్చిన టపాల సంఖ్య తెలుపుతోంది. కొన్ని బ్లాగుల్లో ఒకటి కంటే ఎక్కువ స్పందనలు కూడా వచ్చాయి.
- దారుణం, సిగ్గుచేటు అన్నారు సన్నజాజి
- కొత్తపాళీ మనం ఎప్పటికి నేర్చుకుంటాం అని ఆవేదన వెలిబుచ్చారు
- లక్ష్మి మళ్ళీ క్షమించేద్దామా అంటున్నారు.
- కళ్ళముందు కటిక నిజం అన్నారు నాలోనేను
- మన ముంబై కోసం అని కవిత రాసారు, శ్రీఅరుణం
- ఉగ్రవాదులకు మన ప్రభుత్వాల మీద ఎంత నమ్మకం అని నిట్టూర్చారు తెలుగోడు
- ఏమిటీ వైపరీత్యం అన్నారు మధురవాణి
- పదమ్ములు కూడా ఈ ఘటనను నిరసించారు. ఈ నెల మొదలైన కొత్త బ్లాగుల్లో ఇదొకటి.
- నువ్వేదిక్కని భగవంతుడిని ప్రార్థించారు, జ్యోతి
- మన కర్తవ్యం ఇదీ అని ఉద్బోధించారు శ్రీదీపికలో
- మృత్యుక్రీడ అని సిరిసిరిమువ్వ అన్నారు
- దాడిని ఎదుర్కొని ప్రాణాలు కోల్పోయిన వీరుడికి అశ్రునివాళి అర్పించారు బొల్లోజు బాబా
- పాపం పోలీసులు అంటూ కొవ్వలి సత్యసాయి రాసారు.
- ఎన్ని వెన్నుపోట్లు, ఎన్ని కత్తిగాట్లు అని విశాఖతీరం నుండి ప్రశ్నిస్తున్నారు.
- దైవానిక ఆక్రోశం వెలిబుచ్చారు
- టెర్రరిస్టులకు విజ్ఞప్తి చేసారు బుజ్జి
- దిగులుగా ఉందన్నారు చదువరి
- పురుషోత్తమరెడ్డి తన మదిలో సంగతులను పంచుకున్నారు.
- పౌరుషం లేని పాలకులు అంటున్నారు కోవెల సంతోష్ కుమార్
- గార్లపాటి ప్రవీణ్ఎన్నాళ్ళిలా అని ప్రశ్నిస్తున్నారు
- విహారి ఈ దుశ్చర్యను ఖండించాలా అని అడుగుతున్నారు.
- ఈ దురంతంపై ఆత్రేయ రాసిన కవిత చదవండి
- లీలామోహనంలో అశ్రునివాళి ప్రకటించారు
- రమణి తన మనసులోని మాట చెబుతున్నారు
- దిగులు, భయం కాదు.. కోపం రావాలంటున్నారు, పర్ణశాల మహేష్
- ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులు ఎల్లుండికి గుర్తుంటారా అని అడుగుతున్నారు, రవిగారు
- సిగ్గులేని ప్రభుత్వాలు అని అన్నారు అంతర్యానంలో
- భరతమాతసేవలో మృత్యువును ముద్దుపెట్టుకున్న కర్మవీరులకు నివాళి అర్పించారు దుర్గేశ్వర
- ఏకచక్రపురం, బకాసురుడు – సామ్యాన్ని సూచించారు కొత్తబంగారులోకంలో
- యథాప్రజా తథారాజా అంటున్నారు రానారె
- పోరాటం ముగిసింది, ఇక పోరాడాల్సింది కుళ్ళు రాజకీయనాయకులతో అంటున్నారు పెదరాయ్డు
- ఉగ్రవాదులు నిమ్న హృదాంతర రక్తదాహ పైశాచిక వీచికల్ అన్నారు జిగురు సత్యనారాయణ తన ఉత్పలమాలలో
- ముంబై ఘాతుకంలో మన పాత్ర ఎంత అని తర్కిస్తున్నారు, నా అనుభవాలు న్లాగులో. ఈ బ్లాగు ముంబై ఘటన తరవాతే కొత్తగా వెలిసింది.
- పిరికివాళ్ళెవరు, ఉగ్రవాదులా ప్రభుత్వాలా అని అడుగుతున్నారు, శ్రీకాంత్. ఈ బ్లాగు కూడా నవంబరులోనే జన్మించింది.
- మన స్నేహం బ్లాగులో శృతి ప్రతిస్పందన చూడండి. ఇది కూడా నవంబరులో పూచిన పువ్వే
- ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలర్పించిన యోధులకు నివాళి అర్పించారు ఇస్మాయిల్
- సురుచి అమరవీరులకు నివాళి అర్పించింది.
- మతం మానవత్వాన్ని కోరుకుంటుంది, మానవ రక్తాన్ని కాదు అంటున్నారు ఫన్‌కౌంటర్లో
- ఈ దాడుల నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాతలకు వాతలు పెట్టారు గడ్డిపూలు సుజాత
- మీరూ ఓ కమాండో కండి అంటున్నారు మగవాడు
ఒక బ్లాగులోని జాబులను విమర్శిస్తూ మరో బ్లాగు రూపుదిద్దుకోవడం గతంలో జరిగాయి. ఓ సందర్భంలో అది పూర్తి వ్యక్తిగత దాడి. నాలుగైదు టపాల తరువాత, ఆ బ్లాగు మూతబడలేదుగానీ, ఆగిపోయింది. మరో సందర్భంలో అసలూ కొసరూ -రెండు బ్లాగులు కూడా మూతబడ్డాయి. ఈ నెల మూడో సంఘటన జరిగింది. పర్ణశాల వంటి చురుకైన బ్లాగులో వచ్చే టపాలకు నిరసనగా ఆ శైలిని అనుకరిస్తూ, ఆ టపాలకు పేరడీగా పానశాల అనే బ్లాగు ఉద్భవించింది. బ్లాగరి పేరును, బ్లాగు రూపురేఖలనూ కూడా అనుకరిస్తూ వచ్చిన పానశాల, బ్లాగులోకంలో సంచలనం సృష్టించడమే కాక, కొందరు బ్లాగరుల అభిమానానికి కూడా పాత్రమైంది. తీవ్రమైన చర్చలూ జరిగాయి. లైంగికతపై పర్ణశాలలో వచ్చిన జాబుకు ప్రతిగా పానశాలలో వచ్చిన జాబుతో ఈ విమర్శలు మొదలయ్యాయి. విమర్శ వ్యక్తిగత దాడిగా పరిణమించడంతో పానశాల బ్లాగరుల విమర్శలు ఎదుర్కొంది. బ్లాగు గుంపులో కూడా చర్చ జరిగింది. చివరికి పానశాలలో పర్ణశాలపై విమర్శలను ఆపడంతో విమర్శల సద్దు మణిగింది.
సాక్షి పత్రికలో సుమన్ ఇచ్చిన ఇంటర్వ్యూ పట్ల బ్లాగరులు బాగా స్పందించారు. గతంలో సుమన్ పట్ల బ్లాగరులకు ఎగతాళి ఉండేది; నవ్వులాటగా మాట్టాడేవాళ్ళు. ఈసారి మాత్రం విమర్శలు సీరియస్సుగా, పదునుగా ఉన్నాయి. కొన్ని జాబులను చూడండి:
- సుమనూ, నీకిది తగునా అంటూ లలిత స్పందించారు.
- సాక్షి డబుల్ ధమాకా అంటూ తిరుపతి ఈస్టు రైల్వేస్టేషన్లో చెప్పారు.
- జిందాబాద్ రామోజీ అంటూ అజయ్ రాసారు.
- ఛీ ఛీ సాక్షి అంటూ శీర్షిక తోటే సరిపెట్టారు తెలుగోడు.
- ఎవరికి లాభం అని అడిగారు గుంపులో గోవిందం. ఈ బ్లాగు ఈ నెలలోనే కొత్తగా ప్రవేశీంచింది.
- జసుగమన్ రామాయణం అంటూ మగవాడు రాసారు.
- సాక్షి రామాయణం అంటూ ఏడుకొండలు రాసారు.
- సుమనోహరాలు అంటూ బుజ్జి రాసారు.
- బళ్ళ సుధీర్ చౌదరి సాక్షి అనే జాబు రాసారు.
- అసలేం జరుగుతోంది ఆరెఫ్సీలో అంటూ యడ్ల ఆదిలక్ష్మి రాసారు. ఈ బ్లాగు ఈ నెలే కొత్తగా రంగ ప్రవేశం చేసింది.
బ్లాగుల్లో రాతలే కాకుండా గీతలు కూడా కనిపిస్తూ బ్లాగులకు వైవిధ్యాన్ని అద్దుతున్నాయి. అలాంటి బ్లాగులు రెండు:
- ఓదెల వెంకటేశ్వర్లు వెంకటూన్స్ పేరుతోఈ కార్టూన్లు ప్రచురిస్తున్నారు. వీరు టీవీ9లోని వికటకవి కార్యక్రమ కర్తల్లో ఒకరు.
- ప్రసిద్ధ కార్టూనిస్టు భగవాన్ కూడా భగవాన్ కార్టూన్స్ పేరిట బ్లాగు వెలయిస్తున్నారు. కార్టూను వేసి చదువరుల నుండి వ్యాఖ్యలను ఆహ్వానించడం వీరి ప్రత్యేకత.
స్వగతాలు, స్వ గతాలు
- మాటే మంత్రం అంటూ తనకెదురైన ఓ సంఘటనకు సంబంధించి తన మనోభావాలను పంచుకున్నారు రమణి.
- తన బాల్యం గురించి చెబుతున్నారు వేద.
- పచ్చదనం, తొలికిరణాల వెచ్చదనం, ఏడురంగుల హరివిల్లు, ఉదయపు హాయైన ప్రశాంతత ఇవన్నీ నాతో ఉంటే నేను ఒంటరిగా నడవడమేంటి అంటున్నారు సత్యవతి.
సినిమా
- ఎవరికోసమీ సినిమా టిక్కెట్టు ధరల పెంపు అంటూ నిరంజన్ పులిపాటి రాసారు.
- సినిమా సమీక్షల్లో కాలాస్‌త్రిది విలక్షణ వైఖరి. ఆవకాయ్ బిర్యానీ రుచెలా ఉందో చెబుతున్నారు, చూడండి.
హాస్యం, వ్యంగ్యం
- ఆ రాత్రి ఏం జరిగిందంటే అంటూ చేగోడీల్లో వచ్చిన ఈ బీభత్స, భయానక కథనాన్ని చదివారా?
- పాపులర్ బ్లాగులు రాయడమెలాగో తెలుసా మీకు?
- శ్రీకాంత్ రోజుకోజోకు కార్యక్రమంలో వచ్చిన జోకొకటిది
- విహారి సిద్ధ, బుద్ధలు మళ్ళీ మన ముందుకు వచ్చారు
- బట్టతల వచ్చేసిందే బాలా.. కొనసాగుతోంది.
- రాజకీయ పాఠాలు చెబుతానంటున్నారు దేవన హరిప్రసాద్ రెడ్డి
ఇంద్ర ధనుస్సు
- మహాభారతంలో భీష్ముని పాత్రపై విశ్లేషణ సిరివెన్నెలలో చదవండి.
- కాఫీ గురించి భాస్కర్ రామరాజు మంచి కాఫీలాంటి జాబు రాసారు.
- అలనాటి హైదరాబాదు చిత్రాలు చూడండి అంటూ కొణతం దిలీప్ విలువైన, వెలలేని చిత్రాలను తన బ్లాగులో పెట్టారు.
- కొల్లూరి సోమశంకర్ రాసిన కిటికీ అనే ఈ జాబు చక్కటి సందేశాన్నందిస్తోంది.
- హాస్య దర్బారు తీర్చే అరిపిరాల సత్యప్రసాద్ కార్పొరేట్ కాశీమజిలీ కథలు పేరుతో మరో శృంఖలను మొదలుపెట్టారు.
- దుప్పల రవికుమార్ “మీరు చదివారా” అంటూ పుస్తక సమీక్షల బ్లాగు రాస్తూంటారు. ఇప్పుడు ప్రముఖ బ్లాగరులతో ఫటాఫట్ అంటూ ప్రశ్నలు జవాబుల శృంఖల మొదలుపెట్టారు. వారానికో బ్లాగరితో ఈ ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరుగుతుంది. మచ్చుకు కొణతం దిలీప్‌తో ఈ ఫటాఫట్!
- మహిళా బ్లాగరులు కొందరు కలిసి, ఆడపిల్లలను ఆదుకునే ఓ స్వచ్ఛంద సంస్థకు పుస్తకాలు, స్టేషనరీ రూపేణా సహాయం చేసారు. ఆ వివరాలు మనసులోమాటలో చూడవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ హార్దిక అభినందనలు.
- సిద్ధాంతం – నమ్మకం అంటూ రవి బ్లాగాడించారు.
- అమెరికాలో ఆంధ్రుల హత్యలపై తన ఆవేదనను చింతా రామకృష్ణారావు ఆంధ్రామృతంలో వెలిబుచ్చారు.
- అమెరికా వనభోజనాల గురించి వేణుశ్రీకాంత్ రాసారు.
- సీబీరావు అమెరికా నుండి ఉత్తరం రాసారు.
- బహిరంగ ప్రదేశాల్లో క్యూ పద్ధతిని పాటించని వారికి రమణ వినతి చూడండి.
- ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాల నిరోధ చట్టం ఆ వర్గాలకు కూడా ఉపయోగపడటం లేదంటున్నారు, ప్రక్షాళనలో
కొత్త బ్లాగులు
- నల్లమోతు శ్రీధర్ సాంకేతికాంశాల బ్లాగరిగా బ్లాగులోకంలో చిరపరిచితులే. ఇప్పుడాయన మనసులో అనే బ్లాగు పుస్తకంలోతన అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నారు.
- మనఃస్పందన తెలియజేస్తున్నారు
- నవకవిత
- ఆనందో బ్రహ్మ అంటూ జోకుల మీద జోకులు చెప్పేస్తున్నారీ బ్లాగులో
- మగవాడినంటూ ఒక బ్లాగొచ్చేసింది. కానీ, ఇది మరో మగవాడి బ్లాగు కాదంటున్నారీ బ్లాగరి.
- కవితా పరిమళాలు వెదజల్లుతూ వచ్చిందో బ్లాగు.
- తోలుబొమ్మలాట వచ్చేసింది, చూడండి.
- ఆయుష్మాన్‌భవ పేరుతో తమ్మిన అమరవాణి బ్లాగు మొదలుపెట్టారు. నిజానికిది కొత్త బ్లాగు కాదు; తమ పాత బ్లాగులోని జాబులన్నిటినీ తీసివేసి కొత్త జాబులతో కొనసాగిస్తున్నారు.
- సముద్రం బ్లాగును మొదలుపెట్టారు కర్ణ.
- తెలుగు వెలుగు అంటూ చెన్నకేశవస్వామి కొత్త బ్లాగు మొదలుపెట్టారు.
- తెలుగు చలనచిత్రాల జాబితా తయారు చేస్తున్నారు, చాణక్య
- సహ చట్టం గురించి చెబుతున్నారీ బ్లాగులో
- అంతరంగ కెరటాలు పేరుతో వచ్చారు మరో కిరణ్ – యార్లగడ్డ కిరణ్ కుమార్
- ఆహా! ఓహో అంటూ వచ్చేసిందో బ్లాగు. వీరికి రాతలే గాక, గీతలూ వచ్చినట్లు తెలుస్తోంది.
- నాగొడవ అనే కవితల బ్లాగుతో పవన్ కుమార్ రంగంలోకి దిగారు.
- బ్లాగంటే ఇదేరా అంటున్నారు జయభారత్
ఈనెల జాబు:
పగవాడిక్కూడా రాకూడదు అనుకునేంతటి కష్టం వచ్చినపుడు ధీరోదాత్తులెలా తట్టుకుంటారో, చూస్తే తప్ప తెలీదు. వెన్నెముకను నమిలేసేంతటి నొప్పిని అనితర సాధ్యమైన రీతిలో ఎదుర్కొన్న గడ్డిపూలు సుజాత, అటువంటి శైలిలోనే – ఉద్వేగ రహితంగా, ఎవరికో సంబంధించిన విషయంలా – తన వీరగాథను వివరించిన మూడు టపాలు మా ఈ నెల జాబు (లు).
పాత మధురాలు
మన పత్రికల్లో దిస్ డే దట్ ఏజ్ లాంటి పాత వార్తల శీర్షికలు వస్తూంటాయి. అలాటిదే ఈ నాటి బ్లాగు – నిన్నగాక మొన్న మొదలైన తెలుగు బ్లాగుల్లో కూడా నా…టి బ్లాగా అని సాగదియ్యకండి. 2005లో వచ్చిన ఈ బ్లాగు ఒకే ఒక్క జాబుతో ఆగిపోయింది. అంత సీన్ లేదు అనే పేరుగల ఈ బ్లాగులో ఉన్న ఒకే ఒక్క జాబు పేరు ఇచ్చట నిద్ర అమ్మబడును. నిద్ర అమ్మే ఆ కంపెనీ పేరు కూడా చూడండి, ఎంత చమత్కారంగా ఉందో! ఇంతకీ ఆ బ్లాగు రాసింది కశ్యప్, ఆయన తమ్ముడూను. ప్రస్తుతం http://kaburlu.wordpress.com అనే బ్లాగు రాస్తున్నారు.
చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యుడు
నవంబరు బ్లాగ్వీక్షణం డిసెంబరు ఒకటిన ప్రచురించటం అభినందనీయం. నవంబరు నెల ఆఖరులో (ముంబై సంఘటన దృష్ట్యా) అత్యధిక టపాలు వచ్చినా వాటినీ చేర్చి మరీ వ్రాశారు.. నెనర్లు. ఒక చిన్న సలహా – ప్రతి నెలా ఏ ఏ దిన పత్రికలలో ఏ ఏ బ్లాగ్ సమీక్షలు వచ్చాయో జోడిస్తే మరింత బాగుంటుందేమో. అవకాశం వుంటే ఆలోచించండి…!!
నా స్పందనకు ప్రతిస్పందించిన వారికి ధన్యవాదములు
ఈనెల బ్లాగుల సమీక్ష విసృతంగా బాగుంది
చాలా శ్రమతీసుకుని మీరు చేస్తున్న ఈ సేవ బ్లాగర్లకు ప్రొత్సాహకరం.శుభమ్
పేలుళ్ళ తరువాతి నుండీ బ్లాగులు చూడలేదు.
అనుకోకుండా ఇక్కడ దొరికాయి.
నెనర్లు.
శ్రమకోర్చి, దాడుల మీద టపాలు క్రోడీకరించి పెట్టినందుకు ధన్యవాదాలు.
నవంబర్ బ్లాగు ప్రస్థానం ప్రతి ఒక్క బ్లాగరుని పరిచయం చేసింది. కొత్తవారిని, పాతవారిని ఒకచోటకి తెచ్చిన ఘనత పొద్దు ది.
నవంబర్ లో నేను రాసిన పోస్ట్ లింక్ ఇక్కడ ఒపెన్ అవడం లేదు. ఆ లింక్ http://manalomanamaata.blogspot.com/2008/11/42_4151.html (42 గంటలు దిగజార్చబడిన ఆత్మస్థైర్యం)
నన్ను కూడా నవంబరు బ్లాగు ప్రస్థానం బ్లాగర్లలో చేర్చినందుకు నెనర్లు.
నెల ముగిసీ ముగియకముందే అసలు ఎలా చేర్చగలిగారు అన్ని టపాలూ? దీనిబట్టి తెలుస్తుంది పొద్దువారు ఎంత సమయాన్ని, శ్రమని కేటాయిస్తున్నారో.అభినందనలు చాలా చిన్నపదం అయిపోతుంది.
చిన్న సవరణకై సూచన : గార్లపాటి ప్రవీణ్ గారి పేరు గార్లపాటి ప్రదీప్ గా ప్రచురించబడింది.
యథాప్రజా తథారాజా అంటున్నారు రానారె! 🙂
చదువరులు ఎత్తిచూపిన పొరపాట్లను సవరించాను. నెనరులు.
అభినందించినవారికి కూడా నెనరులు
-రచయిత
మాష్టారు, కంపెనీ లో మంత్లీ స్టేటస్ రిపోర్ట్ లాగా, ఇలా నెల ముగియగానే ఎలా క్రోడీకరించి పంపించారు? మీ కృషి కి అభినందనలు. మా ఖాతాదారు(client)గాడి భాష లో చెప్పాలంటే Dude, u did an excellent Job..
అరిపిరాల గారు, I second your thought
కానీ వీళ్ళపై మరింత భారం పడుతుందేమో కదా …Crisis Time, ఎంత Work అయినా చెయ్యాల్సిందే అంటారా! 😉
చాలా కష్టపడి అన్నీ సేకరించి వ్రాసారు.
మీకివే అభినందనలు.