అలా-ఇ-మీనార్
ఈ ఫోటోలో ఉన్న కట్టడం పేరు అలా-ఇ-మీనార్. భారతదేశాన్ని ఏలిన ముస్లిం పాలకుల్లో అక్బర్, షేర్షాల తర్వాత అంతగొప్పవాడిగా అలాఉద్దీన్ ఖిల్జీని చరిత్రకారులు పేర్కొంటారు. అతడి సైనిక విజయాలే కాకుండా అతడు చేపట్టిన పరిపాలనా, సైనిక, ఆర్థిక సంస్కరణలు అతడికి ఆ స్థాయిని తెచ్చిపెట్టాయి. ఐతే అతడికి తాను సాధించిన విజయాలతో తలచుకున్నదేదైనా చేసెయ్యగలననే గర్వం పొడసూపింది.
అతడు చెయ్యాలనుకుని చెయ్యలేకపోయినవి/విరమించుకున్నవి:
1. మహమ్మదు ప్రవక్తలాగే ఒక కొత్త మతాన్ని స్థాపించడం.
2. విశ్వవిజేత కావడం.
ఈ బొమ్మలోని నిర్మాణం కూడా ఆ కోవలోకే వస్తుంది. ఢిల్లీలోని World Heritage site ఐన కుతుబ్ కాంప్లెక్స్ లో ఇది ఒక భాగం. కుతుబ్ మీనార్ కంటే రెండింతలు ఎత్తైన మీనార్ కట్టాలని సంకల్పించి అలాఉద్దీన్ ఖిల్జీ మొదలుపెట్టిన నిర్మాణం. 160 మీటర్లు అనుకున్నది కాస్తా కేవలం ఇరవైనాలుగున్నర మీటర్ల వరకూ వచ్చి ఆగిపోయింది. (కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు/239 అడుగులు.)
(ఫోటో & కథనం: త్రివిక్రమ్)
అవునండీ, ఎందుకు మధ్యలోనే ఆగిపొయినదో కూడా ఇస్తే పొయ్యేది కదా!
ఈ మీనారు నిర్మాణంలో ఉండగానే అలాఉద్దీన్ ఖిల్జీ మరణించాడు. అందువల్ల అది అక్కడితో ఆగిపోయింది.
ఆగిపోయింది కట్టడమే కాదండీ!
ఖిల్జీ గుండె కూడా!
నా బ్లాగులో చదువరిగారి వ్యాఖ్య వలన ఈ రచన చదివే అవకాశం కలిగింది. ఈ కట్టడం గురించి తెలుసుకునే లోగా ఆ ప్రదేశంలో తారసపడ్డ మరొక వ్యక్తిని గమనిస్తూ ఈ వివరాలు మిస్సయ్యాను. ఈ రకంగా తెలిసినందుకు సంతోషం.