ఫిబ్రవరి గడి సమాధానాలు

ఈసారి భైరవభట్ల కామేశ్వరరావు గారు, బ్లాగాగ్ని గారు తప్పుల్లేకుండా పూరించగా, నవతరంగం వెంకట్ గారి పూరణలో 6, ఆగంతకుడు గారి పూరణలో అంతకంటే ఎక్కువగానూ తప్పులు దొర్లాయి. అందరికీ అభినందనలు! కొత్తపాళీ గారు స్లిప్పులందించడంలో బిజీ ఐపోయి పూరణ పంపలేదు.

*

1 హె

*

2 కో

*

3 శ్రీ

రా

4

5మి

*

6 రా

7

డు

*

*

కృ

*

రు

*

*

త్రు

8 టు

యిన్

వన్

*

9

*

ష్ణ

*

10వం

11

పం

డు

బం

*

*

12లా

వా

దే

13 వీ

*

ణా

*

*

*

ల్యాణ్

*

*

14

డి

*

15 చా

రు

లు

*

16

*

17 వి

18

రా

19భా

రి

*

*

20 పా

21 కి

*

22

మా

ము

*

23 హై

24 కూ

25 హి

రా

26

కం

*

లు

*

27 వి

28 రా

టు

*

*

29

*

30 పై

*

31 స్వా

*

32 నా

లి

33 పా

34 గా

*

35 దాం

36

త్యం

*

37 తి

38 వి

రె

*

*

ను

*

39

రం

*

40 నా

వా

రు

*

41 బా

బు

42 మాం

ల్యం

తం

తు

నా

నే

నా

*

43 నె

ర్లు

వివరణలు:

అడ్డం:
2. కోలాటం ఆడేవారి హస్తభూషణం (2) కోల – కోలాటం ఆడేవారు రెండుచేతుల్లో రెండు కోలలు పట్టుకుని ఆడుతారు.
3 శ్రీమినర్వాలో మనం పానకం తాగే రోజు (3,3) శ్రీరామ నవమి – anaagram
6 పాపడు పాపం రాయిగా మారేను (3) రాపడు = రాయిగా మారు
8 సర్‌ – టూకీగా, ఒక ఒరలో రెండు కత్తులు (1,1,1) టూ ఇన్ వన్ – ఆధారం మొదట్లో ఆంగ్లసంబోధన సమాధానానికి పరోక్ష సూచన
12 జ్వాలాముఖి ఒకరు కంటే ఎక్కువైతే వ్యవహారాలు ఎప్పటికీ తెగవు, అందుకే బహువచనం తీసేసాం (4) లావాదేవీ – జ్వాలాముఖి అంటే లావా పొంగే అగ్నిపర్వతం. దాన్ని ‘లావా’ దేవి అనడం ఒక చమత్కారం.
14 దిక్కు తెలియని వేగం (2) వడి = speed, వేగం = velocity భౌతికశాస్త్ర నిర్వచనాలు.
15 రసాలు – రాజుగారి నేత్రాలు? (3) – రసం = చారు. చారులు రాజుగారికి కళ్ళు, చెవులు.
20 కులుకులొలికే కలికికి హంసతూలికల వాహనం (3) పాలకి = పల్లకి
22 లయ మారము అంటూ. అటూఇటుగా షోలాపూర్లో శక్తిపీఠం కనండి (5) షోలాపూర్లో శక్తిపీఠం ‘రమాలయము’
25 ప్రవక్త ప్రస్థానంతో కేలండరు మొదలు (5) మహమ్మదు ప్రవక్త మక్కా నుంచి మదీనాకు చేసిన ప్రస్థానం జరిపినప్పటి నుంచి హిజరా శకాన్ని లెక్కిస్తారు.
27 కొమ్ము విరిగిన దోమ కుత్తుక ఏలిక (4) మహాభారతంలో పాండవుల అజ్ఞాతవాసాన్ని ఉద్దేశించి విరాటుడి కొలువును దోమకుత్తుకతో పోల్చిన తెనాలి రామలింగడి పద్యం ప్రసిద్ధం.
29 అనుస్వారం తోడుంటే నా తరమయ్యేది. లేదే? ఎలాగ?(2) అనుస్వారం అంటే సున్నా.
32 పంటల్లో పాము తిరగలి ??(3) ‘నాగ’లి
35 జాయా-పతుల సంబంధం (3) జాయ అంటే భార్య.
37 ఇసుమున తైలము దీయుటకు శ్రమించె (3) “తివిరి ఇసుమున తైలము దీయవచ్చు…” పద్యం
39 వంట్లో బాణం దిగితే నడుం హ-రీ- మనదా? (2) వళ్ళు అంటే శరీరంలో నడుం అంటే మధ్య అక్షరమైన ‘రీ’ ఎగిరిపోయి శరం అంటే బాణం మిగిలింది.
40 మంచం పట్టీ కొంచెం సాగినా మదీయ శ్రీవారే (3) మంచం పట్టీ = నవారు. సాగితే ‘నావారే’ (మదీయ = నా యొక్క)
41 పసివాడి మీద అలా రుబాబు చేయకండి (2) పసివాడు = బాబు

నిలువు

1 హలో – మత్తెక్కించే కథానాయిక కాదోయ్- వెంటబడితే బతుకు బుగ్గే సుమా (3) కథానాయిక హీరోయిన్. హెరాయిన్ అనేదొక మాదకద్రవ్యం.
2 గీకువీరులు రాసేదే మంచానికి ఆధారం (2) geeks రాసేది code – కోడు. మంచానికి ఆధారం కూడా కోడే.
3 సంపెట భూపాలుడు (8) – శ్రీకృష్ణదేవరాయలు బిరుదు. (శ్రీకృష్ణదేవరాయల ఇంటిపేరు ‘సంపెట’).
4 సువాసన కోసం తల్లో పెట్టుకోడం మర్చిపోం (3) మర్చిపోం = మరువం. అతివలు ఈ ఆకులను సువాసన కోసం తల్లో పెట్టుకుంటారు.
7 వీడిల్లు బంగారంగానూ, మృత్యుంజయుడి తమ్ముడు వాయుదేవుడా? – శుభం (2,2) మృత్యుంజయుడంటే చిరంజీవి. చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్. పవనుడు = వాయుదేవుడు, కల్యాణ్ = శుభసూచకం.
8 బంటు కానిది – తెబ్లాగరి ప్రవీణ్ కు ప్రీతిపాత్రమైనది – ఉత్సాహం మీరి తిరగబడింది (3) ఉబుంటు అనే లైనక్స్ వర్షన్ను ప్రవీణ్ లాంటి గీకువీరులు కొందరు వాడుతారు, దాని గురించి తమ బ్లాగుల్లో కూడా రాశారు.
9 బ్రహ్మ రాతలకి పలక (3,3) లలాట ఫలకం – బ్రహ్మ నుదుటి మీద రాస్తాడని ఒక నమ్మకం. లలాటమంటే నుదురు, ఫలకమంటే పలక.
11 ప్రశ్నతంత్రాల గారడీ మాంత్రికుడి జాగరిణాలు (4) – ప్రశ్నతంత్రాల గారడీ మాంత్రికుడు గణాచారి.
13 అలనాటి పెద్దనగారినుంచీ ఈనాటి కవులదాకా దీనిని వీడియుండలేరట (4) “కప్పురపు వీడెము…” కవిత్వరచనకు ఆవశ్యకమని పెద్దన ఉవాచ. వీడెము/వీడియము = తాంబూలం.
18 టిబెట్టులో వెనక్కి తిరిగిన మాలతి (2) టిబెటన్ బౌద్ధ సన్యాసిని లమా అంటారు. మాలతి పొట్టిపేరు మాల వెనక్కి తిరిగితే అదే ఆన్సరు.
19 కిరాతకుడై పొరబాటున కన్నతండ్రినే చంపబోయిన ఓ మహాకవి, కళారవి (3) భారవి. అతడు రాసిన ప్రసిద్ధ కావ్యం కిరాతార్జునీయం.
20 భగవంతుడికి భక్తులు పంపే S.O.S (2) పాహి అంటే సంస్కృతంలో కాపాడమని అర్థం. దైవప్రార్థనల్లో తరచు వచ్చే పదం.
23 యెస్‌, అమితాబచ్చన్లా, సన్నగా,… (3) హైటుగ “అమితాబ్ బచ్చన్ హైటు మీదొట్టు…” అని ఒక పాట కూడా ఉందికదా?
24 ఈవెనింగు బ్లాగర్లందరూ వీవెనింగు చేసే చోటు (3,3) బ్లాగరుల సౌకర్యార్థం కూడలి లో వీవెన్ కల్పించిన సౌకర్యం కూడలి కబుర్లు.
31 ముత్యపు చిప్పలు సావిరహే అని పాడేదెవరికోసమో? (4) వానచినుకు ముత్యపు చిప్పలో పడితే ముత్యమౌతుంది. స్వాతిముత్యం కావాలంటే మరి స్వాతివాన కురవక తప్పదు కదా? “సా విరహే తవదీనా…” జయదేవుడి అష్టపది.
34 తైలంకోసం ఎలా తిరిగినా ఒకటేగా? (3) తైలం తీయాలంటే గుండ్రంగా ‘గానుగా’డాలి.
38 సిగలో అత్తరులు.. .ఏవో అవి? (2) “సిగలో అవి విరులో…” అని మేఘసందేశం పాట.
40 అద్దంలో ఉత్తరకోస్తావారు ఎవరదీ (2) అద్దంలో కనిపించేది నేనే ఐతే ఉత్తరకోస్తా వ్యావహారికంలో నానే అంటారు.

This entry was posted in గడి and tagged . Bookmark the permalink.

One Response to ఫిబ్రవరి గడి సమాధానాలు

  1. అయ్యో పంపలేదా? పంపేననుకున్నానే?

Comments are closed.