పరిష్కారాలు పంపినవారు
మొత్తం ఐదుమంది. తప్పుల్లేకుండా నింపినవారు ఎవరూలేరు.
సుజాత (మనసులో మాట) (ఒక తప్పుతో), భైరవభట్ల కామేశ్వరరావు (2 తప్పులతో), మరో మాట చెప్పు (2 తప్పులతో), bh.aditya369 (3 తప్పులతో), వికటకవి (11 తప్పులతో).
1ధ |
ర్ష |
2ణ |
3ము |
X |
4వే |
5మ |
6న |
శ |
త |
క |
7ము |
న్య |
X |
8య |
ము |
నా |
తీ |
ర |
ము |
X |
X |
X |
న్ను |
X |
9అం |
త్య |
ము |
X |
రు |
X |
10ధా |
ర్మి |
11కు |
డు |
X |
12ప |
లా |
స |
X |
13న |
గ |
X |
ని |
X |
ని |
X |
14తా |
X |
15గి |
ల |
16క |
X |
న |
X |
X |
17నె |
X |
18కౌ |
పీ |
19పా |
X |
20కా |
డి |
21మా |
ను |
22లు |
X |
23న |
క |
X |
X |
ల్కు |
X |
కై |
X |
తం |
X |
24వ |
25ద |
రు |
X |
26పే |
27ము |
28రి |
29మ్మ |
X |
30మూ |
గ |
31ది |
X |
డ |
X |
32రా |
గు |
లు |
33కి |
ర |
ణం |
X |
X |
34వ |
35గ |
X |
36ల |
బ |
X |
ఆ |
X |
|
X |
X |
X |
37 ము |
ని | 38క |
న్న |
డి |
39సే |
ద్యం |
X |
X |
40ఊ |
41రో |
42డు |
X |
43ము |
ల |
హ |
X |
44తు |
త |
45వృ |
కో |
ద |
రు |
డు |
X |
46మ |
నం |
X |
47కా |
రా |
X |
ఆధారాల వివరణలు:
అడ్డం:
1 శ్షనివారం పూట వెంకన్నదర్షనానికిపోతే తూగులయ్యకు ఎదురయిన తిరస్కారం (4) ధర్షణము
4 ఎవ రేమన్నా ఈ శంచరీ తెలుగువాడే చెయ్యగలడు (7) వేమనశతకము. తెలుగువారి మనసుల్లో చేరిన శతకం, “ఎవ రేమన్నా” లోని శబ్దం ఆధారంగా.
8 నాతి రయమున రమ్మని పిలువ, బాస చేసి రావేల మదనగోపాలా? (6) యమునాతీరము. బాస చేసి రావేల మదనగోపాలా అన్నది యమునా తీరమున అంటూ మొదలయే పాత సినిమాపాటలో వినిపించే మాట. నాతి రయమున – Anagram.
9 కడగొట్టుది (3) అంత్యము
10 కార్మికుడితో శృతికలిపిన ధన్యాత్ముడు (4) ధార్మికుడు
12 శ్రీకాకుళంలోని ఈ పట్టణం ముంగిట ఢంకా మోగిస్తే ఒక జూదం (3) పలాస. శ్రీకాకుళం జిల్లాలోని ఈ పట్టణం ముందర ఢంకా మోగిస్తే వినిపించే జూదం ఢంకాపలాసు.
13 ఎద్దులబండిని నడపాలంటే యిక్కడే కూర్చోవాలి. (2) నగ. ఎద్దులబండిలో దాన్ని నడిపేమనిషి కూర్చునే స్థలాన్ని నగ/నొగ అంటారు.
15 కప్పీ (3) గిలక
18 సర్వసంగపరిత్యాగి ఆచ్ఛాదనలో ఆంగ్ల పంచితం (2) కౌపీ. Cow–Pee. సన్యాసి ఆచ్ఛాదన ‘గో’చీ. దీన్నే ‘కౌపీ’నము అంటారు.
20 గోవుబిడ్డల అర్రులరగదీసినది యజమానులు కాదట (5) కాడిమానులు. ఎద్దుల మెడ(అర్రు)లపై కాడిమాను రాపిడివల్ల వాటి మెడలు, కాడిమాను రెండూ అరుగుతాయి.
23 మంచు మౌంటెనబాబు గారి సతీమణి గత నెల లేదట. నిజమేనా? (2) నక. మంచుమౌంటెనబాబు హిమవంతుడు. ఆయన భార్య మేనక. గతనెల మే. దాన్ని తీస్తే మిగిలేది ‘నక’.
24 సత్యం చెప్పమన్నారు పెద్దలు. చెప్పిందేచెప్పి విసుగెత్తించారు సదరు పోతు రాజావారు. (3) వదరు. “సత్యం వద, సదరు” శబ్దాల ఆధారంగా.
26 కూర్చుండ మాయింట కురిచీలు కలవు __ తోడ నేనల్లించి యుంటి (2) పేము
28 తెగుళ్లు తగుల్తాయిగానీ పుడతాయా? ఏమో ఆ పుట్టించేవానికే తెలుసు! (2) రిమ్మ. పుట్టించేవాడు బ్రహ్మ. బ్రహ్మకయినా పుట్టు రిమ్మ తెలుగు – సామెత ఆధారంగా.
30 ఆడది, నోట్లో నాలుకలేనిది. మాటలు రానిది. (3) మూగది.
32 రాలు గుత్తుల్లో గుండ్రని తృణధాన్యాలు (3) రాగులు – Anagram.
33 యుద్ధానికి ముందు కీ యిస్తే చాలు చీకట్లను తరమగలదీ ఋజువర్తని (3) కి’రణం’.
34 ఏడుపు (2) వగ
36 నెత్తీనోరూ బాదుకోవడం కూడా సగమే చేస్తానంటే ఎలా? (2) లబ. ‘లబలబా నెత్తీనోరూ బాదుకోవడ’మనే జాతీయం నుంచి.
37 ఇలామంతునాయుడుగారు కన్నడిగుడా? మునుపెన్నడో రైతని విన్నాను! (7) మునికన్నడిసేద్యం. ఈ నవలలో మునికన్నడి తండ్రి ఇలామంతునాయుడు.
40 తెలంగాణ వ్యవహారంలో మొరటోడు (3) ఊరోడు
43 కోపమొస్తే బలరాముడు దీన్ని తిరగేసి ఒహటిచ్చుకుంటాడని పురాణం (3) ములహ. బలరాముడు హలమును తిరగేసి …
44 చివర దబాయిస్తారనుకుంటే మరీ అంతపరుషమా? (2) తుత. చివర సమానార్థకం తుద. దబాయించడంమంటే దకారం వాడటమే. కానీ దకారానికి పరుషం తకారం. సరళాదేశసంధి సూత్రాన్ని గుర్తుచేసుకొని చెప్పండి!
45 మధ్యమాగ్రజునికి సింగపు నడుముందన్నారు సరే, నకనకలాడితే నక్కకడుపోడనక మరేదో అన్నారే! (5) పాండవమధ్యముడు అర్ఝునుడు, వాని అన్న భీముడు. ఛాంగురే బంగారు రాజా పాటలో ‘భళా అచ్చమైన సింగపు నడుఁవుంది’ విన్నారా? భీమునికి వృకోదరుడనే పేరు కూడా వుంది. ఎందుకంటే … తెలిస్తే మీరే చెప్పండి!
46 గాలికంటే వేగవంతమైనవారు వాళ్లెవరో ఎందుకౌతారు? తిరగేస్తే బెంగళూరెవరిది? (2) గాలికంటే వేగవంతమైనది మనసు. వాళ్లెవరో ఎందుకౌతారు, అయితేగియితే అది మనమే. కావాలి. మనం. మనం తిగగేస్తే నంమ. నమ్మ.
47 అందరూ మిమ్మల్నలా పిలుస్తూవుంటే అనుమానమొచ్చింది, మీరు ఘాటైన కిళ్లీకథలుగానీ చెబుతుంటారా మాస్టారూ? (2) కారా. కారా ‘కథల’ మాస్టారి గురించి తెలీనివాళ్లెవరు?
నిలువు:
1 అన్యధాభావము లేని పుణ్యవతి (2) ధన్య (anagram)
2 చెయ్యీకాలూ సక్రమంగా వుండగనే ఈ నటుని పీచు లాగి తిరగేసినారా! (7) ణయత్యసలకైకా. కై అంటే చెయ్యి (ఉదా. కైమోడ్చు – చేతులుజోడించి నమస్కరించు). కాల నుంచి కాలు అనే శబ్దం. పీచు లాగి, తిరగేసి’నారా’ లతో ప్రసిద్ధ నటుడు కైకాలసత్యనారాయణను రాబట్టవచ్చు.
3 మూడు మూలు, సాగదియ్యకుండా (3)ముముము
4 విడుదలకై వేడుకొను తీరునుగనవే (6)వేతీరుగనను. ఈ ఆధారంలోని మూడు ‘వే’లతో, నాలుగు అడ్డం వేమనశతకం ఆధారంతో చిన్న మార్పు.
5 మిషను తిరిగితేనే లక్ష్మీకటాక్షం (2) మర. machine ను తెలుగులో మర అంటాం కదా, తిగగేస్తే రమ, అంటే లక్ష్మి.
6 అడ్డదిడ్డంగా పాతరేస్తే నిక్షేపంగా వుంటుందా? (4) నముధాని. నిక్షేపము, పాతర అనే పదాలను బ్రౌణ్యములో చూడండి.
7 పాత కాలంలో …. (2) మున్ను. మునుపు, గతంలో…
9 నోటి కుహరపు పైకప్పా? ఐతేమాత్రం, లాగి వదిల్తే అలాగే ఉంటుందా? (3) అంలాగి. నోటి కుహరపు పైకప్పా? అంటే అంగిలా? లాగి వదిలేస్తే అలాగే వుండదట. మారుతుంది. ఈ మూడక్షరాల పదం ఎలా మారుతుందంటే – చుట్టుపక్కలున్న గళ్లను బట్టి.
11 ఆ పని కానిచ్చేస్తే పోలా? అదేదో ఖూనీ అన్నట్టు భయపడతావే? (2) కుని. ఖూనీ అనే శబ్దం ఆధారంతో కుటుంబ నియంత్రణకు పొడిరూపం.
14 కాలేజీలో లెక్కలు చెప్పే బిందాస్ విశారదుడీ మేస్త్రీ (2) తాపీ. ఆంధ్రవిశారద బిరుదాంకితుడు, లెక్కల మేస్టారు తాపీ ధర్మారావు. “తాపీగా” అనే మాటకు హిందీలో బిందాస్ అనే మాట సమానార్థకం కూడా కదా!?
16 కాడు రమ్మనేదాకా కడుపుకింత __ కావలసిందే కదా!(2) కడి. వల్ల’కాడు’ రమ్మనేదాకా కడుపుకు కావలసింది ఇంత కబళం (ముద్ద).
17 అంతర్జాలాంధ్రుల ప్రేమపూర్వక కృతజ్ఞత (3) నెనరు
19 పాలకోసం పరిగెత్తిన కవివీరుడీ క్షీరజధవుడు. ఎక్కడివాడో! (4) పాల్కురికి. పాలకోసం పరుగెత్తిన అనడంలోనే పాలకురికిన అనే అర్థం స్ఫురించాలి. పాలసముద్రం నుంచి పుట్టినవాడు సోముడు అనగా చంద్రుడు. క్షీరజధవుడు అంటే ఇక్కడ సోమనాథుడు. వీరశైవుడైన కవి. ఈయన వూరు పాల్కురికి ఔనోకాదో ఖచ్చితంగా నిర్ధారణ కాలేదు.
21 మా గతం నుంచి వచ్చిన ఒక మహర్షి (3) మాతంగ. మా గ తం – ఈ మూడక్షరాల్లో దాగిన ఋషి – Anagram.
22 విలువైనవివేనట. వలవలా ఏడ్చి తలకిందులైతే సగం నిలిచాయట. (2) లువ. విలువైనవి, వలవలా అనే శబ్దాలతో వలువలు అనే మాట స్ఫురించాలి. “వలువలు” లో సగమే నిలిచాయట. అవీ తలకిందులుగా.
25 భయం కాదు. దాన్ని మించినదే. (2) దడ
26 తల్లి తన బరువు దించుకోగానే బిడ్డ తెంచుకొనేదీబంధాన్నే! (2) పేగు
27 మొదట్నుండీ అనేకదంతములు తుదవరకూ. ఒక వరుసలో వుంటేనా!? (5) ములుఆద్యంత. మొదటినుండి తుదవరకూ – ఆద్యంతములు.
29 కిందనుంచి పైకి పోవద్దన్న ఏరుతల్లి (3) మ్మరలే. ఏరుతల్లి శబ్దం పోలేరమ్మను గుర్తుకుతెస్తుందని … కిందనుంచి పైకి రాస్తే వచ్చేది పో”లేరమ్మ” వ్యతిరేకార్థం. అడ్డం 28, 33 లతో ఈ పదం తయారు చేయగలరని ఆశించాం.
31 స్వర్గమే ఆకాశము (3) దివము
32 కార్పొరేటు కళాశాలలు మా బడికిరా అని పిలిచేదిందుకోసమే (3) రాబడి. “బడికిరా”లో దాగిన పదం.
35 గమనించి చూస్తే మీకో మెలికల దారి కనబడకపోదు (4) గనిముమ. దారికి పర్యాయపదం నిగమము. ఈ పర్యాయపదాన్నీ, అది ఎలా మెలితిరిందో చెప్పే శబ్దం “గమనించి” – Anagram.
36 హన్నన్నా! పేరుకు పెద్ద నలుడే, మరి ఫీల్డు మారినంత మాత్రాన తలమునకలైతే ఎలా? (3) లన్నహ. బృహన్నల అనే పదం స్ఫురించడం కోసం పెద్ద(బృహత్)నలుడు, హన్నన్నా అనే మాటలు. తల మునకలేసిందంటే బృ మునిగిందని.
38 ముందు, వెనక చూడం అంటారా? చెయ్యడమే కదా కావలసింది! (3) కలనం. ఈ పదానికి ముందూవెనుక గల అక్షరాలు “చూడం” అంటున్నాయి. కలనం అంటే చెయ్యడమని అర్థం.
39 ఏమీ ___ లింగా? (3) సేతురా
40 అదరగొట్టడం ఇదరగొట్టడం ఊరకనే శ్రమ. పొమ్మనలేక పొగబెట్టాలంటే కావలసిందిదే (2) ఊద.
41 నోరూరే సిక్సర్లు, ఛీరులీడర్ల జోరు – స్టేడి’యమున పారె’నాంగ్ల హోరు (2) రోరు. Roar.
42 ఏఁవయ్యా పీనాసి బసవయ్యా, తలాడించడంలోనూ పొదుపేనా!(2) డుడు
అయితే వీరతాడు వేసేసుకుంటున్నా!
29 అడ్డం: ఫలితాలు చూసాక కూడా నాకు క్లూ చదివితే పోలేరమ్మ గుర్తుకురావట్లేదు.
మమ సుజాత గారు, అభినందనలు
కొత్తపాళీ గారు,
ఈ ‘మమ ‘ భలే తగిలించారు మీరు నాకు! శుభ కార్యాలప్పుడు పురోహితుడు ‘మమ అనుకోండి ‘ అని చెప్పినట్టు, ఏ టపా, లేక కామెంట్ రాస్తున్నా ‘మమ ‘ అనుకోవాల్సి వస్తోంది.
రానారె గారూ!
అడ్డం 45: భీముడు ఎంత తిన్నా పొట్ట ఖాళీగానే ఉన్నట్లు వీపుకు అంటుకునే ఉంటుందట తోడేలుకున్నట్లు. అందుకని అతణ్ణి వృకోదరుడు అంటారట. డిగ్రీలో మా తెలుగు లెక్చరర్ ఒకాయన చెప్పారు. 🙂
గడి పంపించేసాక, 29 నిలువు తిరగబడ్డ “దారమ్మ” సరైన సమాధానం అనుకొన్నాను. “ఏరుతల్లి” = “గోదారమ్మ”, “పో” = “గో” వద్దంటే మిగిలేది “దారమ్మ” అన్న లాజిక్కుతో.
4 (నిలువు, అడ్డం), మొదటి అక్షరం “వే”వా, “యే”వా అని చాలారోజులు ఆలోచించాను. చివరికి టాసేద్దామనుకొన్నాను. కానీ మళ్ళా నా బుఱ్ఱకో చిన్న లాజిక్కు తట్టింది. మన తెలుగులో(వాడుకభాషలో) “వేమన” – “యేమన” అయ్యే అవకాశం ఉంది కాని, “యే తీరుగనను” – “వే తీరుగనను” అవ్వదు కదా అని! దాంతో “యే” పెట్టి పంపించేసాను.
గడి మరీ కష్టంగా ఉంటున్నందువల్ల ఎక్కువ సమాధానాలు రావడం లేదా లేక తెలుగు నెజ్జనాలకి తీరికుండకా?
పూరకులకు అభినందనలు (వీరతాళ్లు మీరే వేసేస్కున్నారు కదా! మిగిలింది అభినందనలే 🙂 ). ప్రయత్నించిన వారందరికి కృతజ్ఞతలు.
సుగాత్రిగారు – వృకోదరుడి పొట్టసంగతి చెప్పినందుకు థాంకులు. ‘తెలుగు లెక్చరర్’ అంటున్నారంటే మీరు తెలుగు చదువు చాలాకాలమే చదివారన్నమాట!
సుజాతగారు, కామేశ్వరరావుగారు – 29నిలువు – ఆధారం మరింత స్పష్టంగా యిచ్చివుండాల్సింది, నిజమే. ఇది నా మొదటి గడి కూర్పయిపోయింది. మిమ్మల్ని యిబ్బందిపెట్టినందుకు మన్నించండి. 4అడ్డం – ఆధారాన్ని నేను సులభంగానే యిచ్చాను. మా ఎడిటర్లు కొంచెం మార్చారు. 🙂