-భైరవభట్ల కామేశ్వరరావు
అక్టోబరు గడి పరిష్కారం పంపిన వారు మొత్తం తొమ్మిది మంది.
ఈసారి అన్నీ సరైన సమాధానాలు పంపినవారు ఒకరుండడం విశేషం! అన్ని సమాధానాలు సరిగ్గా పంపినవారు: “మహార్ణవం” రాధిక. వారికి అభినందనలు.
మూడు తప్పులతో రాసిన వారు:
1. సుజాత (మనసులో మాట),
2. దైవానిక. (దైవానిక, “కత్తి” సమాధానం తప్పు రాయడం క్షమార్హం కాదు 🙂 )
మూడు కన్నా ఎక్కువ తప్పులతో పంపినవారు:
1. ఆదిత్య
2. ఈ.భాస్కర నాయుడు
3. శ్రీలు
4. జ్యోతి
5. స్వరూప కృష్ణ
6. స్నేహ
ప్రయత్నించిన వారందరికీ మా అభినందనలు
1 సా |
2 యం |
కా |
3 ల |
మైం |
4 ది |
|
5 ప్ర |
జా |
6 రా |
జ్యం |
|
7 రం |
గు |
|
కు |
|
8 వా |
తా |
పి |
|
మా |
|
9 భ్ర |
10 గ |
య |
|
11 మ |
త్కు |
ణ |
|
తా |
|
ను |
|
మ |
12 ధ |
మ |
ని |
|
|
13 ము |
14 ని |
|
15 అ |
జ |
16 గ |
ర |
ర |
|
|
17 రౌ |
ద్రి |
|
18 గ |
19 జల్ |
|
|
20 జా |
కీ |
21 చ |
లి |
22 వేం |
ద్రం |
|
23 ఆ |
|
24 కా |
25 రే |
|
|
ట |
రి |
|
డ |
|
26 చి |
|
27 రా |
|
28 గ |
ళం |
29 తి |
క |
30 త్ర |
31 ప |
|
32 ము |
వ్వ |
33 ల |
స |
వ్వ |
డి |
|
రి |
|
|
ద |
|
షీ |
|
34 వ |
కీ |
|
35 వి |
న్న |
కో |
36 ట |
37 లు |
సూ |
38 వ |
రా |
39 జా |
|
40 యా |
41 వ |
త్తు |
|
|
ంకు |
|
42 చి |
ట్టి |
బా |
బు |
|
43 లు |
క |
లు |
44 క |
లు |
|
45 స్థ |
|
|
46 దు |
లు |
పు |
|
47 ల్తా |
|
త్తి |
|
48 లం |
అడ్డం
1. పొద్దుకొచ్చి పొద్దుపోయిందంటారేమిటి గొల్లపూడి గిరీశం గారు! (6) – సాయంకాలమైంది – కన్యాశుల్కంలో గిరీశం మొదటి డైలాగు. గొల్లపూడి నవల పేరు.
5. అంజి kingdom పేరు ఒక oxymoronలా లేదూ? (2, 2) – “అంజి” సినిమా హీరో చిరంజీవి. అతని రాజ్యం “ప్రజా రాజ్యం”. రాజ్యం అంటే రాజులు పాలించేది అని అర్థం. అంచేత “ప్రజా రాజ్యం” అన్నది oxymoron అనుకోవచ్చు.
7. ఇది పడుద్దనడం అతనికో తుత్తి (2) – “రంగు పడుద్ది” ఏ.వి.ఏస్ డైలాగు
8. తిన్నది తాపీగా అరిగించుకోండి (3) – తిన్నది అరగడానికి “వాతాపి జీర్ణం” అంటారు కదా.
10. బుద్ధాజీ వెళ్ళిపోయాడు! (2) – బుద్ధుడు వెళ్ళింది గయకి. “గయ” అంటే హిందీలో వెళ్ళిపోయాడని అర్థం వస్తుంది.
11. దంతంలేని ఏనుగు బాధ సూర్యచంద్రులు కూడా తట్టుకోలేరట! (3) – “శివుడద్రిని శయనించుట, రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షుండవిరళముగ శేషునిపై శయనించుట నల్లి బాధ పడలేక జుమీ!” అన్న పద్యం ఒక ఆధారం. నల్లికి సంస్కృత పదం “మత్కుణం”. దంతం లేని ఏనుగుని కూడా మత్కుణమంటారు. ఈ అర్థం బ్రౌణ్యంలో కనపడక కాస్త తికమక పడ్డట్టున్నారు.
12. స్వరముల నరమిదే (3) – ధమని ఒక రకమైన నరం (ఇంగ్లీషులో artery అనుకుంటాను). “ధ మ ని” స్వరాలే కదా!
13. కామునిలో దాగిన మోక్షగామి (2) – ముని
15. అరగజం దూరంలో, అదిగో పెద్ద కొండచిలువ! (4) – అజగర (“అరగజ” anagraM) అంటే కొండచిలువ
17. ఆరుద్ర కుమార్తె కలం పేరు కూడా సార్థకమే! (2) – ఆరుద్ర కుమార్తె లలిత గారు బ్లాగర్లకి పరిచితులే. ఆమె కలం పేరు “రౌద్రి” అంటే రుద్రుని కూతురు అని అర్థం వస్తుంది.
18. జల్లుమనిపించే షాయరీ (2) – గ”జల్”
20. పేకముక్క రౌతు (2) – జాకీ
21. శీతల పానీయాల ఉచిత పంపిణీ కేంద్రం (4) – చలివేంద్రం
24. స్రవించే రాజులు రాజ్యముల్ కలుగవే! (2) –పోతనగారి పద్యం “కారే రాజులు రాజ్యముల్ కలుగవే!” కారే అంటే స్రవించే అని కూడా అర్థం వస్తుంది కదా.
28. గంగాళం కాదు. సన్నని గొంతుగల తేనీటి చెంబు (4) – గళంతిక (ఇంగ్లీషులో kettleకి అందమైన తెలుగు పదం!)
30. శతపత్ర సుందరిలో ఎంత సిగ్గు దాగుందో! (2) – త్రప అంటే సిగ్గు
32. అచ్చ తెలుగు మంజీర నాదాన్ని వినాలంటే సప్తగిరులని దర్శించాలి (3, 3) – “మంజీర నాదం” అచ్చ తెలుగులో “మువ్వల సవ్వడి”. ఇది సప్తగిరి దూరదర్శన్లో వచ్చే ఒక మంచి కార్యక్రమం, శాస్త్రీయ నృత్యంలో పోటీ.
34. పాపమీ లాయరుగారికి ఒకటే తాళంచెవి మిగిలింది (2) – వకీ. వకీలు అంటే లాయరు. “కీలు” – తాళంచెవులు. ఒకటే ఉంటే “కీ”.
35. వేసవి వాన కురిపించినవాడే నేటి కవిత్వానికి పెట్టనికోట (4) – విన్నకోట. విన్నకోట రవిశంకర్ కవితల సంపుటి వేసవి వాన.
37. కమల్ దాదా భాయ్ డబ్బులు లాగడంలో కాస్త తడబడ్డాడేమిటి? (3, 2) – తెలుగులో శంకర్ “దాదా”, హిందీలో మున్నా “భాయి”, తమిళంలో కమల్ హాసన్ నటించిన “వసూల్ రాజా”. వసూల్ తడబడింది.
40. సమస్త్యములో ఎక్కువైనదిదే (3) – సమస్తము సరైనపదం, అందులో ఎక్కువైనది “య వత్తు”. “య వత్తు” పదాన్ని మనం “యా వత్తు” అని పలుకుతాం. “యావత్తు” అంటే అర్థం సమస్తము.
42. వైణిక బాబు గట్టివాడే! (4) – చిట్టిబాబు. ప్రముఖ వీణ విద్వాంసుడు.
43. అబ్బా! ఎటు చూసినా ఈ పురుగుల గోల తొలిచేస్తోంది! (5) – లుకలుకలు. ఇది పురుగుల ధ్వనిని సూచించే పదం. ఎటునుంచి చూసినా అదే వస్తుంది.
45. 48 తో కలిస్తే చోటు దొరుకుతుంది (2) – స్థ. 48 అడ్డంలోని అక్షరం “లం” తో కలిస్తే “స్థలం” అంటే చోటే కదా.
46. భానుమతి మన లారెల్ ఎండ్ హార్డీ ని చెయ్యమన్న పని (3) – దులుపు. రమణా రెడ్డి, రేలంగి మన “లారెల్ ఎండ్ హార్డీ”. వాళ్ళతో భానుమతి పాట “దులపర బుల్లోడో”.
నిలువు
1. “రాజొకడూరలేడ”ని చెప్పినా వినని రాకుమారుని గాథ (5, 3) – సారంగధర చరిత్ర. ఈ కథ ప్రసిద్ధమైనదే. చేమకూర వేంకట కవి దీన్ని కావ్యంగా రచించాడు. అందులో సారంగధరుని మిత్రుడు తన సవతి తల్లివద్దకు పోవద్దని వారిస్తూ చెప్పే పద్యం – “రాజొకడూరలేడు, చెలి ప్రాయపు బిత్తరి” అంటూ మొదలవుతుంది. అతని మాట వినకుండా సారంగధరుడు వెళతాడు.
2. మోహనుబాబు యముడైతే మరి ఎన్.టీ.ఆరు? (2, 2) – యంగు యమ. ఇది పై కథకన్నా కూడా ప్రసిద్ధమైనదే కదా
3. కర్పూరవసంతరాయలి ప్రేయసిదే కులమయితే నేమి? (3) – లకుమ (కులమ anagram)
4. దివ్యమైన నిర్వాణముతో సమానమీ ప్రభుత్వ కొలువు (4) – దివాణము. అంటే ప్రభుత్వ కొలువు.
5. మహత్వాన్ని కోల్పోయిన ముత్తాత (3) – పితామహుడు అంటే తాత. ప్రపితా”మహుడు” అంటే ముత్తాత. “మహ”త్వాన్ని కోల్పోతే మిగిలేది “ప్రపితా”.
6. అద్వైతం లక్ష్మణుడికి విశిష్టంగా తెలుసునే! (4) – రామానుజుడు విశిష్టాద్వైత మత ప్రచారకుడు. రామానుజుడంటే లక్ష్మణుడు కూడా కదా.
9. నువ్వేం తలుచుకుంటే అదైపోవాలా! ఇదేం న్యాయం? (3, 3) – “భ్రమర కీటక”. సంస్కృతంలో కొన్ని ప్రసిద్ధమైన analogiesని “న్యాయాలు” అంటారు. అలాటి న్యాయాల్లో ఇదో న్యాయం పేరు. దీన్నే “భ్రమర కీట” న్యాయం అని కూడా అంటారు. పురుగులు తాము తేనెటీగగా మారాలని తీవ్రంగా తలుచుకుంటూ తపస్సు చేస్తే అవి తేనెటీగగా మారిపోతాయట. అలాగే జీవుడు “అహం బ్రహ్మాస్మి” అని తలుచుకొని తపస్సు చేస్తే బ్రహ్మత్వాన్ని పొందుతాడు అని అంటారు.
14. ఇది రెండింతలైతే మేను మెఱుపు గనిగా మారదూ! (2) – నిగ. శరీరం మెఱుస్తూంటే, “నిగ నిగ”లాడుతోందంటారు. “గనిగా”లో నిగ దాగుంది.
16. లావొక్కింతయు లేని ఎన్.టి.ఆర్ తొలి ప్రేయసి (2) – ఎన్. టి. ఆర్ అంటే ఇక్కడ జూనియర్ ఎన్. టి. ఆర్. అతను హీరోగా వేసిన తొలి చిత్రంలో హీరోయిన్ గజాలా. “లా” ఒక్కింతయూ లేకపోతే మిగిలేది “గజా”.
17. 17 అడ్డంలో పేరుకి మాత్రం కనిపించే రసం (2) – రౌద్రికి సంబంధించిన రసం “రౌద్రం”.
19. ఈ నాయిక కాటుక తిరగేసి పెట్టుకుందేవిటి దేవా? (2) – కాజల్ అంటే కాటుక. అదో హిందీ హీరోయిన్ (నటుడు అజయ్ దేవగన్ భార్య) పేరు.
22. వద్దని తెలుగులో చెప్పొచ్చు కదా తంబీ! (2) – వద్దు తమిళంలో “వేండ”.
23. 45 తో కలిసే గొప్ప ప్రయత్నం చెయ్యి (2) – “ఆ”. 45 అడ్డంలోని అక్షరం “స్థ” కలిస్తే “ఆస్థ” అంటే గొప్ప ప్రయత్నం అని అర్థం.
25. చంద్రలత సాహితీ క్షేత్రంలో జల్లిన వాటి మధ్యలో మీరు చూస్తున్నది ఇరుక్కుపోయింది (3, 3) – రేగడి విత్తులు
26. చిల్లిగవ్వ, ఆద్యంతం యుద్ధాలకి కారణం! (2) – “చి”ల్లిగ”వ్వ” మొదలు చివరా కలిపితే “చివ్వ”, అంటే యుద్ధం.
27. రాజులు చేసేవి పోలిటిక్సయితే మరి రసికులు చేసేవి? (5) – “రాజకీయాలు” అంటే రాజులు చేసే పనులు. రసికులు చేసే పనులు “రాసకీయాలు”.
29. అడిగానంటున్నావు సరే. అదేదో తిన్నగా చెయ్యొచ్చుగా (3) – కోరితి అంటే అడిగాను అని అర్థం. అది తిరగబడింది.
31. ఇండెక్సు (4) దీనికి చక్కని తెలుగు పదం “పద సూచి” (పుస్తకాలకి సంబంధించి వాడేటప్పుడు)
32. ఈ మధ్యనే ఈ బాదు కాంగ్రెస్సుకి మణిమయంగా మారింది (5) – ముషీరాబాదు. ఆ మధ్య ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మణెమ్మ గెలిచింది.
33. వేయికళ్ళ వయ్యారి తిరగబడింది (2) – ఇదొక పొడుపుకథ. వెయ్యి కళ్ళ వయ్యారంటే వల.
36. చాటాలంటే వెయ్యాల్సింది (2) – టంకు
38. పనికిరానట్టు కనిపించినా, వేళ్ళూనుకుంటే ఎంత చల్లదనమిస్తాయో! (2) – వట్టి వేళ్ళు వేసంకాలంలో వేడి తగ్గడానికి ఇంట్లో కడతారు. “వట్టి” అంటే పనికిరాని అనికూడా అర్థం.
39. ప్రత్యుత్తరాలలో ఉత్తరాలు వెతికి పట్టుకోడమే ఇక మీ ఉద్యోగాలు, ఓకే? (3) – జాబులు. ప్రత్యుత్తరానికి మరో పదం “జవాబు”. అందులో ఉన్న “జాబు” అంటే ఉత్తరం అనే అర్థం ఉంది తెలుగులో. ఇంగ్లీషులో “జాబ్” అంటే ఉద్యోగం కదా.
41. మధ్యలో కాస్త సాగదీస్తే, 34 అడ్డంలో వాళ్ళు పుచ్చుకొనేదే (3) – 34 అడ్డంలో వాళ్ళు లాయర్లు. వాళ్ళు “వకాల్తా” పుచ్చుకుంటారు కదా.
44. దీని పదును తెలియాలంటే బ్లాగ్వనంలో కుటీరాన్ని దర్శించాల్సిందే! (2) – కత్తి పదును తెలియనివాళ్ళు బ్లాగ్లోకంలో లేరంటే అతిశయోక్తి కాదు.
48. 23 ని ముందు పెట్టుకుని యుద్ధం చెయ్యి (2) – 23లో అక్షరం “ఆ”. దానికి “లం” కలిస్తే “ఆలం” అంటే యుద్ధం.
34 అడ్డం తప్పు అర్థమైంది. దానివల్ల 33 నిలువు కూడా చెడినట్టుంది.నా మిగిలిన మరో తప్పేదో తెలీడం లేదు! అనగా గుర్తు లేదు. సమాధానాలు చూస్తే సరిగ్గా రాశాననే అనిపిస్తోంది. దయచేసి చెప్పగలరు.
కత్తి కంటే కలం పదును కదా అని “అతితెలివిగా” అలోచించాను అని ఇప్పుడు అర్థం అయ్యింది 🙂 కచ్చితంగా క్షమార్హుడిని కాదు
when the total number is 9 who have submitted the answers it is true that the puzzle is too difficult.
further the winner is only one. I have observed from the clues that some are too much confusing and difficult but not intelligent.
36 నిలువు లో “ట” వచ్చి ఒక గడిలో ” ంకు ” వచ్చి ఒక గడిలో పెట్టారు అలా రాయొచ్చా? ఎందుకంటే “సున్న” అనేది ఎక్కడ ఉన్నా అది మొదటి అక్షరానికే చెందుతుంది కదా? అంటే “టం” వచ్చి ఒకగడిలో “కు” వచ్చి ఇంకో గడిలో పెట్టాలి కదా?
శ్రీలు, అది అసలుగా “టమ్కు” అవ్వాలి. అలాంటి పదం ఉందని బ్రౌణ్యం చెబుతోంది. ప్రింట్ లో కాస్త తప్పు వచ్చి ఉండవచ్చు. టంకు అని కూడా వ్రాయవచ్చు.