మార్చి పోస్టుల మార్చిపాస్టు

– చదువరి

కవిసార్వభౌముడు శ్రీనాథుడు స్వర్గానికొస్తున్నాడని తెలిసి బృహస్పతి గుండె గుభేలుమందట -“దివిజ కవివరు గుండియలు డిగ్గురుమన్నవట“. అటువంటి నివాళి నేడు శోభన్‌బాబుకూ దక్కింది -విహారి రాసారు: సోగ్గాడు శోభన్‌బాబు స్వర్గానికొస్తున్నాడని ఇంద్రుడికి బెంగ పట్టుకుందట. భేష్!

మన మిమిక్రీ వీరులకు ఎన్టీయార్, ఏయెన్నార్, కృష్ణ, శోభన్‌బాబుల గొంతులు అభిమాన వస్తువులు. కురుక్షేత్రం సినిమాలో శోభన్‌బాబు కృష్ణుడిగానూ, కృష్ణ అర్జునుడిగానూ నటించారు. ఆ సినిమా వచ్చిన కొత్తలో మిమిక్రీ కార్యక్రమాల్లో శోభన్ కృష్ణుడు ఓ ఆకర్షణ. “అర్జునా, అర్జునా, అర్జునా! చంపేదెవరు చచ్చేదెవరు..? వేసెయ్ బాణం, తీసెయ్ ప్రాణం” అంటూ శోభన కృష్ణుణ్ణి అనుకరించేవారు. (ముమ్మారు సంబోధించటం శోభనునికి అలవాటని తెలిసిందే కదా!) ఇకపై మిమిక్రీల్లో ఎస్వీయార్, ఎన్టీయార్ వంటి దిగ్దంతులతో పాటు శోభన్ బాబు కూడా స్వర్గం నుండి పాల్గొంటాడు.

తాడేపల్లి లలితా బాలసుబ్రహ్మణ్యం, జ్యోతి కూడా నటభూషణుడికి తమ నివాళి ఘటించారు.

—————-

తెలుగు బ్లాగులు రెండో దశ విస్తరణలో ఉన్నట్టున్నాయి. ఇప్పటి వరకు కూడలి, జల్లెడ, తేనేగూడు, తెలుగుబ్లాగర్స్ వంటి వాటికే పరిమితమైన బ్లాగు కూడళ్ళు, ఇప్పుడు విస్తరిస్తున్నాయి. oneindia.com, blagkut, వెబ్ దునియా వంటి ఇతర చోట్ల నుండి కూడా బ్లాగులు వస్తున్నాయి, బ్లాగులను సంగ్రహించడమూ జరుగుతోంది. తెలుగు బ్లాగులు నిదానంగా తరువాతి స్థాయికి చేరే సూచనలివి.

ఈ విషయమై గత eతెలుగు సమావేశంలో ఒక చర్చ కూడా జరిగింది. బ్లాగు అనగానేమి అనే చర్చలో ఉపచర్చగా ఇది జరిగింది. బ్లాగుల్లో రాసే విశేషాలు మరింత స్థానికంగా, బ్లాగరి నిజ జీవితానికి మరింత దగ్గరగా, మరింత వాస్తవికంగా ఉండాలని అన్నారు. బ్లాగు పాఠకులు వాడుకోగలిగే అంశాలకు ప్రాముఖ్యత నివ్వాలని పెద్దలన్నారు.

జల్లెడ వారు బ్లాగుల జల్లింపు కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తూ కొత్త విశేషాలు తీసుకొచ్చారు. మనక్కావలసిన జాబులను ఆర్టీయెస్సులో కూడా చూసుకోగలిగే ఏర్పాటు, జాబులకు రేటింగునిచ్చే ఏర్పాటు వీటిలో ఉన్నాయి.

దీనికి తగ్గట్టే బ్లాగుల రేటింగుల గురించి, డిగ్గటం గురించి విహారి, దీప్తిధారలో, జ్యోతిలో జాబులొచ్చాయి.

————

ఇక కూడళ్ళ లోంచి, బ్లాగుల్లోంచి, జాబుల్లోకి వెళ్దాం.

కొత్తపాళీ ఒక చిన్న ఇతివృత్తాన్ని ఇచ్చి బ్లాగరుల్లో మంచి కథన కుతూహలం కలిగించారు. ఈ ఆహ్వానాన్ని కాదనలేక కాలుదువ్వి బరిలో దూకిన ప్రముఖులెవరెవరో చూడండి. ఈ పోటీలో బహుమతి సాధించిన రమ్యకు మా అభినందనలు.

బ్లాగుల్లో ప్రాక్టికల్ జోకు లాంటిది ఒకటి ఈ నెల నమోదయింది. అదో మూడు జాబుల శృంఖల. నెటిజెన్ స్పీక్ లో వచ్చిన ఈ గొలుసులో చివరిది ఇది.

శివరాత్రి సందర్భంగా:
శివరాత్రి సందర్భంగా రెండు పద్యాల జాబులొచ్చాయి.

సాక్షి పత్రికపై
సాక్షి పత్రిక ఈ నెలే వెలువడింది.బ్లాగరులు దీనిపై విశ్లేషణలు వ్యాఖ్యానాలూ రాసారు. ఇప్పటివరకూ వచ్చిన జాబులన్నీ కూడా ఈ అంశాన్ని పైపైన స్పృశించినవే; కూలంకషమైన విశ్లేషణ ఇంకా రాలేదు. త్వరలో వస్తుందేమో చూద్దాం. ప్రస్తుతానికి ఈ అంశంపై వచ్చిన జాబులివీ:

సాధారణ అంశాలు:

రాజకీయాలు:
ఈ నెల రాజకీయ జాబుల్లో తెలంగాణ అంశం వెలుగులో ఉంది. జాబులూ, వాటిపై వ్యాఖ్యలు కూడా వాడిగా, వేడిగా ఉన్నాయి.


భాష, సాహిత్యం:


సాంకేతికం:

హాస్యం:

కొవ్వలి సత్యసాయి ప్రవేశపెట్టిన తెలుగు జేసింది” మా ఈనెల బ్లాగు మాట!

కొత్త బ్లాగులు:

  • సుజాత మనసులో మాట చెబుతున్నారు. పుస్తకాల పట్ల ఆమెకు గల ప్రేమను తెలిసికొనేందుకు ఈ బ్లాగులోని మొదటి జాబు చదవండి.
  • సాహితీ ఝరి చూసారా? పద్యాలు, వచన కవిత్వం, సమస్యా పూరణం.. వెరసి రాఘవేంద్రశర్మ సాహితీఝరి. ఈ బ్లాగు పాతదే.. పొద్దుకు ఇది కొత్త!
  • Srisuja: (http://gunturmirchi-srisuja.blogspot.com/): గతంలో పాత్రికేయ వృత్తిలో ఉన్న గృహిణి రాస్తున్న బ్లాగు ఇది. చమత్కార ధోరణిలో, చక్కగా ఉంది.
  • రామ, శాంతి కలిసి రాస్తున్న బ్లాగు రామ-శాంతి. వారు రాసిన జాబుల్లో మా బడి రేడియో అనే జాబు మా ఎంపిక. హిట్ కౌంటరులోని హిట్లను చమత్కారంగా ఘాతాలు అని పిలుస్తున్నారు.
  • “మా అమ్మ నాకే కాక నాబ్లాగుకి కూడా పేరెట్టింది” అని పరిచయం చేసుకుంటూ శ్రావ్య వరాళి బ్లాగులోకంలోకి అడుగుపెట్టింది. eతెలుగు మీటింగేమంత బాగా జరగలేదనీ చెప్పింది. పెద్దలు గంభీరంగా ఆశీః వచనాలు చదివినా.., ప్రస్తుతం ఆ బుడత ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు – మీటింగు ఎలా జరపాలో తెలిసికొనేందుకు!


ఈనెల బ్లాగు:
వారణాసి వెంకట రమణ రాస్తున్న కబుర్లూ-కాకరకాయలూ మీరు చదివారా? నవ్వించేలా హాస్యం రాయగల బ్లాగరుల జాబితాలోకి రమణ చేరిపోయారు. ఎప్పుడో 2007 సెప్టెంబరు నుండి రాస్తున్నారు. ఆయన రాసిన డైసీలూ, ఇంపలూ ఆ బ్లాగులోని గొప్ప జాబుల్లో ఒకటి. alimony అనే మాటకు అర్థం ఆయన బ్లాగు చదివాకే తెలిసింది. అది కాదు విశేషం.. నేను ఓ ప్పది సంవత్సరాలపాటు ఆ మాట వాడకపోయినా, పదకోండో యేట దానర్థం అడిగితే ఠక్కున చెప్పెయ్యగలను. అది చదివిన వారెవరైనా చెప్పగలరు. చూడండి!

ఈనెల జాబులు:

  1. సాంకేతికులు, అసాంకేతికులను మనమెరుగుదుము. కానీ నసాంకేతికులు కూడా ఉంటారని నిడదవోలు మాలతి చెబుతున్నారు. ఆమె రాసిన “నసాంకేతికాలు” ఈ నెల జాబుల్లో ఒకటి.
  2. తిథులు, నక్షత్రాలు, రాశులు మొదలైన వాటి గురించి వినని భారతీయులుండరు. కానీ వాటి గురించి తెలిసిన వారు, అవెలా ఏర్పడతాయో తెలిసిన వారు మాత్రం అరుదు. ఈ విషయమై నాగమురళి రాసిన ఈ జాబు చాలా విశేషాలు చెబుతుంది. మా ఈనెల జాబుల్లో ఇదొకటి.
This entry was posted in జాలవీక్షణం and tagged , , . Bookmark the permalink.

5 Responses to మార్చి పోస్టుల మార్చిపాస్టు

  1. chavakiran says:

    బాగుమ్దండి, హెలీకాప్టర్లో బ్లాగ్ బాధిత గ్రామాల సందర్శనలాగా 🙂

  2. Naveen Garla says:

    క్రిందన … “ఇవి కూడా చూడండి” అని వ్రాసి, పాత నెలల సమీక్షల లింకులు కూడా వ్రాస్తే బాగుంటుంది.

  3. సునిశిత పరిశీలనతో మీరు చేస్తున్న సమీక్షలు బాగుంటున్నాయి. మిస్సయిన జాబులని చదవగలిగేలా, మామూలుగా చదివేసిన బ్లాగుల సొగసును ఆస్వాదించగలిగేలా చేస్తున్నారు. నెనర్లు.

  4. “దివిజ కవివరు గుండియలు డిగ్గురుమన్నవట”

    ఔరా!!!! నాలా ఆలోచించే వాళ్ళు అప్పుడు కూడా వున్నారన్నమాట.

    ఈ సమీక్ష లో ఎక్కువ కామెంట్లు (రిగ్గింగు చేసుకోకుండా) వచ్చిన టపా కూడా ప్రచురిస్తే బావుంటుందేమో.

    — విహారి

  5. రవి says:

    మీ సమీక్షలలో ఓ విషయం గమనించాను. నిస్పాక్షికత. పేరున్న బ్లాగరైనా, లేదు, వుబుసుపోక రాసే నా లాంటి వాళ్ళనైనా సమానంగా ఉదహరిస్తున్నారు.

    మిస్ అయిన బ్లాగులన్నీ మళ్ళీ చదవగలిగాను. నెనర్లు.

Comments are closed.