నెలవంక

— విశ్వకవి రవీంద్రుని ‘నెలవంకకు’ స్వేచ్ఛానువాదం: రవి

టక్కరి పోస్ట్ మాన్

అమ్మా! ఎందుకలా దిగులుగా నేల మీద కూర్చున్నావు?
తెరిచిన కిటికీ నుండి వర్షపు చినుకులు నిన్ను తడిపేస్తున్నా పట్టించుకోవు.
గడియారం నాలుగు కొట్టింది విన్నావా? అన్నయ్య స్కూలు నుండి వచ్చే వేళయింది.

ఇవాళిలా కొత్తగా ఏమయిందే నీకు?
నాన్న నుండి ఇవాళ ఉత్తరం రాలేదనా?
పోస్ట్ మాన్ తన సంచీలో దాదాపు రోజూ ఉత్తరాలు తెస్తూనే ఉన్నాడుగా!
నాన్న ఉత్తరాలు మాత్రం తనతో దాచుంచుకుని చదూకుంటాడు. పోస్ట్ మాన్ ఓ దొంగ!

అమ్మా! దాని గురించి బాధపడకే!
రేపు పక్కూరిలో జాతరటగా, పనిమనిషితో పేపరు, పెన్ను తెప్పించి పెట్టు.
నేనే నాన్న ఉత్తరాలు రాస్తా. నువ్వు ఏ తప్పూ కనుక్కోలేవు.
నాకు A నుండి K వరకు రాయడమొచ్చు.

ఎందుకే నవ్వుతావు ?
నేనూ నాన్నలా బాగా ఉత్తరాలు రాస్తానంటే నమ్మట్లేదు కదూ ?
నేను పేపర్ కి మార్జిన్ దిద్ది, ఎంచక్కా గుండ్రంగా రాస్తాగా!
ఉత్తరం రాసి, నాన్నలా తెలివి తక్కువగా పోస్ట్ మాన్ సంచిలో వేస్తాననుకున్నావా?
ఆలస్యం చేయకుండా నేనే నీ దగ్గరకు వచ్చి ఒక్కో అక్షరం చదివిస్తాగా!

నాకు తెలుసులే, పోస్ట్ మాన్ కు మంచి ఉత్తరాలు తెచ్చి నీకివ్వడం ఇష్టం లేదని.

~~~~~~~~~~~~~~

వర్షం

దట్టమైన అడవి మీదకు దండెత్తి వస్తున్న చిక్కటి మేఘమాల!
అబ్బాయ్, బయటకు వెళ్ళకు.
నిరుత్తరమైన అంబరాన్ని చుంబిస్తూ, చెరువు పక్క తాటి చెట్ల వరుస.

చింతచెట్టు కొమ్మపై భారంగా వాలిన కాకుల సమూహం.
నల్లబడుతున్న తూరుపు తీరం.
కంచె దగ్గర బెదురు చూపులతో పాడి ఆవు.

బాబూ, ఆవును లోపలకు తెచ్చేవరకూ ఇక్కడే ఆగు.

చెరువులో జారిపోతున్న చేపల్ని వేటాడుతూ జాలర్లు.
అమ్మను వేధిస్తూ పరిగెడుతున్న తుంటరి పిల్లాడికి మల్లే వర్షపు నీటి పిల్ల కాలువ.
అదుగో! పడవ వాడి కోసం ఎవరో పిలుస్తున్నారు.

అరే అబ్బాయ్! ముసురేసింది. కుండపోత. నది గర్జిస్తూంది వింటున్నావా?
గంగానది నుండి నిండు కడవలతో ఇండ్లకు వెళ్ళటానికి వేగిర పడుతున్న పడుచులు.
దీపాలు వెలిగాయి.
అబ్బాయ్, బయటకు వెళ్ళకు!
నిర్మానుష్యమైన వీధి. జారుతున్న అరుగు.
వలలో చిక్కిన అడవి దున్న ఆర్తనాదంలా వెదురు చెట్ల మధ్యనుండి వీస్తున్న ఝంఝా మారుతం.

——————
కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన రవి, ప్రస్తుతం ఉద్యోగరీత్యా బెంగళూరులో నివాసముంటున్నారు. 2007 సెప్టెంబరు నుండి బ్లాగాడిస్తూ ఉన్నారు.
గతంలో ఇతర వెబ్‌సైట్లలో సమీక్షలు పేరడీలూ రాసేవారు.

తెలుగు మీద మమకారంతో పాటు, వీరికి సంస్కృత భాషతో పరిచయమూ ఉంది.

This entry was posted in కవిత్వం and tagged , . Bookmark the permalink.

8 Responses to నెలవంక

  1. రవి గారు, ఇంత మంచి రవీంద్రుని రచన తెనిగించినందుకు ధన్యవాదాలు!

  2. Subrahmanyam Mula says:

    చాలా బావుంది రవి గారు… keep it up!

  3. రవి says:

    @ నిషి గంధ గారు, @సుబ్రహ్మణ్యం గారు: నెనర్లు. మీకు నచ్చితే నా ఈ క్రింది టపా కూడా చదవండి.

    http://blaagadistaa.blogspot.com/2008/04/blog-post_25.html

  4. Sowmya says:

    @Ravi garu:
    బాగున్నాయండీ… I just began reading the collection “Crescent Moon” after reading this translation.
    కానీ, ఓ చిన్న సలహా:
    అనువాదం చేసినప్పుడు, కాస్త ఆ అసలు కవిత పేరు కూడా రాయరాదూ? (ఇక్కడ మీ టైటిల్స్ ని బట్టి కనుక్కోవచ్చు కానీ, జనరల్గా చెబుతున్నా…)

  5. sravanthi says:

    Ramnathareddy garu,

    i am Sravanthi, working as software engineer at Hyderabad now.

    mee blog chadivaaka chala anandanga undi. Naaku emi cheppalo maatlalu raavatam ledu sorry.

    Maadi proddatur andi. akkade putti perigaanu…meedi proddatur ani choosi chala anandapaduthunnau. chala manchi rachanalu cehsthunnaru. Telugu ante naaku chala istam..maa office lo naa meeda english lo maatladamani restriction unna nenu matram telugu lone matladathaanu ippatiki…antha istam. Kaani ippdu anipshtundi..istam unet saripodu …inka nennu telugu basha gurunchi chalaa nerchukovaali ani

    Naaku pina cheppina takakri post man chala nachindi.. hyderabad lo vivdha Bharathi(Radio FM channel) vintoo vuntaanu kaali time lo..andulo oka program vasthunid Jaya Mala ni…aa program ki letters anni mana indian army lo unna vallaki vaalla inti nundi vasthaayi..ilaanti kathane oka papa letter raasthe vinnau…nijanga edupothundandi .. mana army valla families enthagaa vallani miss avuthunnaro…ani.

    mee katha naaku aa paapa raasina letter gurthuku theppinchindi andi.

    Thank you
    Keep writing good.

  6. రవి says:

    @సౌమ్య గారు, ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషపడుతున్నాను. మీరు తప్పక తోటమాలి (Gardener), ఊరపిచ్చుకలు (Stray Birds), మిణుగురు పురుగులు (FireFlies) లాంటివన్నీ చదవండి. నా కవిత ప్రచురింపబడటానికి సార్థకత లభించింది అనుకుంటున్నాను . ఈ క్రింది లంకె లొ కొన్ని రచనలు దొరుకుతవి.

    http://www.ebooksread.com/authors-eng/rabindranath-tagore.shtml

    ఇక పోతే మీ సూచన గురించి. రవీంద్రుని రచనలు బెంగాలి లో రాయబడ్డాయి. మనం చదివేవి ఆంగ్ల అనువాదాలు. మీరు చెప్పినట్టు అసలు కవితను ఉదహరించాలంటే, బెంగాలి కవితను ఉదహరించాలి. తిరిగి (ఆంగ్ల) అనువాదాన్ని ఉదహరించడం అంత బావోదని నా అభిప్రాయం.

    @స్రవంతి గారు, చాలా సంతోషంగా ఉంది. మీకు వీలయితే రవీంద్రుని నెలవంక చదవండి.

    మీరు తప్పుగా అనుకోకపోతే 2 విషయాలు. 1. వీలయితే దయచేసి తెలుగులో రాయగలరు. 2. నాపేరు రవి. మీరు చెప్పిన రామనాథుడు ‘రానారె ‘ గా బ్లాగు లోకంలో సుపరిచితుడు.

  7. Sowmya says:

    @Ravi:
    Crescent Moon was translated by Tagore himself. కనుక, మీరు ఆంగ్ల టైటిల్స్ ఇవ్వడం లో తప్పేమీ లేదు అని నా అభిప్రాయం. పైగా, మీ అనువాదాలు చదివే వారిలో బెంగాలీ లో దీన్ని చదివి ఉన్న వారికన్నా ఆంగ్లం లో చదివే వారి సంఖ్యే ఎక్కువ కూడా.

  8. ramnarsimha says:

    రవి గారు,
    `పోస్ట్ మాన్` కవిత చాలా బాగుంది.
    అభినందనలు.

Comments are closed.