-వీవెన్, సిముర్గ్, త్రివిక్రమ్, చదువరి
కాశ్మీరు, దేశభక్తి, కులం, మతం, చిరంజీవి ప్రజారాజ్యం -ఇవీ ఈ నెల బ్లాగరులు ఎక్కువగా స్పందించిన అంశాలు. వేడిగా వాడిగా చర్చలూ జరిగాయి. కొన్ని సందర్భాల్లో చర్చలు వ్యక్తిగతంగా కూడా మారాయి. లైంగికతపై కూడా చర్చ జరిగింది. చాలామంది బ్లాగరులు హుందాగా స్పందించినప్పటికీ, ఒకటిరెండు చోట్ల ఇది బూతు స్థాయికి దిగజారింది. అసహజ లైంగికాచారాల గురించిన చర్చ, అక్కడ వచ్చిన కొన్ని హేయమైన వ్యాఖ్యలు ఏవగింపు కలిగించాయి. ఎవరి బ్లాగుకు వారే సుమన్ అన్న బ్లాగోక్తి నిజమేగానీ, సుమన్ని ఎంతగా ఆటపట్టించారో, చివరికి సుమన్ పరిస్థితి ఏమయిందో కూడా బ్లాగరులకు బాగా తెలుసు.
సాలభంజికలు బ్లాగు తాత్కాలికంగా సుషుప్తిలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. బ్లాగరులు ఈ విషయమై అసంతృప్తి వెల్లడించి ఉన్నారు. త్వరలో ఈ బ్లాగు తిరిగి ఉదయిస్తుందనీ, జాబులు పూయిస్తుందనీ ఆశిద్దాం.
ఇక వివరాల్లోకి వెళితే..
రాజకీయాలు, సామాజికాంశాలు
- చిరంజీవి రాజకీయ రంగప్రవేశం ఈ నెలలో జరిగిన అతిపెద్ద రాజకీయ ఘటన. ప్రజారాజ్యం పార్టీ ఆవిష్కార సభకు సంబంధించి వచ్చిన కొన్ని జాబుల వివరాలివి:
- రాబోయే ఎన్నికలలో పార్టీల అవకాశాలు, రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో ఒక IT వోడి అబిప్రాయం చదవండి.
- కాలాస్త్రి : చిరంజీవి రాజకీయరంగ ప్రవేశ ప్రకటన
- సెహబాష్ చిరు !!! ప్రజా జీవితానికి స్వాగతం అంటూ శివ స్వాగతం పలికారు
- ప్రజారాజ్యం వచ్చేసింది అంటూ కృష్ణదేవరాయలు రాసారు.
- చిరంజీవి భూమా నాగిరెడ్డిని వెంటేసుకుని “రాయలసీమ రాజకీయ సంస్కృతిని మారుస్తా”ననడంతో సినిమా వాళ్ళకు ఇంతే తెలుసు అంటూ దేవన హరిప్రసాద్ రెడ్డి చిరంజీవిని ఘాటుగా విమర్శించారు.
- ప్రజారాజ్యం కోసం చిరంజీవి ప్రజారాజ్యం తెచ్చాడంటూ చదువరి ఓ జాబు రాసారు.
- చిరంజీవిది ప్రజారాజ్యం అంటూ జాబిల్లిలో విజయ్ రాసారు.
- కరీంనగర్ బ్లాగర్ల ప్రపంచం ఇలా రాసింది: ప్రేమే లక్ష్యం, సేవే మార్గం – చిరంజీవి “ప్రజా రాజ్యం”
- కృష్ణాష్టమి సందర్భంగా..
- కురుక్షేత్ర యుద్ధం ముగిసాక ఏం జరిగిందో రాసారు అరిప్రాల సత్యప్రసాద్
- పోతన భాగవతంలోని పద్యాలను భైరవభట్ల కామేశ్వరరావు శ్రీకృష్ణ లీలామృతంలో పరిచయం చేసారు.
- ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం ప్రత్యేకత – దేశభక్తి మీద తెలుగు బ్లాగరులు జరిపిన చర్చ.
- బ్లాగాడిస్తాలో రవి దేశభక్తి అంటే ఏంటంటూ ప్రశ్నించారు
- పై జాబుకు స్పందనగా దేశభక్తే అసలైన మానవత్వం అంటూ సరస్వతీ కుమార్ రాసారు.
- కత్తి మహేష్ కుమార్ దేశభక్తి అంటే?!? అని ప్రశ్నించారు.
- సురాజ్య మవ్వలేని స్వరాజ్యం ఎందుకని ? అంటూ ప్రఫుల్ల చంద్ర కూడా ప్రశ్నించారు
- జేసీ దివాకరరెడ్డి ఆర్టీయే అధికారులపై చేసిన దాడిపై బ్లాగరుల స్పందన
- అమరనాథ దేవాలయ స్థల వివాదంపై వచ్చిన జాబులు:
- ఈ వివాదంపై మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న కులదీప్ కుమార్కు నివాళిగా దేవన అనంతం కులదీప్ కుమార్ అమర్ రహే అని రాసారు.
- ఈ సమస్య నేపథ్యంలోనే మరింత విస్తృతమైన కాశ్మీరు సమస్యను ఉద్దేశించి కత్తి మహేష్ కుమార్ఈ కాశ్మీరం నాకొద్దు ! అనే జాబు రాసారు. వేర్పాటు వాదులు అడుగుతున్నట్టుగా భారత్ కాశ్మీరును వదిలెయ్యాలనేది ఈ బ్లాగరి అభిప్రాయం.
- పై జాబుకు స్పందనగా తేటగీతిలో మురళి షాక్మీర్ ఇచ్చేస్తే పోలా అనే జాబు రాసారు.
- తేటగీతిలో వచ్చిన పై టపాను అందరూ ఖండించాలి అంటూ భావకుడన్ రాసారు.
- భావకుడన్ రాసిన జమ్మూ హిందువుల ఘోష – సైలెంట్ మెజారిటీ గళానికి ప్రతీకా? అని యోచించారు
- కాశ్మీరీల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే విధానం మారాలంటూ వారణాసి కిరణ్ కుమార్ కాశ్మీరును కాదు కాశ్మీరీలను పట్టించుకోవాలని రాసారు.
- కులమతాలపై ఈ నెల బ్లాగుల్లో విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలు వ్యక్తిగతమైన ఆరోపణలకూ దారితీసాయి. కొన్ని బ్లాగులు.
- కులమా కులమా నీకు మరణం లేదా అంటూ మనసులో మాట సుజాత ఆవేదనగా అడిగారు.
- కులమతాలు నేరమా?! అంటూ శంఖారావంలో సరస్వతీ కుమార్ చర్చించారు.
- ఈ వివాదాల నేపథ్యంలో మాగంటి వంశీ అసలు ఏమవుతోంది ఈ మధ్య మన తెలుగు బ్లాగు ప్రపంచంలో? అంటూ ఆవేదన వెలిబుచ్చారు.
- ఇవి కాక, వివాదాస్పదమైన చర్చకు దారితీసిన జాబులు, వ్యాఖ్యలను తరువాత తొలగించిన ఘటనలూ జరిగాయి.
- ఉత్తమ బ్లాగులను, నచ్చని బ్లాగులను ఎంచమంటూ వీవెన్ తన బ్లాగులో జాబు రాసారు. అది వివాదాస్పద చర్చకు దారితీసింది.
- స్త్రీ పక్షపాతం
- స్త్రీ పక్షపాతంపై గడ్డిపూలులో సుజాత ఒక జాబు రాసారు.
- స్త్రీ పక్షపాతానికి అసలైన కోణమంటూ మా గోదావరిలో కొండవీటి సత్యవతి రాసారు.
- స్త్రీ పక్షపాతానికి మరోవైపు అంటూ కత్తి మహేష్ కుమార్ రాసిన జాబుకు స్పందనగా వచ్చినవే పై రెండు జాబులూను.
ఒలింపిక్స్ లో భారత బోణీ: ఒలింపిక్స్‌లో భారత్ బోణీ కొట్టడం బ్లాగరులకు సంతోషాన్నిచ్చింది. జాబుల పండగ చేసుకున్నారు. మచ్చుకు ఇవి చూడండి:
- అవీ-ఇవీ లో త్రివిక్రమ్ ఒలింపిక్స్ లో స్వర్ణంతో భారత్ బోణీ కొట్టిందని అని రాసారు.
- వచ్చిన వాడు అభినవ్ బింద్రా అంటూ తేటగీతిలో మురళి రాసారు.
- ఈ వార్తను మధు తన బ్లాగులో ప్రకటించారు
- ఐతే ఓకే అంటూ కిరణ్ కూడా తన బ్లాగులో రాసారు.
- స్మృతిలో ప్రవీణ్ తన హర్షం వెలిబుచ్చుతూ, గుర్తింపు వచ్చిన వాళ్ళకే మనం మరింత గుర్తింపు ఇస్తాము అంటూ బాధపడ్డారు.
- ఒక చిత్రమేంటంటే.. ఈ తొలి స్వర్ణ దినానికి కేవలం రెండు రోజుల ముందు బండారు శివ ఒలంపిక్స్ లో మనదేశం అనామకంగా ఉండటాని కి ప్రదాన కారణం ఏమిటి ? – క్రికెట్ అంటూ ఒక జాబు రాసారు. ఒలింపిక్స్‌లో భారత్ అనామకంగా ఉండటానికి కారణం క్రికెట్టేనంటూ సాగిందీ జాబు.
- పై జాబుకు స్పందనగా పూర్ణిమ నిఝంగా క్రికెట్టేనా?? అంటూ ఒక జాబు రాసారు. మిగతా ఆటలు ప్రాచుర్యం పొందకపోవడానికి క్రికెట్టు కారణం కాదంటూ ఆమె వాదన సాగింది.
- ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించని మన ప్రభుత్వాలు అంతర్జాతీయ పోటీల్లో గెలిచాక మాత్రం విచక్షణారహితంగా వరాలు ప్రకటించడాన్ని వికటకవి “ఎవడబ్బ సొమ్మని తేరగ పంచేరు…” అని ప్రశ్నించారు.
సాహిత్యం
ఈ నెల సాహితీ విభాగంలో పద్యాలు ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాయి.
- కందపద్యపు ఛందాన్ని ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తూ రాకేశ్వరరావు అందములోఁ పోతరాజుల కందములోః బొమ్మల చందములోఁ అని ఒక జాబు రాసారు. ఛందస్సును అర్థం చేసుకోగల సాఫ్టువేరును తయారుచేసే పనిపై గతంలో ఆసక్తి వెలిబుచ్చిన నేపథ్యంలో, రాకేశ్వరరావు ఈ పనిపై నిష్ఠతో ఉన్నారనీ, ఆ పని ప్రగతి సాధిస్తున్నదనీ ఈ జాబు ద్వారా తెలుస్తూంది.
- చంద్రమోహన్ కందపద్యపు సొగసును, ఛందాన్ని తెలియజేస్తూ ఓ జాబు రాసారు. ఇక్కడా, పై జాబులోనూ గిరి, రాఘవ, రానారె, భైరవభట్ల, చంద్రమోహన్, ఊకదంపుడు, రాకేశ్వరరావు వంటి పద్యబ్లాగరులు తమతమ వ్యాఖ్యలలో ఆశువుగా కందాలను సంధించి పాఠకులకు విందులు చేసారు.
- తెలుగు బ్లాగుల్లో వస్తున్న కొన్ని కవితలపై చెణుకులు విసురుతూ రానారె ఒక సర్వలఘు కందం రాసారు.
- గిరి ఒక సీసపద్యం, ఆటవెలది, ఒక ఉత్పలమాలల్లో తనకు నచ్చిన బ్లాగులు జాబితా తయారుచేసారు.
- చదువరి తానూ కందానికో నూలుపోగు సమర్పించారు
- ఒక్కో పాదాన్నీ ఒక్కో భాషలో రచించిన కందపద్యాన్ని పరిచయం చేసారు భైరవభట్ల కామేశ్వరరావు.
- నీటిలో వెన్నెల బిందువులు కలిసి, నీళ్ళు ఎంగిలైన వైనం బొల్లోజు బాబా చెప్పారు, తెలుసుకున్నారా?
- కథల వెనక కథల గురించి నిడదవోలు మాలతి ఒక జాబు రాసారు.
- ఫణీంద్ర, తాత్విక మీమాంస రాసారు.
సాంకేతికాంశాలు
- తెలుగు బ్లాగరులు ముద్దుగా పిలుచుకునే మంటనక్కకు కొత్తగా అమరిన యుబీక్విటీ అనే పొడిగింత గురించి ప్రవీణ్ రాసారు.
- సాఫ్టువేరు తెలుగీకరణంలో ఉపయోగపడగల అనువాదాంశాల గురించిన విశేషాలను ఫ్యూయల్ తెలుగు: పరిచయంలో వీవెన్ రాసారు.
హాస్యం, వ్యంగ్యం
- తానెంత గొప్ప చిత్రకారిణో చెబుతున్నారు శ్రీవిద్య
- వేణ్ణీళ్ళు, చన్నీళ్ళు – మీది పోస్ట్‌పెయిడా, ప్రీపెయిడా?
- పందికి బ్లాగు గౌరవం కలిగించారు అబ్రకదబ్ర తన బ్లాగులో.
- రాత్రికి రాత్రి పాపులర్ బ్లాగరైపోవాలంటే ఏం చెయ్యాలో గోసుకొండ అరుణ చెప్పారు, విన్నారా?
- చాన్నాళ్ళ తరువాత తోటరాముడు నవ్వులు పూయించాడు
- ఈ అక్క చెల్లెళ్ళు చెప్పే సుందోపసుందుల కథ విన్నారా?
ఇంద్రధనుస్సు
- పిల్లలకి ఎత్తు మప్పడం, పేర్లు పెట్టడం అనే విషయంపై రామ, శాంతి ఓ జాబు రాసారు.
- ఏకాంతవేళ ఓ కాంత సేవ అంటూ ప్రసాదం శృంగార రసాత్మక టపా ఒకటి రాసారు.
- ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పోయి, జరిగాక మొసలికన్నీరు కారుస్తారంటూ చరసాల ప్రసాద్ ఆవేదన చెందారు. గౌతమీ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం తరువాత రాసిన టపా ఇది.
- తాను చిన్ననాట చేసిన అల్లరి గురించి చెబుతున్నారు, కల.
- “అరవయ్యొక్కేళ్ళ పండు ముత్తైదువా మా తల్లి .. మహాసముద్రపు అలల నురుగులు ఆమె పాదాల మంజీరాలు.” – స్వాతంత్ర్య దినోత్సవాన, భారతమాతకు కొత్తపాళీ చేసిన అక్షర నీరాజనం. అమ్మ గురించి ఆయన రాసిన మూడు టపాల వరుసలో ఇది మొదటిది.
- నారిసెట్టి ఇన్నయ్య రాస్తున్న నా ప్రపంచం బ్లాగులో హేతు విరుద్ధమైన ఆచారాల గురించి రాస్తూ వాటిలోని మర్మాల గురించి తెలియజేస్తూంటారు. ఇతర విషయాలతో పాటు ఈనెల పక్షితీర్థంలో క్రమం తప్పకుండా ఒకే వేళకు వచ్చే గద్దల గురించి, క్రీస్తు మహిమల గురించి కూడా రాసారు
- హైదరాబాదీయులు రాస్తున్న బ్లాగుల్లోకెల్లా జ్యోతి షడ్రుచులు ఉత్తమమైనదిగా ఎంపికైంది.
- పాముకు ఇస్పాట్ పెట్టిన సంగతి రాసారు భాస్కర్ రామరాజు.
- క్రాంతి ముంబై మేరీ జాన్ సినిమా సమీక్ష రాసారు
- ధ్యానం యొక్క పరిమితుల గురించి నారాయణ మూర్తి వివరిస్తున్నారు.
- వ్యూహాత్మక నీటి నిల్వల గురించి తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం 7 టపాల వరుస రాసారు.
- సీబీరావు గారి జ్ఞాపకాలు, ఆలోచనలు విశేషాలను తెలుసుకుంటున్నారా?
- హేతువాదిగా పేరుపొందిన సీబీరావు నా ప్రపంచపు పదివేలవ సందర్శకుణ్ణి అదృష్టవంతునిగా చెప్పడాన్ని శ్రీకాంత్ సరదాగా ఎత్తిచూపారు. దానికి రావుగారు చాలా హుందాగా స్పందించారు.
కొత్త బ్లాగులు
- ఆగస్టులో ఓ తుంటరి బ్లాగు లోకంలోకి ప్రవేశించాడు
- తన కార్టూన్లతో తెలుగు బ్లాగర్లను అలరించడానికి కొవ్వూరి భగవాన్ రెడ్డి వచ్చేసారు.
- ఆంధ్రామృతం అందించడానికి ఓ తెలుగు మాష్టారు బ్లాగులోకం లోనికి వచ్చేసారు.
- ఉత్సాహంగా… ఉల్లాసంగా… కృష్ణాతీరం నుండి అరుణాంక్ వస్తున్నారు.
తెలుగు సేవకుడు
మాగంటి వంశీ మోహన్ పరిచయం చెయ్యనవసరం లేని వ్యక్తి. మాగంటి.ఆర్గ్ వెబ్‌సైటు కర్తగా ఆయన నెజ్జనులకు సుపరిచితుడే. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతులకు సంబంధించిన ఎన్నో విశేషాలను సేకరించి, ఆ సైటులో ఉంచారాయన. సాంస్కృతికంగా విలువైన పది తెలుగు సైట్లను ఎంచి ఓ జాబితాగా చేస్తే ఆ సైటు తప్పక ఆ జాబితాలో ఉంటుంది. మాగంటి వంశీ, శ్రీదేవి దంపతుల శ్రమ ఫలితమీ సైటు. ఈ మధ్య ఆ సైటులో రేడియో ప్రసారాలను కూడా మొదలుపెట్టారు. అమూల్యమైన విషయాలను ఒకచోట చేర్చి అందిస్తున్న మాగంటి వంశీ అభినందనీయులు.
వంశీ జానుతెనుగు సొగసులు పేరుతో బ్లాగు రాస్తూంటారు. ఈ బ్లాగులో ఇతర సంగతులతో పాటు, సుప్రసిద్ధుల జీవితాల్లో జరిగిన విశేషాలను కూడా రాస్తూంటారు.
-వీవెన్, సిముర్గ్, త్రివిక్రమ్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు
వంశీ కి అభినందనలు.
Very deserving recognition.
హాస్యంలో అశ్విన్ బూదరాజు ఇటీవలి టపాలని మిస్సయ్యారు.
మనలో మాట రమణి గారు రాసిన అదృష్ట లక్ష్మి కూడా సున్నితమైన హాస్యపు టపా.
ఊఊ పూర్ణిమ టపాలేవీ మీ జాబితాల్లో కనబడక పోవడం విడ్డూరం.
ఇంద్రధనుస్సు వర్గం బాగుంది 🙂
నా టపా కి ఇంతటి భాగ్యం పడుతుందని నేను అనుకోలేదు. అయితే, పాపులర్ ఎలా అవ్వాలో చెప్పి నేనే పాపులర్ అయ్యాను అన్న మాట. 🙂
Nice review
Good Review
నిఝంగా క్రికెట్టేనా?? టపా రాసినది పూర్ణిమ… ప్రియ కాదు… సవరించగలరు…
ఏకాంతపు దిలీప్ గారూ, సవరించాం. నెనరులు
హోమోఫోబియాతొ బాధపడే పొద్దు సంపాదకుల వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. శరత్ గారి బ్లాగు వర్ధిల్లాలి. బ్లాగుల్లో అన్ని వర్గాల వారికీ స్థానం ఉండాలి. వాళ్ళని ఎగతాళి చేస్తె వెల్లిపోతారనుకుంటె పొరపాటు. ఇలాంటి వెనకబడిన రాతలు రాయడం ఆపెయ్యాలి. అసలు మిమ్మల్ని బ్లాగు సమిక్శలు చెయ్యమన్నది ఎవరు? పిలావని పేరంటానికి ఒచ్చి ఎగతాలి చెయ్యడమ్ ఎం న్యాయం? శరత్ గారి రాతలు చదివి సంతోశించెవాల్లు ఎందరో ఉన్నారు. ఇది పొద్దు గాల్లు గుర్తించాలి.
ఈ సారి సమీక్ష ప్రతినెలకంటే కొంచెం విలక్షణంగా ఉన్నది.
‘ఈ నెల బ్లాగు ‘శీర్షిక కనిపించలేదు.
భావకుడన్ గారు ‘అందరూ ఖండించాలి ‘ అని పిలుపునిచ్చినది తేటగీతిలో ఆగస్ట్ నెలలో వచ్చిన ‘షాక్మీర్ ఇచ్చేస్తే పోలా’ అనే టపానుద్దేశించి కాదు.అదే బ్లాగులో జూలై నెలలో వచ్చిన ‘మైనారిటీలది తప్పే కాదు ‘ అనే టపా నుద్దేశించి.. గమనించగలరు.. ధన్యవాదాలు!
పొద్దు: ఆగస్ట్ నెల బ్లాగ్వీక్షణం పై మన వీక్షణం!
http://sarath-sahityam.blogspot.com/2008/09/blog-post_05.html
ఇంతకు ముందు కామెంట్‌లో చెప్పటం మర్చిపోయిన కొన్ని మాటలను రాయడానికి మరలా కామెంట్ చేస్తున్నాను.
తీరిక లేక ప్రతిరోజూ బ్లాగులు చూడటం కుదరనివారు నెలకోసారి క్రితం నెలలో వచ్చిన అన్ని మంచి టపాలనూ ఒకేసారి చదివే సౌకర్యం ఈ సమీక్షం ద్వారా కలుగుతున్నది.సమీక్షం బావున్నది.నేను రాసిన రెండు టపాలను పేర్కొన్నందుకు ‘పొద్దు ‘ సంపాదక వర్గానికి మరీమరీ కృతజ్ఞతలు.
చిరంజీవి రాజకీయ ప్రవేశంపై నేను వ్రాసిన సెటైర్ చదివి, కామెంటు కూడా వదిలిన చదువరి గారికి, నా టపా “బ్లాగ్వీక్షణం” లో చోటుకు అనర్హమని ఎందుకనిపించిందో?
గిరీష్,
అనర్హమని కాదండి. వ్యాసం రాసేటప్పటికి కొన్ని బ్లాగులు గుర్తుకు రాకపోవడం వలన, ఎప్పటికప్పుడు బ్లాగులను ఒకచో చేర్చి పెట్టుకోకపోవడం వలన ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ఆగ్రహించక గ్రహించగలరు.
వీవెన్, సిముర్గ్, త్రివిక్రమ్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు కి నమస్కారాలు:
ముందుగా మీ ఈ ప్రయత్నానికి నా అభినందనలు. నెలకెన్ని టపాలు వస్తున్నాయో సంఖ్య నాకు తెలీదు కానీ, ఇన్నేసి టపాలు చదివి ఒకేసారి వాటిలో కొన్నింటిని ఏరి ఒక చోట పెట్టడం అనేది ఎంత కష్టమైన పనో నేనూహించగలను. అలాంటి ప్రయత్నంలో కొన్ని టపాలు మిస్స్ అయితే ఓపిక పట్టుచ్చులే అని కాసేపు అనిపిస్తుంది, కానీ రోజూ కూడలి చూడడం కుదరని వారు, ఈ వీక్షణం మీదే ఆధారపడితే మంచి రచనలు తెలుసుకునే అవకాశం కోల్పోతారు. అందుకే నెలాఖరులో “ఈ నెల మీకు నచ్చిన బ్లాగులు” అని ఒక టపా పెడితే విరివిగా చదివేవారి అభిప్రాయాలు మీకు లాభపడచ్చు. కొత్త బ్లాగులూ, వివాదాల మీద మీరు దృష్టి పెట్టవచ్చు.
సూచన ఆచరణీయం కాకపోతే సహృదయంతో మన్నించగలరు. ఈ సమీక్షల వల్ల లాభపడిన ఒకరిగా మాత్రమే ఈ ఆత్రం అని గ్రహించగలరు.
బ్లాగ్వీక్షకుల కంటికి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారి బ్లాగు కనిపించకపోవడం బాగాలేదు. ఈ నెలలో 21 మంచి పుస్తకాలను పాఠకుల దృష్టికి తెచ్చారు. అందులో ఒక్కటైనా నచ్చలేదా?
పొద్దు ఎడిటర్ గారికి
బ్లాగ్వీక్షణంలో నా బ్లాగ్ ఎప్పుడూ చూసినట్లు కనపడుటలేదు. పొద్దులొ ప్రత్యేకంగా రిజిస్టర్ చేసుకోవాలా? నాకు కొంచెం కొత్త తెలుపగలరు.
I am unable to find link for the review of September Telugu blogs.Please advise what went wrong?
-cbrao
Columbus,Ohio
పొద్దు సంపాదకులకు,
అక్టోబరులో “సెప్టెంబరు బ్లాగ్వీక్షణం” ప్రచురించలేదు. కారణాలు తెలియరాలేదు. ఒకరిద్దరిద్దరు రంధ్రాన్వేషుల కారణంగా ఇలాంటి మంచి శీర్షిక ఆగలేదనుకుంటున్నాను..
ఈ నెలలోనైనా ఈ శీర్షికను పునరుద్ధరించగలరు. ఇలా అడగటానికి రెండు కారణాలు –
ఒకటి – (కొత్త) బ్లాగర్లకి ఇది ఎంతో ప్రోత్సాహకరంగా వుంటుంది
రెండు – ఇది ఒక సింహావలోకనం లాంటిది. తెలుగు బ్లాగు ఒక కొత్త సాహిత్య ప్రక్రియ అయితే అది ఏ దశలో సాగుతోందో ఏ ఏ దారుల్లో పోతోందో తెలుసుకునేందుకు మంచి రెఫరెన్సు ఈ బ్లాగ్వీక్షణం.