-గార్ల సురేంద్ర నవీన్
. |
మనసుపడ్ద పడతి చెంతచేరలేదన్న చింతేల
ఆమె లేని బ్రతుకు భారమన్న భావమేల
అహరహము తలచి వగచి దిగులొందుటేల
దేవీదాసుడిని దేవదాసు చేసెనన్న దు:ఖమేల
పొల్లులల్లే పడతి ప్రేమ కోసమింకా ప్రాకులాడుటేల
మనము రాయని రాతల కోసమింత క్షోభ యేల
ఓటమి వెంటే గెలుపున్నది
బాధ వెంటే సుఖమున్నది
కప్పిరి వెంటే ఉప్పరమున్నది
కన్నీరు వెంటే పన్నీరున్నది
అశాంతి వెంటే శాంతి ఉన్నది
ఆలజడి వెంటే ఆనందం ఉన్నది
చిత్రమైన దేవుడు..తనదగ్గరున్న ఎన్నెన్నో
వరాలను నీకు మొత్తంగా దత్త చెయ్యాలని
నీ వద్దనున్న నిక్రేపాలను నీకు గుర్తు చెయ్యాలని
నీ ప్రేమను లంచంగా తీసుకున్నాడు కాబోలు
అహ్లాద అరుణోదయాలున్నవి నీకోసమే
పక్షుల కిల కిలారావాలున్నవి నీకోసమే
చలచల్లని ఎర్రని సాయంకాలాలున్నవి నీకోసమే
వెండి వెన్నలనిచ్చే చందమామున్నది నీకోసమే
విశాల నీల గగనమున్నది నీకోసమే
హేమంతములో మబ్బులున్నవి నీకోసమే
మబ్బులపైన ఇంద్రధనస్సున్నది నీకోసమే
మట్టిని తడిపే ముసురున్నది నీకోసమే
ప్రపంచంలోని రంగు రంగుల పూలున్నవి నీకోసమే
చల్లగ వీచే పైరగాలున్నది నీకోసమే
అన్నిటి కన్నా…………
అంతటికన్నా……………….
అమోఘమైన
అద్భుతమైన
అపురూపమైన
దేవుడిచ్చిన ఈ మానవ జన్మ ఉన్నది మనకోసమే
|
—-
గార్ల సురేంద్ర నవీన్ తన పూతరేక్స్ బ్లాగు ద్వారా నెజ్జనులకు సుపరిచితుడు. బ్లాగరిగానే కాక, వికీపీడియన్‌గా కూడా ప్రసిద్ధుడు. తెలుగు వికీపీడియాలో తెలుగు సినిమా ప్రాజెక్టులో విశేషమైన కృషి చేస్తున్నారు. మదనపల్లె వాస్తవ్యుడైన నవీన్ బెంగళూరులో సాఫ్టువేరు ఇంజనీరుగా పని చేస్తున్నారు.
’పాత’ రేకు లా ఉంది. ఏముంది ఇందులో?
నాకు తెలిసి తెలుగు అభిమాని లేద ఏదైనా కళ ఉన్నవాడు ఎలాంటి కవిత చూసినా, కథ చూసినా దానిలోని మంచిని చెప్పి, ఏవైనా సరిదిద్దులు ఉంటే కామెంట్ చేయాలి కానీ, పేరుకు తెలుగు అభిమాని అని వ్రాసి అర్థం లేని ప్రశ్న వేస్తే ఏంటి అర్థం?
ఇలా అడ్డ ప్రశ్నలు వేసే వాళ్ళు తెలుగు అభిమాని కాడు, కళా పోసన అసలే ఉన్నవాడు కాదు. ఆయ్ !
@తెలుగు అభిమాని గారు
మీరు చెప్పదలుచుకొన్నది అర్థం అయ్యింది. ప్రకృతి, పక్షులు, ఆకాశం, పరవశం గురించి ఎన్నో లక్షల కవితలు వచ్చుంటాయో కదా, ఇందులో ఏముంది కొత్త అని మీ భావమనుకుంటా.
కవిత వ్రాయటం మొదలు పెట్టినప్పుడు, “ఆ మడతి కేకరాక్షమయూఖములతో అశ్మమంటి నా ఉల్లమూష్మమూరి కరుగుచున్నదే..” అని వ్రాయకూడదని అనున్నాను. నేను చెప్పదలుచుకున్న సందేశం అందరికీ అర్థం కావాలని సరళంగా వ్రాశాను. అదన్నమాట సంగతి.
సమయం వెచ్చించి వ్యాఖ్య వ్రాసినందుకు సంతోషం 🙂