మే గడి సమాధానాలు, వివరణలు

మే గడికి జవాబులు పంపినవారు మొత్తం ఏడుగురు.
అంతా సరిగా నింపినవారు భైరవభట్ల కామేశ్వరరావు కాగా
ఒక తప్పుతో వికటకవి,
2 తప్పులతో ఆదిత్య, రాఘవ, దైవానిక, జ్యోతి వలబోజు,
3 తప్పులతో వైదేహీ శశిధర్.

ఈసారి “రాముడండగా” ఎక్కువమందిని తికమకపెట్టింది.

1

2 వె

3 ది

*

4 కం

5 చం

6 కా

7

రం

ధా

*

క్కి

*

*

8 చి

డా

*

9 మా

*

10 రం

11 భా

సం

12 భో

గం

*

13

డి

*

14

15 ని

*

మా

*

16

*

రు

*

17 కై

పు

*

రం

18 టీ

*

19 రా

ము

డం

గా

*

20 జీ

21 మూ

*

లా

*

జు

*

*

సే

*

22

డి

యా

రం

23 వి

పం

24 చి

*

*

25 దా

వా

26

లం

*

*

*

*

రు

*

27

గు

*

*

28

29

30 కా

*

31

రు

డు

*

రా

*

32

రం

దం

వి

*

వ్వ

*

33 వా

మూ

*

నా

*

*

34 లా

35 గం

డి

*

36

కం

*

37 అం

కో

38

రి

39 సం

*

40 సై

*

లు

*

41

భి

శం

*

ఆధారాల వివరణలు:

అడ్డం:

1 ఆటగత్తే కానీ నీతీ, (ఉప)జాతీ పుష్కలంగా ఉన్నదే! (5) ఆటవెలది
వెలది అంటే స్త్రీ. వేమన పుష్కలంగా నీతిపద్యాలు చెప్పింది ఆటవెలదుల్లోనే. ఛందస్సుపరంగా ఇది పద్యాల్లో ఒక ఉపజతి.
4 కాంతాకారం చంపుతే సంసారం పెరుమాళ్ళు ఊరంత (3, 3) కంచంత కాపరం anagram.
పెరుమాళ్ళు ఉండే ఊరు కంచి.
8 ఇది కరాటేడా చిన్నా, వెనకనుంచీ కొట్టకూడదు (2) చిడా అనెది కరాటేలో ఒక stance (anagram)
9 మారననువాడు అరవనాయకుడు కాదు అనంగుడే (2) (hidden word)
మార అంటే మన్మధుడు. (తెలుగులో మారుడు). అరవనాయకుడు మారన్ ధ్వనిసూచన.
10 నరులుకోరే భోగం, మునులుకోరే సంగమ్‌, వెరసి నలకూబరుడికి మాత్రం పాపం భారం (5) రంభాసంభోగం
నరులకు, మునులకు కామన్ గా ఉండే కోరిక స్వర్గంలో రంభతో సుఖించాలని. నలకూబరుడు రంభ ప్రియుడు. భోగం, సంగమ్‌, భారం కలిపితే రంభాసంభోగం (anagram)
13 ఇదే (2) గడి
14 నీరజతో రాత్రి నీకు తగునా (3) రజని అంటే రాత్రి (anagram)
16 ఇది జడపదార్థమంటే రసికులూరుకోరు (2) జడ. రసికుల సరసతకు జీవగర్ర కదా? ఎలా ఊరుకుంటారు? (hidden word)
17 మత్తిలిన కైక కళ్ళు కెంపులెక్కె (2) కైపు – అంటే మత్తు. (anagram)
18 పద్యానికి తోడుగా ఇదుంటునేగాని ఇప్పటివారికి అర్థంకాదు (2) టీక – అంటే వ్యాఖ్యానం లేక తాత్పర్యం
19 శ్రీరామరక్ష ఉండగా చింతలేల (5) రాముడండగా; అండ=రక్ష
20 జీతమూ బత్తెమూ లేని అనంత గగనసంచారి (3) జీమూత. జీమూతమంటే మేఘం. అనంతం అంటే, ఇక్కడ పదం అంతం కాలేదని సూచన. (anagram)
22 గాడీ తో గయా!రండి మీరు టైం చూసుకుని (4) గడియారం (anagram)
23 విలోమంలో పంచమం పలికే వీణ (3) విపంచి అంటే వీణ. (anagram)
25 కోర్టెక్కిన కార్చిచ్చు (4) దావానలం. (కోర్టెక్కేది దావాతో).
27 వెళ్ళమంటే ఏనుగు వెళ్తుందా? (2) ఏగు = వెళ్ళు. (hidden word)
28 బెల్లం దొరికే ఊరిలో పల్లీలు పరారు (3) అనకా. (బెల్లం దొరికే ఊరు అనకాపల్లి. దాంట్లోంచి పల్లి పరారైతే మిగిలేది అనకా.)
31 సరుగుడు చెట్లలో తిరుగుడు చక్రవర్తి(4) సగరుడు భూలోకాన్ని ఏలిన చక్రవర్తుల్లో మున్నెన్నదగినవాడు. (anagram)
32 మరి అందం దగ్గరైతే ఎంత మధురం? (3) మరందం. మరి+అందం దగ్గరైతే మరందం. మరందమన్నా, మకరందమన్నా ఒకటే. మరి మధురమే కదా? (anagram)
33 చిన్నపిల్లల కడుపునొప్పికి మొదటి మందు వాకిలి మూల సాగిందేమో చూడండి(2) చిన్నపిల్లల కడుపునొప్పికి మొదటి మందు వాము. సాగితే వామూ. వాకిలి మూల అదే ఉంది. (hidden word)
34 తెగేవరకూ తప్పదు కదండీ, మరి కానీండి (3) లాగండి.
36 కతకత కంగు, చిల్లగింజ మింగు (3) కతకం – అంటే చిల్లగింజ. (hidden word)
37 పర్యంకం తిరగబడితే మృదులాంత్ర నిపుణిడి ఒళ్ళోచేరిన వయ్యారి కాదూ (4) అంకోపరి అంటే laptop. (anagram)
39 బజారుకెళ్ళి సంతసించండి (2) సంత (పల్లెటూళ్ళలో వారం వారం జరిగే బజారు) (hidden word)
40 మీరేదంటే మేమూ అదే (1) సై
41 ఎదురు తిరిగిన ప్రశంస (4) అభిశంస

నిలువు:
1 ఆలా పడుతున్న నీటిప్రవాహానికి సున్నాచుట్టండి – మీకిప్పుడు కావాల్సిందదే. (3) ఆధారం. ధార అంటే ప్రవాహం. ఆలా పడుతున్న (ఆ) ధారకు సున్నా చుడితే ఆ+ధారం. గడి నింపేటప్పుడు మీకు కావలసిందదే కదా?
2 బొక్కసమందలి రొక్కమునంతయు బొక్కలాడు నక్కల తొక్కిసలాటను గనిన మిక్కుటముగ పుట్టు ____బు తమకు (3). వెక్కసం – అంటే వెగటు.
3 ప్రతిరోజూ నదిగండి కొడితే, ప్రజల పరిస్థితేమిటో? (5) దినగండం (anagram)
4 కథలుచేరే చోట పక్షిరాజు పాట్లా (7) కథలు చేరే చోటు కంచి. పక్షిరాజు గరుడుడు. వెరసి కంచిగరుడసేవ.
5 వీరబాదుడు బాదే దూర్వాసుడి లాటి నాన్నకి కాన్వెంటు కుర్రాడు పెట్టుకొన్న ముద్దుపేరులా లేదూ (3) చండాడి. చండశాసనుడిలాంటి డాడీకి తగినపేరే కదా?
6 డిజీగారి కాపురములో మరక మంచిదికాదట. (4, 2) కామారపుజీడి. అంటుకుంటే ఒకంతట వదలదని సామెత. (anagram)
7 గోపీనాథ్ మొహంతి జరపజాలని ఒరియా నవల? (3) పరజ. ఒరియాలో గోపీనాథ్ మొహంతి రాసిన ప్రసిద్ధ నవల పరజ.(anagram)
11 పలకా,భలపం పట్టి సత్యభామ కూచిపూడివారింటికి చేరింది (5) భామాకలాపం. కూచిపూడి భాగవతుల భామాకలాపం ప్రసిద్ధం. (anagram)
12 ధారానగరం కవిరాజభోజ్యం చేసినవాడు (4) కవిపోషకుడు భోజరాజు. అతడి రాజధాని ధారానగారం. (anagram)
15 మరో రకారం చేరినా ఇది నీతరం ఎల్లప్పటికీ కాదేమో (4) నీతరం. మరో రకారం (రం) చేరితే నిరంతరం = ఎల్లప్పుడూ. (anagram)
21 ఆసక్తి పెరగాలంటే పిడికిలి ..లట (2) మూయా. గుప్పెట మూసి ఉన్నంతసేపే ఆసక్తి. తెరిస్తే ఏమీ మిగలదు అంటారు కదా అనుభవజ్ఞులు?
22 క్లుప్తంగా చెయ్యగలరా? (2) గలం. చెయ్యగలరా అన్నప్రశ్నకు సంక్షిప్తసమాధానం.
23 చేమకూర వేంకటకవి చెప్పిన అర్జునుడి అడ్రసు (6) చేమకూర వేంకటకవి రాసిన కావ్యం విజయవిలాసం. విజయుడంటే అర్జునుడు. విలాసమంటే అడ్రసే కదా?
24 నిశ్శబ్దంలో వినిపించే వరరుచి సడి (5) చిరుసవ్వడి. (anagram)
25 మూడుగుడులదాత దాక్కోవడమెందుకు? (6) దాగుడుమూతలు (anagram)
26 జనానాలో రాజుగారికిచ్చే కానుక (4) నజరానా (anagram)
27 రోజులు మారాయండీ – దుక్కిదున్నబోతే కరువాయె (4) ఏరువాక. రోజులు మారాయి సినిమాలో ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా పాటుంది కదా? (anagram)
28 ఎవరికోసం, మరలమరల ఈ నిఘంటువులెవరికోశం? (5) అమరకోశం అనేది సంస్కృతంలో ప్రామాణిక నిఘంటువు. (anagram)
29 నగరంలో నెత్తుటికాలవ? (2) నరం. రక్తవాహిక కాబట్టి నరం నెత్తుటి కాలువ అయింది. (hidden word)
30 ఆకాశం కానిది మరి భట్టబాణుని కావ్యవిలాసమే (4) అంబరమంటే ఆకాశం. కాదంటే కాదంబరి – భట్టబాణుడు రాసిన కావ్యం
35 బొంతకి తగ్గదే ఇది (2) గంత గంతకు తగ్గ బొంత అని సామెత కదా? దాన్ని తిరగేశాం.
37 అలెక్సాండరు తోడుగా తక్షశిల యువరాజండగా (2) అంభి. పురుషోత్తముడిపై పగ కొద్దీ అలెక్జాండరును ఇండియాపై దండెత్తమని ఆహ్వానించి, అతడికి సహకరించిన తక్షశిల రాజు.
38 తంబూరా ఎట్నుంచి పలికినా సత్తా ఒకటే. (2) పస. తంబురాలో పలికే స్వరాలు సపస.

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.