ఇటువంటి సంఘటనలతో నాకు తెలీకుండానే నాకు సుబ్బారావు మీద ఓ విధమైన వేర్పాటు భావన పెరిగిపోయింది. అంతకుముందులా నేను ఎక్కువగా మాట్లాడలేకపోయేదాన్ని. అవసరమైతే తప్ప అతడితో మాట్లాడేదాన్ని కాదు. ఎక్కువ సమయం మౌనంగానే గడిపేదాన్ని. నాలో ఆ నిర్లిప్తతని పసిగట్టి సుబ్బారావు ఒకటి రెండుసార్లు అడిగాడు కూడా.
“మౌనంగా ఉంటున్నావు రేఖా ఈ మధ్య. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా?” అని.
“అటువంటిదేం లేద”ని సర్దిచెప్పి, తప్పించుకున్నా.
ఇక మా విడాకులకు దారితీసిన విషయం ఏమిటంటే
నాకు ఈ మధ్యనే చాలామందికి చిన్నవయసులోనే వచ్చే దూరదృష్టి లోపం ఏర్పడింది. దానికి ‘గ్లాసెస్’ వాడమన్నారు డాక్టర్లు. ఎందుకో అప్పుడే గ్లాసులు వాడడం నాకిష్టం లేకపోయింది. అందుకే ‘కాంటాక్టు లెన్సులు’ తీసుకున్నా. రెండు కంటిపాపల మీద జాగ్రత్తగా అమర్చుకోవలసిన ఆ లెన్సులు వాడడం కూడా నాకు చేతకాలేదు. అందుకే నా ‘సైట్’ ని శాశ్వతంగా నివారించే ‘లేజర్ ట్రీట్ మెంట్’ గురించి సుబ్బారావుతో చెప్పి, ఆ ట్రీట్ మెంట్ తీసుకుంటానని అడిగా.
ఆ మాటకి సుబ్బారావు ససేమిరా “ఒప్పుకోన”న్నాడు. “‘లేజర్ ట్రీట్ మెంట్ కొంతమంది విషయంలో ఫెయిలవుతుందనీ, దురదృష్టవశాత్తూ ఆపరేషన్ ఫెయిలై నేను అంధురాలైతే తను జీవించలేడనీ, కనుక ఆ విషయంలో మాత్రం తను రాజీపడే ప్రసక్తే లేద”నీ ఖరాఖండిగా చెప్పేశాడు.
కానీ, మా హాస్పిటల్ డాక్టర్లు మాత్రం ‘ఎక్కడో కొన్ని కేసులు ఫెయిలయినంత మాత్రాన ట్రీట్ మెంట్ ని తప్పు పట్టడం సరికాద’న్నారు. ‘అటువంటిదేం వుండబోద’ని నాకు ధైర్యం చెప్పారు. సుబ్బారావుకి తెలీకుండా ఓ రోజు లేజర్ ట్రీట్ మెంటు ద్వారా ఆపరేషన్ ముగించుకుని, ఏమీ ఎరుగని దానికి మల్లే సాయంత్రానికి యిల్లు చేరాను. ఎందుకంటే ఆ ఆపరేషనుకి ఎక్కువ సమయం అవసరం లేదు.
ఆపరేషన్ ఆయితే సక్సెస్ అయి నా కళ్లు పూర్వంలా బాగా కన్పించసాగాయిగానీ, ఎట్లా తెలిసిందో ఏమో ఈ విషయం కాస్తా సుబ్బారావుకి తెలిసిపోయింది. అది తెలిసిన రోజున సుబ్బారావు చాలా వేదనకి గురైనట్టున్నాడు.
ఆ సాయంత్రం ఇంటికి రాగానే నావైపోసారి చూసి, మౌనంగా వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు. ఎప్పుడూ ఉత్సాహంగా కన్పించే అతడలా మౌనం దాల్చడం చూసి, దగ్గరకెళ్ళి, “ఏమైంద”ని అడిగాను. సుబ్బారావు సూటిగా నా కళ్ళలోకి చూస్తూ, “లేజర్ ట్రీట్ మెంట్ తీసుకున్నావటగా?” అన్నాడు.
నేను అదిరిపడ్డాను. సమర్ధింపుగా ఏదో చెప్పబోయాను. అంతలోనే అతడి కళ్ళలో నీళ్ళు, ముఖంలో సీరియస్ నెస్ చూసి భయంతో ఆగిపోయాను. తప్పుచేసినదానిలా తలదించుకున్నాను. ఎందుకంటే తన తల్లి చనిపోయిన రోజున కూడా సుబ్బారావు కంట తడిపెట్టగా నేను చూసెరగను.
నా మౌనం చూసి సుబ్బారావే అన్నాడు.
“చూడు రేఖా! ఆపరేషన్ చేయించుకోడం తప్పుకాదు. ఇలా నన్ను ఛీట్ చేయడం తప్పు. ఎందుకంటే ఇంతకుముందొకసారి చెప్పాను -“నీతో మా జీవితాలు కూడా ముడివడివున్నాయ”ని. అయినా, నేనెందుకు ఆ ఆపరేషన్ కి సుముఖత చూపలేదో ఆపరేషన్ సక్సెస్ అయింది గనుక నీకిప్పుడు అర్ధంకాదుగానీ, ఒకవేళ అదే ఫెయిలయివుంటే ఏమయ్యుండేది? జీవితాంతం గ్రుడ్డిదానిగా జీవించేదానివి. అప్పుడు మా గతేమిటి? నేను మాత్రం నిన్ను నా జీవితంలోకి ఖచ్చితంగా రానిచ్చేవాడ్నికాదు. ఎందుకంటే భర్తను ఏమార్చి ఆపరేషన్ కెళ్ళడం, ఒక అక్రమ సంబంధం పెట్టుకోవడం కన్నా తక్కువ పనిగా నాకు అన్పించదు.” చెప్పి సుబ్బారావు అక్కడ్నుంచి లేచి, వెళ్ళిపోయాడు.
విభ్రాంతి చెంది చేష్టలుడిగి నేనక్కడే నిల్చుండిపోయాను.
ఆ సంఘటన తర్వాత సుబ్బారావు మళ్ళీ మామూలుగానే వుండగలిగాడు గానీ, ఆ పని నావల్ల కాలేదు. ఎప్పుడూ ఏదో అపరాధ భావనలో గడిపేదాన్ని. దానికి తగ్గట్టుగానే సుబ్బారావు నేను ఆదమరచి నిద్రబోతున్న ఉదయం వేళల్లో తనే కాఫీ కలుపుకొచ్చి నన్ను నిద్ర లేపేవాడు. నేను పూలమొక్కలకి నీళ్ళుపోయడం మరచిన రోజున, ఆ పని తను చేసి చూపించేవాడు. అలాగే బాబుకి కాంప్లాన్ యివ్వడం మరచినప్పుడు, తనే పాలలో కాంప్లాన్ కలిపి, తాగిస్తూ కన్పించేవాడు.
ఎంతైనా సుబ్బారావు అహంభావి. బాబు జ్వరం తనే చూసి, తనే డాక్టరుకి చూపించకపోతే.. ఆ జ్వరమేదో నన్నే చూడమని చెప్పి, నేనూ డాక్టర్నేగా? నన్నే పరీక్షించమనొచ్చుగా? లేదంటే డాక్టరు దగ్గరకి నన్నూ వెంటబెట్టుకు వెళ్ళొచ్చుగా? అదంతా తన ఆధిక్యత చూపుకోడం కోసం. అలాగే రాత్రికి రాత్రి బాబుకి జ్వరం పెరిగి వుండొచ్చు. ఒకవేళ అప్పటిదాకా మేలుకునున్న నేను అప్పుడే నిద్రలోకి జారుకునీ వుండొచ్చు. అంతమాత్రాన బాబు బాధ్యతంతా సుబ్బారావు తనమీదే వేసుకోకుండా నన్ను నిద్రలేపి ఆ తడిబట్ట పట్టీ వేసే పనిలో నన్నూ భాగస్వామిని చేయవచ్చు. కానీ చేయడు. అంతా తనే చేయాలనే స్వార్థం సుబ్బారావుది. తను తెలివైనవాడిననే అహంభావం. మంచితనం ముసుగులో ఎదుటి వ్యక్తిని వంచించే తత్వం.
ఆలా ఒకటనేమిటి? ప్రతి పనిలోనూ సుబ్బారావు తన ఆధిక్యతని చాటుకునేవాడు. పైగా ‘అటువంటి క్రమశిక్షణ ప్రతిమనిషి జీవితంలోనూ వుండాల’నేవాడు. నేను అతడిని చూసి సిగ్గుపడని రోజు లేదంటే అతిశయోక్తికాదు. చివరకి బాబు కూడా నాకు దూరమయ్యేడు. వాడూ వాళ్ళ డాడీతోనే ఎక్కువగా గడుపుతూ ‘అటాచ్ మెంట్’ పెంచుకున్నాడు.
కానీ, ఇంత తెలిసిన సుబ్బారావు, శాస్త్రీయమైన ‘లేజర్ ట్రీట్ మెంట్’ ని దేనివల్లనో అంగీకరించలేకపోయాడు. ఆ విషయంలో మాత్రం పక్కా నిరక్షరాస్యుడిలా ప్రవర్తించాడు.
ఎందుకో సుబ్బారావుతో కలిసి జీవించడం యిక నాకు సాధ్యం కాదనిపించింది. విడిపోవాలని నిశ్చయించుకున్నా. ఎందుకంటే అతడి పక్కన నిల్చుని, అతడితో సహజీవిస్తూ, అనుక్షణం మనసును కష్టపెట్టుకుంటూ జీవించడం నావల్ల కాదని నాకు తెలుస్తూనే వుంది. అలాగని బాబుని అతడికి దూరం చేయదలచుకోలేదు. వాడ్ని సుబ్బారావుతోనే ఉండనిచ్చా. మా మమ్మీ, డాడీలకెలాగో సర్దిజెప్పుకుని, నేను మా యింటికొచ్చేశా.
“ఆది నా విడాకుల వృత్తాంతం!” అంది సురేఖ చెప్పడం అయిపోయిందన్నట్టు.
* * *
సురేఖ విచిత్ర విడాకుల ఉదంతం విని నేను నిర్ఘాంతపోయాను.
మానవ సంబంధాలు, విలువలలోని ఔచిత్యం, సున్నితత్వం గురించి నేను తెలీనివాడ్ని కాదు. అయినా సురేఖ వైవాహిక జీవితం పరిశీలించాక నాకవన్నీ మళ్ళీ మరింత విశదంగా భోదపడినట్టయింది. మనం తప్పు చేయకపోవడం పెద్ద గొప్పనుకుంటాం. కానీ కాదు. ఆవతలి వ్యక్తులు మన చర్యలకి ఏ విధంగా స్పందిస్తున్నారో, ఏ విధమైన బాధననుభవిస్తున్నారో గ్రహించుకుని మసలుకోవడం అంతకన్నా గొప్పగా, ముఖ్యంగా నాకు తోచింది.
అంతలోనే సురేఖ, “ఇప్పుడు చెప్పు. నేను చేసింది తప్పంటావా?” అంది. ఆపైన, పక్కకి తొలగిన చున్నీని వత్తైన ఛాతీ మీదికి లాక్కుంది.
నేనామె ప్రశ్నకి సమాధానం యివ్వకుండా, “ఇంతకీ ఏ కారణాలతో అంటే ఏ ‘గ్రౌండ్స్’ ని ఆధారం చేసుకుని యిచ్చింది నీకు కోర్టు విడాకులు?” అన్నా.
“ఏదో! చెత్తాచెదారం. అన్నీ అబద్దాలే. ఆ లాయరు చెప్పమన్నవన్నీ కోర్టులో చెప్పాను. మొత్తం మీద సుబ్బారావుని చేయకూడనంతటి దోషిని చేస్తేనే వచ్చాయి విడాకులు.” అందామె బాధగా.
ఎవరో పనిగట్టుకుని తీర్చిదిద్దినట్టుండే సురేఖ మృదువైన పెదాలు అసత్యాలు పలికి, అసలుని నకిలీ చేయడం నాకు నచ్చలేదు. అందుకే –
“సుబ్బారావుని దోషిని చేయడం నీకు తప్పనిపించలేదూ?” అడిగాను.
“అనిపించింది. కానీ అలా అనుకుంటూ పోతే నాకు విముక్తి లభించదే. అయినా నాకు తెలిసిందొక్కటే. ముందు నా జీవితం నాకు ముఖ్యం. నా మనసు, దాని బాగోగులు.. దానికి నొప్పి కలుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత, నాదేనని నా ప్రగాఢ నమ్మకం. నా జీవితానికీ, నా మనసుకీ, సుబ్బారావు బాధలతో నిమిత్తం ఉందని నేననుకోను. ఇక మా బాబు జీవితం అంటావా? వాడికేం? సుబ్బారావు జీవించివున్నంత కాలం వాడికేలోటూ వుండదు!” అంది నమ్మకంగా.
“పోనీ, నువ్వు ప్రపంచానికి సుబ్బారావుని దోషిగా చూపడం అతడికి కోపం తెప్పించలేదా?”
“లేదు. కోర్టు విడాకులకు అనుమతిచ్చిన రోజు రాత్రి సుబ్బారావు మా యింటికొచ్చాడు. నన్ను పట్టుకుని పసివాడిలా వలవలా ఏడ్చాడు. నేను లేకుండా జీవించలేనన్నాడు. తన బిడ్డని తల్లిలేనివాడిగా చేయొద్దని వేడుకున్నాడు.”
“నువ్వేమన్నావు?”
“అతడ్ని కోర్టుకీడ్చి విడాకులు సంపాదించిన దాన్ని ఏమంటాను? కుదరదన్నాను. విసిగించకుండా వెళ్ళమన్నాను. ఏం చేయగలడు సుబ్బారావు? అలాగే ఏడుస్తూనే, బాబుని భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. బాబు కూడా వెళ్తున్నంతసేపూ నన్ను చిత్రంగా చూస్తూనే వున్నాడు. ఆ దృశ్యం చూసి నా కడుపు తరుక్కుపోయింది. ఆ తర్వాత, రెండురోజులపాటు ఏడుస్తూనే గడిపాను.” అంది సురేఖ. ఆమె కళ్ళలో కన్నీరు పొంగింది. మళ్ళీ తనే –
“చెప్పు! నేను చేసింది తప్పేనంటావా?” అడిగింది.
ఆమెకి తన ప్రవర్తన కొంత అనిశ్చితికి గురిచేసినట్టుంది. తన ప్రవర్తనలోని మంచిచెడుల్ని నిగ్గుదేల్చుకునేటందుకు ఆమె నా అభిప్రాయానికి స్వాగతం పలుకుతూ, ఆతృత కనబరుస్తోంది. ఎందుకంటే సురేఖ దృష్టిలో నేనొక పరిణతి చెందిన వ్యక్తిని. అందుకే –
“ఏం చెప్పను సురేఖా. కవితలల్లీ, రచనలు చేసీ, విలువలేమిటో కళాత్మకంగా పదిమందికీ వివరించగలదానవు. మనసు కష్టపెట్టుకోడం తప్పని తెలుసుకునే స్థాయికి ఎదిగిన స్త్రీవి. మనసు -దాని పరిమితులెరిగిన వాడిగా నీకు తప్పుని ఆపాదించలేను. అలాగని, జీవితంలో ప్రాక్టికాలిటీతో, జీవించడంలో వున్న సౌందర్యంతో అంతటి నీ కళాహృదయాన్ని సైతం అథః పాతాళానికి తొక్కేయగలిగిన సుబ్బారావు క్రమశిక్షణనూ నేను తప్పు పట్టలేను.” అన్నా.
సురేఖ మాట్లాడలేదు. కానీ, నా మాటలు చాలా శ్రద్ధగా ఆలకిస్తోంది.
మళ్ళీ నేనే “వ్యక్తులు విప్పిచెప్పుకోలేని తప్పొప్పుల్ని కాలం, భవిష్యత్తూ విశదపరుస్తాయంటారు. చూద్దాం. అంతవరకూ మనం వేచివుండక తప్పదు.” అంటూ వెళ్ళడానికన్నట్టు లేచాను.
* * *
ఓ ఏడాది గడిచింది.
మళ్ళీ సురేఖ నుండి అర్జంటుగా విజయవాడ రమ్మని నాకు ఫోనొచ్చింది. ఏదో ఒక విశేషమైన పని లేనిదే సురేఖ నన్ను విజయవాడ రమ్మనదు. ఉన్నఫళాన బయలుదేరి విజయవాడ చేరా. సురేఖని వాళ్ళింట్లో కలుసుకున్నా.
నేను వెళ్ళేసరికి సురేఖ మంచం మీద పడుకుని వుంది. ఎప్పుడూ లేనిది ఆమె ఈసారి చీర కట్టుకుని వుంది. ఏదో సుస్తీ చేసిన దానికి మల్లే ఆమె శరీరం నీరసంగా వుంది. నన్ను చూడగానే మంచం మీంచి బలవంతంగా లేవలేనట్టుగా లేచి కూర్చోబోయింది. ఆమె వాలకంలో ఏదో కృత్రిమత్వం తోచి నేను వద్దని వారించాను. ఆమె మళ్లీ పడుకుంది. అంత నీరసంలోనూ నన్ను చూసిన ఆనందం ఆమె ముఖంలో కన్పిస్తూనే వుంది. మొదటగా-
“బావున్నావా?” అంది పమిటని గుండెలమీదికి సర్దుకుంటూ.
“బాగానే వున్నా.” అన్నా.
“బానేవుంటావులే. కష్టాలు పడను నన్ను కట్టుకోలేదుగా.” విషాదంగా నవ్వింది.
“ఏంటా మాటలు. అసలేమయింది నీకు?” అన్నా.
“ఏమవుతుంది? నువ్వప్పుడో మాటన్నావు గుర్తుందా? మనుషులు తేల్చుకోలేని సమస్యలు భగవంతుడే తేలుస్తాడని—గుర్తుందా?” అంది సురేఖ. స్వేదంతో ఆమె శరీరం తడిసింది. జాకెట్టుకీ, చీరకీ మధ్యభాగంలోని నడుము భాగం రెట్టింపు కాంతితో నాజూగ్గా కన్పిస్పోంది.
“భగవంతుడని నేననలేదు. కాలం అన్నాను.” అన్నా.
“ఏదో ఒకటిలే. అదిప్పుడు తెలిసొచ్చింది నాకు.” అందామె.
“ఏమైంది నీకు?” అడిగా భయంగా.
“పాపిష్టిదాన్ని నాకేమవుతుంది? సుబ్బారావుకే పాపం మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. నావల్ల ఎంత వేదన అనుభవించాడో ఏమో?” కన్నీరు ఆమె కణతలమీది నుంచి చెవులమీదికి కారుతోంది.
నేను చలించిపోయా. “మూత్రపిండాలెందుకు దెబ్బతిన్నాయి సుబ్బారావుకి?” అన్నా అసంకల్పితంగానే.
<<రెండవ పేజీ — నాలుగవ పేజీ>>
baagundi.
Chala Baagundi. Thanks to the writer and Poddu
@ విజయకుమార్ గారు
చాలా బాగుందండి. అసలు సిసలైన కథా విషయం. ఈ తరం పోల్చుకోగలిగే అంశం. Original piece of work! గతంలో మనుషుల ఇష్టా ఇష్టాలకన్నా భాధ్యతలకే అందరూ ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇప్పుడు నాది,నేను, నా పర్సనల్ స్పేస్.. వీటిని గౌరవించీ, ఎదుటి వారి పట్ల భాధ్యతాయుతంగా ఉండటం అనేది కత్తి మీద సాము లాంటిది. మనం భాధ్యతలు పంచుకోవాల్సిన సమయంలో వాళ్ళు పర్సనల్ స్పేస్లో ఉంటారు! మంచి చెడులు చెప్తుంటే తన అభిప్రాయలకి, ఇష్టాలకి వ్యతిరేకమనుకుంటారు. ఈ ఆలోచనే, మన కుటుంబ సభ్యులతో కూడా మనం నిస్సంకోచంగా,స్వేచ్చగా ఉండనినివ్వకుండా చేస్తుంది.
నేను ఎదుటివారి పట్ల భాధ్యతగా వ్యవహరించాలా,వాళ్ళకిష్టమొచ్చినట్టు ప్రవర్తించాలా అనే సంఘర్షణకి ఎప్పుడూ గురవుతాను.భాధ్యతగ వ్యవహరించకపోతే నా వ్యక్తిత్వాన్ని నిలుపుకోలేను, అంతర్ సంఘర్షణని భరించలేను. ఎదుటి వారికి ఇష్టమొచ్చినట్టు ఉండకపోతే వారికి దూరమవుతాను!
నేనో చిన్న ఐ.టి జాబ్ చేస్తునాను. ఈ రోజు ఎందుకో నెట్ లో ఏమైనా తెలుగు కథలు దొరుకుతాయేమోనని వెతికాను. దాదాపు 5 సం|| తరువాత “అహంకారి” చదివాను.
ఒక మనిషికి వ్యక్తిత్వంతో పాటు ఎదుటివారి ఆలోచనలనికూడా గౌరవించాలన్న విషయం మరోక్క సారి “అహంకారి” తో గుర్తుచేసారు…
చాలా రోజుల తరువాత మంచి కథ చదివిన feeling కలిగింది.
మీ కథ నాకు నచ్చింది. “ఇది నా జీవితం.. పూర్తిగా నా వ్యక్తిగతం” అని అనుకుని క్షణికావేశం అయితే బంధాలను లేకపోతే మనుషులనో చంపేస్తారు. ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి వారు ఒక్క క్షణం ఆలోచిస్తే తమతో ఎన్ని జీవితాలు పెనవేసుకుపోయాయో తెలుస్తుంది.
మొన్నీ మధ్య మా స్నేహితురాళ్ళతో ఎదో చర్చ వచ్చి.. “Financial Independence ఉందంటూ అమ్మాయిలూ బంధాలలో ఇమడలేకపోతున్నారు” అని నా అభిప్రాయం చెప్పా.. దానికి సరిగ్గా తూగినట్టు ఉంది మీ కథ.
“కవితలల్లీ, రచనలు చేసీ…” అంటూ మీ నాయికను ప్రొజెక్ట్ చేయడం నచ్చింది. ఊహాలోకం అందంగానే ఉంటుంది, మనం మాత్రమే నిర్మించుకుంటాం గనుక. నిజజీవితంలో “నా”, “నీ”, “మన” అన్నింటికీ విలువ ఇవ్వాలి. అందుకే అది క్లిష్టమైనది.. అందమైనది.
ఓ మంచి అనుభూతి మిగిల్చింది మీ కథ. అభినందనలు.
పూర్ణిమ
మీరు ఎంచుకున్న కథాంశం బాగుందండి. కాని సురేఖ పాత్ర ను చూపించిన విధానం అంతగా నచ్చలెదండి. సురేఖ మంచి సుక్ష్మగ్రాహ్యత కలిగిన స్త్రీ అని, మానసిక పరిణితి కలిగిన స్త్రీ అని ఒక దగ్గర చెప్పారు. మరి అంత లొనె తన కొడుక్కి జ్వరం వస్తే కూడ తెలుసుకొలేని డాక్టర్ అని చెప్పారు మరోచోట.
కంట్లొ నలక పడితె డాక్టర్ అయివుండి డాక్టర్ దగ్గరికి తీసుకువెల్లడం ఎంటొ అర్థం కాలేదు. డాక్టర్ అయివుండి ఎప్పుడొ లావు అవుతానని డైటింగ్ చెయడం ఎంతొ అర్థం కాలెదు. ఈ స్త్రీ కయిన మగవాళ్ళు పొరపాటున తగలడానికి కావాలని చేతులు కాళ్లు తగిలించడానికి తేడా తెలుస్తుంది. కాని సురేఖ కి ఎందుకు తెలిదొ అర్థం కాలెదు. అంత వ్యక్తిత్వం వున్న సురేఖ దొంగతనం గా ఆపరెషన్ చేయించుకొవడం అర్థం కాలెదు.
సుబ్బారావు అహంకారి అని చుపించడానికి డాక్టర్ అయిన సురేఖ ను మరీ అంత తక్కువ చేసి చుపించనవసరం లెదెమొ అనిపిస్తుందండి.
మంచి అంశాన్ని ఎంచుకున్నారు.చాలామంది అన్వయించుకోగలిగే సమస్యల్ని చూపించారు.కధ చదువుతున్నప్పుడు మధ్య మధ్యలో సురేఖ గురించి ఎందుకు ఇంత అనవసర వర్ణన అనుకున్నాను.చివర్లో లింక్ కలిపి ఆశ్చర్యపరిచారు.మొత్తమీద కధ బాగుంది.అభినందనలు.
చాలా మంచి కథ. ఎక్కడా value judgment ఇవ్వకుండా, కేవలం పాత్రల మధ్యనున్న మానవసంబంధాలను తెలియజెప్పడం ఒక గొప్ప ప్రయత్నం.
అద్బుతంగా ఉంది విజయకుమార్ గారు. ఇంత చక్కటి కథలు రాయగలిగే మీరు ఆరు సంవత్సరాలుగా రాయకపోవటం అన్యాయం.
చాలా బాగా రాశారండీ. మంచి సంక్లిష్టమైన ఇతివృత్తం. కథకుడి గొంతుని కథనానికి వాడుకున్న తీరు చాలా బావుంది. చివరి మూత్రపిండ దానం సీనుకి ముందే ఆపేసి ఉంటే బాగుండేదేమో!
ఈ కథలో నాకు ఏదో వెగటు తగిలింది. అయినా ఎంత వద్దనుకున్నా కథ చాలా బాగుందనే అనిపిస్తావుంది. కథాంశానికొచ్చేటప్పుటికి ఈ కథలోని నీతిని అడుగడుగునా మననం చేసుకుని ఎప్పటికప్పుడు అంతశ్శోధన చేసుకోదగినదిగా వుంది. కథలో వేలుపెట్టడానికి పూనుకుంటే మటుకు పైన స్నేహగారి వ్యాఖ్య నిశితంగా వుంది. కథన్నాక ఆ మాత్రం డ్రామా వుండాల్నేమో!
@శ్రీ చావా కిరణ్ గారికి,
ఆది బ్లాగరు మీరు ముందుగా నా కథకి వ్యాఖ్య రాయడం శుభప్రదం. నాకు చాలా సంతోషాన్నిచ్చింది. కృతజ్ఞతలు.
@శ్రీనివాస్ గారికి,
కథ చాలా బాగుందన్నారు. ధన్యవాదాలు.
@ఏకాంతపు దిలీప్ గారికి,
మీ వ్యాఖ్య నన్ను ఆలోచింపజేసింది. నిజమే. పాత తరాలకీ, నేటి తరానికీ మీరు చూపిన వ్యత్యాసం నూటికి నూరుపాళ్ళూ నిజం. మనం బాధ్యతగా వుంటూనే, ఎదుటివాళ్లు యిష్టపడేలా నడుచుకోవడం అంటే రెంటినీ సమన్వయం చేసుకుంటూ జీవించడంలో ఈ అంతర్ సంఘర్షణ బహుశా వుండదనుకుంటా. మీ వ్యాఖ్యకి కృతజ్ఞతలు.
@వంశీ గారికి,
మంచి కథ చదివిన ఫీలింగ్ కలిగిందన్నారు. అంతకుమించి నాకు కావల్సిందేముంది. ధన్యవాదాలు.
@పూర్ణిమ గారూ,
కథ రాశాక ఈ కథకి స్త్రీలెలా స్పందిస్తారోనని భయపడ్డా. స్త్రీగా మీ మొదటి వ్యాఖ్య (ఈ కథకి) చదివి ‘అమ్మయ్య’ అనుకున్నా. మీరన్నమాటలు “Financial Independence ఉందంటూ…” నేనూ నిజమనే భావిస్తా. నా కథ మంచి అనుభూతి మిగిల్చిందన్నారు. అలాగే అదే వ్యాఖ్యని నా బ్లాగులో కూడా రాశారు. మీ వ్యాఖ్య కూడా నాకు మంచి అనుభూతినే మిగిల్చింది. మీకు రెండుసార్లు కృతజ్ఞతలు.
@స్నేహ గారికి,
ముందుగా మీరు వ్యాఖ్య రాసినందుకు కృతజ్ఞతలు.
ఎంతో తెలివైన వారైనప్పటికీ, తన కొడుకు ఒంట్లో కాదుగదా తన ఒంట్లో జ్వరం కూడా తెలుసుకోలేని డాక్టర్లు కూడా కొందరున్నారీ లోకంలో. M.D., చేసి, మరేదో specialization చేసి ఒక హాస్పిటల్లో పాథాలజిస్ట్ గా వున్న ఓ Expert Doctor తనికి నీళ్ళ విరేచనాలైతే మరో డాక్టరు దగ్గర చూపించుకోవడం మొన్నీ మధ్యనే నేను చూశాను. మీరు నమ్మినా నమ్మక పోయినా.
ఇదే విధంగా మీరు వేలెత్తి చూపిన కథలోని ప్రతి అంశానికీ నేను వివరణ యివ్వగలను. కానీ, యివ్వను. ఎందుకంటే ఎక్కడైనా రచయిత వివరణ యావత్తూ తన రచనని సమర్థించుకునేదిగానే వుంటుందనేది అందరికీ తెలిసిందే. అయినా, మీ తర్వాత ‘కడప’ పేరుతో వ్యాఖ్య రాసిన వారన్నట్టు కథన్నాక ఆ మాత్రం డ్రామా కూడా వుండాల్నేమో అని నేనూ అంటాను. ఏమైనా మీకు కృతజ్ఞతలు.
@రాధిక గారూ,
నేనెప్పుడూ చెప్పుకోడానికి సందర్భం రాలేదుగానీ మీ కవితలన్నా, వ్యక్తిగా మీరన్నా నాకు గౌరవం. ఎందుకంటే మీ గురించి తోటి బ్లాగర్లను అడిగినప్పుడు స్త్రీలతో సహా ప్రతివారూ మీరు స్నేహశీలి అనీ, మంచి వ్యక్తి అనే చెప్పారు. అందుకే మీ టపాలకి ఎక్కువ సంఖ్యలో వ్యాఖ్యలొస్తాయనీ అన్నారు. అలాగే మీకు స్వంత ఊరిమీద, దేశం మీద ఉన్న మమకారం గురించి కూడా నాకు తెలుసు.
మీ మంచితనమే మీకు శ్రీరామరక్ష అనుకుంటా. మీ వ్యాఖ్యకి బుణపడివుంటాను.
@మహేష్ కుమార్ గారికి,
మీరన్నట్టు value judgment యివ్వకపోవడం మంచిదే అయింది. అయితే ఈ ఘనత నాది కాదు. పొద్దు సంపాదకవర్గం శ్రీ త్రివిక్రమ్ గారిది. ఎందుకంటే నేను కథ చివర్లో judgment యిచ్చాను. ‘పొద్దు’ వారు తీసేద్దామని నాచేత తీయించేశారు.
@నాగరాజు గారూ,
మీ ప్రోత్సాహానికి సదా బుణపడి వుంటాను. మీరు సూచించినట్టు తరచుగా రాయడానికి ప్రయత్నిస్తాను. అలాగే శ్రమించి రాసే మీ రచనలన్నా నాకు చాలా ఆసక్తి.
@కొత్తపాళీ గారూ,
అసలు మీరిచ్చిన తెల్లకాగితం ఇతివృత్తంతో నేను అప్పుడే ఇంత పెద్ద కథొకటి రాయాలనుకున్నా. సమయాభావం వల్ల రాయలేకపోయా. బ్లాగులో ప్రముఖులు మీవంటి వారి వ్యాఖ్యలు నాకు ప్రోత్సాహకరం. ధన్యవాదాలు.
@‘కడప’ పేరుతో రాసిన వారికి,
ఈ కథ మీకే కాదు ప్రచురణ పూర్తయ్యాక చూస్తే నాకు కూడా కొంత వెగటు తగిలింది. దానికి కారణం బహుశా తొందర తొందరగా కథ రాసేయడం. అయినా కథా వస్తువు ఇక్కడ ప్రతివ్యక్తీ self identify చేసుకునే విధంగా వుందనుకుంటా. కృతజ్ఞతలు.
katha maanava manastatvanni chakkaga visleshichindi.kathalo freudahamni santrupti parachagalagadam ante manaku emi kaavalo telusu kani samajam daanini amodinchademo ane bhayam edi emina avari spacelo vaaru batakadam ane kotta prayogam adbutam
@ విశ్వం గారికి,
కథ విపులంగా చదివినట్టున్నారు. కృతజ్ఞతలు.
katha lo theme bagundi. kani surekha ni anthaga degrade cheyyakkaraledomo. Na ane atmabimananike mana ane sambamdhaniki madhya sangharshana vuntune vuntundi. valli
kathanu nadipinchadam bagundi kaani prolonged a lot
చాలా బాగుంది,చాలా రొజుల థరవాథ మంచి కథ చదివాను,థాంక్స్..
కొథ కథలు వ్రాస్థె నా మైల్ చయంది…
ఆల్ ది బెస్త్….