– వీవెన్, చదువరి
2008 జూన్
-తెలంగాణాలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల పర్యవసానాలు చవిచూసిన నెల
-ఆంధ్రజ్యోతి, మంద కృష్ణ మాదిగల మధ్య తారాస్థాయి యుద్ధం – పర్యవసానంగా పాత్రికేయులను పోలీసులు నిర్బంధించిన నెల
-దేవేందర్ గౌడ్ తెదేపా నుండి బయటికి వచ్చిన నెల
-పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు తారాజువ్వల్లాగా ఎగసిన నెల.
వెరసి టపాలకు మంచి విషయాలు దొరికిన నెల.
బ్లాగుల్లో సాధారణంగా స్వగతాలో, జ్ఞాపకాల నెమరువేతలో, సమకాలీన రాజకీయ, సామాజిక అంశాల గురించో, సినిమాల గురించో చర్చలుంటాయి, అభిప్రాయాలూంటూంటాయి. సాహితీ సమీక్షలుంటాయి. అరుదుగానైనా.., లోతైన విశ్లేషణలూ సూత్రీకరణలు కూడా ఉంటూంటాయి. చాన్నాళ్ళ కిందట పప్పు నాగరాజు కవిత్వ లక్షణాలను వివరిస్తూ, కవిత్వాన్ని ఎలా ఆస్వాదించాలో విశ్లేషిస్తూ వాక్యం రసాత్మకం కావ్యం అంటూ చక్కని విశ్లేషణాత్మక, విజ్ఞానదాయక వ్యాసాలు రాసారు. గుండెచప్పుడులో సామాజిక, ఆర్థికాంశాల మీద అలాంటి టపాలు వస్తూంటాయి. అటువంటి ప్రయత్నాలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఈనెల అలాంటి టపాలు కొన్నొచ్చాయి. అవి:
- సరస్వతీ కుమార్ భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?! అనే శీర్షికతో వరసగా విశ్లేషణాత్మక వ్యాసాలు రాస్తున్నారు.
- అలాగే తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం ద్రవ్యోల్బణమ్మీద జాబు రాసారు.
చర్చలు
- బ్లాగుల్లో పాటించాల్సిన మర్యాద, సంప్రదాయాలు మళ్ళీ చర్చకొచ్చాయి. చర్చలు ఆసక్తికరంగా, వేడిగా, వాడిగా జరిగాయి. జ్యోతి బ్లాగులో ప్రమదావనంలో కిరణాల వెల్లువ జాబు ఈ చర్చకు వేదిక. జాబులో రాసిన విషయాలపై యుప్ మి అనే వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి. నిడదవోలు మాలతి తన బ్లాగులో రాస్తూ – ఈ విషయమై పెద్దల సలహాలను క్రోడీకరించి బ్లాగరుల ప్రయోజనార్థం ఒకచోట ఉంచాలని సూచించారు. ఈ జాబులో కూడా కొంత చర్చ జరిగింది. పొద్దు సంపాదకుడు రానారె క్షణికమ్ పేరిట రాసిన సంపాదకీయంలో కూడా ఇదే విషయాన్ని స్పృశించారు.
- ప్రేమపై మహేశ్ కుమార్ రాసిన బ్లాగుపై వేడిగా చర్చ జరిగింది.
- దళితులపై అత్యాచారాలను నిరోధించే చట్టంపై తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం రాసిన జాబులో కూడా మంచి చర్చ జరిగింది.
హాస్యం/వ్యంగ్యం
- పాండురంగడు సినిమా ఇంద్రుడికీ నచ్చిందంట!
- అమెరికాలో టిక్కెట్ల ఇక్కట్ల గురించి విహారి
- నేనూ గొప్ప చిత్రకారినినే… అంటూ మీనాక్షి తన చిన్నతనపు నటనా చాతుర్యాన్ని పంచుకుంటున్నారు.
- నేను సాఫ్టువేరు జాబు మానేస్తున్నా. K రాసిన వ్యాఖ్య చదవడం మర్చిపోకండే!
- ఊసుపోక అప్పులూ ఆప్తులూ అంటూ మాలతి ఆప్తుల అప్పులు తీర్చేస్తున్నారు.
- బ్లాగువనంలో ఇంగ్లీషన్నయ్య– సులక్షణక్కయ్య
- వానొచ్చినా వరదొచ్చినా… ఆగదు ఏ సీరియల్ నీ కోసం
- బ్లాగుసింహారెడ్డి మరియు బ్లాక్షనిజం
- మీ బ్లాగులో అసలు వ్యాఖ్యలే రావట్లేదా అయితే, కామెంటు ఎటూ లేదు లుక్కైనా వెయ్యి బ్రదర్ అని పాడుకోండి!
- బ్లాగువనంలో హిడింబి హిడింబి నడుమ శ్రీవిద్య
- నీల దంతాల కర్ణపిశాచులపై అబ్రకదబ్ర గోడు
సామాజికం/రాజకీయం
ఈ నెల ముఖ్యాంశాలు: ఉప ఎన్నికలలో తెరాసకి ఎదురుదెబ్బ, ఇందన ధరల పెంపు, నెల చివర్లో తెలుగుదేశం పార్టీ నుండి దేవేందర్ గౌడ్ రాజీనామా.
- రాదిక నీ కోసం సఖీ ! రాదిక వసంతమాసం…. అంటూ తెరాస ఓటమిపై, ఇన్ని పార్టీలెందుకు ? అంటూ మన ప్రజాస్వామ్య వ్యవస్థపై తన అభిప్రాయాన్ని తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం తన కలగూరగంప బ్లాగులో వివరిస్తున్నారు
- ముందస్తు ఎన్నికలు వస్తాయోమో అని అబ్రకదబ్ర తెలు-గోడు విశ్లేషిస్తున్నారు
- కెసిఆర్ నిర్ణయం సరయినదే అని కరీంనగర్ బ్లాగర్లు అంటున్నారు
- మహిళలు – ”మహా”రాణులే
- పెట్రోల్ ధర మండుతోంది, ఎడ్లు కట్టండి! అంటూ మహేశ్ కుమార్ పెట్రోలు ధరలో చేరే వివిధ అంశాలని వివరిస్తున్నారు
- పెట్రో ధరల పెంపులో రాజకీయాలని దూర్వాసుల పద్మనాభం వివరిస్తున్నారు.
- పెట్రోలు ధరలపై నీచ రాజకీయం అంటూ కిరణ్ వివరిస్తున్నారు.
- కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని కడపలోనే స్థాపించాలి అంటూ త్రివిక్రమ్ వివరిస్తున్నారు.
- మద్యం మత్తులో జోగుతున్న ప్రభుత్వాన్ని చెరుగుతున్నారు పద్మనాభం.
- గ్లోబలు వార్మింగు సరే. చదువరి చెప్పే లోకలు వార్మింగు సంగతి చూడండి.
- భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి? అంటూ తన టపాశృంఖలంలో శంఖారావం సరస్వతి కుమార్ వివరిస్తున్నారు.
- తెలంగాణా ఉద్యమం చేతులు మారుతోంది అంటూ దేవేందర్ గౌడ్ రాజీనామాపై చదువరి విశ్లేషణ
- మనిషి నిలువుగాపెరిగితే అందం, నగరం అడ్డంగా పెరిగితే చందం. అందుకు వ్యతిరేకంగా జరుగుతున్న అ(ధో)భివృద్ధికి కారణం కేంద్రీకృత అభివృద్ధి విధానాలు అంటూ దేవన అనంతం వివరిస్తున్నారు.
- ఈ విశాల ప్రపంచంలోమన భవిష్యత్తు మన చేతుల్లోనే… అంటూ వేణుగానం ఆలపిస్తున్నారు.
స్వగతాలు, స్వ గతాలు
- తన హిమాలాయాలలో ట్రెక్కు అనుభూతులని ముగిస్తున్నారు ప్రవీణ్.
- ఫణి ప్రదీప్ తన జర్మనీ ప్రయాణ విశేషాలని కొనసాగిస్తున్నారు.
- హైదరాబాదు పోలీసొల్లు చురుకు అంటూ కరీంనగర్ వాళ్ళు నెమరువేసుకుంటున్నారు
- తన కాలేజి జీవితం లోని అనుభవాలని మహేశ్ కుమార్ కొనసాగిస్తున్నారు.
- అప్పుడు ఏమి జరిగిందంటే… వర్షం… మొదలయ్యింది అంటూ క్రాంతి తన జ్ఞాపకాలని కురిపిస్తున్నారు.
- బడి గంట మోగింది అంటూ తన మనసులో మాట చెప్తున్నారు సుజాత.
- మన భరతం పట్టే భాగ్యనగరం ఆటోల గురించి సరిగమలు పలికిస్తున్నారు సిరిసిరిమువ్వ
- నన్ను దోచుకోని తాజ్ మహల్ అంటూ తన ఢిల్లీ యాత్రా విశేషాలని తెలు-గోడు పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. (రెండో భాగం)
- వూరెళ్తున్నానోచ్! అంటూ వూరెళ్లాకా ఏమేం చేయాలనుకుంటున్నారో కూడా చెప్తున్నారు చరసాల ప్రసాద్.
- పెళ్ళంటే నూరేళ్ళ వంటా? అంటూ తన మనసులో మాటని బ్లాగులో పెట్టేసారు సుజాత.
- నేనూ, మా నాయనా, సినిమాలూ అంటూ తండ్రుల దినోత్సవం సందర్భంగా కత్తి మహేశ్ కుమార్ వాళ్ళ నాన్నతో తన జ్ఞాపకాలని నెమరువేసుకుంటున్నారు.
సాహిత్యం
- మీరు చదివారా? రాయలసీమలో ఆధునిక సాహిత్యం.
- స్ఫూర్తి దాయకం ‘ఇడ్లి-వడ-ఆకాశం’ అంటూ విఠల్ వెంకటేష్ కామత్ ఆత్మకథకి యండమూరి స్వేచ్ఛానువాద రచనని మనసులో మాట సుజాత పరిచయం చేస్తున్నారు
- నూటికో కోటికో ఒక్కరు అనే తన అనువాద సీరియలుని కొల్లూరి సోమశంకర్ తన బ్లాగులో ప్రచురిస్తున్నారు.
- రోజూ రచన చేయండి! అంటూ మందహాసం చేస్తున్నారు సూర్య ప్రకాశ్.
- నూటపదహారు సరదా కథలు, నూటపదహారు రూపాయలకే అంటూ భమిడిపాటి రామ గోపాలం గారి సరదా కధలని గడ్డిపూల సుజాత పరిచయం చేస్తున్నారు.
సినిమా
ఈ నెల విశేషం పాండురంగడు సినిమానే. ఆ తర్వాత దశావతారం.
- పాండురంగడిపై టపాలు: మౌర్య, వసంతకోకిల: No thanks!!, “బ్యాండు” రంగడు
- బిగ్ బక్ బన్నీ అనే చిట్టి ఆనిమేషన్ సినిమాని వీవెన్ పరిచయం చేసారు.
- దశావతారం – కమల్ విశ్వరూపం అంటూ కాలాస్త్రి శ్రీ
- చూడకూడని సినిమా అంటూ లిటిల్ మిస్ సన్ షైన్ అనే సినిమాని కథలు కాకరకాయలు బ్లాగులో సమీక్షించారు
- ‘రెడీ’ సినిమా సమీక్షని పూతరేకుల నవీన్ అందిస్తున్నారు.
- గమ్యం చేరినమా? అంటూ గమ్యం సినిమాపై తన స్పందనని జేప్స్ తెలియజేస్తున్నారు.
- తప్పకుండా చూడవలసిన సినిమా – ఆమిర్ (హిందీ) అంటూ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు పర్ణశాల మహేశ్ కుమార్.
ఇతరత్రా
- అమ్మ గురించి బ్లాగర్ల టపాలతో జాన్ హైడ్ కనుమూరి అమ్మ అనే సంకలనాన్ని వెలువరించారు.
- నా కలాపోసన అంటూ తెలు-గోడు తాను తీసిన కొన్న ఫొటోలను ప్రదర్శిస్తున్నారు.
- పురాణ ప్రలాపం అనే పుస్తకాన్ని సీబీరావు తన బ్లాగులో విడుదల చేసారు. ఈ పుస్తకంపై ఇన్నయ్యగారి సమీక్ష, ఓ విలాపం అంటూ మురళీ కృష్ణ గారి పరిచయం చదవండి.
- తెలుగు బ్లాగులు ఎందుకు చదవాలో వివరిస్తున్నారు పూర్ణిమ.
- ఎమరాల్డ్ మిఠాయి దుకాణానికి వెళ్లమంటున్నారు దిలీప్.
- గ్రహాలు వక్రించడం అంటే ఏమిటో నాగ మురళి చెప్తున్నారు. ఆలకించండి.
- విమానాల్లో “బొద్దు”గుమ్మలు ఉండకూడదా? ఎయిరిండియా వారి ఇటీవలి నిర్ణయం గురించి వికటకవి
- సీబీరావు ఊహలన్నీ ఊసులై బ్లాగు సమీక్షని ప్రారంభించి మరో టపాలో ముగించారు.
- చిలకమర్తి లక్ష్మీనరసింహం వర్ధంతి (జూన్ 17) సందర్భంగా ఆయన గురించిన విశేషాలను తెలుగురధంపై కొంపెల్ల శర్మ ఊరేగిస్తున్నారు.
- నీళ్లు వేస్ట్ చెయ్యకండ్రా బాబూ! అంటున్న సీనుగాడి గోల వినండి. విని, అ గోలలోని కిటుకులూ తెలుసుకోండి.
- పిల్లల్లో నిజాయితీని పెంపొందించడానికి గానూ ప్రభుత్వం పాఠశాలల్లో నిజాయితీ పెట్టెలు ఏర్పాటు చేస్తోందంట. ఈ కమామీషు మా పాఠశాలలో నిజాయితీ పెట్టె . . . అంటున్న వేద సంహిత వర్మగారి టపా చూడాల్సిందే.
కొత్త బ్లాగులు
- భూతాపాన్ని మనమెందుకు పట్టించుకోవాలి అంటూ ముక్త లేఖ మొదటి లేఖ రాసారు.
- దేశమా నీ గమ్యం ఎటు? అంటూ తన కొత్త బ్లాగు ఈ దేశంలో దూర్వాసుల పద్మనాభం ప్రశ్నిస్తున్నారు.
- నేను ఇప్పుడు బ్లాగే మీనాక్షిని అంటూ బ్లాగులోకంలోకి విచ్చేసారు.
- మురళీ గానం
- చెన్నై చల్లగా వుంది అంటూ ఛీ వెధవ జీవితం అనే బ్లాగుతో వంశీధర్ తెలుగు బ్లాగులోకంలోకి అడుగుపెట్టారు.
- లీలామోహనంగా విజయమోహన్
- సిరిమల్లి అనే బ్లాగులో స్వర్ణకారుడు అశోక్ బంగారు ఆభరణాల గురించి వివరాలందిస్తున్నారు.
- కోస్తా కబుర్లు చెప్పడానికి ప్రభాకర్ రావు బ్లాగులోకం లోకి వచ్చేసారు.
ఈనెల బ్లాగు
ఆ బ్లాగు పుట్టి రెండే నెలలైంది. రెణ్ణెల్లలోనూ 40కి పైగా జాబులొచ్చాయి. ఎత్తిపోతల కార్యక్రమంలో ఎక్కడినుండో తెచ్చిపెట్టిన సరుకేం కాదది; బ్లాగరి మేధలోచి ఉద్భవించిన అసలు సిసలు ఆలోచనలే ఆ జాబులు. చాలా జాబులు ‘కత్తి‘లా ఉన్నాయని వ్యాఖ్యాతలు అన్నారు. పర్ణశాల ఆ బ్లాగు, కత్తి మహేశ్ కుమార్ ఆ బ్లాగరి. తన కాలేజీ కబుర్ల గురించి రాసినా, తెలుగు సినిమా గురించి రాసినా, మానవ సంబంధాల గురించి రాసినా ఆయన ఆలోచనలు ఆసక్తికరంగా ఉంటాయి. చదివింప జేస్తాయి. ఆయన భావాలు కొన్ని వైవిధ్యంగా ఉండి, కొంతమందికి ఆమోదయోగ్యంగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. విభేదించినవారితో అర్థవంతమైన చర్చకు ఈ బ్లాగరి సిద్ధంగా ఉంటారు.
తన బ్లాగులోనే కాక, ఇతర బ్లాగుల్లోనూ వ్యాఖ్యలరూపంలో మహేశ్ తరచూ కనిపిస్తూంటారు. జూన్ నెలలో వివిధ బ్లాగుల్లో జరిగిన చర్చల్లో వేడీ వాడీ కలిగిన వాటిలో మహేశ్ పాత్ర ప్రముఖంగానే ఉంది. నవతరంగంలో సినిమా విశ్లేషణలు కూడా రాస్తూంటారు.
-వీవెన్, చదువరి పొద్దు సంపాదకవర్గ సభ్యులు
పొద్దువారు నాబ్లాగుని మరోసారి గుర్తించినందుకు కృతజ్ఞతలు. మంచిమాట ఎప్పుడు ఎక్కడ విన్నా సంతోషమే.
అలాగే మరొకటి కూడా ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా (అనువాదాల)తూలికగురించి ఇప్పుడే ఆక్స్ ఫర్డ్, మాంచెస్ఠర్ యూనివర్సిటీల సైటులో చూసాను.
http://www.intute.ac.uk/artsandhumanities/cgi-bin/fullrecord.pl?handle=20080619-1110542.
నాతూలిక నాదే అయినా తెలుగువారందరికోసం చేసింది కనక మీరు కూడా ఆనందిస్తారనీ …మరో చిన్న కుట్ర ఏమిటంటే నాసైటు మొహం గురించి వారన్నమాట చూసి మీరేదైనా చేస్తారేమోనని … 🙂
జూన్ నెలలో రవి గారు కాళిదాసు గురించి రాసిన చక్కని వ్యాసాన్ని గురించి మీ సమీక్షలో రాయకపోవడం నన్ను నిరాశకి గురిచేసింది.
http://blaagadistaa.blogspot.com/2008/06/blog-post_14.html
ఈ బ్లాగులో జూన్ నెల టపాలు అన్నీ చాలా బాగున్నాయి.
July blogs rocks!
They are too lively!!
అరే! ‘ఈ నెల బ్లాగు’ నాదే!!
ఆశ్చర్యంతో పాటూ, చాలా ఆనందంగా కూడా ఉంది.
ఏదో నా ఆలోచనల్ని పంచుకుందామనుకున్నానే గానీ, ఇంత స్పందన ఉంటుందని తెలీదు.
అందరికీ నెనర్లు.
🙂
సంపాదకీయం, ప్రత్యేక వ్యాసం సంగతి దేవుడెరుగు!
కనీసం, మన యోధుడు “సాం” మనెక్షా ని గురించి ప్రస్థావించి ఉంటే బాగుండేది.
I know it is not possible to cover everything!
Yet,
There was some discussion about Telugu medium Vs English Medium in this month!
నా మూడు టపాలని గుర్తించారా! బోలెడన్ని నెనర్లు.
జూన్ నెల బ్లాగుల విహంగ వీక్షణంలో’భారతదేశానికి ఎటువంటి వ్యవస్థ కావాలి..?!’ అనే శీర్షికతో రాస్తున్న నా వ్యాసాలను ప్రత్యేకంగా ప్రస్తావించినందుకు పొద్దు సంపాదకవర్గ సభ్యులైన వీవెన్,చదువరి గార్లకు కృతజ్ఞతలు.
ఇంటర్నెట్టు,
టీవీ ఛానెళ్లూ వచ్చాక…
ఎవరికీ ఓపికా,తీరికా వుండటం లేదు.
అందుకే పుస్తకాలు చదవడం అనేది
రోజురోజుకీ బాగా తగ్గిపోతోంది.
అసలు, మొదటినుంచీ పుస్తకాలను కొని చదవే అ లవాటు
తెలుగువాళ్లలో చాలా తక్కువనే చెప్పాలి.
పుస్తక ప్రచురణలూ తక్కువే. ఇక
ఇప్పుడు కొత్త పుస్తకాలు ప్రచురించి చేతులు కాల్చుకునేందుకు
ప్రచురణ కర్తలు ఇంకా భయపడుతున్నారు.
అయినా అనేక కష్ట నష్టాలు భరిస్తూ తెలుగులో మంచి పుస్తకాల
ప్రచురణని కొనసాగిస్తున్న ఏకైక సంస్థ
హైదరాబాద్ బుక్ ట్రస్ట్.
వాళ్లు ఇప్పుడు ఒక బ్లాగును కూడా ప్రారంభించారు.
అది చాలా ఆసక్తికరంగా, అద్భుతంగా వుంది.
దానిని మీరు ప్రస్తావించకపోవడం వెలితిగా అనిపించింది.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ బ్లాగ్ యుఆర్ఎల్ ఇది:
ఇప్పటికైనా సందర్శించండి:
hyderabadbooktrust.blogspot.com
నా పుస్తక పరిచయాన్ని గురించి రాసినందుకు థాంక్స్. అంత కన్నా.. ఇప్పుడు ఏమీ చెప్పలేను. ఎందుకంటే, ఈ పుస్తకం, పెద్దగా ఆదరణ పొందలేదు. అలానే, నా పరిచయం కూడా !
వీవెన్ గారు,
నా మొదటి బ్లాగ్, ప్రమదావనం ని కూడలిలో ఉంచినందుకు ధన్యవాదాలు. మొదటి టపాకి తమ వ్యాఖ్యలు పంపించిన మహా బ్లాగరులందరికీ నా కృతజ్ఞతలు.మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో మరిన్ని టపాలు చేర్చే ఉత్సాహం ఉరకలు వేస్తోంది. మరొకసారి కృతజ్ఞతాభినందనలు…
bit is very useful to us