జూన్ గడి పై మీ అభిప్రాయాలు ఇక్కడ రాయండి.
పాత గడులు
1. 2008 మే గడి, సమాధానాలు
2. 2008 ఏప్రిల్ గడి, సమాధానాలు
3. 2008 మార్చి గడి, సమాధానాలు
4. 2008 ఫిబ్రవరి గడి, సమాధానాలు
5. 2007 డిసెంబరు గడి, సమాధానాలు
6. 2007 నవంబరు గడి, సమాధానాలు
7. 2007 అక్టోబరు గడి, సమాధానాలు
8. 2007 ఆగష్టు గడి, సమాధానాలు
9. 2007 జూలై గడి, సమాధానాలు
10. 2007 జూన్ గడి, సమాధానాలు
11. 2007 మే గడి, సమాధానాలు
12. 2007 ఏప్రిల్ గడి, సమాధానాలు
13. 2007 మార్చి గడి, సమాధానాలు
కిందటిసారేమో వెన్నముద్ద నోట్లో పెట్టి, ఈసారి చెఱకుముక్క చేతికిచ్చారు!
23 అడ్డం తిరగబడినట్టుంది కానీ ఆ సూచనేదీ క్లూలో లేదు?
ఒక్క సూచన, గడిలో కొన్ని పెద్ద పెద్ద పదాలు దాదాపు ఖాళీలు పూరింపుము స్థాయికి ఎదిగిపోతున్నాయి. గడి సాధ్యమైనంతగా పలు వైపుల నుంచి ఆధారాలతో ఉంటూ క్లిష్టంగా ఉండాలి కానీ ఖాళీలు పూరింపుము లా ఉండకూడదు. ముఖ్యంగా దీనివల్ల ఒక్కో సారి ఒకటికన్న ఎక్కువ సమాధానాలు ఉండే అవకాశం ఉంది. అంతే కాక ఒక పదానికి ఆధారాలు పలు వైపులనుంచి లేకపోవటం వల్ల క్రాస్ చెకింగ్ అవకాశం లేక ఊహాగానం ఎక్కువ అవొచ్చు.
కామేశ్వరరావు గారితో ఏకీభవిస్తున్నా. తికమకలు మరియు మకతికలు ఉంటే చెప్పి తీరాలండోయ్.
కామేశ్వరరావు గారు & వికటకవి గారు,
23 అడ్డం ఆధారం సరిగానే ఉంది.
కామేశ్వరరావు గారు & వికటకవి గారు, మీ వ్యాఖ్యలకు కృతజ్ఞతలు. 23 అడ్డంలో తికమకేమీ లేదు. 🙂 వివరణ చూడండి.
రానారె గారు,
నా సందేహానికి కారణం, హిమవంతుని భార్యని “మేన” అని కూడా అంటారు. మరి దానర్థం “మే”(గత నెల) “న”(లేదు) అని వస్తుంది కదా. మీ ఆధారంలోకూడా “నిజమేనా?”లో ఉన్నది “మేన”. అంచేత సమాధానం “మేన” అనుకున్నాను. కాని రెండో అక్షరం “న”అవ్వాలి కాబట్టి తిరగబడిందేమో అనుకున్నాను. పొద్దువారి వివరణతో సందేహం తీరింది!
మొత్తానికి, నాకు రాని రెండు ఆధారాలూ తప్పించి తక్కినవన్నీ అదిరేయి:-)