తెలుగు – పిల్లలు

-లలిత

తెలుగు నేర్పడం ఎలా?” అన్న పేరుతో రంగనాయకమ్మ గారు కొన్ని తెలుగు పాఠ్యపుస్తకాలను విమర్శనాత్మకంగా పరిశీలిస్తూ, కొన్ని సూచనలనూ జోడించి ఒక పుస్తకం వ్రాశారు. రంగనాయకమ్మగారే ఒక పాఠ్య పుస్తకం కూడా రాశారు. చదివిందీ, నేర్పిందీ మర్చిపోయిన తర్వాత మిగిలినదే విద్య అని ఆంగ్లంలో ఒక నానుడి. అది వాడుకుని, ఆ పుస్తకం చదివిన తర్వాత నాకు మిగిలిన అనుభూతి, నా ఆలోచనలు ఇక్కడ పంచుకుంటున్నాను.

ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్లం ఉండగా ఆంధ్రం ఎందుకనే ధోరణి ప్రబలంగా ఉండడమే కాక, అవసరార్థం ఆంగ్లాన్ని ఆకర్షణీయంగా అందజేస్తున్న తల్లిదండ్రులు, తెలుగును మాత్రం అప్పచెప్పే పద్ధతిలో నేర్చుకోమనడం అన్యాయం కదూ? అసలే తెలుగు ఎందుకు అని అడిగే పరిస్థితులున్నప్పుడు, అది నేర్చుకుంటే తెలుస్తుందని చెప్పడానికైనా నేర్చుకునే పద్ధతులు మెరుగైతే, ఆకర్షణీయంగా తయారైతే, తెలుగులో ఆరోగ్యకరమైన వినోదం అందిస్తే భాషాభ్యుదయానికి అవకాశం లభిస్తుంది కదూ?

పెద్దబాలశిక్షలో ఉన్న అక్షరమాల కాక తెలుగు భాషా పరిచయంలో పిల్లలకు మనం ఇవ్వవలిసిన క్రొత్తదనం ఏదీ లేదని, వాడుకలో లేని కొన్ని అక్షరాలను తొలగించడము, మరీ తక్కువగా వాడే అక్షరాలను అక్షరమాల నుంచి తొలగించి అవసరమైనప్పుడు పరిచయం చెయ్యడము మాత్రమే అవసరం అని సూచించారు. అలాగే తను తయారు చేసిన పాఠ్యపుస్తకంలో అందించారు కూడా. అది అంతగా అభ్యంతరకరం కాదనిపించినా, నా అభిప్రాయంలో ఆ మార్పు కూడా అవసరం లేదేమో అనిపిస్తుంది. వర్ణమాలను యథాతథంగా పరిచయం చెయ్యడంలో తప్పు లేదని నాకనిపిస్తుంది. మనం ఇప్పుడు వాడే భాషలో కొన్ని అక్షరాలు అరుదుగా మాత్రమే ఉపయోగపడినా, భాష నేర్పడం అంటే ఆ భాషలోని సాహిత్యాన్ని ఆస్వాదించే స్థాయికి ఎదిగేందుకు ప్రోత్సహించడం కూడా అని భావిస్తాను నేను – అందునా మాతృభాషను. కాబట్టి మన ప్రాచీన సాహిత్యాన్ని చదివేటప్పుడు ఈ అరుదైన అక్షరాలు అవసరం అవుతాయి. అంతే కాదు, 26 అక్షరాలు మాత్రమే ఉన్న ఆంగ్ల భాషలోనే ఒకే శబ్దాన్ని పలకడానికి వేరు వేరు సందర్భాలలో వేరు వేరు అక్షరాలు వాడతారు. ఉదాహరణకు k, c మరియు, g, j. ఇంకో ప్రక్క, స్వల్ప తేడాతో ఒకేలా ధ్వనించే “వ” శబ్దానికి రెండు వేరు వేరు అక్షరాలున్నాయి. మరి “ర”, “ఱ” లను ఒకే అక్షరంతో సూచించగలమనుకోవడం ఎందుకు?

అయితే, నాణానికి ఇంకో వైపు, అక్షరానికీ ధ్వనికీ సంబంధం పరిచయం చేసే స్థాయిలో ఈ విచక్షణ చూపించడం ఫరవాలేదనిపిస్తుంది. అంటే, అరుదుగా వాడబడే అక్షరాలతో పదాలు ప్రాథమిక స్థాయిలో ప్రవేశపెట్టక్కర లేదేమో. కుతూహలం కొద్దీ పిల్లలు అడిగితే జవాబులతో సిద్ధంగా ఉండగలిగేందుకు బోధించేవారికి ఆయా అక్షరాల గురించి కావలిసిన పరిజ్ఞానం ఉండడం మాత్రం అవసరం.

చూస్తున్న కొద్దీ అర్థమైనా కాకపోయినా గుర్తులు మనసులో ముద్రించుకుపోతాయి. తర్వాత నేర్చుకునేటప్పుడు అవి సులభంగా వచ్చేస్తాయి. మూడు నాలుగేళ్ళ పిల్లలకు అక్షరాలు అర్థం కాని పిచ్చి గీతల వంటివే అయినా అక్షరాలతో పాటు వాటి ధ్వనిని ఉపయోగిస్తూ బొమ్మలూ, వస్తువులూ పరిచయం చేస్తే అవి వారి ఎదిగే మెదడుపై ముద్ర వేస్తాయి. అక్షరాభ్యాసం కాని పిల్లలతో కూడా కలిసి కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటే వారు బొమ్మలనే కాదు అక్షరాలనూ తెలియకుండానే గుర్తించడం అలవాటు చేసుకుంటారు.

ఏ విషయం నేర్చుకోవడానికైనా ఎన్ని పద్ధతులున్నా, ఎన్ని పరికరాలున్నా, పరిశ్రమ, శ్రద్ధ, క్రమశిక్షణ లేకుండా ఏ విద్యా అలవడదు, ఉపయోగపడదు. పోతన వంటి మహానుభావులకు తప్పితే సామాన్యులకు గురువు ద్వారా కాని విద్య అబ్బదు, అందునా ప్రాథమిక విద్య. పెద్దబాలశిక్షను పద్ధతిగా అనుసరించి క్రమశిక్షణతో నేర్చుకుంటే తెలుగు భాష చక్కగా నేర్చుకోవచ్చు అనడానికి సందేహం లేదు. ఇక క్రొత్తదనం గానీ, ఆకర్షణ గానీ ఎందుకు అన్న ప్రశ్నకు బోలెడన్ని సమాధానాలు. సహజంగానే పిల్లలూ, మారామూ దగ్గిర స్నేహితులు. అత్యవసరమైనదైనప్పటికీ, ఆహారాన్ని కూడా ఆటపాటలతో అందిస్తే తప్ప అంటుకోరు చాలా మంది పిల్లలు. ఇక ప్రస్తుత పరిస్థితులలో ఆంగ్లం ఉండగా ఆంధ్రం ఎందుకనే ధోరణి ప్రబలంగా ఉండడమే కాక, అవసరార్థం ఆంగ్లాన్ని ఆకర్షణీయంగా అందజేస్తున్న తల్లిదండ్రులు, తెలుగును మాత్రం అప్పచెప్పే పద్ధతిలో నేర్చుకోమనడం అన్యాయం కదూ? అసలే తెలుగు ఎందుకు అని అడిగే పరిస్థితులున్నప్పుడు, అది నేర్చుకుంటే తెలుస్తుందని చెప్పడానికైనా నేర్చుకునే పద్ధతులు మెరుగైతే, ఆకర్షణీయంగా తయారైతే, తెలుగులో ఆరోగ్యకరమైన వినోదం అందిస్తే భాషాభ్యుదయానికి అవకాశం లభిస్తుంది కదూ?

భాషే కాదు, ఏ విషయం నేర్చుకోవాలన్నా చదవడం అనే అలవాటు అవసరం. ఆంగ్లంలో ఎన్ని భారతాలు ఉన్నా ఆంధ్రమహాభారతం చదివితే కలిగే ఆనందం ఆంగ్ల భారతాలు ఎన్ని చదివితే వస్తుంది? చదవాలంటే అక్షర జ్ఞానం కావాలి. అక్షరాలు అలవాటు కావాలంటే కూడా చదవాలి, తల్లి దండ్రులు పిల్లలతో కలిసి పుస్తకాలు చదవాలి.

చదువు అనే నవలలో కొ.కు. గారు రాసినట్టు, చూసి చూసి అక్షరాలు నేర్చుకోవడం నాకు స్వానుభవం – నా విషయంలోను, మా పిల్లల విషయంలోనూ. ఐతే మా పిల్లలు ఆంగ్ల వాతావరణంలో ఉండి ఆంగ్లం నేర్చుకున్నారు. నా కాలంలో అప్పటికింకా టీవీ రాలేదు, ఆంగ్లం అంత అందుబాటులో లేదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. అందుకే ఇప్పుడు తెలుగు నేర్పే పద్ధతులు ఈ కాలానికి తగ్గట్టు ఏర్పరచుకోవాలి. చూస్తున్న కొద్దీ అర్థమైనా కాకపోయినా గుర్తులు మనసులో ముద్రించుకుపోతాయి. తర్వాత నేర్చుకునేటప్పుడు అవి సులభంగా వచ్చేస్తాయి. మూడు నాలుగేళ్ళ పిల్లలకు అక్షరాలు అర్థం కాని పిచ్చి గీతల వంటివే అయినా అక్షరాలతో పాటు వాటి ధ్వనిని ఉపయోగిస్తూ బొమ్మలూ, వస్తువులూ పరిచయం చేస్తే అవి వారి ఎదిగే మెదడుపై ముద్ర వేస్తాయి. అక్షరాభ్యాసం కాని పిల్లలతో కూడా కలిసి కూర్చుని పుస్తకాలు చదువుతూ ఉంటే వారు బొమ్మలనే కాదు అక్షరాలనూ తెలియకుండానే గుర్తించడం అలవాటు చేసుకుంటారు. నేర్పేది అక్షరాలూ, గుణింతాలూ, వత్తులూ వంటి క్రమంలోనే అయినా.. చదువుతూ, పుస్తకాలూ, పటాలూ, సైను బోర్డులూ వంటి వాటి ద్వారా అన్ని అక్షరాలనూ, పదాలనూ చూపిస్తూ ఉండవచ్చు. అతి సర్వత్ర వర్జయేత్ అని నాణేనికి రెండో వైపున, అక్షరాలు నేర్వక ముందే అచ్చు పుస్తకాలు బొమ్మలు లేనివి, పెద్ద పెద్ద వాక్యాలూ, కఠినమైన పదాలూ, క్లిష్టమైన వాక్య నిర్మాణం, సంక్లిష్టమైన కథా వస్తువూ ఉన్న పుస్తకాలతో మొదలు పెడితే, అందునా ఈ కాలంలో, మొదటికే మోసం రావచ్చు.

తెలుగులో మాట్లాడడం అంటే ప్రతి పదమూ తెలుగే ఉండాలి అన్న అసాధ్యమైన ఆలోచన వల్ల కూడా తెలుగులో మాట్లాడడం అనేది ఒక పెద్ద పనిగా అనిపించడమూ అనుభవమే. తెలుగు నేర్చుకుని సగానికి పైగా ఆంగ్లం వాడటం ఎబ్బెట్టుగా అనిపించినట్టే మాటలు నేర్చే దశలో వాక్యం మొత్తం తెలుగు పదాలతోనే నిర్మించాలనుకోవడమూ దురాశే అనిపిస్తుంది.

ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, పిల్లలకు ఆంగ్లం ఎన్ని రకాలుగా, ఎన్ని మాధ్యమాలలో పరిచయం చేస్తున్నామో దానితో పోటీ పడేలా తెలుగుని పరిచయం చేసి వారికి అసలు అభిరుచి ఏర్పడేందుకు దోహదం చెయ్యాల్సిన బాధ్యత తల్లి దండ్రులదే. ఇది భాషాభిమానం ఉన్నవారికీ, భాషతో తమ గుర్తింపు, అస్తిత్వం, వారసత్వం మొదలైనవి ముడిపడి ఉన్నాయనుకునే వారికీ వర్తిస్తుంది. తెలుగు చదవదం, రాయడం అవసరం లేదు, మాట్లాడితే చాలు అనుకునే వారికి ఈ వ్యాసం ద్వారా చెప్పదల్చుకున్నది ఏమీ లేదు. చెయ్యాలి అనుకునే వారే ఆలోచించాలి, తగు చర్యలను చేపట్టాలి కదా? తెలుగు నేర్చుకునే అవకాశం కల్పిస్తే అప్పుడు భాషతో అనుబంధం పెంచుకోవడం ఇక పిల్లల బాధ్యత అవుతుంది అని నా నమ్మకం. అంతేగాని తల్లిదండ్రులం కదా అని వారిదైన భాష నుండి వారిని వేరు చేసే అధికారం మాత్రం లేదనిపిస్తుంది.

తరచూ పిల్లలతో కూర్చుని నెమరు వేసుకుంటుంటే భాష పెరుగుతుంది. అలాగే బంధం కూడా – భాషతోనూ, పిల్లలతోనూ.

ఇక తెలుగులో మాట్లాడడం అనేది కూడా చాలా అవసరమైన విద్యే. సాంకేతికంగా ఎదుగుతూ అందువల్ల సంబంధిత ఆంగ్ల పదజాలాన్ని విరివిగా అరువు తెచ్చుకుంటున్నాము. తెలుగులో మాట్లాడడం అంటే ప్రతి పదమూ తెలుగే ఉండాలి అన్న అసాధ్యమైన ఆలోచన వల్ల కూడా తెలుగులో మాట్లాడడం అనేది ఒక పెద్ద పనిగా అనిపించడమూ అనుభవమే. తెలుగు నేర్చుకుని సగానికి పైగా ఆంగ్లం వాడటం ఎబ్బెట్టుగా అనిపించినట్టే మాటలు నేర్చే దశలో వాక్యం మొత్తం తెలుగు పదాలతోనే నిర్మించాలనుకోవడమూ దురాశే అనిపిస్తుంది. పద్యాలూ, పాటలూ వినడమూ, వినిపించడమూ, అనిపించడమూ కూడా నోరు తిరగడానికి కొంతలో కొంత ఉపయోగపడుతుంది. పద సంపద పెరిగేందుకూ దోహదం చేస్తుంది – ముఖ్యంగా ప్రవాసాంధ్రులకు. ఇక్కడ ఎదురయ్యే సమస్య పిల్లల వయసుకు, ఆలోచనలకు, వారికి ఈ రోజులలో ముఖ్యంగా దైవ, ధార్మిక విషయాలలో కలిగే అవగాహనకు సరిపోయే తెలుగు పద్యాలూ, పాటలూ తెలిసి ఉండడం, లేదా తెలుసుకునే మార్గాలు ఉండడం. అంతర్జాలంలో మాగంటి, ఆంధ్రభారతి, తెలుగుదనం, వంటి వారి సేకరణలు అమూల్యమైన నిధులు. కాస్త శ్రమపడి వెతికితే ఆణి ముత్యాలే దొరుకుతాయి. తరచూ పిల్లలతో కూర్చుని నెమరు వేసుకుంటుంటే భాష పెరుగుతుంది. అలాగే బంధం కూడా – భాషతోనూ, పిల్లలతోనూ.

అంతర్జాలంలో తెలుగు పిల్లల కోసం, వారి తల్లిదండ్రులకు ఉపయోగపడే లంకెలు ఇక్కడ చూడవచ్చు. అక్కడ ఉండవచ్చనిపించిన లంకెలు తెలిస్తే తెలుగు4కిడ్స్ వారికి తెలియచేయవచ్చు. రంగనాయకమ్మ గారి “తెలుగు నేర్పడం ఎలా” వంటి తెలుగు పుస్తకాలతో సహా పిల్లల పుస్తకాల కోసం, AVKF వారిని సంప్రదించవచ్చు.

———————

ప్రవాసంలో తమ పిల్లలకు తెలుగు భాష పై మక్కువను పెంచుతూ పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తూ, భర్త ప్రోత్సాహ సహకారాలు, తమ పిల్లల ఉత్సాహమే పెట్టుబడిగా, తమ కుటుంబం నుంచి, తమలాంటి అనేక కుటుంబాలకు కానుకగా, తెలుగు4కిడ్స్ ను అందిస్తున్నారు లలిత. తెలుగులో పిల్లల కోసం ఆరోగ్యకరమైన వినోదాన్ని విస్తృతంగా అందించాలన్న తన ఉద్దేశానికి దగ్గరగా ఉన్న BookBox కథలను తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నారు. లలిత ఓనమాలు బ్లాగు రాస్తూంటారు.

About లలిత

ప్రవాసంలో తమ పిల్లలకు తెలుగు భాష పై మక్కువను పెంచుతూ పరిచయం చెయ్యడానికి ప్రయత్నిస్తూ, భర్త ప్రోత్సాహ సహకారాలు, తమ పిల్లల ఉత్సాహమే పెట్టుబడిగా, తమ కుటుంబం నుంచి, తమలాంటి అనేక కుటుంబాలకు కానుకగా, తెలుగు4కిడ్స్ ను అందిస్తున్నారు లలిత. తెలుగులో పిల్లల కోసం ఆరోగ్యకరమైన వినోదాన్ని విస్తృతంగా అందించాలన్న తన ఉద్దేశానికి దగ్గరగా ఉన్న BookBox కథలను తెలుగులో అందించే ప్రయత్నం చేస్తున్నారు.
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

5 Responses to తెలుగు – పిల్లలు

  1. లలిత గారు : చాలా రోజులకు ఒక పెద్ద టపా వ్రాసినట్టునారు. అభినందనలు. ఎప్పటిలాగానే సాధ్యమైనంత వివరంగా వ్రాయటానికి చేసిన ప్రయత్నం వేనవేల విధాల ప్రశంసనీయం.

    ….తెలుగులో మాట్లాడడం అంటే ప్రతి పదమూ తెలుగే ఉండాలి అన్న అసాధ్యమైన ఆలోచన వల్ల కూడా తెలుగులో మాట్లాడడం అనేది ఒక పెద్ద పనిగా అనిపించడమూ అనుభవమే…..” …. చాలా చక్కగా చెప్పారు.

    మీ మీద ఉన్న అభిమానం, గౌరవం కారణంగా , ముఖ్యంగా పాఠకుల సూచనలకు/వ్యాఖ్యలకు ఓపికగా ప్రతిస్పందించే తీరు చూసినవానిగా కొన్ని సూచనలు.

    1. మధ్య మధ్యలో మీరు చెప్పిన వాటికి ఉదాహరణలుగా మీ తెలుగు కిడ్స్ సైట్ లో నుంచి లేదా మరే ఇతర సైట్ లో నుంచి అయినా కొన్ని లంకెలను ఇచ్చి ఉంటే బాగుండేది.

    2. అలాగే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ని మిగిలిన వాటితో కలిపి ఒకే పేరాలో కాకుండా, వాటిని బుల్లెట్స్ తో చూపించి ఉండవలసింది.

    3. మీరు చెప్పదలచుకున్న కొన్ని ముఖ్య విషయాలను అయినా మీరు హైలైట్/bold చేసి చెప్పవలసింది. ఉదా : “తెలుగు చదవదం, రాయడం అవసరం లేదు, మాట్లాడితే చాలు అనుకునే వారికి ఈ వ్యాసం ద్వారా చెప్పదల్చుకున్నది ఏమీ లేదు.

    4. అలాగే మీరు చేసిన ఆయా తెలుగు సైట్స్ లో నుండి కొన్ని ఆణిముత్యాల వంటి లంకెలను (మీ పిల్లలకి లేదా/మరియు మీకు బాగా నచ్చినవి) ఇవ్వవలసింది. ఎందుకంటే ఆయా సైట్స్ లోకి వెల్లినపుడు మొదటి పేజ్ లో మొదటి చూపులో నచ్చిన articles కనపడకపోతే లేదా వాళ్లు క్లిక్ చేసిన మూడో, నాలుగో లంకెలు కూడా నచ్చకపోతే అసలు ఉన్న ఉత్సాహం కూడా పోయే అవకాశం ఉంది. అలా కాకుండా మీరు పరిచయం చేసే లంకెలతో ఆ పిల్లలలో లేదా తల్లిదండ్రులలో కొత్త inspiration/interest కలుగ జేయగలిగితే ఈ టపాయొక్క ప్రధమ ఉద్దేశ్యం నెరవేరినట్టే కదా …

  2. http://telugupadyam.blogspot.com/ says:

    లలితగారూ,
    చాలా మంచి వ్యాసం రాసారు. మీరు చెప్పినవి ముఖ్యంగా ప్రవాసాంధ్రుల పిల్లల విషయంలో నూటీకి నూరుపాళ్ళూ ఆచరించదగ్గవి.
    పిల్లలకి తెలుగు నేర్పడం కోసం మీరు చేస్తున్న కృషికూడా చాలా గొప్పది!

  3. చాలా మంచి వ్యాసం లలిత గారు.
    ఇందులో తెలుగు నేర్పే పద్ధతులు విధానాల కంటే తెలుగు చదువనూ వ్రాయనూ ఎందుకు నేర్చుకోవాలి అని మీరు రాసిన విషయాలు, కారణాలు నాకు చాలా నచ్చాయి.
    అభినందనలు.
    తెలుగువాడిని చేసిన సూచనలు కూడా ఆచరణ యోగ్యంగా ఉన్నాయి. మీరు గానీ పొద్దు సంపాదకులు గానీ వాటిని అమలు చేసి ఈ వ్యాసాన్ని మళ్ళీ ప్రచురిస్తే మంచిదనిపిస్తోంది.

  4. lalitha says:

    వ్యాఖ్యానించిన వారందరికీ ధన్యవాదాలు.

    తెలుగు4కిడ్స్ లో నాకు నచ్చినవే అన్నీను. అయినా మూడు నాలుగు లంకెల వరకూ వెళ్ళినా నచ్చినవి కనిపించలేదంటే బహూశా ఇలాంటివి వారు చూసుకోవటం లేదా? లేక వారికి నచ్చటంలేదో మరి.
    ఉదాహరణలు:

    http://telugu4kids.com/stories.aspx – కథలు – ఏడు చేపల కథ
    http://telugu4kids.com/rhymes.aspx – rhymes – వానా వానా వల్లప్పా
    http://telugu4kids.com/Taara.aspx – తార – తార ఇలా అంటోంది
    http://telugu4kids.com/TeluguPaatalu.aspx – ఆణిముత్యాలు – ఉయ్యాల, చందమామ
    http://telugu4kids.com/lettersAndNumbers.aspx – Letters and Numbers – numbers 1 to 10
    http://telugu4kids.com/TeluguMaatalu.aspx – పద సంపద – రంగులు
    http://telugu4kids.com/Padyalu.aspx – పద్యాలు – అన్ని పద్యాలూ నేను చాలా ఇష్టంగా చేసినవి

    నేను ఇంకో వ్యాఖ్య వివరంగా రాసి ప్రచురించే లోపు పోగొట్టుకున్నాను. గుర్తున్నది మళ్ళీ రాస్తాను.
    నేను ఈ వ్యాసం రాయడానికి కారణాలు:
    1. నేను రాసింది నేను కాక ఇంకెవరైనా ప్రచురిస్తారా అన్న సందేహం
    2. అంతర్జాలంలో పాఠకాదరణ మెండుగా ఉన్న మాధ్యమాలు పిల్లల విభాగం మీద ఎక్కువ శ్రద్ధ కనబరచాలి అనే నా ఉద్దేశాన్ని వినిపించడం
    3. నేను కాగడాలాగా దారి చూపించగలను, ఆత్మ సంతృప్తి కోసం వెలుగుతూ ఉండగలను. భాష అభ్యుదయానికి ఆత్మసంతృప్తి కన్నా అవసరమైన కృషి ఇంకా చాలా కావాలి అని చెప్పదల్చుకోవడం.
    4.తెలుగును పిల్లలకు దగ్గర చెయ్యాలి అని గట్టిగా చెప్పదల్చుకోవడం.

    చివరి మాటగా:
    తెలుగు4కిడ్స్ కు స్పందన చాలా బావుంది. సాయం చెయ్యడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతానికి ఈ సాయాన్ని వేరే పత్రికలు / వెబ్ సైట్లు / మాధ్యమాలకు మళ్ళించగలరు. ఇందుకు ఒక బలమైన కారణం: నా అభిరుచులు, ఆశయాలు, ఆలోచనలు నాతో కలిసి పని చేసే వారికి ఇబ్బంది కలిగించవచ్చు. లేదా నేను మొహమాటం కొద్దీ నా అభిప్రాయలతో రాజీ పడాల్సి వస్తుందేమో అనే భయమూ నాకుంది. నాలో పరిపక్వత వచ్చే వారకూ నన్ను భరించి ప్రోత్సహించి నాకు సహకారం అందించగల ఓపిక నా కుటుంబ సభ్యులకే ఉన్నది కనుక నేను వారి సాయంతో నాకు చేతనైనంత చేస్తూ ఉంటాను.

    తెలుగు4కిడ్స్ ను విస్తృతపరిచే ఆలోచన, పరిపక్వత,వచ్చినప్పుడు మళ్ళీ సంప్రదిస్తాను. అంత వరకూ మీ అభినందనలు, ఆశీర్వాదాలూ, సలహాలూ, సూచనలే తెలుగు4కిడ్స్ కి శ్రీరామరక్ష.

  5. lalitha says:

    “తెలుగు నేర్పే పద్ధతులు విధానాల కంటే తెలుగు చదువనూ వ్రాయనూ ఎందుకు నేర్చుకోవాలి అని మీరు రాసిన విషయాలు, కారణాలు నాకు చాలా నచ్చాయి.” This has been haunting me. It looked like there was something important missing in the article I wrote. I found the expression for it in the book “The New Read-Aloud Handbook” by Jim Trlease.

    The author’s effort in the book is to motivate parents to read aloud to their kids and to continue doing soeven through higher grades. Why? He says though many know how to read, they “choose” not to read. It is to get the next generation excited and enthusiastic about reading and thence to learn and grow and blossom and to continue doing so.

    The above is too simplistic way of expressing the power of reading. I hope a lot of parents read Jim Trlease’s book and get inspired. I hope someone will come out with a list of good children’s literature in Telugu the way the author did for such in English.

    I always wondered about English rhymes so related to simple daily activities so that the language and life are intertwined, being not so familiar with many like them in Telugu. Then I read the author himslef, whose mother tongue is English, wondering about them “aloud” and how they help children’s vocabulary and language skills. I wish we could unearth such in Telugu, and come up with many more and encourage ourselves and the generations to come to bond with our language more lovingly.

    It’s a good book to read and re-read and apply. If there are such books in Telugu, I hope someone would write about them.

Comments are closed.